wheel chairs
-
24x7 మీ సేవలో..
సాక్షి, హైదరాబాద్ : రైల్వే స్టేషన్లో మీరు వేచి ఉన్న విశ్రాంతి గదిలో తాగునీరు లేదా.. ఏసీలు పని చేయడం లేదా... టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయా.. వీల్‌చైర్స్ కావాలా... ఇకపై ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయాణికుల సహాయ కేంద్రం సిద్ధంగా ఉంది. 24/7 ఈ కేంద్రం పని చేసేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కొత్తగా హెల్ప్ డెస్క్‌లను అందుబాటులోకి తెచ్చారు. వైద్యం, అంబులెన్స్‌లు వంటి అత్యవసర సేవలతో పాటు అన్ని రకాల ప్రయాణ సదుపాయాల కోసం నేరుగా ఈ సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చు. హెల్ప్ డెస్క్ సేవలు ఇలా... రైల్వేస్టేషన్ల అభివృద్ధి, సదుపాయాల విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా ఐదు రైల్వేస్టేషన్లు బెంగళూర్, పుణే, సికింద్రాబాద్, ఢిల్లీలోని ఆనంద్‌బాగ్, చండీఘర్లను ఎంపిక చేసి ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ)కి అప్పగించారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్, పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు నేరుగా కానీ, ఫోన్ నంబర్ల ద్వారా కానీ సేవలను పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, గర్భిణులు, నడవలేని స్థితిలో ఉన్న రోగుల కోసం వీల్చైర్లను ఏర్పాటు చేస్తారు. కొత్తగా వచ్చే ప్రయాణికులు ఏ ప్లాట్‌ఫామ్‌కు ఎలా వెళ్లాలి, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఎక్కడ ఉన్నాయో చెబుతారు. ఏసీ వెయిటింగ్ హాళ్లు, ప్రీపెయిడ్ రెస్ట్‌రూమ్‌ల వివరాలను తెలియజేస్తారు. స్టేషన్ పరిశుభ్రత, మంచినీటి సదుపాయం, టాయిలెట్ల నిర్వహణ, విద్యుత్ సదుపాయం వంటి వివిధ రకాల సేవల్లో లోపాలకు తావు లేకుండా చూస్తారు. దేశవ్యాప్తంగా రైళ్ల నిర్వహణ, టికెట్ బుకింగ్, రిజర్వేషన్ల వంటి అంశాలకు మాత్రమే రైల్వేలు పరిమితమవుతాయి. స్టేషన్ల నిర్వహణ, రైల్వేస్థలాల్లో వాణిజ్య కార్యకలాపాల విస్తరణ ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం వంటివి ఐఆర్ఎస్డీసీ పరిధిలోకొస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్లో పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లు, సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. తొలిదశలో ప్రయాణికుల సదుపాయాల నిర్వహణ, రెండో దశలో స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టును చేపట్టనున్నారు. సికింద్రాబాద్‌లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య : 1.95 లక్షలు రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య (సుమారు) : 150 మొత్తం ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య : 10 వీల్‌చైర్, హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్ : 040–27788889 వాటర్, టాయిలెట్లు, విద్యుత్, రెస్ట్‌రూమ్స్ వంటి వాటి కోసం : 040–27786607 ఐఆర్ఎస్డీసీ సిబ్బంది సహాయం కోసం : 8008400051, 9849759977 -
విభిన్న ప్రేమ
నెల్లూరు రూరల్: రాష్ట్రంలో 2,450 మందికి మోటరైజ్డ్ త్రీవీలర్లను పంపిణీ చేయనున్నారు. ఈ లెక్కన జిల్లాకు 188 యూనిట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యాటరీ సాయంతో నడిచే వీల్ చైర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 175 మందికి ఇవ్వనున్నారు. వీటిలో జిల్లాకు సుమారు 13 యూనిట్లు రావచ్చని అధికారుల అంచనా. అర్హులైన వారు ఈ నెల 16వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 23వ తేదీ లోపల దరఖాస్తు కాపీలను విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాల్సి ఉంది. అయితే లబ్ధిదారుల ఎంపికలో సవాలక్ష నిబంధనలు పెట్టారు. 80 శాతం వికలత్వం ఉంటేనే మోటారైజ్డ్ త్రీ వీలర్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే శారీరక వికలత్వం కనీసం 80 శాతంతో పాటు 18–40 ఏళ్లలోపు వయసు దివ్యాంగులే అర్హులు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) చదువుతుండాలి. లేదంటే పదోతరగతి ఉత్తీర్ణులై స్వయం ఉపాధి విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. పీజీ విద్యార్హత సర్టిఫికెట్తో పాటు డ్రెవింగ్ లైసెన్స్, స్వయం ఉపాధి యూనిట్ ఫొటో జత చేయాల్సి ఉంది. బ్యాటరీ వీల్ చైర్స్కు దరఖాస్తు చేసుకునేవారు కనీసం పదోతరగతి ఉత్తీర్ణులవ్వాలి. వీటిలో మోటారైజ్డ్ త్రీ వీలర్ వెహికల్స్‌కు నిబంధనలు పెట్టారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 వేల మంది అర్హులు జిల్లాలో మొత్తం సుమారు 50 వేల మంది శారీరక వికలత్వం కల్గిన దివ్యాంగులున్నారు. వీరిలో 15 వేల మంది 80 శాతం పైగా వికలత్వం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వీరిలో ఎంతమంది పీజీ చేసి ఉంటారనేది ప్రశ్న. దీనికి తోడు స్వయం ఉపాధి యూనిట్లు నడిపే వారు కూడా చాలా అరుదుగా ఉన్నారని సమాచారం. ఈ పరిస్థితుల్లో నిబంధనలు పెట్టడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్న తలెత్తుతోంది. మరో వైపు జిల్లాకు కేటాయించిన యూనిట్లు ఏమాత్రం సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేల సంఖ్యలో అభ్యుర్థులుంటే కేవలం 200 లోపు యూనిట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ నిబంధన దారుణం సాధారణ పురుషులు, మహిళలు డ్రైవింగ్ లైసెన్స్ పొందడటమే చాలా కష్టం. అలాంటిది దివ్యాంగులు వాహనం పొందేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌ను తప్పని సరి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వికలాంగులకు ఇన్వ్యాలిడిటీ వెహికిల్ కింద ఎల్‌ఎల్‌ఆర్‌ను అందించే వీలుంది. అయితే దివ్యాంగులు నడపకలిగిన వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాతగానీ ఎల్‌ఎల్‌ఆర్‌ను జారీ చేయరు. అలాంటప్పుడు ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనను ఎలా అమలు చేస్తోందని దివ్యాంగులు ప్రశ్నిస్తున్నారు. -
గాంధీ ఆస్పత్రిలో అవస్థలు
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగం వద్ద వీల్ చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు దాతలు స్పందించి ఇటీవల గాంధీ ఆస్పత్రికి విరాళంగా అందించిన పదుల సంఖ్యలో వీల్చైర్లు, స్ట్రెచర్లు స్టోర్ గదికే పరిమితం అవుతున్నాయి. దీంతో స్ట్రెచర్లు అందుబాటులో లేక ఓ వ్యక్తి తన తల్లిని స్వయంగా ఎత్తుకుని అత్యవసర వార్డులోకి తీసుకువెళుతున్న దృశ్యాలను సోమవారం ‘సాక్షి’ క్లిక్ మనిపించింది.