ఉబర్ రేప్ కేసు నిందితుణి ్ణ గుర్తించిన బాధితురాలి స్నేహితురాలు
న్యూఢిల్లీ: ఉబర్ రేప్ కేసులో నిందితుడిని బాధితురాలి స్నేహితుడు గుర్తించాడు. శివ్‌కుమార్ యాదవ్ అత్యాచారానికి పాల్పడినట్టు కోర్టుకు తెలియజేశాడు. గత ఏడాది డిసెంబర్ ఐదో తేదీన బాధితురాలైన మహిళా ఎగ్జిక్యూటివ్‌పై నిందితుడు ఉబర్ సంస్థకు చెందిన కారులో అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైన సంగతి విదితమే. ఈ కేసు మంగళవారం విచారణకురాగా ప్రాసిక్యూషన్ తరఫు సాక్షి అయిన ఆయుష్ డాబాస్ గుర్తించాడు. ఘటన జరిగిన రోజున బాధితురాలుగానీ, డ్రైవర్గానీ మద్యం మత్తులో లేరని తెలిపాడు.
ఆ రోజు రాత్రి బాధితురాలితోపాటు తాను భోజనం కోసం గుర్గావ్లోని సైబర్ హబ్‌కు వెళ్లామని, వెనుదిరిగి వచ్చే సమయంలో బాధితురాలికోసం ఉబర్ యాప్‌ద్వారా కారునను కిరాయికి తీసుకుని బయల్దేరిందని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజాకు తెలియజేశాడు. కారు వచ్చిన సమయంలో నిందితుడి వివరాలను తెలుసుకున్నానని తెలిపాడు. ప్రియా మార్కెట్ ప్రాంతం వద్ద బాధితురాలు కారులో బయల్దేరిందని తెలిపాడు. ఉబర్ యాప్‌లో డ్రైవర్ ఫొటో చూశానని, అందువల్లనే నిందితుడిని గుర్తించానని తెలిపాడు.
ఆలస్యమైందనే వెంట వెళ్లలేదు
ఆ రోజు బాగా పొద్దుపోయిందని, అందువల్లనే బాధితురాలితోపాటు తాను కూడా అదే కారులో ఎక్కలేదని ఆయుష్ తెలిపాడు. దక్షిణ ఢిల్లీలోని వసంత్‌విహార్ ప్రాంతంలో తాను ఉంటానని, ఇంకా మరింత ఆలస్యమవుతుందనే ఉద్దేశంతోనే తన దారిని తాను వెళ్లిపోయానన్నాడు. కాగా బాధితురాలి స్నేహితుడితోపాటు ప్రాసిక్యూషన్ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అల్మా మింజ్ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదుచేసింది.