west zone dcp venkateswarrao
-
కార్డన్ సెర్చ్.. ఐదుగురు రౌడీ షీటర్ల అరెస్ట్
హైదరాబాద్: టప్పచబుత్ర జోషివాడలో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. సుమారు 150 మంది పోలీసులు ఆదివారం వేకువజాము నుంచే ఈ తనిఖీలు మొదలుపెట్టారు. తమ తనిఖీలలో భాగంగా 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐదుగురు రౌడీ షీటర్లను అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు చూపించని కారణంగా 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసుల అదుపులో ఆరుగురు రౌడీ షీటర్లు
-
పోలీసుల అదుపులో ఆరుగురు రౌడీ షీటర్లు
హైదరాబాద్ : నగరంలోని షాహినాద్ గంజ్ పీఎస్ పరిధిలోని జుమ్మెరాత్ బజార్, దేవినగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు తనిఖీలు చేశారు. ఆరుగురు రౌడీ షీటర్లు, 15 మంది అనుమానితులను అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 17 వాహనాలు, 2 వేల గుడుంబా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.