windows 7
-
విండోస్ 7కు అప్డేట్స్ నిలిపివేత
జైపూర్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి సెక్యూరిటీ, టెక్నికల్ అప్డేట్స్ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. 2020 జనవరి 14 నుంచి అప్డేట్స్ను నిలిపేస్తామని, యూజర్లు మెరుగైన లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌కు మారాల్సి ఉంటుందని పేర్కొంది. యూజర్లు సులభంగా కొత్త ఓఎస్‌కు మారేలా బైబ్యాక్, ఎక్సే్చంజ్ ఆఫర్లు ప్రకటించడంతో పాటు చౌకగా డివైస్‌లను తయారు చేసేలా డెల్, హెచ్‌పీ వంటి కంప్యూటర్స్ తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు మైక్రోసాఫ్ట్ వివరించింది.‘2020 జనవరి 14 నుంచి విండోస్ 7కు సపోర్ట్ నిలిపివేస్తున్నాం. ఆ తర్వాత నుంచి ఈ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి సెక్యూరిటీ, టెక్నికల్ అప్డేట్స్ లభించవు. కాబట్టి ఈ ఓఎస్‌పై నడిచే కంప్యూటర్ డివైజ్‌లకు రిస్కులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని లేటెస్ట్ ఓఎస్‌కు అప్‌గ్రేడ్ కావడం శ్రేయస్కరం‘ అని మైక్రోసాఫ్ట్ ఇండియా గ్రూప్ డైరెక్టర్ ఫర్హానా హక్ తెలిపారు. వినియోగదారులు విండోస్ 10 ఆధారిత పీసీ, ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్‌లను కొనుగోలు చేయొచ్చని, వీటిల్లో మరింత సురక్షితమైన, అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయని వివరించారు. టెక్‌ఐల్ నివేదిక ప్రకారం దేశీ చిన్న తరహా సంస్థలు నాలుగేళ్ల క్రితం నాటి కంప్యూటర్ నిర్వహణపై సగటున రూ. 93,500 ఖర్చు చేస్తున్నాయని.. ఇది దాదాపు మూడు కొత్త తరం కంప్యూటర్స్ రేటుకు సరిసమానమని హక్ పేర్కొన్నారు. -
జూన్ 30 తర్వాత వాట్సాప్ బంద్!
చాలావరకు ఫోన్లలో పనిచేయకపోవచ్చు కొత్త వెర్షన్‌లోకి అప్‌గ్రేడ్ కావాలంటూ సూచన సరికొత్త బంపర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఫేస్బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ ఇటీవలికాలంలో అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్తగా ‘స్టేటస్’ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త కొత్త ఫీచర్లు చాలా ఆదరణ పొందుతున్నాయి కూడా. తమ బంధువులు, స్నేహితులతో నిత్యం టచ్‌లో ఉండటానికి ఇప్పుడు చాలామందికి వాట్సాప్ నిత్యావసర సాధనంగా మారిపోయింది. ఈ యాప్‌ను తమ వ్యాపార, వాణిజ్య అవసరాలకు ఉపయోగించేవారు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో అనేక ఆధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతే ఎలా ఉంటుంది? జీర్ణించుకోవడం కష్టమే కదా. కానీ కొందరు యూజర్లకు ఈ బాధ తప్పకపోవచ్చు. గత ఏడాది ఈ విషయమై కంపెనీ ఒక అధికారిక ప్రకటన చేసింది. తమ ఫీచర్లను విస్తరిస్తున్న క్రమంలో కొన్ని మొబైల్ డివైజ్‌లలో వాట్సాప్ పనిచేయకపోవచ్చునని, 2016 చివరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నది. కానీ, దీనిపై కొంత భిన్న స్పందన రావడంతో ఈ నిర్ణయాన్ని వాట్సాప్ ఈ ఏడాది జూన్ 30వరకు వాయిదా వేసింది. ఇప్పుడు ఈ నిర్ణయం కచ్చితంగా అమలుకానున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం కనుక అమలైతే.. చాలావరకు ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయకపోవచ్చు. కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపిన ప్రకారం.. ఈ ఫోన్లలో జూన్ 30 తర్వాత వాట్సాప్ సపోర్ట్ చేయబోదు. బ్లాక్‌బెర్రీ (బ్లాక్‌బెర్రీ 10 సహా) నోకియా ఎస్40 నోకియా సింబియన్ ఎస్60 ఆండ్రాయిడ్ 2.1 , ఆండ్రాయిడ్ 2.2 విండోస్ ఫోన్ 7.1 ఐఫోన్ 3జీఎస్/ఐవోఎస్ 6 ఈ వెర్షన్ ఫోన్లు ఉన్నవాళ్లు తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకొని వాట్సాప్ సేవలను యథాతథంగా పొందవచ్చునని కంపెనీ గతంలోనే తెలిపింది. అంతేకాదు, తన యూజర్లకు మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు వాట్సాప్ సిద్ధమవుతోంది. విండోస్ యూజర్లకు చాట్‌డాటాను ఆర్గనైజ్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. ఈ ఫీచర్ ఉంటే.. ఫొటోలు, జిప్‌లు, వీడియోలు, మెసేజ్‌లు యూజర్లు తమకు నచ్చినట్టు ఒకేచోట ఆర్గనైజ్ చేసుకోవచ్చు. -
'విండోస్ 7కు అప్ డేట్స్ నిలిపేస్తున్నాం'
విండోస్ 7 కంప్యూటర్ వినియోగించే ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఆపరేటింగ్ సిస్టం. వినియోగదారుడికి అత్యంత సౌకర్యవంతంగా ఉండే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మరికొద్ది సంవత్సరాలు మాత్రమే వినియోగదారుడికి అందుబాటులో ఉంటుంది. ఈ మాట ఎవరో కాదు.. స్వయంగా మైక్రోసాఫ్ట్ సంస్థే ప్రకటించింది. సమకాలీన సాంకేతికతలో రోజు రోజుకూ వస్తున్న మార్పులు విండోస్ 7లో భద్రతా సమస్యలు సృష్టిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో వచ్చే మూడేళ్లలో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంకు భద్రతాపరమైన అప్డేట్లను పంపడం నిలిపివేస్తున్నట్లు తెలిపింది. భద్రతా సమస్యలను ఎదుర్కోవాలంటే వినియోగదారులకు ఎప్పుడూ ఓఎస్‌లో మార్పులు చేస్తూ కొత్త అప్డేట్లు పంపించాల్సి ఉంటుంది. అలాగే.. కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్న ప్రింటర్లు, కీబోర్డులు, స్పీకర్లు, మౌస్‌లు తదితర హార్డ్‌వేర్ పరికరాలకు సపోర్ట్ చేయాలన్నా ఓఎస్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంతో ఇలాంటి సమస్యలను పరిష్కరించడం మైక్రోసాఫ్ట్‌కు తలకుమించిన భారంగా మారుతోంది. అందుకే 2020 జనవరి 13 నుంచి విండోస్ 7కు సెక్యూరిటీ సపోర్ట్ పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తన బ్లాగులో మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఆ లోగా వినియోగదారులంతా విండోస్ 10కి మారాలని కోరింది. -
విండోస్ ఎక్స్పీ వాడుతున్నారా... జాగ్రత్త !
-
'విండోస్ ఎక్స్పీ'కి తెర !