Wipro group
-
హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు అమ్మేయనున్న విప్రో..?
టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న విప్రో.. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణంగా కాస్ట్‌కటింగ్ పేరిట టెక్ సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్చు తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు విప్రో ఆస్తులను సైతం విక్రయించాలని యోచిస్తోంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. హైదరాబాద్, బెంగళూరులోని తన ఆస్తులను విక్రయించాలని విప్రో నిర్ణయించింది. ఈ క్రమంలో కంపెనీ కలిగి ఉన్న నాన్ కోర్ రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. కంపెనీ విక్రయించాలనుకుంటున్న ప్రాపర్టీల్లో హైదరాబాద్ గచ్చిబౌలిలోని క్యాంపస్, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని క్యాంపస్‌లు ఉన్నట్లు వెల్లడైంది. గచ్చిబౌలి విప్రో క్యాంపస్ దాదాపు 14 ఎకరాలమేర విస్తరించి ఉంది. ఇక బెంగళూరులో 25 ఎకరాల భూమిని కలిగి ఉంది. అయితే కంపెనీ ఆ భూమిని పూర్తిగా లేదా కొంతమేరకే విక్రయిస్తుందా తెలియాల్సి ఉంది. బెంగళూరు క్యాంపస్‌ను దశల వారీగా అమ్మనున్నట్లు సమాచారం. మొదటి దశలో ఐదు ఎకరాలు విక్రయిస్తుందని తెలిసింది. టెక్ కంపెనీలు మారుతున్న వర్క్‌కల్చర్‌కు అనుగుణంగా హైబ్రిడ్‌వర్క్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. వివిధ నగరాల్లోని కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే విప్రో ఈ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే కంపెనీ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదీ చదవండి: సినిమా కోసం రూ.91 కోట్లు ఇస్తే రూ.50 కోట్లు పోగొట్టిన దర్శకుడు హైదరాబాదులో విప్రోకు మొత్తం మూడు ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో రెండు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉండగా.. ఒకటి మణికొండలో ఉంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 20 ఏళ్ల క్రితం కంపెనీకి భూమి కేటాయించింది. సెప్టెంబర్ త్రైమాసికం వరకు విప్రోలో 2,44,707 మంది ఉద్యోగులు ఉన్నారు. -
లైటింగ్ పరిశ్రమలో అగ్ర స్థానంపై విప్రో కన్ను
న్యూఢిల్లీ: లైటింగ్ పరిశ్రమలో అగ్రగామిగా అవతరించాలనే లక్ష్యంతో విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఉంది. 2024–25 నాటికి టాప్–3 కంపెనీల్లో ఒకటిగా అవతరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ క్షీణత తదితర సవాళ్లు ఉన్నప్పటికీ, తాము పరిశ్రమ సగటు కంటే వేగంగా వృద్ధిని సాధిస్తున్నట్టు తెలిపింది. విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లో భాగమైన విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఏడాది క్రితమే గృహోపకరణాల విభాగంలోకి అడుగు పెట్టింది. మధ్యస్థ ప్రీమియం శ్రేణిలో ఉత్పత్తులను విడుదల చేసింది. ప్రస్తుతం ఇవి ఆన్లైన్లో ఈ కామర్స్ చానళ్లపై లభిస్తున్నాయని, ఆఫ్లైన్లోనూ (భౌతిక దుకాణాఅల్లో) విక్రయించనున్నట్టు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో విప్రో కన్జ్యూమర్ కేర్ రూ.1,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. డిమాండ్ వైపు సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమకంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయగలమని గుప్తా తెలిపారు. అందుకే టాప్–3లోకి చేరాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్టు చెప్పారు. విప్రో లైటింగ్ వ్యాపారంలో 60 శాతం వాటా బీటూసీ నుంచి వస్తుంటే, 40 శాతం బీటూబీ నుంచి లభిస్తోందని.. ద్రవ్యోల్బణం, ఇతర అంశాల వల్ల గత ఏడాది కాలంలో బీటూసీ విభాగంలో వ్యాపారం నిదానించినట్టు తెలిపారు. కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా బీటూబీ వ్యాపారం మంచి పనితీరు సాధిస్తున్నట్టు పేర్కొన్నారు. బీటూసీ అంటే నేరుగా కస్టమర్‌కు విక్రయించేవి. బీటూబీ అంటే వ్యాపార సంస్థలకు విక్రయించేవి. గృహోపకరణాల విభాగంలో విస్తరణ గృహోపకరణాల విభాగంలో తమకు మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు సంయజ్ గుప్తా వెల్లడించారు. ‘‘ప్రస్తుతం మేము పరీక్షించే దశలో ఉన్నాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర చానళ్లపై విక్రయిస్తున్నాం. గృహోపకరణాలు, లైటింగ్ ఉత్పత్తుల మధ్య పోలిక ఉంది. ఒకే రకమైన రిటైల్ చానళ్లలో వీటిని విక్రయిస్తుంటారు. దేశంలో లైటింగ్ ఉత్పత్తులు విక్రయించే చాలా మంది రిటైలర్లు గృహోపకరణాలను కూడా అమ్ముతుంటారు’’అని గుప్తా తమ మార్కెటింగ్ విధానాన్ని వివరించారు. ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రిక్ కెట్టెల్, ఎగ్ బాయిలర్, పాపప్ టోస్టర్, శాండ్విచ్ మేకర్లు, ఇండక్షన్ కుక్‌టాప్స్, మిక్సర్ గ్రైండర్లను విప్రో ప్రస్తుతం విక్రయిస్తోంది. ఈ విభాగంలో టీటీకే ప్రెస్టీజ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఫిలిప్స్ తదితర సంస్థలతో పోటీ పడుతోంది. వాటర్ గీజర్లు, కూలింగ్ ఉత్పత్తుల వంటి విభాగాల్లోకి ప్రవేశించే ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించగా.. చిన్నపాటి గృహోపకణాలకే పరిమితం అవుతామని గుప్తా స్పష్టం చేశారు. చిన్న గృహోపకరణాల మార్కెట్ ఇంకా విస్తరించాల్సి ఉన్నందున వృద్ధికి అవకాశాలున్నట్టు తెలిపారు. బీటూసీ స్మార్ట్ లైటింగ్‌లో తాము మార్కెట్ లీడర్‌గా ఉన్నట్టు చెప్పారు. -
4వేల కోట్లతో యూఎస్ కంపెనీని కొనుగోలు చేసిన విప్రో!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ తాజాగా యూఎస్ కంపెనీ రైజింగ్ ఇంటర్మీడియెట్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. కంపెనీలో పూర్తి(100 శాతం) వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు 54 కోట్ల డాలర్ల(రూ. 4,135 కోట్లు)ను వెచ్చించనున్నట్లు వెల్లడించింది. తద్వారా ఎస్ఏపీ(శాప్) కన్సల్టింగ్ సామర్థ్యాలను భారీగా మెరుగుపరచుకోనున్నట్లు పేర్కొంది. ఐటీ పరిశ్రమలో రైజింగ్‌కున్న నైపుణ్యం, ఎంటర్ప్రైజ్ అసెట్ మేనేజ్మెంట్లో శాప్ కన్సల్టింగ్ సామర్థ్యాలు, కన్జూమర్ పరిశ్రమలు, మానవవనరుల నిర్వహణా అనుభవం వంటి అంశాలు కంపెనీ పురోభివృద్ధికి దోహదపడనున్నట్లు విప్రో వివరించింది. తద్వారా అత్యంత క్లిష్టమైన శాప్ ట్రాన్స్‌ఫార్మేషన్స్‌లో క్లయింట్లకు సమర్థవంత పరిష్కారాలు అందించగలమని తెలియజేసింది. యాంటీట్రస్ట్ నుంచి.. రైజింగ్ కొనుగోలు డీల్‌కు యూఎస్, జర్మనీ, కెనడాకు చెందిన పోటీ చట్టాలకు సంబంధించిన యాంటీట్రస్ట్ అనుమతులు లభించవలసి ఉన్నట్లు విప్రో వెల్లడించింది. జూన్‌కల్లా డీల్ పూర్తికాగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. డీల్ తదుపరి రైజింగ్.. విప్రో కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొంది. వెరసి ప్రస్తుత సీఈవో మైక్ మావొలో అధ్యక్షతన విప్రో దన్నుతో కార్యకలాపాలు మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. 16 దేశాలలో కార్యకలాపాలు కలిగిన రైజింగ్‌కు 1,300 మంది ఉద్యోగులు సేవలందిస్తున్నట్లు వెల్లడించింది. రైజింగ్ కొనుగోలు వార్తల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 529 వద్ద ముగిసింది. -
ఈ గవర్నెన్స్ లక్ష్యంగా ఏపీలో పాలన
-
లక్ష్యం.. ఈ-గవర్నెన్స్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఈ-ఆఫీసులుగా మారుస్తానని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం సచివాలయంలో చంద్రబాబుతో సమావేశమైన విప్రో బృందం ఏపీ రాష్ట్ర ఎంటర్‌ప్రైజర్ ఆర్కిటెక్చర్(ఏపీఎస్ ఇఏ) ప్రాజెక్టుపై ప్రెజంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దశాబ్దం క్రితమే ఈ-సేవ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇవాళ ఈ-ప్రొక్యూర్మెంట్ సహా అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు ఎన్నో మీ-సేవా కేంద్రాల్లో లభ్యమవుతున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలను ఈ-ఆఫీసులుగా మార్చి తొలి ఈ-గవర్నెన్స్ రాష్ట్రంగా పేరు తెచ్చుకోవడమే ధ్యేయమని చెప్పారు. ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టును ఉమ్మడి భాగస్వామ్యంతో చేపట్టడానికి సిద్ధపడాలని, అప్లికేషన్స్, సాప్ట్వేర్ రూపొందించి ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా దీని నిర్వహణలోనూ పాలుపంచుకోవాలని విప్రో ప్రతినిధులకు ఆయన సూచించారు. ఇవాళ అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలను ఆధార్‌తో అనుసంధానం చేసిన తొలి రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నామని చెప్పారు. ఏపీని దేశంలోనే తొలి స్మార్ట్ రాష్ట్రంగా మార్చాలన్నదే తన తాపత్రయమన్నారు. ఈ నేపథ్యంలో నూతన రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించడానికి విప్రో వంటి సంస్థలు ముందుకురావడం అభినందనీయమన్నారు. ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు తొలి దశలో రెవెన్యూ, ఆర్థిక, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య వంటి ముఖ్యమైన పది విభాగాలను చేర్చిన విషయాన్ని ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ సీఎంకు వివరించారు. విశాఖలో బిట్స్ పిలానీ: బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ)కు అనుబంధంగా విశాఖపట్నంలో కళాశాల ఏర్పాటుకు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా సంసిద్ధత వ్యక్తం చేసిన ట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సచివాలయం లో గురువారం తనతో భేటీ అయిన బిర్లాను రాష్ర్టంలో కళాశాల ఏర్పాటు చేయాల్సిందిగా బాబు కోరారు. విశాఖలో బిట్స్ ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బిర్లాకు చెందిన ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు అనువుగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు వద్ద 1866 ఎకరాల విస్తీర్ణంలో సున్నపురాయి గనుల ప్రాస్పెక్టింగ్ లెసైన్సుకు సంబంధించి నిరంభ్యతర పత్రం ఇప్పించాల్సిందిగా తన కార్యాలయ ముఖ్య కార్యదర్శిని బాబు ఆదేశించారు.