బావిలోకి దూకి వివాహిత ఆత్మహత్య | woman suiscide | Sakshi
Sakshi News home page

బావిలోకి దూకి వివాహిత ఆత్మహత్య

Published Wed, Sep 28 2016 9:02 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

woman suiscide

ఇబ్రహీంపట్నం ః మండలంలోని గోధూర్‌ గ్రామంలో బుధవారం సంతానం కలగలేదని మనస్తాపంతో బండి నవ్య(22) అనే వివాహిత వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు నవ్యకు రెండేళ్ల కిందట మెట్‌పల్లి మండలం వెల్లులకు చెందిన కిషోర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. భర్త కిషోర్‌ జీవనోపాధి నిమిత్తం దువకత్తర్‌ వెళ్లాడు. 20 రోజుల క్రితం భర్త స్వంత గ్రామం వచ్చి వెళ్లాడని కుటుంబీకులు తెలిపారు. నవ్య 15 రోజుల క్రితం గోధూర్‌ గ్రామానికి వచ్చిందని ఉదయం ఇంట్లో కనబడకపోయే సరికి చుట్టు పక్కల వెతకగా వ్యవసాయ బావిలో మృతదేహం లభించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నవ్య తండ్రి మాన వెంకట్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎంపీపీ తేలు లక్ష్మీ, సర్పంచ్‌ కాయితీ లావణ్య, ఎంపీటీసీ చల్ల పద్మ పరిశీలించారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement