మహిళ కాళ్లు, చేయి లభ్యం.. కలకలం! | unknown woman brutally murdered in chennai | Sakshi
Sakshi News home page

మహిళ కాళ్లు, చేయి లభ్యం.. కలకలం!

Published Fri, Feb 9 2018 8:53 PM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM

unknown woman brutally murdered in chennai - Sakshi

సాక్షి, సేలం: ఓ గుర్తు తెలియని మహిళ కాళ్లు, చేతులు లభించిన సంఘటన నామక్కల్‌ జిల్లాలో శుక్రవారం కలకలం రేపింది. వివరాలివి.. నామక్కల్‌  సమీపంలోని కరూర్‌- సేలం జాతీయ రహదారి ఉంది. ఇక్కడే ఓ వంతేన కింద ఓ మహిళ రెండు కాళ్లు, ఒక చేయి ఉన్నట్లు నల్లిపాలయం పోలీసులకు సమాచారం అందింది. 

ఇన్‌స్పెక్టర్‌ తంగవేల్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఓ మహిళ  కాళ్లు, గోరింటాకు పెట్టిన ఒక చేయి పడి ఉన్నాయి. ఇతర శరీర భాగాల కోసం ఆ ప్రాంతంలో వెతికగా గొంతు నులిమి చంపిన స్థితిలో మూడు మేకల కళేబరాలు లభించాయి. పోలీసులు ఆ రెండు కాళ్లు, చేయిని పోస్టుమార్టం నిమిత్తం నామక్కల్‌​ జీహెచ్‌కు తరలించారు. మేకల కళేబరాలను కూడా పశువైద్య కళాశాల ఆస్పత్రికి పంపించారు. 

అనంతరం డీఎస్పీ రాజేంద్రన్‌ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఆ మహిళను ఎవరైనా బలి ఇచ్చారా? అక్రమ సంబంధంతో హత్యకు గురైందా అనే కోణాల్లో పోలీసులు కేసు విచారణ చేస్తున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement