![17 years women molestation in chennai - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/19/rap.jpg.webp?itok=jM_ZVXmW)
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై నగరంలో దివ్యాంగ బాలికపై అత్యాచార ఘటన నుంచి తేరుకోకముందే మరో ఘోరం బయటపడింది. ప్రేమ పేరుతో బాలికను లోబరచుకున్న ఓ యువకుడు ఆమెను తన స్నేహితులకు అప్పగించాడు. పుదుచ్చేరిలోని ఒక గ్రామానికి చెందిన నిరుపేద కార్మికుని కుమార్తె (17) చెన్నై నగరంలో చిన్నపాటి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఆదుకుంటోంది. అదే సమయంలో ఆమెకు విల్లుపురం జిల్లా వళుతావూరుకు చెందిన ఒక యువకుడు పరిచయం అయ్యాడు.
మాయమాటలు చెప్పి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసి బెదిరిస్తూ అనేకసార్లు రేప్‌చేశాడు. తన ఆరుగురు స్నేహితులకు బాలికను అప్పగించగా వారూ రేప్ చేశారు. విషయం తెల్సుకున్న బాధితురాలి తల్లిదండ్రులు బుధవారం పుదుచ్చేరి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment