woman brutally murdered
-
ఆమె మరణించిన 15 ఏళ్లకు కీలక తీర్పు ఇచ్చిన కోర్టు
పెళ్లైన ఏడాదిన్నరకే వరకట్న దాహానికి బలైంది. ఎన్నో ఏళ్లుగా కోర్టులో విచారణ సాగిని ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు 15 ఏళ్లకు ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..భారతి అనే మహిళ అక్టోబర్3, 2007న పెళ్లై ఏడాదిన్నరలోపే అసాధారణ పరిస్థితుల్లో చనిపోయింది. దీంతో ఆమె భర్త, అత్త, బావ, మరిదిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఐతే ఆమెను హత్య చేశారనే సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిందితులను తొలుత నిర్దోషులుగా ప్రకటించారు. పోస్ట్‌మార్టం నివేదికలో మాత్రం ఆమె ఊపిరాడక చనిపోయినట్లు ఉంది. అదీగాక దర్యాప్తు అధికారులు సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న వ్యక్తులు గురించి, పైగా పక్కన అద్దెకుంటున్న వారిని విచారించడం వంటివి చేయలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఈ కేసును విచారిస్తున్న కోర్టు ప్రాసిక్యూషన్ వాదనలు విన్న కోర్టు ఎట్టకేలకు దోషలుగా నిర్ధారిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. బాధితురాలు వివాహం అయినప్పటి నుంచి వరకట్న సమస్యలు ఎదుర్కొన్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంది. మరణానికి ముందు రోజు కూడా వేధింపులకు గురైనట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. అలాగే ఆమె మరణానికి ముందు నిందితులందరిపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ తదితర సాక్ష్యాధారాలు ఆధారంగా భర్త పవన్‌కుమార్, అత్తగారు సత్బిరో, బావ కప్తాన్ సింగ్, బావమరిది దల్జీత్ సింగ్‌లను దోషులగా నిర్ధారించినట్లు కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మృతురాలు వివాహం అయినప్పటి నుంచి చనిపోయేంత వరకు వేధింపులు కొనసాగినట్లు తగిన సాక్ష్యాధారాలు ఉన్నందున వారిని దోషులగా గర్తించినట్లు స్పష్టం చేసింది. ఈ కేసుకి సంబంధించి తదుపరి తీర్పును జనవరి 30కి వాయిదా వేసింది. (చదవండి: అనాథలమని ఆవేదన చెంది.. ముగ్గురు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య..) -
రక్తపు మడుగులో అనురాధ..15 సార్లు.. కత్తెర పోట్లు..
శ్రీకాకుళం (ఆమదాలవలస) : ఆమదాలవలస ఉలిక్కిపడింది. మహిళ ను కర్కశంగా హత్య చేశార న్న వార్తతో శనివారం పట్ట ణం నిద్ర లేచింది. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో రైల్వే పాత గేటు ప్రాంతంలో శుక్రవారం రాత్రి పాతిన అనురాధ (31) అనే మహిళను దారుణంగా హత్య చేశారు. ఆమదాలవలస సీఐ పైడయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి నందగిరిపేటకు చెందిన పాతిన అనురాధ(31)ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తెరతో మెడపై పొడిచి హత్య చేశారు. మెడపై దాదాపు 15 కత్తెర పోట్లను పోలీ సులు గుర్తించారు. అనురాధకు నందగిరిపేటకు చెందిన అప్పలనాయుడుతో వివాహమైంది. అయి తే వీరి దాంపత్యం ఎంతోకాలం సాగలేదు. ఆయనతో విడిపోయాక అనురాధ ఆమదాలవలస గేటు ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈమెకు 12 ఏళ్ల అమ్మాయి ఉంది. పలు ఇళ్లలో పనులు చేసుకుంటూ ఈమె బతుకుతోంది. ఈమె ఉంటున్న వీధిలోనే మరో ఇంటిలో ఆమె తల్లి గురుగుబెల్లి అమ్మలమ్మ నివాసముంటున్నారు. శనివారం ఉదయం కూతురి ఇంటికి వెళ్లిన అమ్మల మ్మ తలుపు తెరిచి చూసే సరికి రక్తపు మడుగులో అనురాధ కనిపించింది. దీంతో ఆమె హతాశురాలై ఇరుగు పొరుగు వారిని పిలిచి పోలీసులకు సమా చారం అందించారు. సీఐ పైడయ్య తన సిబ్బంది తో పాటు డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో అక్కడకు చేరుకున్నారు. అనురాధ ఇటీవల ఓ చీటీ పాటను పాడి ఆ డబ్బులు ఇంటిలోనే ఉంచుకుంది. ఈ డబ్బు కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తు న్నట్లు సీఐ తెలిపారు. మృతురాలి ఫోన్ కాల్ డేటా సేకరించి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతు రాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులే దగ్గరుండి.. అనురాధ మృతదేహాన్ని పోలీసులు రిమ్స్‌కు తరలించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తల్లి వృద్ధురాలు కావడం, కుమార్తె ఇంకా చిన్నపిల్ల కావడంతో దహన సంస్కారాలు చేసేందుకు ఎవరూ లేకపోయారు. దీంతో పోలీసులే దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. -
మహిళ దారుణ హత్య
జియాగూడ: పురానాపూల్ జాతీయ రహదారిపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి ఓ మహిళను దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆమెను చంపడాన్ని గమనించిన ఓ లారీడ్రైవర్ అగంతకులను ఎదిరించడంతో వారు అతనిపై తిరగబడ్డారు. ఇన్స్పెక్టర్ పి.శంకర్ తెలిపిన మేరకు.. జియాగూడ జాతీయ రహదారిలో అర్ధరాత్రి ప్రాంతంలో శ్రీకాకుళం వెళ్లే లారీడ్రైవర్ దిగంబర్మానే లారీని నిలిపి అద్దాలను శుభ్రం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో లారీ పక్కన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు యూసుఫ్‌నగర్‌కు చెందిన జాహిదాబేగం(40)తో గొడవకు దిగారు. అంతలో జాహెదాబేగం రక్తంతో లారీ ముందుకు వచ్చింది. నిందితులు మళ్లీ ఆమెపై కత్తులతో పొడిచి చంపారు. గమనించిన లారీ డ్రైవర్‌ను కూడా కొద్దిదూరం వెంబడించి అక్కడినుంచి పారిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీంను రప్పించి నమూనాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా లారీడ్రైవర్ నిందితులను, వారి యాక్టివా వాహనాన్ని ఫోటోలు తీశాడు. దీంతో నిందితులు లారీ డ్రైవర్‌ను వెంబడించి పరారయ్యారు. అయితే ద్విచక్ర వాహనం పలక్నూమాలోని జహనూమా ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు. మృతురాలు వడ్డీకి డబ్బులిచ్చి జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. -
మహిళ కాళ్లు, చేయి లభ్యం.. కలకలం!
సాక్షి, సేలం: ఓ గుర్తు తెలియని మహిళ కాళ్లు, చేతులు లభించిన సంఘటన నామక్కల్ జిల్లాలో శుక్రవారం కలకలం రేపింది. వివరాలివి.. నామక్కల్ సమీపంలోని కరూర్- సేలం జాతీయ రహదారి ఉంది. ఇక్కడే ఓ వంతేన కింద ఓ మహిళ రెండు కాళ్లు, ఒక చేయి ఉన్నట్లు నల్లిపాలయం పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ తంగవేల్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఓ మహిళ కాళ్లు, గోరింటాకు పెట్టిన ఒక చేయి పడి ఉన్నాయి. ఇతర శరీర భాగాల కోసం ఆ ప్రాంతంలో వెతికగా గొంతు నులిమి చంపిన స్థితిలో మూడు మేకల కళేబరాలు లభించాయి. పోలీసులు ఆ రెండు కాళ్లు, చేయిని పోస్టుమార్టం నిమిత్తం నామక్కల్ జీహెచ్‌కు తరలించారు. మేకల కళేబరాలను కూడా పశువైద్య కళాశాల ఆస్పత్రికి పంపించారు. అనంతరం డీఎస్పీ రాజేంద్రన్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఆ మహిళను ఎవరైనా బలి ఇచ్చారా? అక్రమ సంబంధంతో హత్యకు గురైందా అనే కోణాల్లో పోలీసులు కేసు విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
టెలికాలర్ దారుణ హత్య
► రాజధానిలో మరో ఘోరం ► పట్టపగలే యువతిని చంపి, తగలబెట్టిన వైనం ► మాదాపూర్ భాగ్యనగర్ సొసైటీలో ఘటన ► పరిచయస్తుడే హంతకుడనే దిశగా పోలీసుల దర్యాప్తు ► యువతి ఫోన్‌కాల్ డేటా ఆధారంగా పరిశీలన హైదరాబాద్: రాజధానిలో మరో ఘోరం జరిగింది. టెలికాలర్‌గా పనిచేస్తున్న సునీత (32) అనే యువతి దారుణ హత్యకు గురైంది. పట్టపగలే ఆమెను హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ భాగ్యనగర్ సొసైటీలో బుధవారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆఫీసుకు వెళుతున్నానని చెప్పి.. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్ సీ క్లాస్ ప్రాంతానికి చెందిన కొరపు మాణిక్‌రావు, జానకమ్మ దంపతుల కుమార్తె సునీత. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. గతంలో సులేఖ.కామ్‌లో పనిచేసిన ఆమె.. కొద్దిరోజుల కిందట మాన్స్టర్.కామ్‌లో టెలికాలర్ (సేల్స్ రిప్రజెంటేటివ్)గా చేరింది. మంగళవారం ఆఫీసుకు వెళుతున్నానంటూ ఇంటి నుంచి వెళ్లింది. కానీ ఆఫీసుకు వెళ్లలేదు. ఆఫీసుకు ఫోన్ చేసి.. దగ్గరి బంధువు ఒకరు చనిపోయారని, రెండు రోజులు రాలేనని సమాచారం ఇచ్చింది. మంగళవారం రాత్రి పదింటికి తిరిగి ఇంటికి చేరుకుంది. బుధవారం ఉదయం 9.30కు ఆఫీసుకు బయలుదేరిన ఆమెను అన్న నర్సింగ్‌రావు సికింద్రాబాద్ స్టేషన్ బస్టాప్‌లో దింపి వెళ్లిపోయాడు. కానీ ఆమె ఆఫీసుకు వెళ్లలేదు. సునీత హత్యకు గురైనట్లు బుధవారం రాత్రి కుటుంబ సభ్యులకుపోలీసుల నుంచి సమాచారం అందింది. పట్టపగలే హత్య! భాగ్యనగర్ సొసైటీ 1007 ఎన్ఐఏ బిల్డింగ్ పక్కన ఖాళీ స్థలం నుంచి పొగలు వస్తున్నాయంటూ అక్కడి ఓ సెక్యూరిటీ గార్డు బుధవారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు వచ్చి చూడగా కాలిపోయిన మృతదేహం కనిపించింది. అక్కడే పాక్షికంగా కాలిపోయిన పర్సు, ఐడీ కార్డు లభించాయి. ఆ పర్సులో దొరికిన సిమ్ కార్డు ఆధారంగా హతురాలిని సునీతగా గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబీకులకు అప్పగించారు. బుధవారం మధ్యాహ్నమే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక ఆధారాలను బట్టి పోలీసులు అంచనాకు వచ్చారు. ఇది ఎవరో పరిచయస్తుల పనేనని, మరొకరు కూడా సహకరించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సునీతను పథకం ప్రకారం ఖాళీ స్థలానికి తీసుకొచ్చి హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు జరుపుతున్నారు. సునీత సెల్‌ఫోన్ కాల్ డిటైల్స్, భాగ్యనగర్ సొసైటీ, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. హత్యకు ముందు రోజు వాలెంటైన్స్ డే కావడంతో ప్రేమ వ్యవహారం, పెళ్లి ప్రస్తావన ఈ హత్యకు కారణాలై ఉంటాయా అన్న కోణాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఓ అనుమానిత యువకుడి ఫొటోలను సునీత మెయిల్ నుంచి పోలీసులు తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ముందు రోజు నుంచి ముభావంగా.. మంగళవారం రాత్రి సునీత ముభావంగా కనిపించిందని, అన్నం కూడా సరిగా తినలేదని ఆమె అక్క శ్రీదేవి చెప్పారు. బుధవారం ఉదయం సునీత ఆఫీసుకు వెళుతుండగా.. లంచ్ బాక్స్ సిద్ధం చేయబోతే ఆఫీసులో పార్టీ ఉందంటూ వారించిందని తెలిపారు. ఇక ఓ ఫోన్ కాల్ వస్తే సునీత విపరీతంగా ఏడ్చేదని, అది ఎవరనేది తమకు చెప్పేది కాదని ఆమె అన్న నర్సింగరావు చెప్పారు. 2001లో ఓ యువకుడు తనను ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని, తాము కేసు పెట్టడంతో జైలు పాలయ్యాడని వెల్లడించారు. ఆ కుటుంబంలో ఎప్పుడూ విషాదమే! సునీత తల్లిదండ్రులు మాణిక్‌రావు, జానకమ్మలకు 11 మంది సంతానం. అందులో సువర్ణ, హేమలత, పుష్పలత, శ్రీదేవి, సునీత కుమార్తెలు, శోభన్‌బాబు, సతీశ్, తిరుమల్, శ్రీను, నర్సింగ్‌రావు, హన్మంతు అనే కుమారులున్నారు. కానీ ఈ పెద్ద కుటుంబంలో ఎప్పుడూ ఓ విషాదమే. కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకోగా.. ఒకరు ఆచూకీ లేకుండా పోయారు. మిగతా ఐదుగురిలో ఇద్దరికి వివాహాలు కాగా.. ముగ్గురు కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఈ ముగ్గురిలో ఇప్పుడు సునీత హత్యకు గురైంది. మాణిక్‌రావు 11 మంది సంతానంలో సువర్ణ బావిలో దూకి తనువు చాలించగా.. శోభన్ బాబు, సతీశ్, శ్రీను ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తిరుమల్ కొన్నేళ్ల కింద ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన భార్య కూడా మరణించింది. హన్మంతు కొన్నేళ్ల కింద ఇల్లు వదిలి వెళ్లిపోయారు. సునీత తన సోదరి శ్రీదేవి, సోదరుడు నర్సింగ్‌రావుతో కలసి బన్సీలాల్‌పేటలో ఉంటున్నారు. నర్సింగ్‌రావు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఇక ఆత్మహత్యకు పాల్పడ్డ తిరుమల్‌కు ఆకర్షిక (13), రిషిక (12) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఇద్దరినీ సునీత తన సొంత పిల్లల్లా చూసుకుంటోంది. వారి కోసం తను వివాహం కూడా చేసుకోలేదని చెబుతున్నారు. ఇప్పుడు సునీత దారుణ హత్యకు గురికావడంతో ఆ చిన్నారులు విలపించిన తీరు అందరినీ కలచివేసింది. -
కట్టంగూరులో యువతి దారుణహత్య
కట్టంగూర్ : నువ్వే నా ప్రాణం అంటూ నమ్మబలికాడు.. నువ్వు లేకుంటే జీవించలేనని ప్రేమ ఊబిలోకి దించాడు..మూడేళ్లుగా చిలకా గోరింకలా తిరిగారు..పెళ్లి చేసుకోమని కోరగానే కాదు పొమ్మన్నాడు.. ఒత్తిడిచేస్తే చివరకు ప్రియురాలి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాడు. ఇదీ కట్టంగూరు మండల కేంద్రంలో గురువారం దారుణహత్యకు గురైన యువతి విషాదగాథ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన కందాల యాదగిరిరెడ్డి మూడో కూతురు శ్రీవిద్య (19) సూర్యాపేటలో పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. కట్టంగూర్కు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు డ్రైవర్ యాదగిరి రెగ్యులర్‌గా నల్లగొండ నుంచి సూర్యాపేటకు వెళుతుంటాడు . అయితే అదే బస్సులో రోజూ ప్రయాణించే శ్రీవిద్యతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇద్దరూ మూడేళ్లగా ప్రేమించుకుంటున్నారు. కాగా,ఇటీవల ఫైనల్ ఇయర్ పూర్తికావడంతో శ్రీ విద్య నల్లగొండలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ప్రాజెక్ట్‌వర్క్ చేస్తోంది. తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్న శ్రీ విద్యను యాదగిరి గురువారం ఇందిరమ్మ కాలనీలోని తన తండ్రి ఎనమల చంద్రయ్య ఇంటికి తీసుకువచ్చి గొడ్డలితో నరికాడు. మెడ, ఛాతిపై నరకడంతో శ్రీ విద్య అక్కడికక్కడే కుప్పకులి మృతిచెందింది. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.నల్లగొండ డీఎస్పీ రాంమోహన్‌రావు, నకిరేకర్ రూరల్ సీఐ రాఘవరావు, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి ఎస్ఐలు పర్వతాలు, ప్రసాదరావు, శ్రీనివాస్‌తో పాటు క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.