Woman Official
-
ఆడదానివై పోయావ్..ఎమ్మెల్యే వీరంగం
భోపాల్: కాంగ్రెస్కు చెందిన మధ్యప్రదేశ్ మాజీ మంత్రి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు దుమారం చల్లారకముందే ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఒక మహిళా అధికారిపై బెదిరింపులకు పాల్పడుతూ కెమెరా కంటికి చిక్కారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతు ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్-రాజస్థాన్ సరిహద్దు సమీపంలోని సైలానా పట్టణంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది, వివరాల్లోకి వెళ్లితే..కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్ష్ విజయ్ గెహ్లాట్ స్థానిక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) కామిని ఠాకూర్పై విరుచుకుపడిన వైనం వివాదం రేపుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ తరువాత, ఎమ్మెల్యే నేతృత్వంలోని ఉద్యమకారులు మెమోరాండం సమర్పించడానికి ఎస్డీఎం కార్యాలయానికి చేరుకున్నారు. దీన్ని స్వీకరించేందుకు కామిని ఠాకూర్ ఎంతకీ బయటికి రాకపోవడంతో గెహ్లాట్ తీవ్ర అసహనానికి గురైనారు. ‘‘ఈ నియోజకవర్గం ప్రతినిధిని నేను.. నా మాటను మీరు అర్థం చేసుకోవడంలేదు. మీరొక మహిళా అధికారి అయిపోయారు.. ఈ స్థానంలో మరో పురుష అధికారి వుంటే గల్లా పట్టుకొని మరీ... ఇచ్చేవాడిని అంటూ రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం మవుతోంది. -
మహిళా అధికారికి బెదిరింపులు: ఇద్దరు అరెస్ట్
తిరువొత్తియూరు : కార్పొరేషన్ కార్యాలయ మహిళా అధికారిని బెదిరించి నగదు ఇవ్వమని కోరిన ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆవడి కార్పొరేషన్ పట్టణాభివృద్ధి కార్యాలయ అధికారిణి సుబ్బుతాయి. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో గదిలోకి చొరబడిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తాము ఏసీబీ విభాగం ఉద్యోగులమని పరిచయం చేసుకున్నారు. ఎందుకు వచ్చారని ఆమె ప్రశ్నించగా మీరు లంచం తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు అందాయని మీపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే నగదు ఇవ్వవలసి ఉంటుందని బెదిరించారు. దీంతో సుబ్బుతాయి సిబ్బందిని పిలిచి ఆ ఇద్దరిని ఆవడి పోలీసులకు అప్పగించారు. ఆవడి పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. విచారణలో వారు అంబత్తూరు అయప్పాక్కంకు చెందిన మోహన్రాజ్, విజయలక్ష్మి పురంకు చెందిన వేలాయుధం అని తెలిసింది. -
బైకుల్లా జైలు.. ఓ భయంకర నిజం
ముంబయి: కూతురుని హత్య చేయించిన నేరంకింద ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా ఉంటున్న ముంబయిలోని బైకుల్లా జైలులో రెండు రోజుల కిందట జరిగిన సంఘటనకు సంబంధించి ఓ భయంకర నిజం వెలుగులోకి వచ్చింది. ఆ జైలులోని మహిళా విభాగం హెడ్ మనిషా పోకార్కర్ చేతుల్లో చావుదెబ్బలు తిని ప్రాణాలు విడిచిన ఓ మహిళా ఖైదీపై అత్యంత అమానవీయ దాడి జరిగిందని తెలిసింది. ఆమెను క్రూరంగా వేధించారని, లైంగిక వేధింపులకు గురిచేశారని తెలిసింది. దాదాపు హత్య చేసినట్లుగా పోకార్కర్ వ్యవహరించారని, ఓ బ్యాటన్తో ఆ మహిళను బయటకు చెప్పలేనంత దారుణంగా హింసించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. బైకుల్లా జైలులో రెండు రోజులుగా దాదాపు 200మంది మహిళా ఖైదీలు ఆందోళన చేస్తున్నారు. అందులో జీవితకారగార శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని మనిషా పోర్కర్ అత్యంత దారుణంగా కొట్టి అమానవీయంగా వ్యవహరించారు. భోజనం చేసే సమయంలో ఆ ఖైదీ రెండు కోడుగుడ్లు దొంగిలించిందనే కారణంతోనే ఆమెపై చేయి చేసుకొని హింసించారు. దీంతో తీవ్ర గాయాలపాలయిన ఆ యువతి ప్రాణాలుకోల్పోయింది. ఈ సంఘటనకు బాధ్యులను చేస్తూ జైలు అధికారులను సస్పెండ్ చేశారు. మహిళా ఖైదీని బ్యాటన్తో లైంగికంగా వేధించిన విషయం బయటకు రావడంతో తమ ప్రాణాలకు ఇక ఎక్కడ రక్షణ ఉంటుందని ఖైదీలంతా వాపోతున్నారు. ఈ చర్యకు పాల్పడిన పోకార్కర్పై కఠిన చర్యలు తీసుకోలేకుంటే తమ క్లెయింట్ ఇంద్రాణీని వేరే జైలుకు తరలించాలంటూ ఆమె తరుపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మొత్తానికి బైకుల్లా జైలు ఘటన పెద్ద దుమారమే రేపుతోంది.