westindies A
-
రాణించిన పుజారా, రోహిత్
కూలిడ్జ్: కరీబియన్ పర్యటనలో టెస్టు సిరీస్ ముంగిట టీమిండియా కీలక బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (156 బంతుల్లో 89 బ్యాటింగ్; 7 ఫోర్లు, సిక్స్)కు చక్కటి సన్నాహకం లభించింది. పుజారాతో పాటు మరో బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ (115 బంతుల్లో 68; 8 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించడంతో వెస్టిండీస్ ‘ఎ’తో శనివారం ఇక్కడ ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. టీ విరామ సమయానికి జట్టు 62 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్... ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (12) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. దూకుడు చూపిన మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (46 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్) శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కెప్టెన్ అజింక్య రహానే (1) తీవ్రంగా నిరాశపర్చాడు. 6 బంతులు మాత్రమే ఆడిన అతడు కార్టర్ (2/24) బౌలింగ్‌లో కీపర్ హామిల్టన్‌కు క్యాచ్ ఇచ్చాడు. 53/3తో కష్టాల్లో పడిన ఈ స్థితిలో పుజారా, రోహిత్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. రోహిత్ సహజ శైలిలో ధాటిగా ఆడాడు. చాలాకాలం తర్వాత మైదానంలో దిగిన పుజారా తన ఫామ్‌ను చాటుకున్నాడు. అతడికి తోడుగా తెలుగు ఆటగాడు హనుమ విహారి (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
‘శత’క్కొట్టిన విహారి, పృథ్వీ షా
నార్తంప్టన్: ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (131 బంతుల్లో 147; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ శతకానికి తోడు యువ సంచలనం పృథ్వీ షా (90 బంతుల్లో 102; 16 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత ‘ఎ’ జట్టు 203 పరుగలతో వెస్టిండీస్ ‘ఎ’పై గెలిచింది. ఈ ఇద్దరు శతకాలతో కదం తొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 354 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం వెస్టిండీస్ 37.4 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ 4, చహర్ 2 వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. రిషభ్ పంత్ (5), శ్రేయస్ అయ్యర్ (0) నిరాశ పర్చడంతో 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ పృథ్వీ షాతో జతకట్టిన విహారి విండీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. అలవోకగా బౌండరీలు బాదుతూ భాగస్వామ్యాన్ని పెంచుతూ పోయాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 160 పరుగులు జోడించారు. ఆ తర్వాత పృథ్వీ ఔటైనా మిడిలార్డర్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన విహారి జట్టుకు భారీ స్కోరు అందించి ఇన్నింగ్స్ చివరి బంతికి వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో చెమర్ హోల్డర్‌కు 3 వికెట్లు దక్కాయి. భారీ లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ భారత బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి లక్ష్యంలో సగం పరుగులైనా చేయకుండానే ఆలౌటైంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన భారత్ ‘ఎ’ సోమవారం జరిగే టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్ ‘ఎ’తో తలపడనుంది. -
సిరీస్‌పై భారత్‘ఎ’ గురి
బెంగళూరు: దుమ్ము రేపే ఆటతీరుతో తొలి వన్డేలో వెస్టిండీస్ ‘ఎ’ జట్టును అదరగొట్టిన భారత్ ‘ఎ’ జట్టు నేడు (మంగళవారం) మరో పోరుకు సిద్ధమవుతోంది. చిన్నస్వామి మైదానంలో జరిగే ఈ రెండో వన్డేను సైతం నెగ్గి సిరీస్‌ను దక్కించుకోవాలని యువరాజ్ సింగ్ బృందం భావిస్తోంది. ఆదివారం నాటి మ్యాచ్‌లో యువరాజ్ అంచనాలను అందుకుని సూపర్ సెంచరీతో జట్టుకు 77 పరుగుల విజయాన్ని అందించాడు. జాతీయ జట్టులో మళ్లీ చోటు కోసం పరితపిస్తున్న యువీ సెలక్టర్లు తనకిచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. కఠోర శ్రమతో పూర్తి ఫిట్నెస్ సాధించి మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. అద్భుతమైన స్ట్రోక్ షాట్లతో 89 బంతుల్లోనే 123 పరుగులు చేసి జట్టులో స్థానంపై ఆశలు పెంచుకున్నాడు. అటు సీనియర్ ఆటగాడు యూసుఫ్ పఠాన్ కూడా తనదైన శైలిని ప్రత్యర్థి బౌలర్లకు రుచి చూపించాడు. జాతీయ జట్టులో స్థానం కోసం అతను కూడా చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. నేటి మ్యాచ్‌లోనూ మరోసారి సత్తా చూపాలనుకుంటున్నాడు. ఇక ఓపెనర్లు రాబిన్ ఉతప్ప, ఉన్ముక్త్ చంద్ కూడా రాణిస్తే విండీస్‌కు కష్టాలు తప్పవు. ముఖ్యంగా ఉతప్ప కూడా విండీస్, దక్షిణాఫ్రికాలతో జరిగే భారత వన్డే సిరీస్‌పై ఆశలు పెట్టుకున్నాడు. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రాణించి సెలక్టర్ల దృష్టిలో పడాలని భావిస్తున్నాడు. ఇక మిడిలార్డర్లో యువీతో పాటు మన్దీప్ సింగ్, నమన్ ఓజా బ్యాట్ ఝుళిపిస్తున్నారు. అటు బౌలింగ్ విభాగం కూడా తొలి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చూపింది. ఇర్ఫాన్, ప్రవీణ్ సిరీస్‌కు దూరమైనా వినయ్ సారథ్యంలోని బౌలింగ్ విభాగం అంచనాలను అందుకుని రాణించింది. ఇదే రీతిన సమష్టి కృషితో వరుసగా రెండో వన్డే సిరీస్‌ను అందుకోవాలనే ఆలోచనలో భారత ఆటగాళ్లు ఉన్నారు. ఒత్తిడిలో విండీస్ ‘ఎ’ స్వదేశంలో శ్రీలంక ‘ఎ’తో జరిగిన వనే ్డలో విశేషంగా రాణించిన విండీస్ ‘ఎ’ ఈ వన్డేలోనైనా సత్తా చూపించి సిరీస్‌లో నిలవాలనుకుంటోంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తమ బ్యాట్లకు పని చెప్పాల్సి ఉంది. బోనర్, కెప్టెన్ పావెల్‌తో పాటు అంతర్జాతీయ వన్డే అరంగేట్రంలోనే శతకం బాదిన కిర్క్ ఎడ్వర్డ్ తమ సత్తా చూపిస్తే జట్టుకు ప్రయోజనంగా ఉంటుంది. గత వన్డేలో దేవ్ నారాయణ్, నర్స్ మాత్రమే అర్ధ సెంచరీలు సాధించి ఆకట్టుకున్నారు. ఆల్‌రౌండర్ రస్సెల్ కూడా ఈ వన్డేలో మెరిస్తే భారత జట్టు గట్టి పోటీని ఎదుర్కొంటుంది. బౌలర్లు పటిష్ట భారత లైనప్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోవడం జట్టును ఆందోళనపరిచే అంశం. జట్లు: భారత్ ‘ఎ’: యువరాజ్ (కెప్టెన్), ఉన్ముక్త్, ఉతప్ప, అపరాజిత్, జాదవ్, నమన్ ఓజా, యూసుఫ్, ఉనాద్కట్, వినయ్, కౌల్, నర్వాల్, నదీమ్, మన్ దీప్ సింగ్, రాహుల్ శర్మ. విండీస్ ‘ఎ’: పావెల్ (కెప్టెన్), పెరుమాల్, బీటన్, బానర్, కార్టర్, కోట్రెల్, కమ్మిన్స్, దేవ్ నారాయణ్, మిల్లర్, నర్స్, రస్సెల్, థామస్.