women labour
-
మహిళా రైతులను ఆశ్చర్యపరిచిన సీఎం.. పొలంలోకి దిగి
మధురై: ఆ మహిళలంతా పొలంలో పని చేసుకుంటూ బిజీగా ఉన్నారు. తమ సాధకబాధకాలు ముచ్చటిస్తూ.. పొలంలో నాట్లు వేస్తున్నారు. ఇంతలో వారి వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. మొదట ఆ వ్యక్తిని చూసిన మహిళలు ఒక్కసారి షాక్ అయ్యారు. ఇంత పెద్ద వ్యక్తి మా దగ్గరకు రావడం ఏంటని ఆశ్చర్యపోయారు. ఇంతకు ఆ మహిళలను అంతలా ఆశ్చర్యపరిచిన సదరు ప్రముఖుడు ఎవరంటే.. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. పొలంలో పని చేసుకుంటున్న మహిళల వద్దకు వెళ్లి పలకరించారు సీఎం ఎంకే స్టాలిన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: నో లగ్జరీ ఫుడ్: ఆసక్తి రేపుతున్న సీఎం స్టాలిన్ నిర్ణయాలు!) మధురై జిల్లా, నట్టపటి గ్రామంలో శనివారం కొందరు మహిళలు పొలంలో నాట్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్తున్న స్టాలిన్... తన వాహానం ఆపి.. పొలంలోకి వెళ్లి మహిళా రైతులతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రే తమ వద్దకు రావడంతో సదరు మహిళా రైతుల ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారి సమస్యలను ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మీడియాలో వైరలవుతోంది. చదవండి: ట్రాన్స్‌జెండర్ చిరకాల కల నెరవేర్చిన సీఎం స్టాలిన్ -
చెరకు కోత
ఒక మనిషి సంతోషంగా ఉన్నారంటే వారి జీవనం సాఫీగా సాగిపోతోందని. వారి కుటుంబంలోని సభ్యులంతా సంతృప్తిగా ఉన్నారని. మరి దేశం సంతోషంగా ఉందనే వార్త ఎప్పుడు మన చెవిన పడుతుంది?! మన దేశ ప్రజలు సురక్షితంగా, సౌభాగ్యాలతో జీవిస్తున్నారని నిర్ధారణ అయినప్పుడు. అయితే అలాంటిది ఎప్పటికీ నిర్ధారణ కాదేమోనన్న భయాన్ని, సందేహాన్ని కలిగిస్తూ.. ఎక్కడో ఒకచోట, ఏదో ఒక దారుణ సంఘటన బయటపడుతూనే ఉంది! అందుకు ఉదాహరణే మహారాష్ట్రలోని మరఠ్వాడ ప్రాంతం. ఆ ప్రాంతంలో అత్యధికులు చెరకు కార్మికులుగా ఉన్నారు. వారిలో ఎక్కువమంది మహిళలే. నెలసరి రోజుల్లో వారిని చెరకుతోట పనుల్లోకి రానివ్వరు. దాంతో వారు ఇంటివద్దనే ఉండాల్సిన పరిస్థితి. ఆ నాలుగు రోజులూ దినసరి కూలీ కోల్పోయి, కుటుంబంలోని మిగతా సభ్యులూ పస్తులుండాల్సి వస్తుంది. అందుకే అక్కడి మహిళా కూలీలు చాలామంది రోజువారీ వేతనం పోతుందనే భయంతో ఆపరేషన్ ద్వారా తమ గర్భసంచిని తొలగించుకుంటున్నారు! ఇలా చేసింది ఒకరూ ఇద్దరు కాదు. ఇప్పటి వరకు వేల మంది! కొంతమంది చెరకుతోట కాంట్రాక్టర్లు భార్య, భర్త ఇద్దరినీ ఒక యూనిట్‌గా పరిగణించి పని కల్పిస్తారు. భార్య ఆ నాలుగు రోజులు పనిలోకి రాకపోతే రోజుకు రూ.500 జరిమానా వేస్తారు. దాంతో.. రోజూ వచ్చి పని చేస్తున్న భర్తకు రావలసిన కూలీ కూడా చెయ్యిజారి పోతుంది. పైగా పనుల్లో కుదిర్చే కాంట్రాక్టర్లు గర్భసంచి లేని మహిళలనే పనుల్లోకి తీసుకురావడానికి ముందుకు వస్తారని, పర్యవసానంగా ఈ యేడాది 13,000 మంది చెరకు కూలీలు తమ గర్భాశయాన్ని తొలగించుకున్నారని ఇటీవల కొన్ని జాతీయస్థాయి స్వచ్ఛంద సంస్థలు జరిపిన పరిశోధనలో బయటపడింది. దీంతో జీవనోపాధికోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితుల్లోకి మహిళలు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువలా అందుతున్నాయి. -
వైఎస్ జగన్‌ను కలిసి సమస్యలు చెప్పుకున్న మహిళా కూలీలు
-
తమిళనాడులో మరో ఘోరం
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై నగరంలో దివ్యాంగ బాలికపై అత్యాచార ఘటన నుంచి తేరుకోకముందే మరో ఘోరం బయటపడింది. ప్రేమ పేరుతో బాలికను లోబరచుకున్న ఓ యువకుడు ఆమెను తన స్నేహితులకు అప్పగించాడు. పుదుచ్చేరిలోని ఒక గ్రామానికి చెందిన నిరుపేద కార్మికుని కుమార్తె (17) చెన్నై నగరంలో చిన్నపాటి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఆదుకుంటోంది. అదే సమయంలో ఆమెకు విల్లుపురం జిల్లా వళుతావూరుకు చెందిన ఒక యువకుడు పరిచయం అయ్యాడు. మాయమాటలు చెప్పి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసి బెదిరిస్తూ అనేకసార్లు రేప్‌చేశాడు. తన ఆరుగురు స్నేహితులకు బాలికను అప్పగించగా వారూ రేప్ చేశారు. విషయం తెల్సుకున్న బాధితురాలి తల్లిదండ్రులు బుధవారం పుదుచ్చేరి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
బషీరాబాద్(రంగారెడ్డి): పిడుగుపాటుకు ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని నవల్గి గ్రామంలో వ్యవసాయ పొలంలో కూలీలు పనిచేస్తుండగా పిడుగుపడింది. దీంతో మంజుల(20), మహాదేవి(48), చెన్నమ్మ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.