wild gun
-
నాటు తుపాకితో ఆర్టీసీ డ్రైవర్ అరెస్ట్
మంచాల: రంగారెడ్డి జిల్లాలో నాటు తుపాకి కలిగి ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మంచాల ఎస్సై యాదగిరి కథనం ప్రకారం... ఎల్లమ్మ తండా గ్రామానికి చెందిన సపావట్ రవి కుమార్. వృత్తి రీత్యా ఆర్టీసీ డ్రైవర్. ఆయన వద్ద తమ పూర్వీకులు వాడిన నాటు తుపాకిను కలిగి ఉన్నాడు. దానికి సంబంధించిన లైసెన్స్, ఎలాంటి అనుమతి పత్రాలు అతని వద్ద లేవు. గుట్టు చప్పుడు కాకుండా రవి కుమార్ తుపాకిని తన దగ్గర భద్రపర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మంచాల ఎస్సై యాదగిరి నాటు తుపాకిని స్వాధీనం చేసుకొని రవి కుమార్ను అరెస్టు చేశారు. -
రైతుపై తుపాకీతో కాల్పులు
వివాహేతర సంబంధమే కారణం ఆలస్యంగా వెలుగు చూసిన వైనం నిందితుడి అరెస్ట్ కెలమంగలం: నాటు తుపాకీతో రైతుపై కాల్పులు జరిపిన వ్యక్తిని డెంకణీకోట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... డెంకణీకోట తాలూకా అయ్యూరు అటవీ శివారు ప్రాంతంలోని తొలువబెట్ట గ్రామానికి చెందిన బసప్ప రెండు రోజుల క్రితం తొడపై గాయాలతో డెంకణీకోట ప్రభుత్వాసపత్రిలో చేరాడు. చికిత్స అందించినా గాయం నుంచి రక్తం కారుతుండడంతో ఆదివారం రాత్రి వైద్యులు ఎక్స్రే తీయించారు. ఆ సమయంలో అతని తొడ భాగంలో 17 తుపాకీ రవ్వలు ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆస్పత్రిని చేరుకుని బసప్పను తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. తొలువ బెట్ట గ్రామానికి చెందిన చిన్నతిమ్మన్(50)తనను నాటుతుపాకీతో కాల్చిన్నట్లు బసప్ప తెలిపాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో చిన్నతిమ్మన్కు పదేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని, నాలుగేళ్లుగా ఆమె తనతోనూ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నట్లు వివరించాడు. గత నెల 31న రుద్రమ్మతో బసప్ప ఉండగా చిన్నతిమ్మన్ అక్కడకు చేరుకున్నాడు. ఆ సమయంలో ఘర్షణ చోటు చేసుకుని నాటుతుపాకీతో బసప్పపై చిన్నతిమ్మన్ కాల్పులు జరిపాడు. ఈ విషయాన్ని తెలిపితే పరువు పోతుందని భావించి ఇనుపమళలతో తనను గుచ్చినట్లు డాక్టర్ల వద్ద తెలిపి చికిత్స పొందుతున్నట్లు పోలీసుల ఎదుట బసప్ప అంగీకరించాడు. దీంతో కేసు నమోదు కేసిన డెంకణీకోట ఇన్స్పెక్టర్ శరవణన్... తొలువబెట్ట గ్రామానికి వెళ్లి చిన్నతిమ్మన్ను అరెస్ట్ చేసి అతని ఇంటి సమీపంలో పొదల్లో దాచి ఉంచిన రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.