winning elections
-
Lok Sabha election 2024: అలవిగాని హామీలు
‘ఊరూరా బారు, బీరు. నెలకు 10 లీటర్ల బ్రాందీ. ఫారిన్ విస్కీ సరఫరా’, ‘ఏకంగా చంద్రుడిపైకి ఫ్రీ ట్రిప్పు’, ‘ఒక్కొక్కరి ఖాతాలో ఏటా రూ.కోటి జమ’, ‘బాల్య వివాహాలకు మద్దతు’... ఇవన్నీ ఎన్నికల్లో అభ్యర్థులు గుప్పిస్తున్న చిత్ర విచిత్రమైన హామీలు! గెలుపే లక్ష్యంగా అలవిగాని హామీలు గుప్పించే సంస్కృతి పెరుగుతోంది. కొందరు అభ్యర్థులు వార్తల్లో నిలిచేందుకు చిత్ర విచిత్రమైన వాగ్దానాలు చేస్తున్నారు... బీరు, బంగారం, రూ.10 లక్షలు వనితా రౌత్. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా చిమూర్వాసి. అఖిల భారతీయ మానవతా పార్టీ అభ్యర్థిగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో చంద్రపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. గ‘మ్మత్తయిన’ హామీలతో ఫేమస్ అయ్యారామె. తనను గెలిపిస్తే ప్రతి గ్రామంలో బీర్లతో బార్ ఏర్పాటు చేయిస్తానని, ఎంపీ లాడ్స్ నిధులతో విస్కీ, బీర్లు దిగుమతి చేసుకుని మరీ ఓటర్లకు ఉచితంగా సరఫరా చేస్తానని ప్రకటించారు. ‘‘నిరుపేదలు ఎంతో కష్టించి పనిచేస్తారు. వారు మద్యం సేవించి సేదదీరుతారు. కానీ నాణ్యమైన విస్కీ, బీర్లు తాగే స్థోమత లేక దేశీయ లిక్కరే తాగుతుంటారు. అందుకే నాణ్యమైన లిక్కర్ దిగుమతి చేసుకుని వారికందించాలని అనుకుంటున్నా’’ అంటూ రౌత్ తన హామీలను సమరి్థంచుకుంటున్నారు! 2019 లోక్‌సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే హామీలు గుప్పించారామె. 2019 ఎన్నికల్లో తమిళనాడులోని తిరుపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎ.ఎం.õÙక్ దావూద్ కూడా ఇలాగే ప్రతి కుటుంబానికీ నెలకు 10 లీటర్ల స్వచ్ఛమైన బ్రాందీ సరఫరా చేస్తానని హామీ ఇచ్చారు! పెళ్లి చేసుకునే ప్రతి జంటకు ఏకంగా 10 సవర్ల బంగారం, ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలిస్తానని, కుటుంబానికి నెలకు ఏకంగా రూ.25,000 ఇస్తాననీ వాగ్ధానం చేశారు! చంద్ర యాత్ర 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సౌత్ మదురై నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన శరవణన్ (33) అనే జర్నలిస్టు ఉచితంగా చంద్రుడిపైకి పంపిస్తానని, మినీ హెలికాప్టర్ ఇస్తానని, ఐఫోన్లు పంచిపెడతానని హామీలిచ్చారు. ప్రతి ఓటర్ ఖాతాలో ఏకంగా ఏటా రూ.కోటి జమ చేస్తానన్నారు! ఇంటి పనుల్లో సాయానికి గృహిణులకు ఉచిత రోబోలను అందిస్తానని, ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ పూల్తో కూడిన మూడంతస్తుల భవనం, ప్రతి మహిళకూ వివాహ సమయంలో 100 సవర్ల బంగారం, కుటుంబానికో పడవ, యువతకు వ్యాపారం ప్రారంభించేందుకు రూ.కోటి సాయం చేస్తానని వాగ్ధానం చేశారు. పైగా తన నియోజకవర్గాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచేందుకు 300 అడుగుల ఎత్తులో కృత్రిమ హిమ పర్వతాన్ని ఏర్పాటు చేయిస్తానన్న హామీ నవ్వులు పూయించింది. అయితే, ‘తమిళనాడులో ప్రబలంగా ఉన్న ఉచిత తాయిలాల సంస్కృతి బారిన పడొద్దంటూ ఓటర్లలో అవగాహన కలి్పంచడమే తన లక్ష్యమని ముక్తాయించారాయన. రైతును పెళ్లాడితే.. రైతు కుమారుడిని పెళ్లాడే మహిళకు రూ.2 లక్షల సాయం చేస్తామని 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఇచి్చన హామీ తెగ వైరలైంది. ‘‘రైతుల అబ్బాయిలను పెళ్లాడేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదు. అందుకే రైతుల స్వీయ గౌరవాన్ని కాపాడేందుకు ఈ హామీ ఇచ్చాం’’ అన్నారాయన. బాల్య వివాహాలకు రైట్ రైట్ 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ అభ్యర్థి శోభా చౌహాన్ ఇచ్చిన హామీ చర్చనీయంగా మారింది. ‘‘దెవాసీ సమాజంలో బాల్య వివాహాల సంస్కృతిలో పోలీసుల జోక్యాన్ని నివారిస్తాం. నన్ను గెలిపిస్తే బాల్య వివాహాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా చూస్తాం’’ అని ప్రకటించారు. మునుగోడును అమెరికా చేస్తా తెలంగాణలో 2022 మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఇచి్చన హామీ కూడా హైలైటే. తనను గెలిపిస్తే మునుగోడును అమెరికాలా మారుస్తానని, ఇతర పారీ్టలు 60 నెలల్లో చేయలేనంత అభివృద్ధిని ఆరు నెలల్లోనే చేసి చూపిస్తానని హామీ ఇచ్చారాయన. ప్రపంచవ్యాప్తంగానూ... 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ న్యూ గింగ్రిచ్ విఫలయత్నం చేశారు. తనను గెలిపిస్తే 2020 కల్లా టికి చంద్రుడిపై శాశ్వత అమెరికా కాలనీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారాయన! ► అవే ఎన్నికల్లో వెర్మిన్ సుప్రీమ్ అనే ఆరి్టస్ట్ తనను గెలిపిస్తే ప్రతి అమెరికన్‌కు ఓ గుర్రాన్ని కానుకగా ఇస్తానని ప్రకటించారు. ► జింబాబ్వేలో 2018 ఎన్నికలప్పుడు ప్రజలకు ఐదేళ్లలో 15 లక్షల ఇళ్లు కట్టిస్తామంటూ జాను–పీఎఫ్ పార్టీ హామీనిచి్చంది. అంటే సగటున రోజుకు ఏకంగా 822 ఇళ్లన్నమాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
BJP National Convention 2024: 100 రోజులు.. 370 స్థానాలు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి 370 నియోజవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. బీజేపీ సొంతంగానే 370 స్థానాలు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కనీసం 400 స్థానాలు దక్కించుకోవడానికి రాబోయే వంద రోజులు కష్టపడి పనిచేయాలని వెల్లడించారు. గడిచిన పదేళ్ల కాలంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు లభిస్తున్నగౌరవాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమయ్యాయి. మరో మూడు నెలల్లోగా జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. తొలిరోజు భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, కోర్ కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు సహా 11 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విజయాలను తెలిలియజేసే ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ, నడ్డా తదితరులు తిలకించారు. అనంతరం పలువురు ముఖ్యనేతలు ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యాలు, ప్రచార వ్యూహాలపై మార్గనిర్దేశం చేశారు. ముఖర్జీకి నిజమైన నివాళి: మోదీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవడమే బీజేపీ లక్ష్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. శనివారం బీజేపీ జాతీయ ఆఫీసు–బేరర్ల భేటీలో ఆయన ప్రసంగించారు. జమ్మూకాశీ్మర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తూ రాజ్యాంగంలో చేర్చిన ఆరి్టకల్ 370ని జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో 370 స్థానాలు సాధించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి 100 రోజుల ప్రణాళిక ప్రకారం కార్యకర్తలు బూత్ స్థాయిలో పనిచేయాలని సూచించారు. ప్రతి బూత్‌లో కొత్తగా 370 ఓట్లు అధికంగా బీజేపీకి లభించేలా చూడటంతోపాటు కొత్త ఓటర్లను ఆకర్షించాలని చెప్పారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం: జేపీ నడ్డా ప్రధాని మోదీ నాయకత్వంలో పదేళ్ల కాలంలో బీజేపీ అనేక విజయాలు సాధించిందని జేపీ నడ్డా అన్నారు. 2014లో 5 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో బీజేపీ, 17 రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉందని గుర్తుచేశారు. పశి్చమ బెంగాల్లో బీజేపీకి 10 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. కొన్ని నెలల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పారీ్టకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని, మూడు రాష్ట్రాల్లో విజయం సాధించామని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ పరంగా గెలిచామని అన్నారు. రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేల సంఖ్య ఒక్కటి నుంచి 8కి, ఓట్ల శాతం 7.1 నుంచి 14కు పెరిగిందని వెల్లడించారు. తెలంగాణను వదిలిపెట్టబోమని, అక్కడ అధికారంలోకి వస్తామని, అందుకు ప్రణాళికలు తయారవుతున్నాయని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశ ప్రజలంతా దీపాలు వెలిగించినా, ప్రతిపక్ష నేతలు మాత్రం ఈ మహత్కార్యానికి దూరంగా ఉన్నారని విమర్శించారు. తెలంగాణ, ఏపీ నుంచి భారీగా హాజరైన నేతలు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ కె.లక్ష్మణ్‌లతో పాటు సీనియర్ నేతలు ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కూన శ్రీశైలం గౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సీనియర్ నేతలు సోము వీర్రాజు, కిరణ్‌కుమార్‌రెడ్డి, విష్ణువర్ధ్దన్‌రెడ్డి, సత్యకుమార్, కిలారు దిలీప్ హాజరయ్యారు. -
‘అది 440 వోల్ట్ల కరెంట్.. కాంగ్రెస్‌కే షాకిస్తుంది’
జైపూర్: రాజస్థాన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 135 సీట్లు గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ఇది అతిపెద్ద విజయాలలో ఒకటిగా ఉంటుందని బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర సింగ్ రాథోడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా "అండర్ కరెంట్" (లోలోపల అనుకూలత) ఉందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై రాజేంద్ర సింగ్ రాథోడ్ వ్యంగ్యంగా స్పందించారు. "అండర్ కరెంట్ ఉందని గెహ్లాట్ సాబ్ చెప్పింది నిజమే. అది 440 వోల్ట్లు. ఆయన చెబుతున్న అండర్ కరెంట్ కాంగ్రెస్‌కే షాక్ ఇస్తుంది" అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలను ఆకట్టుకోలేదని, రాష్ట్రంలో ఆ పార్టీని గద్దె దించేందుకే ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ‘కాంగ్రెస్ అవమానకరమైన పరాజయం దిశగా అడుగులు వేస్తోంది. గ్రౌండ్ రిపోర్ట్‌ల ప్రకారం.. ఈ ఎన్నికల్లో బీజేపీ 135 సీట్లకు పైగా సాధిస్తుంది. ఇది అతిపెద్ద ఎన్నికల విజయాలలో ఒకటి’ అని రాథోడ్ పేర్కొన్నారు. నవంబర్ 25న రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 200 స్థానాలకు గాను 199 స్థానాల్లో పోలింగ్ జరిగింది. మరో నాలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
బహుముఖ పోటీలో బీజేపీకే మొగ్గు
పెద్ద రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరుగుతున్నప్పుడు చిన్న రాష్ట్రాల కథనాలు విస్మరణకు గురయ్యే అవకాశం ఉంది. అలాగని అక్కడి పోరేమీ తక్కువ రసాత్మకం కాదు. మణిపూర్, గోవా శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి మామూలు కంటే ఎక్కువ పార్టీలు బరిలో ఉన్నాయి. సహజంగానే అన్నీ తమ గెలుపు పట్ల ధీమాగా ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వాటి విజయావకాశాలను ప్రభావితం చేయగలిగే అంశాలు ఎన్నో. 5 రాష్ట్రాల ఎన్నిక లను విశ్లేషిస్తూ ఢిల్లీకి చెందిన ప్రతిష్ఠాత్మక సీఎస్డీఎస్, ‘సాక్షి’కి ప్రత్యేకంగా రాస్తున్న వ్యాస పరంపరలో ఇది మొదటిది. కోవిడ్ మహమ్మారి మూడోసారి విరుచుకు పడుతున్న తరుణంలో భారత ఎన్నికల సంఘం... ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ పార్టీలూ, నేతలూ ఎన్నికల సంఘం నిర్ణయన్ని స్వాగతించినా ఇత రులు మాత్రం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టారని విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం తీరు రోమ్ తగలబడుతూంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల సంఘం... ఎనభై ఏళ్ల పైబడ్డ వారికి, కోవిడ్ బాధితులు, దివ్యాంగు లకు పోస్టల్ బ్యాలెట్ల వంటి సౌకర్యాలు కొన్ని ఏర్పాటు చేసి... బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలు, ప్రదర్శనలు, పాదయాత్రలకు మాత్రం విస్పష్టంగా నో చెప్పింది. ఓటింగ్ జరిగే సమయాన్ని ఒక గంట పొడిగించి, పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ సంబంధిత రక్షణ చర్యలన్నింటినీ తప్పనిసరి చేసింది. ఈ చర్యలన్నీ చదివేందుకు, ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో చూసుకునేందుకు బాగానే ఉంటాయి కానీ... వాస్తవ పరిస్థితుల్లో వీటి అమలు మాత్రం చాలా కష్టం. కోవిడ్ కేసుల నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేసి ఉండే బాగుండేది. కానీ హడావుడిగా ప్రకటించడం ఎన్నికల సంఘం కూడా రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతోందనేందుకు నిదర్శనం. తాజా ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మీడియా దృష్టి మొత్తం ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లపైనే కేంద్రీకృతమై ఉంది. మిగిలిన మూడు రాష్ట్రాల వివరాలూ, విశ్లేషణలూ తక్కువగానే అందుతున్నాయి. వివక్షకు తావు లేకుండా... అందరి సమాచారాన్ని ఇచ్చే విషయాన్ని కార్పొరేట్ మీడియా ఎప్పుడో మరచిపోయింది. వీటన్నింటి కార ణంగా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో సవ్యంగా జరుగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో మణిపూర్, గోవాల పరిస్థితి ఏమిటన్నది ఒక్కసారి విశ్లేషించి చూడాలి. సంక్లిష్ట ముఖచిత్రం... మణిపూర్ అరవై అసెంబ్లీ సీట్లున్న ఈ ఈశాన్య రాష్ట్రంలో పోటీ బహుముఖం. బీజేపీ, కాంగ్రెస్ కూటమి, నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీఎఫ్), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీపీ)లకు కొన్ని సీట్లలో చిన్న చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. బీజేపీ సొంతంగా పోటీ చేస్తూండగా, కేంద్రంలో ఎన్డీయే భాగస్వాములైన ఎన్పీఎఫ్, ఎన్పీపీలు రాష్ట్రంలో విడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, జేడీ (ఎస్)లతో కాంగ్రెస్ కూటమి ఏర్పాటు చేసు కుంది. మణిపూర్ రాజకీయ ముఖచిత్రం, చరిత్ర చాలా సంక్లిష్ట మైందే. పార్టీలు, భౌగోళిక ప్రాంతాలవారీగా విడిపోయి ఉంటాయి. మొత్తం అరవై అసెంబ్లీ సీట్లలో నలభై వరకూ ఇంఫాల్ లోయ ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ మెయిటీ వర్గపు ఆధిపత్యం ఎక్కువ. నాగాలు, కుకీల ప్రాబల్యమున్న పర్వత ప్రాంతాల్లో 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2017 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 28 స్థానాలు దక్కించుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినా... ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా బీజేపీ 21 సీట్లతోనే అధికారంలోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్య మంత్రి ఓఖ్రామ్ ఐబోబి 15 ఏళ్ల అధికారానికి తెరపడింది. బీరేన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ... ఎన్పీపీ, ఎన్పీఎఫ్, తృణమూల్ కాంగ్రెస్, లోక్ జనశక్తి, ఒక స్వతంత్ర అభ్యర్థుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి కూడా కనీసం 40 స్థానాలను గెలుచుకుని అధికారం లోకి వస్తామని బీజేపీ ధీమాగా ఉంది. సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందివ్వడం మాత్రమే కాకుండా... రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, ఇన్నర్ లైన్ పర్మిట్ వ్యవస్థ అమలు ద్వారా ప్రజల నమ్మకం పొందడం ఇందుకు కారణాలుగా చూపుతోంది. మణిపూర్ రాష్ట్రంలోకి వచ్చేం దుకు ఇతర రాష్ట్రాల వారు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న ఇన్నర్ లైన్ పర్మిట్ ప్రజల చిరకాల డిమాండ్. దీనికి తోడు... ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే రాష్ట్రంలో దాదాపు ఐదు వేల కోట్ల రూపా యలతో 21 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం కూడా తమకు కలిసివస్తుందని బీజేపీ నమ్ముతోంది. అయితే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన తమను ఎస్టీల్లో చేర్చాలన్న మెయిటీల డిమాండ్‌పై ఏకాభిప్రాయం సాధించడంలో బీజేపీ విఫలమైంది. అలాగే మణిపూర్ (హిల్ ఏరియాస్) అటానమస్ డిస్ట్రిక్ కౌన్సిల్స్ బిల్ 2021 ఆమోదం పొందకపోవడమూ... రాష్ట్రంలోని పర్వతప్రాంత ప్రజలు, ఇతరుల మధ్య విభేదాలకు కారణమవుతోంది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు ఎక్కువ కావడంతో అందరినీ సర్దుబాటు చేసే అవకాశాలు తగ్గిపోయాయి. కాంగ్రెస్ నుంచి వచ్చిన 11 మంది ఎమ్మెల్యేలకు, ఇద్దరు టీఎంసీ, ఎల్జేపీ మాజీలకు మళ్లీ అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడం సొంతపార్టీ నేతలు, కార్యకర్తల అసంతృప్తికి కారణమవుతోంది. ఈ అంశాలన్నీ ఫిబ్రవరి 14 నాటి ఎన్నికల్లో బీజేపీ మీద ప్రతికూల ప్రభావం చూపవచ్చు. బీజేపీ అవకాశాలకు గండికొట్టగల ఇంకో కారణం... రాష్ట్రంలో రాజుకుంటున్న ప్రాంతీయ విద్వేషాలు. 2017లో తొమ్మిది సీట్లలో పోటీ చేసిన ఎన్పీపీ, వాటిల్లో నాలుగు గెలుచుకోగలిగింది. ఇప్పుడు ఆ పార్టీ 40 సీట్లకు పోటీ చేస్తోంది. ఎన్పీఎఫ్ గత ఎన్నికల్లో నాగాల ఆధిపత్యం ఉన్న 11 స్థానాల్లో పోటీ చేసి నాలుగింటిలో విజయం సాధించింది. చివరగా చొరబాటుదారులు చురాచెండ్పూర్లో జరిపిన దాడి నేపథ్యంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) యాక్ట్‌తో కల్లోలిత ప్రాంత స్థాయిని కొనసాగించడమూ అధికార పార్టీకి కలిసివచ్చే అంశం కాదు. కుకీ పీపుల్స్ అలయన్స్ పేరుతో ఏర్పడ్డ కొత్త పార్టీ కనీసం తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఓట్లను చీల్చగలదని అంచనా. పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతానికి బీజేపీకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, అవకాశ వాద రాజ కీయాలకు ప్రాధాన్యం లభించే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం అంత సులువేమీ కాదు. గోవాలోనూ బహుముఖమే... గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఈసారి ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్, గోవా ఫార్వార్డ్ పార్టీ (జీఎఫ్‌పీ)ల కూటమి మాత్రమే కాదు... మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), తృణమూల్ కాంగ్రెస్‌ల కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కూడా ఉండటంతో పోటీ బహుముఖంగానే ఉండనుంది. గత ఎన్నికల్లో (2017) భార తీయ జనతా పార్టీ మొత్తం నలభై స్థానాల్లో 13 మాత్రమే గెలుచు కున్నా... ఓట్ షేర్ మాత్రం 32 శాతం దాకా సంపాదించగలిగింది. మరోవైపు కాంగ్రెస్ 28 శాతం ఓట్ షేర్‌తో 17 స్థానాల్లో విజయం సాధిం చింది. కాకపోతే మణిపూర్‌లో మాది రిగానే నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్‌లో జరిగిన ఆలస్యం కాస్తా కాషాయపార్టీకి వరంగా మారింది. బీజేపీ వేసిన రాజకీయ ఎత్తులకు చిల్తై అధికారానికి దూరం కావడమే కాకుండా... ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలను కోల్పోయింది. కొంతమంది ఎమ్మెల్యేలు తృణమూల్ వైపునకూ మొగ్గిపోవడం గమనార్హం.ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోలేదన్న విమర్శను ఎదుర్కొంటోంది. ఉక్కు మైనింగ్‌ను మళ్లీ ప్రారంభిస్తామన్న బీజేపీ హామీ నెరవేరలేదు. ఈసారి గెలిస్తే... రాష్ట్ర ప్రభుత్వపు సంస్థ ద్వారా మళ్లీ ప్రారంభిస్తామని బీజేపీ చెబుతోంది. దీంతోపాటు మొల్లెం అటవీ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, పర్యావరణ సమతౌల్య పరిరక్షణ, కోవిడ్ నిర్వహణ, మాధే నది నీటిని కర్ణాటకతో పంచుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ధరల పెరుగుదల వంటి అనేక అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా నిలుస్తున్నాయి! ప్రాంతీయ పార్టీల మద్దతు కోల్పోయిన బీజేపీకి క్రిస్టియన్ (25 శాతం) ఓటర్లతోనూ పెద్దగా సంబంధాలు లేవు. పార్టీలకు అతీతంగా ఓటర్లను ఏకం చేయగల కరిష్మా ఉన్న కేంద్ర మాజీ రక్షణశాఖ మంత్రి, గోవా మాజీ ముఖ్యమంత్రి మనో హర్ పారిక్కర్ లాంటి నేతలు లేకపోవడం బీజేపీ మళ్లీ గద్దెనెక్కేందుకు అడ్డంకులుగా నిలుస్తున్నాయి. ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత, చర్చిలు, సామాజిక కార్యకర్తలపై పెరుగుతున్న దాడులు, పౌర చట్టానికి సవరణలు, ఎన్ఆర్సీ తదితర అంశాలూ బీజేపీకి ఇబ్బందికరమైన అంశాలే. వీటన్నింటికీ తోడుగా ఈసారి ఎన్నికల్లో కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ బరిలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలూ బీజేపీ మద్దతుదార్ల ఓటర్లను చీల్చే అవకాశం ఉంది. ఢిల్లీలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను చూపుతూ ఆమ్ ఆద్మీ పార్టీ తమకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తోంది. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన అనుభవజ్ఞుల సాయంతో తమకూ కొన్ని సీట్లు రాగలవన్న ఆశతో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. అయితే... గోవాలో బీజేపీకి ఊరటనిచ్చే ఒక అంశం ఉంది. ఇక్కడ రాజకీయాలు వ్యక్తులపైనే ఎక్కువ ఆధారపడి ఉంటాయి, పార్టీలపై కాదు. గెలుపోటముల మధ్య తేడా కూడా చాలా స్వల్పం. చిన్న చిన్న నియోజకవర్గాల కారణంగా కొన్ని వేల ఓట్లతో విజయం కాస్తా అపజయంగా మారిపోగలదు. బహుముఖ పోటీ జరుగుతున్న నేపథ్యంలో జరిగే ఓట్ల చీలిక బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది. 2017లో గెలిచిన 24 మంది పార్టీలు ఫిరాయించడం వల్ల గోవా ప్రజలకు నేతలపై ఉన్న నమ్మకమూ సన్నగిల్లింది. ఈ ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సి వస్తే మాత్రం ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉంది. మొత్తమ్మీద గోవా, మణిపూర్ రాజకీయాల్లో ఈసారి కూడా ఫిరాయింపులు తమదైన పాత్ర పోషిస్తాయా లేదా అన్నది చూడాలి. ఒపీనియన్ పోల్స్ ప్రకారం బీజేపీకి మణిపూర్‌లో కొంత మొగ్గు ఉన్నట్లు కనిపిస్తోంది. గోవాలో మాత్రం వెనుకబడి ఉంది. కానీ, ఈ పరిస్థితి మారేందుకు ఎక్కువ సమయమేమీ పట్టకపోవచ్చు. వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు,సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
అధికారానికి ‘నిచ్చెన’ప్రదేశ్!
ఇండియా అంటే భారత్... భారత్ అంటే ఉత్తరప్రదేశ్ అన్న వ్యవహారం ఊరకే రాలేదు. ఆ రాష్ట్ర విస్తీర్ణం, వారి జనాభా, రాజకీయాల్లో వారి సంఖ్యా బలం, దీనికిమించి ఇక్కడ గెలిచిన రాజకీయ పార్టీకి దేశాన్ని పాలించగలిగే సత్తువ రావడం కారణాలు. రాష్ట్రం అంతటా మాట్లాడేది హిందీ కాబట్టి, వారిని ఒక భావజాలం వైపు కూడగట్టడం కూడా సులభమవుతోంది. దీనివల్ల ఆ రాష్ట్రం రాజకీయంగా గడ్డకట్టిన స్థితిలోకి పోవడంతో పాటు ఈ ప్రభావం దక్షిణాదిపై పడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పాగా వేయడం వల్ల ప్రత్యక్షంగా గెలవలేని మిగిలిన రాష్ట్రాలను కూడా ఆడించడానికీ, అదుపాజ్ఞల్లో ఉంచుకోవడానికీ వీలవుతోంది. అక్కడి సంకుచిత రాజకీయాల క్రీడను మిగతా దేశ ప్రజలు అనివార్యంగా చూడవలసి రావడమే వినోద విషాదం. వలస పాలన నుంచి బయటపడిన భారత దేశంలో స్వాతంత్య్రానంతరం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అవసరం దృష్ట్యా ముమ్మర ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొని ప్రధాన భూమికను నిర్వహించిన సర్దార్ పణిక్కర్ ఒక కీలకమైన వ్యాఖ్యానం చేశారు: ‘‘ఇక రేపటి నుంచి ఇండియా అంటే భారత్, భారత్ అంటే ఉత్తరప్రదేశ్ (యూపీ) అని వ్యవహరించబడుతుంది. ఎందుకంటే, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పరిపాలించలేదు కాబట్టి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం (కాంగ్రెస్) దేశంలోని పెద్ద రాష్ట్రాలపై కన్నా చిన్న రాష్ట్రాలను ప్రభావితం చేస్తూ వాటిపై ఆధిపత్యం చలాయించడం సులువని భావించింది. ఎందుకంటే అప్పటికే దేశంలోని పెద్ద రాష్ట్రాలు హెచ్చు స్వపరి పాలనా హక్కు కోసం ఆందోళన చేస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశాన్ని సమైక్యంగా, సుస్థిరంగా ఉంచేందుకు పటిష్ఠమైన కేంద్ర ప్రభుత్వం అవసరమని కాంగ్రెస్ భావించింది. అందుకు ఉత్తరప్రదేశ్‌ను కేంద్రంగా చేసుకుని అక్కడి ‘84’ పార్లమెంట్ సీట్లు(అనంతరం ఈ సంఖ్య 86, తర్వాత 85 అయింది. ఉత్తరాఖండ్ విభజన తర్వాత ఐదు సీట్లు ఆ రాష్ట్రానికి పోవడంతో, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోక్‌సభ స్థానాల సంఖ్య 80 అయింది) ఆసరా చేసుకుని, మిగతా దేశాన్ని అదుపాజ్ఞల్లోకి తీసుకోవచ్చునని భావించింది. కనుకనే అంత పెద్ద యూపీ రాష్ట్రాన్ని కనీసం మూడు రాష్ట్రాల కిందనైనా విభజించకుండా ఒకే ఒక పెద్ద రాష్ట్రంగానే ఉంచటం జరిగింది’’ అని పేర్కొన్నారు. పాగా వేస్తే చక్రం తిప్పొచ్చు కానీ క్రమంగా ఉత్తరప్రదేశ్ దేశ పాలనలో ‘ఏకు మేకై’ కూర్చుంది. క్రమంగా నేడు పార్లమెంట్‌లోని (లోక్‌సభ) 543 మంది సభ్యులలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యే 80కి ‘దేకడం’తో కేంద్రంలో ఏ పార్టీ అయినా ‘చక్రం’ తిప్పడానికి సాధ్యపడుతోంది. చివరికి ఉత్తర–దక్షిణ భారత రాష్ట్రాల మధ్య తీవ్ర పొరపొచ్చాలకు, అనుమానాలకు, ప్రాంతీయ తగాదాలకు ‘నారు పోసి నీరు’ పెడుతోంది. ఈ వాస్తవాన్ని సెక్యులర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఏనాడో గుర్తించబట్టే యూపీ నుంచి ఎంపిక చేసే ఎంపీల సంఖ్యాబలాన్ని పదేపదే ప్రశ్నిస్తూ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల్ని దఫదఫాలుగా హెచ్చరిస్తూ రావలసి వచ్చిందని మరచిపోరాదు. ఇలా దశాబ్దాలపాటు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ, ఇతరత్రా పాలకవర్గ కూటములు కేవలం యూపీ నుంచి ఎన్నికయ్యే ఆ 80 మంది పార్లమెంట్ సభ్యుల మీద ఆధారపడుతూ మిగతా రాష్ట్రాలపైన కేంద్రాధిపత్యాన్ని శాశ్వతంగా చలాయించగల అవసరాన్ని అలవాటుగా స్థిరపరచుకోజూస్తున్నాయి. నిజానికి సర్దార్ పణిక్కర్ ‘ఇండియా అంటే భారత్, భారత్ అంటే యూపీ’ అని ఎందుకు ముద్రవేయవలసి వచ్చిందో భారత విదేశాంగ శాఖ, సమాచార శాఖల్లోని మాజీ అధికారి డాక్టర్ టీఎన్ కౌల్ తన సాధికార గ్రంథమైన ‘జ్ఞాపకాలు (రెమినిసెన్సెస్)’లో చాలా వివ రంగా చర్చించారు. ‘యునైటెడ్ ప్రావిన్స్’ అనే పేరుతో ఉన్న ఈనాటి ఉత్తరప్రదేశ్ అసలు ‘రెండు యూపీ’ల కింద లెక్క. తూర్పు యూపీకి పూర్తి భిన్నమైనది ‘పశ్చిమ’ప్రదేశ్. తూర్పు యూపీతో పోల్చితే పశ్చిమ యూపీ సంపన్నవంతమైన ప్రాంతం. అక్కడి పొలాలు తూర్పు యూపీ కన్నా సారవంతమైనవి. నీటి సౌకర్యం మెండు. నదీ జలసంపద, కాలువలు ఎక్కువ. ఈ దృష్ట్యా తూర్పు యూపీ కన్నా పశ్చిమ యూపీ అన్నివిధాలా సౌష్టవంగల ప్రాంతం. ఈ ఉత్తరప్రదేశ్ ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన వింధ్య వరకు, తూర్పున బిహార్ దాకా, పశ్చిమాన రాజస్థాన్ ఎడారి దాకా వ్యాపించి 75 జిల్లా లతో, 20 కోట్ల జనాభాతో యూరప్‌లోని ఫ్రాన్స్ దేశం కన్నా పెద్దదిగా నిలుస్తోంది. అలాంటి పెద్ద యూపీ కనీసం మూడు రాష్ట్రాలుగానైనా విభజించవలసి ఉండగా అలా జరగక పోవడానికి కారణం – ఆ అన్ని పార్లమెంట్ స్థానాలలో కేంద్ర ఆధిపత్యం కోసం పాలకవర్గాల ‘పెరపెర’! ఆ మాటకొస్తే పంజాబ్‌ను న్యూపంజాబ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌గా విభజించిన తర్వాతనే మెరుగైన అభివృద్ధికి నోచుకున్నాయి. కానీ కేంద్రాధిపత్యాన్ని తమ చేతుల నుంచి జారి పోకుండా జాగ్రత్త పడేందుకే... యూపీ నుంచి మొత్తం మంది ఎంపీ లను గుప్పిట్లో పెట్టుకుని పార్లమెంట్‌ను, దేశాన్ని ‘అడకత్తెరలో పోక చెక్క’లుగా మలచుకునేందుకు ప్రయత్నం జరుగుతోంది. రాజ్యాంగం ఉపోద్ఘాత పీఠికలో నిర్దేశించిన ‘భారత ప్రజలమైన మేము మాకుగా రూపొందించుకున్న హక్కుల పత్రాన్ని’ కేంద్ర పాలకులు ఓ చిత్తు కాగితంగా జమకట్టి తిరుగుతున్నారు. దీనంతటికీ ఆ మొత్తం లోక్ సభ స్థానాలను యూపీలో పదిలపరచుకుంటూ రావడమే కారణమని మరచిపోరాదు. భాష ఒక సాధనం పైగా మొత్తం ఉత్తరప్రదేశ్ ప్రజలు మాట్లాడేది హిందీ కాబట్టి యూపీని మరింతగా విభజించడానికి ప్రజలు మొగ్గు చూపక పోవచ్చు. అంటే, రానురాను కేంద్రంలోని పాలకవర్గాలు ప్రజలలో అవకాశవాద రాజకీయాలు చొప్పించడానికి ఎలాంటి పటిష్ఠమైన పునాదులు వేస్తూ వచ్చారో చెప్పడానికి యూపీ నుంచి ఆ 80 పార్లమెంటేరియన్ల సంఖ్యే తిరుగులేని నిదర్శనం. ఈ ‘గుత్తేదార్ల’ రాజకీయం లౌకిక రాజ్యాంగ వ్యవస్థకే కాక అది నిర్దేశించిన పౌర బాధ్యతల అధ్యాయంలోని అనుల్లంఘనీయమైన సూత్రాలకు పూర్తి విరుద్ధం. అందుకే యూపీతోపాటు దాని సరసనే మరో పెద్ద రాష్ట్రమైన బిహార్‌పైన కూడా పాలక శక్తులు కన్ను వేశాయి. మనం వేలు విడిచిన బ్రిటిష్ వలస సామ్రాజ్యవాద పాలకుల నుంచి నేర్చుకున్న గుణపాఠాలను ‘గంగ’లో కలిపేసి, స్వాతంత్య్రానంతర భారతంలో అధికార పదవులకు ఎక్కి వచ్చిన స్వతంత్ర భారత పాలకులు బ్రిటిష్ వాళ్ల ‘విభజించి–పాలించడ’మనే సూత్రాన్ని మాత్రం తు.చ. తప్పకుండా ఆచరిస్తున్నారు. కేంద్ర పాలకులుగా ఉంటున్నవారు ఏ ‘బ్రాండ్’కు చెందినవారైనా వారి కన్ను మాత్రం యూపీలోని పార్లమెంట్ స్థానాలపై కేంద్రీకరించక తప్పడం లేదు. దక్షిణాది మీద కన్ను ఆ యూపీ మెజారిటీ పార్లమెంటరీ స్థానాల ఆధారంగానే దక్షిణ భారత రాష్ట్రాలలో కూడా ‘పాగా’ వేయడానికి కేంద్ర పాలకులు ఎవరైనా సరే ప్రయత్నిస్తూనే ఉంటారని మరచిపోరాదు. ఆ సంఖ్యా బలంతోనే దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బొంబాయి, తెలంగాణ, గోవాలలో నిత్యం ఏదో ఒక ‘చిచ్చు’ రేపుతూ పోవడానికి కేంద్ర పాలకులు అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు. బహుశా అందుకనే యూపీలోని 75 జిల్లాలకు ‘వికేంద్రీకరణ’ సూత్రం వర్తించదు గానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రాజధానుల ‘వికేంద్రీకరణ’కు, ‘త్రికేంద్రీకరణ’కు అడ్డుపుల్లలు వేస్తూ పోతున్న చందంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటికైనా ఉత్తర–దక్షిణ భారత రాజకీయాలు, వాటిపై ఆధారపడి నడవవలసిన రాజకీయ పాలకులు... స్వతంత్ర భారతంలో 75 జిల్లాలతో కూడి వికేంద్రీకృత పాలనకు దూరమై, కేవలం కేంద్ర పాలనాధికారం కోసమని 80 మంది పార్లమెంటేరియన్ల సంఖ్యతో నేడు దేశంలో ఎవరూ ‘పిలవని పేరంటం’ లాంటి ఓ వినోదాన్ని ప్రజలు చూడవలసి రావడమే పెద్ద విషాదం! abkprasad2006@yahoo.co.in -
గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ వ్యూహాలు
సాక్షి, వనపర్తి: జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు మరో 48 గంటలు సమయం ఉండగానే జిల్లాలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, తమ కేడర్‌తో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. శనివారం పెద్దమందడి మండలంలోని వేర్వేరు గ్రామాల్లో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రధాన నాయకులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం పెద్దమందడి మండలంలోని విరాయపల్లిలో నిర్వహించగా.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం పెద్దమందడి మండల కేంద్రంలో నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటివరకు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ లోస్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోలేదు. ఈ స్థానం ఏర్పడిన 1962 నుంచి ఇప్పటివరకు ఎవ్వరూ సాధించలేనంత మెజార్టీతో ఈ సారి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని, కేసీఆర్‌కు, కేటీఆర్‌కు బహుమతి ఇవ్వాలనే ఆలోచనతో మంత్రి నిరంజన్‌రెడ్డి ఉన్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం ఎన్నికల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గెలుపు దిశగా పార్టీ శ్రేణులకు సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఇటీవల భారీ మెజార్టీతో శాసన సభ్యుడిగా సాధించిన విజయం కంటే.. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకోవాలనే కసితో మంత్రి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో నాయకుల మధ్య మనస్పర్థలపై దృష్టి సారించారని, సర్ధిచెప్పినట్లు తెలుస్తోంది. మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి, టీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజార్టీ వచ్చేలా చూడాలని సూచించారు. దీంతో అధికార పార్టీలో నాయకులు, కార్యకర్తలలో రెట్టింపు ఉత్సాహం కనిపించింది. వనపర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్, టీడీపీల నుంచి కొంతకాలంగా దశలవారీగా.. ప్రధాన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరటంతో అధికార పార్టీకి పెద్దమందడి మండలంతో పాటు నియోజకవర్గంలో మరింత బలం పెరిగినట్లు తెలుస్తోంది. ఎలాగైనా నిలబెట్టుకుందాం.. ఇదిలా ఉండగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక్క స్థానం కొల్లాపూర్‌లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఉన్న కాసింత పట్టుతోనే విజయం కేతనం ఎగుర వేసేందుకు కుస్తీ పట్టాలని వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఎన్నికల యుద్ధానికి నాయకులను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కార్యకర్తల సమావేశంలో సూచనలు చేశారని తెలుస్తోంది. నేడు జిల్లా కేంద్రంలో మంత్రి సమావేశం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులను, కార్యకర్తలను అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదివారం తన నివాసంలో వనపర్తి, గోపాల్పేట, రేవల్లి మండలాలతో పాటు వనపర్తి పట్టణ ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు. -
గెలుపు తంత్రం అదే!!
అమెరికా ఎన్నికల ఫలితం ‘మితవాద సాంస్కృతిక పునరుజ్జీవనం’లో భాగమే ప్రపంచీకరణ పరిణామాలు, మార్పులపై ‘తెల్ల అమెరికన్ల’ ఆగ్రహం వలసలపై వ్యతిరేకత, మహిళా సాధికారతపై విముఖత, ఉగ్రవాద భయం వారి మనోభావాలకు, ఆగ్రహానికి ప్రచారంలో అద్దం పట్టిన డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం’ అనే నినాదంతో బరిలోకి దిగిన ట్రంప్ అంచనాలనూ తలకిందులు చేశారు. వలసల, మహిళల, ప్రపంచీకరణ వ్యతిరేకి, ముస్లిం వ్యతిరేకి, క్యాథలిక్ వ్యతిరేకి - అన్నిటికీ వ్యతిరేకిగా పేరుపడ్డ ట్రంప్.. ఆ ధోరణిని బాహాటంగా ప్రదర్శించే దుందుడుకు స్వభావిగా, డర్టీ కామెంట్లతో నోటిదురుసు వ్యక్తి డొనాల్డ్.. ప్రపంచంలో ప్రజాస్వామిక, లౌకిక విలువలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో ఎలా నెగ్గారనే ప్రశ్నకు సమాధానాలు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రంప్ గెలుపు వెనుక ఆర్థిక కారణాలకన్నా సాంస్కృతిక కారణాలే ఎక్కువగా ఉన్నాయని.. ఆయన విజయం కాకతాళీయమేమీ కాదని, ప్రపంచ వ్యాప్తంగా బలపడుతున్న ‘మితవాద సాంస్కృతిక పునరుజ్జీవనం’లో భాగమేనని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. - సాక్షి, నేషనల్ డెస్క్ భారతదేశంలో బీజేపీ, బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ గెలుపు, హంగరీలో ఫిడిస్జ్ - హంగేరియన్ సివిక్ అలయన్స విజయం, పోలండ్‌లో లా అండ్ జస్టిస్ నెగ్గడం.. రష్యా, టర్కీ, ఫిలిప్పీన్‌స దేశాలూ అధికారస్వామ్యం దిశగా పయనించటం నుంచి.. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ తీర్పునిచ్చిన ‘బ్రెక్జిట్’ వరకూ - ప్రపంచ వ్యాప్తంగా.. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో మితవాద సాంస్కృతిక పునరుజ్జీవనం బలపడుతోందనేది పరిశీలకుల అంచనా. మితవాద రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రంప్‌కు ‘తెల్ల అమెరికన్లు’ పట్టంకట్టడం ఆ పాశ్చాత్య మితవాద పునరుజ్జీవనానికి కొనసాగింపేనని అంచనా వేస్తున్నారు. పలువురు సామాజిక, రాజకీయ పరిశీలకుల విశ్లేషణల ప్రకారం.. శతాబ్దం కిందట సుడిగాలిలా చెలరేగిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆలోచనా ధోరణులతో పశ్చిమ దేశాల్లోనే మొదలైన విప్లవాత్మక లౌకిక ప్రజాస్వామిక ఉద్యమం ప్రపంచాన్ని చుట్టేయడంతో 60వ దశకంలో ప్రపంచం సంక్షుభిత పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సంక్షోభాలను అధిగమించి లౌకిక ప్రజాస్వామ్యం అన్ని దేశాల్లోనూ వేళ్లూనుకుంది. ప్రపంచీకరణ.. పాశ్చాత్య ప్రపంచంలో మితవాద భావజాలం గల ప్రజానీకం, అవకాశాలను పొందలేని వెనుకబడిన వర్గాలు.. తమ విశిష్ట ఉనికిని కోల్పోతున్నట్లుగా, పరాయివారి వల్ల అన్యాయానికి గురవుతున్నట్లుగా భావిస్తున్నారు. ట్రంప్ వెనుక నిలుచున్నది ఈ వర్గానికి చెందిన ‘తెల్ల అమెరికన్లే’. తెల్లవారు కాని విదేశీయులు, విజాతీయులు తమ దేశంలోకి వచ్చి ఉద్యోగాలు, ఉపాధి చూసుకుంటూ తమతో సమానంగా నివసించటం, తమను మించి అభివృద్ధి చెందుతుండటం ఒకవైపు.. తమకు అవకాశాలు సన్నగిల్లడానికి కారణం ఈ వలసలేనని మరోవైపు.. ‘శ్వేత’ సౌధంలో ఒక ‘నల్లజాతీయుడు’, అందునా ‘ముస్లిం ఉగ్రవాదం’ తమకు పెనుముప్పుగా పరిణమించిన తరుణంలో ఒక ‘ముస్లిం’ దేశాధ్యక్షుడిగా ఉండటం.. రెండో తరగతి పౌరులుగా ఉండాల్సిన మహిళలు సమాన హక్కులు పొందడమే కాదు.. తమకు సర్వాధినేతగా పదవి చేపట్టడానికి ఒక మహిళ సంసిద్ధమవడం వంటి పరిణామాలు మరోవైపు.. ముప్పేటగా కలగలసి ‘తెల్ల అమెరికన్లు’ ట్రంప్ వెనుక నిలిచేలా చేశాయి. ట్రంప్ ఇదే భావజాలాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. నిజానికి ట్రంప్‌ను గెలిపించిన ‘తెల్ల అమెరికన్లు’ ఎక్కువగా చదువుకోని శ్రామిక వర్గీయులు. ట్రంప్ కుబేరుడైనా..ఈ ‘తెల్ల’ అమెరికన్లు వారు ఆయనను తమ వాడిగానే భావించారు. ఇక మహిళలను వినియోగ వస్తువుగానే ఎక్కువగా పరిగణించే ట్రంప్.. ఎన్నికల ప్రచారంలో బాహాటంగా మహిళలను కించపరుస్తూ ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా ‘తెల్ల అమెరికన్ మహిళలు’ ఆయనను వ్యతిరేకించలేదు. నల్ల అమెరికన్లను ట్రంప్ చిన్నచూపు చూసినా కూడా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికి గతంలో కన్నా ఈసారి ఎక్కువ నల్ల జాతి ఓట్లే లభించాయి. మెక్సికన్ల వల్ల దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయని, వారు అమెరికాలోకి రాకుండా మెక్సికో సరిహద్దులో గోడ కట్టేస్తానని ట్రంప్ ప్రకటించినా కూడా.. మెక్సికన్ అమెరికన్ల ఓట్లు కూడా ఆయన సంపాదించుకోగలిగారు. ఇందుకు ప్రధాన కారణం.. తమకు తెలిసిన, తమకు నచ్చిన ‘తమ సొంత అమెరికా’ రూపురేఖలు మారిపోతుండటానికి సంబంధించిన తమ మనోభావాలను, ఆగ్రహావేశాలను ట్రంప్ తన మాటలు, చేతల్లో ప్రతిబింబించటమే. వాస్తవానికి.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం బరిలోకి దిగినప్పటి నుండీ ట్రంప్ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారు. ట్రంప్ చుట్టూ కమ్ముకున్న వివాదాలు ఎంత తీవ్రమైనవంటే.. నామినేషన్ రేసులో ఒకసారి, ఆ తర్వాత నామినేషన్ పొందాక అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి.. ఆయన పోటీ నుంచి తప్పుకోవాలంటూ సొంత పార్టీ అగ్రనేతలు, అధినాయకత్వమే బలంగా, బాహాటంగా ఒత్తిడి చేసిన పరిస్థితి. కానీ.. ‘అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం’ అన్న నినాదమే ఒక మంత్రంగా.. ‘తెల్ల అమెరికన్ల’ను ట్రంప్ వెనుక సంఘటితం చేస్తోన్న విషయాన్ని ఆ సర్వేలు పసిగట్టలేకపోయాయని విశ్లేషకుల అంచనా.