women journalist
-
మాటల కశ్మీరం.. సమానియా
సరిహద్దు సమస్యలు, అంతర్గత అల్లరు,్ల మరోపక్క ఉగ్రమూకల దాడులతో అట్టుడికే కశ్మీర్... ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత మిగతా రాష్ట్రాల్లాగే పరిస్థితులు క్రమంగా మారుతుండడంతో..అక్కడి యువత సరికొత్త ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇటువంటి అవకాశాన్ని తన తెలివితేటలు, నైపుణ్యంతో అందుకున్న ఆర్జే సమానియా.. ఉత్తర కశ్మీర్లో తొలి మహిళా ఆర్జేగా నిలిచింది. 19 ఏళ్ల సమానియా బారముల్ల ఓల్డ్ టౌన్‌కు చెందిన అమ్మాయి. సమానియా భట్ రోజూ తండ్రి పక్కన కూర్చుని ప్రపంచవ్యాప్తంగా జరిగే విషయాలను ఆయనతో చర్చిస్తూ అప్డేటెడ్గా ఉండేది. ఉదయాన్నే వచ్చే వార్తాపత్రికలను చదువుతూ, టీవీల్లో వచ్చే వార్తలను శ్రద్ధగా వినడం ఆమెకు ఒక అలవాటుగా ఉండేది. ఆ అలవాటే నేడు సమానియాను ఉత్తర కశ్మీర్లో తొలి రేడీయో జాకీగా మార్చింది. తన సుమధుర వాక్ చాతుర్యంతో శ్రోతల్ని ఆకట్టుకొంటూ నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. మాస్ కమ్యూనికేషన్ అండ్ వీడియో ప్రొడక్షన్లో డిగ్రీ చదివింది. జర్నలిస్టు కావాలన్న కలతో డిగ్రీలో మాస్ కమ్యునికేషన్ పాఠాలు చాలా శ్రద్ధగా నేర్చుకునేది. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే స్థానిక న్యూస్ పేపర్ లలో కూడా పనిచేసేది. ఆ ఆసక్తితోనే డిగ్రీ పూర్తయ్యాక జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో పీజీ ఎంట్రన్స్ కోసం సన్నద్ధమవుతూ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసింది. స్కాలర్షిప్ మంజూరు అయినప్పటికీ, కరోనా సెకండ్ వేవ్ వల్ల చేతికి రాకుండానే స్కాలర్షిప్ వెనక్కి వెళ్లింది. ఇది సమానియాకు కాస్త బాధ కలిగించినప్పటికీ నిరుత్సాహ పడకుండా ముందుకు సాగింది. ఆర్జేగా... స్కాలర్షిప్ రాలేదన్న బాధలో ఉన్న సమానియాకు మజ్‌బగ్‌లో ఉన్న కశ్మీర్ రేడియో ఛినార్–ఎఫ్ఎమ్:90.4 రేడియో జాకీలకోసం దరఖాస్తుల ఆహ్వాన ప్రకటన కనిపించింది. అది చూసి వెంటనే రేడియో జాకీ (ఆర్జే) పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఈ పోస్టుకోసం కశ్మీర్‌లోని వివిధ జిల్లాల నుంచి 250 మంది పోటీపడ్డారు. పోటీ ఎక్కువగా ఉండడంతో నాలుగైదు రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత సమానియా ఆర్జేగా సెలెక్ట్ అయ్యింది. కాగా రేడియో స్టేషన్ నలుగుర్ని మాత్రమే ఎంపిక చేయగా.. సమానియా మాత్రమే మహిళా ఆర్జేగా సెలెక్ట్ అయ్యింది. ఆకట్టుకునే వాక్చాతుర్యంతో శ్రోతలలో పాజిటివ్ ఎనర్జీని నింపుతూ తనవైపు తిప్పుకుంటుంది. ‘హల్లా బోల్ విత్ ఆర్జే సమానియా’ షో చేస్తూ శోతల అభిమానం చూరగొనడం, ఈ షోకు మంచి స్పందన లభించడంతో తొలుత మ«ధ్యాహ్నం 12గంటల నుంచి 3 గంటల వరకు ఉన్న షో సమయాన్ని, మ«ధ్యాహ్నం 3 గంటల నుంచి ఆరుగంటల వరకు ప్రసారం చేస్తున్నారు. ప్రేర ణాత్మక మాటలు చెప్పడమేగాక ఆయా రంగాల్లో ఉన్నతస్థాయికి ఎదిగిన యువతీ యువకులను అతిథులుగా పిలిచి క్రియేటివ్‌గా ఇంటర్వ్యూలు కూడా చేస్తోంది. ఆత్మీయ స్వరం, సానుకూల మాటలతో సమానియా రేడియో జాకీగా దూసుకుపోతోంది. ‘‘నేను ఆర్జే అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ప్రింట్ మీడియాలో పనిచేస్తున్నప్పుడు టీచర్లు, స్నేహితులు ‘నువ్వు రేడియో జర్నలిజానికి బాగా పనికొస్తావు’ అని ప్రోత్సహించేవారు. అయితే నేను ఎప్పుడు ఆ దిశగా ప్రయత్నించలేదు. కానీ రేడియో స్టేషన్ చినార్ ప్రకటన నాలో ఆశలు రేపింది. అందరితో పోటీపడి ఆర్జేగా సెలెక్ట్ అయ్యాను. నైపుణ్యం కలిగిన కశ్మీర్ యువతను మేల్కొల్పడమే మా ముఖ్య ఉద్దేశ్యం. యువతలోని శక్తిసామర్థ్యాలను తట్టిలేపి, వారిలోని ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చూపించడమే’’ అని సమానియా చెప్పింది. -
మహిళా జర్నలిస్ట్ చెంపను తాకిన గవర్నర్
చెన్నై : తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అనుచిత ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ మహిళా జర్నలిస్ట్ పట్ల ఆయన ప్రవర్తించి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే... బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి పేర్కొనడంతో ఆయన ఇరుకున పడినట్లయింది. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్ మంగళవారం రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తనకు ఆ ప్రొఫెసర్ ఎవరో కూడా తెలియదంటూ బన్వరిలాల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు మహిళా పాత్రికేయులు కూడా పాల్గొన్నారు. సమావేశ ముగింపు సమయంలో వేదికపై నుంచి వస్తున్న గవర్నర్‌ను ఒక మహిళా జర్నలిస్టు ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా బదులుగా ఆమె చెంపను తాకారు. గవర్నర్ చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అంతేకాకుండా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేసేందుకు ప్రయత్నించారు. తన పట్ల గవర్నర్ ప్రవర్తనపై మహిళా జర్నలిస్టు ట్విటర్లో స్పందించారు. ‘విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు’ అంటూ మహిళా జర్నలిస్లు లక్ష్మీ సుబ్రహ్మణినయన్ ట్వీట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం మంచి పద్థతి కాదన్నారు. నా ముఖాన్ని పదేపదే శుభ్రం చేసుకున్నాను. కానీ ఆ మలినం నన్ను వదిలినట్లు అనిపించడం లేదు. 78 ఏళ్ల వయస్సున్న మీరు నాకు తాతయ్యలాంటి వారే కావొచ్చు. కానీ మీ చర్య నాకు తప్పుగా అన్పిస్తోంది’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ప్రతిపక్ష డీఎంకే పార్టీ రాజ్యాంగ పరంగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికి ఇలా ప్రవర్తించడం మంచి పద్థతి కాదంటూ ఆయన చర్యను ఖండించింది. డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమొళి.. ‘ ఆయన ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఒక మహిళ గౌరవానికి అలా భంగం కలిగించడం సభ్యత అనిపించుకోదంటూ’ ట్వీట్ చేశారు. విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపించిందనే ఆరోపణలపై మధురై కామరాజ్ అనుబంధ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న తరుణంలో ఈ ఘటన వెలుగుచూడడంతో ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. Washed my face several times. Still not able to get rid of it. So agitated and angered Mr Governor Banwarilal Purohit. It might be an act of appreciation by you and grandfatherly attitude. But to me you are wrong. — Lakshmi Subramanian (@lakhinathan) April 17, 2018 -
మహిళా జర్నలిస్టుకు హీరో ఫ్యాన్స్ అసభ్య మెసేజ్‌లు!
చెన్నై: తమిళ హీరో విజయ్ ఫ్యాన్స్ అభిమానం శ్రుతి మించారు. తన హీరో నటించిన సినిమా బాగోలేదని కామెంట్ పెట్టిన ఓ మహిళా జర్నలిస్టుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే....బెంగళూరుకు చెందిన జర్నలిస్టు ధన్య రాజేంద్రన్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జబ్ హ్యారీ మెట్ సీజల్’ కి వెళ్లింది. అయితే ఆ సినిమా ఆమెకు అంతగా నచ్చకపోవడంతో ఇంటర్వెల్ కాకుండానే థియేటర్ నుంచి వచ్చేసింది. అదే విషయాన్ని ధన్య రాజేంద్రన్ శుక్రవారం ట్వీట్ చేస్తూ కొన్నేళ్ల క్రితం హీరో విజయ్ నటించిన ‘సురా’ సినిమా చూసినప్పుడు కూడా ఇదే ఫీలింగ్ కలిగిందని, అయితే ఆ సినిమా కనీసం ఇంటర్వెల్ దాకా అయినా కూర్చోబెట్టిందని, షారుక్ సినిమా అంతకంటే దారుణంగా ఉందని పోస్ట్ చేసింది. దీంతో విజయ్ ఫాన్స్ ఆమెపై సోషల్‌మీడియాలో వల్గర్ కామెంట్లతో ప్రతిదాడికి దిగారు. అసభ్య పదజాలంతో రీ ట్వీట్ చేయటమే కాక బూతు మెసేజ్‌లు, ట్రోలింగ్ ఫోటోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అంతేకాకుండా మహిళా జర్నలిస్టుపై బెదిరిస్తూ పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో గత మూడు రోజులుగా సుమారు 45వేలకు పైగా ట్విట్లు వచ్చాయి. దీంతో ధన్య రాజేంద్రన్ పోలీసుల్ని ఆశ్రయించారు. పక్కా ఫ్లాన్ ప్రకారం తనపై హీరో అభిమానులు ట్రాలింగ్ చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. ధన్యా రాజేంద్రన్ ఫిర్యాదుపై విచారణ అధికారులు మాట్లాడుతూ... ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ నలుగురిని గుర్తించినట్లు తెలిపారు. అయితే అసభ్యంగా కామెంట్లు చేసిన పలువురు తమ ట్విట్టర్ అకౌంట్లను డిలీట్ చేసినట్లు సీనియర్ అధికారి పేర్కొన్నారు. పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (అసభ్యకర పదజాలం, చిహ్నాలు, ప్రతీకాత్మక చిత్రాలు, బొమ్మలు, దృశ్యాలు వంటివి పోస్ట్ చేసి సదరు వ్యక్తి పేరు, ప్రతిష్టలు, గౌరవానికి భంగం కలిగించేలా చేసినా శిక్షార్హులే. అంతేకాదు, మహిళ ఆత్మాభిమానాన్ని కించపరిచేలా పదాలు, చిహ్నాలు వంటివి పెట్టినా ఐపీసీ సెక్షన్ 509 కింద నేరం). కాగా ఈ వివాదంపై హీరో విజయ్ ఇంతవరకూ స్పందించలేదు.