women Representation
-
Lok sabha elections 2024: అరుణాచల్‌లో ఆమె ప్రాతినిధ్యమేది?
ఈటానగర్: చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం విషయంలో అరుణాచల్ ప్రదేశ్ అందుకు మినహాయింపేమీ కాదు. రెండు లోక్‌సభ స్థానాలతో పాటు రాష్ట్రంలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగననున్నాయి. కానీ ఈ ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగిన మహిళల సంఖ్య మాత్రం అంతంతే... ఇప్పటివరకు 15 మంది... అరుణాచల్ ఈస్ట్, అరుణాచల్ వెస్ట్ రెండు లోక్‌సభ స్థానాలకు మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. గణ సురక్ష పారీ్టకి ప్రాతినిధ్యం వహిస్తున్న టోకో శీతల్ ఒక్కరే మహిళ. 50 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది మంది మహిళలు మాత్రమే నామినేషన్లు వేశారు. వారిలో అధికార బీజేపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు కాగా ఒకరు ఇండిపెండెంట్. వీరిలో హయులియాంగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దా సంగ్లు పుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1987లో అరుణాచల్ ప్రదేశ్ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి కేవలం 15 మంది మహిళలు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి ఒక మహిళ మాత్రమే రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించారు. సిబో కైను 1978లో అసెంబ్లీకి గవర్నర్ నామినేట్ చేశారు. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) అభ్యర్థిగా సెప్పా నియోజకవర్గం నుంచి 1980లో అసెంబ్లీకి ఎన్నికైన మొదటి మహిళ న్యారీ వెల్లి. కోమోలి మొసాంగ్ 1980లో నాంపాంగ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా ఎన్నికయ్యారు. 1990లో కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి ఆమె విజయం సాధించారు. ఒమేమ్ మోయోంగ్ డియోరీ 1984లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1990లో కాంగ్రెస్ టిక్కెట్‌పై లేకాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా గెలుపొందారు. బలమైన గొంతుకలు కావాలి.. సాంస్కృతిక అడ్డంకులు, సామాజిక–ఆర్థిక పరిమితులు, అవగాహన లేమి వంటి అనేక అంశాలు ఎన్నికల రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాజకీయ ప్రక్రియలో మహిళల ప్రమేయాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం, పౌర సమాజ సంస్థల సమష్టి కృషి అవసరమని అరుణాచల్ ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ కెంజుమ్ పాకం అన్నారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లపై చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాని బాత్ సూచించారు. అప్పుడే అరుణాచల్ వంటి చోట్ల వారికి ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు. -
మహిళలు ముందుకు సాగాలి!
పేరు.. మేనక గురుస్వామి వృత్తి... సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, యేల్ లా స్కూల్, న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కూల్ ఆఫ్ ‘లా’లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ప్రత్యేకత... ఎల్జీబీటీ హక్కులకు సంబంధించిన ఆర్టికల్ 377ను సడలించడానికి న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. తల్లిదండ్రులు... మీరా గురుస్వామి, మోహన్ గురుస్వామి (ఆర్థిక శాఖ మాజీ సలహాదారు) వివరం... హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మేనక ప్రాథమిక విద్యను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, హైస్కూల్ విద్యను న్యూఢిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయలో పూర్తిచేశారు. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, హార్వర్డ్ లా స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో న్యాయశాస్త్రాన్ని చదివారు. సందర్భం... మంథన్ సంవాద్‌లో వక్తగా పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. ‘‘మై కాన్స్టిట్యూషన్స్ కంట్రీ’ అనే విషయం మీద మాట్లాడారు. ఆర్టికల్ 377ను సడలించేందుకు ఆమె చేసిన న్యాయ పోరాటం గురించి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అడిగే ప్రయత్నం చేస్తే.. ‘‘పోరాటం విజయవంతం అయింది.. దాని గురించి వార్తలు, వార్తా కథనాలూ వెలువడ్డాయి. ఇంకా దాని గురించే ఎందుకు? దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకుందాం అన్నారు. ‘‘దేశంలోని రెండు ప్రధాన పార్టీలు బీజేపి, కాంగ్రెస్‌ను కాదని ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి యంగ్‌స్టర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది సమాఖ్య స్ఫూర్తిని, ప్రాంతీయ ఆకాంక్షను చాటుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయం.. దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించిన అంశం. అంతేకాదు దక్షిణ భారతదేశ ఓటర్ల నాడిని తెలుపుతోంది. ప్రాంతీయ పార్టీల పట్ల వాళ్లకున్న ఆదరణకు చిహ్నం. దీన్ని ఒకరకంగా ఫెడరల్ మూవ్‌మెంట్‌గా చెప్పొచ్చు. అంతేకాదు ప్రస్తుతం దేశంలో మహిళా ఓటర్ల శాతమూ పెరిగింది. అయితే మహిళా సమస్యలను రాజకీయ పార్టీలు ఎంతవరకు ప్రాముఖ్యం ఇస్తాయన్నదే ఇక్కడ ప్రశ్న. ఆ మాటకొస్తే మన దగ్గర ఎంతోమంది మహిళా నేతలున్నారు. మహిళా ప్రతినిధుల సంఖ్యా తక్కువేం కాదు. ప్రధానమంత్రి దగ్గర్నుంచి ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా మహిళలు పనిచేశారు. కానీ వీళ్లెవరూ మహిళా సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో స్పందించిన దాఖలాల్లేవు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.. మహిళా సమస్యల పట్ల వాళ్లెందుకు మాట్లాడరు? అని. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటాం.. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు రక్షణ ఉండదు. సాయంకాలం అయిందంటే బయట ఎవరూ కనిపించరు’’ అని అంటూ... ‘‘కాలం మారింది. మహిళలు ముందుకు సాగాలి. రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండాలి. సమస్యల పట్ల నిలదీయాలి. పరిష్కారాల కోసం పోరాడాలి’’ అని చెప్పారు మేనక గురుస్వామి. – ఫొటో: ఎన్.రాజేష్ రెడ్డి -
ఆమె ఒక్కరే...
మహిళలకు ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు అని పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేస్తున్నా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టేందుకు మాత్రం ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం రావడం లేదు. ఇప్పటి వరకు కేవలం టి కల్పనాదేవి ఒక్కరు మాత్రమే ఎంపీ గెలుపొందారు. వరంగల్, మహబూబాబాద్ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీలు అతివలకు అవకాశాలు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. సాక్షి, వరంగల్: వరంగల్, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక మహిళా ఎంపీ మాత్రమే ప్రాతినిథ్యం వహించారు. వరంగల్ ఎంపీగా డాక్టర్ టి కల్పనాదేవి 1984లో గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆమె కూడా పరాజయం పాలయ్యారు. వరంగల్, మానుకోట రెండు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే 26,657 మంది అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురు మహిళలు టికెట్ ఆశిస్తుండగా టికెట్ వచ్చేనే లేదో చూడాలి. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో అతివలకు అవకాశాలు కల్పించడంలో రాజకీయ పార్టీలు చిన్న చూపుచూస్తున్నాయి. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ తప్పనిసరి అని నిబంధన పెట్టడంతో పురుషులతో సమానంగా అవకాశాలు దక్కుతున్నా చట్ట సభలకు వచ్చే సరికి అంతంతమాత్రంగానే ఉంటుంది. వరంగల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు 15,18,907, మహిళా ఓటర్లు 15,45,564, ఇతరులు 223 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళ ఓటర్లు ఎక్కువ ఉండటంతో వచ్చే ఎన్నికల్లోనైనా మహిళలకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. అభ్యర్థిత్వం ఆశించే మహిళలు ఉంటున్నా గెలుపోటములను బేరీజు వేసుకుంటూ రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటుండటంతో టికెట్లు దక్కడం లేదు. గెలిచి.. ఓడిన కల్పనాదేవి వరంగల్ లోకసభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 19 సార్లు ఎన్నికలు జరిగాయి. 1984లో హన్మకొండకు చెందిన డాక్టర్ టి.కల్పనాదేవి తెలుగుదేశం పార్టీ నుంచి వరంగల్ లోక్‌సభ సభ్యురాలిగా గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి కమాలోద్దిన్ అహ్మద్‌పై 8,456 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1989లో టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వరంగల్ లోకసభ ఏర్పాటైనప్పటి నుంచి ఏకైక మహిళా ఎంపీగా చరిత్రలో నిలిచారు. ప్రముఖ వైద్యురాలుగా పనిచేస్తూ టీడీపీ పార్టీలో చేరారు. 1990లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ ఉపాధ్యక్షురాలుగా, ఏఐసీసీ సభ్యురాలుగా పనిచేశారు. 2016 మే 29న గుండెపోటుతో మరణించారు. ప్రస్తుత ఆశావహులు.. వరంగల్ ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సింగపురం ఇందిర ఆశిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో పోటీచేసి ఓటమి చెందారు. మానుకోట అభ్యర్థిత్వం విషయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత మానుకోట టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ వస్తుందో...గెలుపొంది చట్టసభల్లో ఎవరు అడుగుపెడతారో వేచి చూడాలి. -
‘అతివ’కే పట్టం..
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాపరిషత్ జిల్లాల పునర్విభజనతో ఆరు జిల్లా పరిషత్‌లుగా విడిపోయింది. వచ్చే జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు నూతన జిల్లాల వారీగా జరుగనున్నాయి. ఈ మేరకు నూతన జిల్లా ప్రజా పరిషత్‌ల వారీగా రిజర్వేషన్లు ప్రభుత్వం బుధవారం ఖరారు చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ అనంతరం జిల్లాలో జెడ్పీ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. రూరల్ జిల్లా అక్టోబర్ 11, 2016న ఆవిర్భవించింది. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోనే జిల్లా పరిషత్ కొనసాగింది. త్వరలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీలు రిజర్వేషన్లలో మహిళలకు కేటాయించిన వారికి ఈ అవకాశం దక్కనుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌గా మహిళే ఉండగా, ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ మహిళలకు రిజర్వేషన్ కావడంతో వారికి ఉన్నత పదవులు లభించనున్నాయి. జిల్లాలో 16 జెడ్పీటీసీలు, 178 ఎంపీటీసీలు ఉన్నాయి. పదవి ఎవరిని వరిస్తుందోనని చర్చలు మొదలయ్యాయి. -
షరియత్ చట్టాల్లో మార్పులను సహించం
సాక్షి, హైదరాబాద్: ఇస్లామీ షరియత్ చట్టాల్లో మార్పుల్ని దేశంలో ప్రతి ముస్లిం మహిళా వ్యతిరేకిస్తోందని ప్రొఫెసర్ అష్రఫ్ రఫీ చెప్పారు. ముస్లిం మహిళల వ్యక్తిగత, సామూహిక, దాంపత్య జీవితం కోసం ఖురాన్, మహ్మద్ ప్రవక్త ప్రవచనాల ఆధారంగా రూపొందించిందే షరియత్ చట్టమని ఆమె పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ ఖిల్వత్లో ఉర్దూ మస్కాన్లో జమియతుల్ మొమినాత్ మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘షరియత్ చట్టాలు.. ట్రిపుల్ తలాక్’ అంశంపై ఒక రోజు సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళా ధార్మికవేత్తలు పాల్గొన్నారు. ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం రూపొందించబోతున్న చట్టంతో మహిళలకే ఎక్కువ నష్టం జరుగుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. పెళ్లి అనేది ఒక పవిత్ర బంధమని.. భార్యాభర్తల మధ్య తగాదాలొస్తే ఇరు పక్షాలవారు సయోధ్య చేయాల్సింది పోయి మరింత జటిలం చేయడం సరికాదన్నారు. ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తే అతని భార్య, పిల్లల జీవనోపాధి ఎలా అని వారు ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. అలాంటప్పుడు అది నేరమెలా అవుతుందని పలువురు వక్తలు ప్రశ్నించారు. ముస్లిం మహిళలపై కేంద్రానికి సానుభూతి ఉంటే ముస్లిం మతగురువులతో సంప్రదించి ట్రిపుల్ తలాక్ నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. -
అగ్రరాజ్యాల్లోనూ ఇంతింతే..
మహిళల హక్కులపై నిరంతరం నీతిచంద్రికలు వల్లించే అగ్రరాజ్యాల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రమే. ‘ఆకాశంలో సగం’ అంటూ మాటలతోనే మహిళలను ఆకాశానికెత్తిన మావో పుట్టిన దేశంలోనూ చట్టసభల్లో మహిళలకు దక్కుతున్న చోటు అంతంత మాత్రమే. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లు కు మోక్షం దక్కే ముహూర్తం ఇంకా ఆసన్నం కాకపోవడంతో భారత్‌లోనూ అదే పరిస్థితి. వివిధ దేశాల్లోని చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు - ఎలక్షన్ సెల్ * ప్రస్తుత పార్లమెంటులో మహిళలకు 11 శాతమే ప్రాతినిధ్యం గల భారత్ ఐపీయూ జాబితాలో 108వ స్థానంలో ఉంది. * పొరుగునే ఉన్న పలు దేశాలు చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో మన కంటే ముందున్నాయి. మహిళలకు 27.7 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తూ అఫ్గానిస్థాన్ 37వ స్థానంలో, 20.7 శాతం ప్రాతినిధ్యంతో పాకిస్థాన్ 66వ స్థానంలో, 19.7 శాతం ప్రాతినిధ్యంతో బంగ్లాదేశ్ 71వ స్థానంలో ఉన్నాయి. * చైనా చట్టసభలో మహిళలకు 23.4 శాతం ప్రాతినిధ్యమే లభిస్తోంది. ఐపీయూ జాబితాలో చైనా 56వ స్థానంలో నిలుస్తోంది. * ప్రపంచంలో సుమారు పాతిక దేశాల్లో మాత్రమే చట్టసభల్లో మహిళలకు కనీసం మూడోవంతు ప్రాతినిధ్యం లభిస్తోంది. * ప్రపంచంలోని ఎనిమిది దేశాల్లో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మచ్చుకైనా లేదు. పెద్దన్న.. చిన్న బుద్ధి పేరుకు అగ్రరాజ్యమే కానీ.. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో మాత్రం అమెరికా వెనకబడే ఉంది. అమెరికా ప్రతినిధుల సభలో మహిళల ప్రాతినిధ్యం 17.8 శాతం మాత్రమే. ఐపీయూ జాబితాలో ఈ దేశం 80వ స్థానంలో ఉంది.