woman suiscide
-
ఉరేసుకుని వివాహిత బలవన్మరణం
చిట్యాల: ఉరేసుకుని వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామానికి చెందిన రెగులగడ్డ కుమారస్వామికి మనుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన స్వాతి(28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిలులన్నారు. కాగా, వీరిద్దరు పిల్లలతో కలిసి కొంత కాలంగా చిట్యాలలోని సంతోష్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కుమారస్వామి చిట్యాలలోని బార్ అండ్ రెస్టారెంట్లో పార్ట్నర్గా ఉండి విధులు నిర్వహిస్తున్నాడు. స్వాతి మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంఘటన స్థలాన్ని నార్కట్‌పల్లి సీఐ మహేష్, చిట్యాల ఎస్ఐ రవి పరిశీలించారు. స్వాతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై మంగళవారం రాత్రి వరకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
అయ్యో అనూష.. భర్త ఊరి నుంచి వచ్చేసరికి..
చీకూ చింతా లేని చక్కని పొదరిల్లు వారిది.. భార్య, భర్త, వారికి ఇద్దరు ముత్యాల్లాంటి బిడ్డలు.. వారి ఆనందం చూసి విధికే కన్నుకుట్టిందో లేదా ఏ దుష్టగ్రహం కన్ను పడిందో గానీ క్షణ కాలంలో తల్లీ బిడ్డలు విగత జీవులుగా మారారు. కుమార్తెలను హతమార్చి, తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఊరు వెళ్లిన భర్త ఇంటికి తిరిగి వచ్చేసరికి ఈ దారుణం జరిగింది. మృతురాలు సూసైడ్ నోట్ రాసి చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఆ లేఖలో ఏముందో తెలిస్తే గానీ అసలు విషయం బయటపడదు. అనకాపల్లి: స్వగ్రామానికి వెళ్లి హుషారుగా ఇంటికి తిరిగి వచ్చిన భర్త హతాశుడయ్యాడు.. భార్యా బిడ్డల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యాడు.. ఇంతలోనే అంత కష్టం ఏమొచ్చిందని కుమిలిపోతున్నాడు. అనకాపల్లి శివారులో సోమవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. శ్రీకాకుళం జి ల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం మెట్ట పేట గ్రామానికి చెందిన మెట్ట జనార్దన్ ఆరేళ్ల కిందట తన అక్క కుమార్తె అనూష (24)ను వివాహం చేసుకున్నాడు. వారికి సుదీక్ష (5), మెట్ట గీత అన్విత (ఏడాదిన్నర) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జనార్దన్‌కు అచ్యుతాపురంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆరు నెలల నుంచి అనకాపల్లి జాతీయ రహదారికి సమీపంలో అనకాపల్లి–ఉమ్మలాడ రహదారిలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం ఉంటున్నాడు. జనార్దన్ ఉంటున్న ఇంటి పరిసరాలు నిర్మానుష్యంగా ఉంటాయి. దూరదూరంగా ఇళ్లు ఉంటాయి. మేడపై ఇంటి యజమాని కుటుంబంతో ఉంటున్నారు. జనార్దన్ శనివారం శ్రీకాకుళం వెళ్లాడు. సోమవారం సాయంత్రం 5.30 నిమిషాలకు తన సోదరుడితో కలిసి ఇంటికి వచ్చి చూడగా ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉన్నారు. భార్య ఫ్యాన్‌కు ఉరిపోసుకొని ఉంది. దీన్ని గమనించిన భర్త జనార్దన్ భార్యను కిందకు దించాడు. జనార్దన్ సోదరుడు 100కు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. హుటాహుటిన డీఎస్పీ బి.సునీల్, పట్టణ సీఐ లంక భాస్కరరావులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అనూష రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎస్పీ సునీల్ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అద్దె ఇంటి యజమాని దుర్భాషలాడడంతో తన భార్య మనస్తాపం చెంది ఈ దారుణానికి పాల్పడినట్టు జనార్దన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారం కిందటే వచ్చారు.. జలుమూరు: నగరికటకం పంచాయతీ పరిధి మెట్టపేటకు చెందిన మెట్ట అనూష పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడంతో మెట్టపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. అనూష తల్లిదండ్రులు మీనాకుమారి, సంజీవరావులు ఉపాధి రీత్యా పలాసలో ఉంటున్నారు. వారం కిందటే అనూషతో పాటు భర్త జనార్దనరావు స్వగ్రామం మెట్టపేట వచ్చారు. ఇంతలోనే ఈ విషాదకర వార్త వినాల్సి రావడంతో వారంతా విషాదంలో మునిగిపోయారు. -
అదనపు కట్నం కాటేసింది
ధారూరు : వివాహం జరిగి కనీసం ఏడాది కాకుండానే ఓ మహిళ అదనపు కట్న దాహానికి బలైంది. పుట్టింట్లో పండగ మర్యాదలు చేయించుకుని.. కొత్త బట్టలతో అత్తారింటికి అడుగుపెట్టిన నిమిషా ల్లోనే శవమైంది. భర్త, మరిది, అత్త, మామలు కలిసి తన కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు, మేనమామలు ఆరోపించారు. అదనపు కట్నంగా రూ. 2 లక్షలు తీసుకురావాలని వేధిస్తూ వచ్చారని బోరున విలపించారు. ఈ హృదయ విదారక సంఘటన ధారూరు మండలంలోని మున్నూరుసోమారం గ్రామంలో బుధవారం చోటుచేసుకోగా గురువారం వెలుగు చూసింది. ధారూరు తహసీల్దార్ గాయత్రి, సీఐ ఉపేందర్‌లు సంఘటన స్థలానికి వెళ్లి శవ పంచానామ నిర్వహించారు. మృతురాలి తల్లిదండ్రులు కిష్టయ్య, యాదమ్మ, మేనమామ నర్సింహులు, సీఐ జె. ఉపేందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన కన్న మల్లేశ్వరి(19)ని మున్నూరుసోమారం గ్రామానికి చెందిన కన్నె రాము గత సంవత్సరం ఏప్రిల్ 12న వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో కట్నంగా రూ. 4 లక్షలు నగదు, 5 తులాల బంగారం, బడిబాసండ్లు, ఓ బైక్‌ను ఇచ్చారు. వారి సంసార జీవితం కేవలం 3 నెలలు మాత్రమే సాఫీగా కొనసాగింది. తర్వాత అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు ప్రారంభమయ్యాయి. మరో రూ. 2 లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని భర్త, మరిది, అత్తమామలు పట్టుబట్టారు. మొత్తం కట్నం డబ్బులు పెళ్లికి ముందే ఇచ్చారనీ.. ఇంటి నుంచి డబ్బులు తెచ్చేది లేదని మల్లేశ్వరి స్పష్టం చేసింది. ఈ విషయం తెలిసిన మల్లే్లశ్వరి తలిదండ్రులు అల్లుడు, కూతుర్ని ఇంటికి పిలిపించి వారికి తోచింది సమర్పించుకుని ఒడి బియ్యం పోసి కొత్త బట్టలతో అదేరోజు అత్తారింటికి సాగనంపారు. అత్తారింటికి చేరిన రెండు గంటలైనా గడవకముందే.. మీ కూతురు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంని ఆత్మహత్య చేసుకుందని అల్లుడు మల్లేశ్వరి తల్లిదండ్రుకలకు సమాచారం ఇచ్చాడు. గురువారం వారు మున్నూరుసోమారం గ్రామానికి చేరుకుని తమ కూతురు మరణానికి అత్త, మామ, భర్త, మరిది కారణమని, వారిపై తగిన కఠిన చర్యలు తీసుకోవాలనీ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. వరకట్న వేధింపులతో మల్లేశ్వరి ఆత్మహత్య చేసుకుందని, నిందితులపై కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. -
రెండో పెళ్లి చేసుకుని మోసగించాడని..
సాక్షి, పులివెందుల: సూర్యమోహన్ అనే వ్యక్తి తనను రెండో పెళ్లి చేసుకుని మోసగించాడనే ఆవేదనతో వైఎస్సార్‌జిల్లా పులివెందుల మండలం చిన్న రంగాపురానికి చెందిన విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. ఈమె కడప ఎర్రముక్కపల్లెలోని బాలవికాస్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. రెండు రోజుల క్రితం యాసిడ్ వంటి ద్రావణం తాగగా తిరుపతిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆత్మహత్యాయత్నం చేసేముందు ఆమె సూసైడ్ నోట్ రాసింది. విజయలక్ష్మి మృతదేహాన్ని ఆమె కుటుంబీకులు పులివెందులకు సోమవారం తీసుకొచ్చారు. సూర్యమోహన్ కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని విజయలక్ష్మి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా, సూర్యమోహన్ మైదుకూరు మునిసిపల్ ఆపిసులో మేనేజర్‌గా పనిచేసి పులివెందులకు మున్సిపల్ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. అక్కడ ఈ ఏడాది జనవరిలో ఏసీబీకి పట్టుబడి సస్పెండయ్యారు. వైఎస్సార్ జిల్లాలో టీచర్ ఆత్మహత్య -
బావిలోకి దూకి వివాహిత ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం ః మండలంలోని గోధూర్ గ్రామంలో బుధవారం సంతానం కలగలేదని మనస్తాపంతో బండి నవ్య(22) అనే వివాహిత వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు నవ్యకు రెండేళ్ల కిందట మెట్పల్లి మండలం వెల్లులకు చెందిన కిషోర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. భర్త కిషోర్ జీవనోపాధి నిమిత్తం దువకత్తర్ వెళ్లాడు. 20 రోజుల క్రితం భర్త స్వంత గ్రామం వచ్చి వెళ్లాడని కుటుంబీకులు తెలిపారు. నవ్య 15 రోజుల క్రితం గోధూర్ గ్రామానికి వచ్చిందని ఉదయం ఇంట్లో కనబడకపోయే సరికి చుట్టు పక్కల వెతకగా వ్యవసాయ బావిలో మృతదేహం లభించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నవ్య తండ్రి మాన వెంకట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎంపీపీ తేలు లక్ష్మీ, సర్పంచ్ కాయితీ లావణ్య, ఎంపీటీసీ చల్ల పద్మ పరిశీలించారు.