women votes
-
సామాజిక వర్గాలపై కొండంత ఆశ !
సాక్షి, హుజూర్నగర్ : ఎన్నికల సమరం దగ్గర పడుతుడటంతో ప్రచారంలో నిమగ్నమైన ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. సభలు, సమావేశాలు, చేరికలతో పాటు తెర వెనుక వ్యూహాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు బయట ఎన్నికల ప్రచారం చేస్తున్న అభ్యర్థులు, ఆశావహులు రాత్రివేళల్లో ముఖ్యమైన నా యకులతో కలిసి ఓటర్లకు ఏ విధంగా చేరువ కావాలనే విషయమై వ్యూహరచన చేస్తున్నారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసే విధంగా తమ ప్రచారశైలిని రూపొందించుకుంటున్నారు. తెరమీద సాగుతున్న ప్రచారం కంటే బూత్‌స్థాయిలో తెర వెనుక సాగే మంత్రాంగమే తమ విజయానికి సోపానమవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ ఓటరు జాబితాలోని ఓటర్లను సామాజిక వర్గాలుగా విభజించి వారిని వ్యక్తిగతంగా కలిసేలా వ్యూహరచన చేస్తున్నారు. ప్రచారానికి ముందే పట్టణాలు, గ్రామాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఓటరు జాబితాను వడ పోస్తున్నారు. కులాలు, మతాలు, యువతీ యువకులు, ఉద్యోగులు, మహిళలను వర్గాలుగా విభజించి విశ్లేషిస్తున్నారు. ఎక్కువ ఓటర్లను ప్రభావితం చేసే గ్రామ ముఖ్య నాయకులపై అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. స్థానికంగా ఓటరు జాబితాలో నమోదై ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్ల సమాచారం తీసుకునే పనిలో మరికొందరు నిమగ్నమయ్యారు. తెరవెనుక ఇలాంటి పనులు నిర్వహించేందుకు చురుకైన యువకులను వినియోగించుకుంటున్నారు. క్రియాశీలకంగా వ్యవహరించే యువకులను బృందాలుగా విభజించి ఈ పనులు అప్పగిస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో తమకు అనుకూలంగా ఎవరెవరు ఉంటారు, వ్యతిరేకంగా ఎవరెవరు ఉంటారనేది స్థానిక నాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. తమకు మద్దతు ఇచ్చే ఓటర్లు ప్రత్యర్థి పార్టీవైపు జారిపోకుండా కాపాడుకుంటూనే ప్రతిపక్ష పార్టీల ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా పథకాలు రచిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా వ్యవహరించే ఓటర్లు ఎవరి మాట వింటారనేది గుర్తించి వారి సహాయం కోరుతూ ముందుకు వెళుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ఇప్పటికే పార్టీల వారీగా విడిపోయిన క్రమంలో ప్రతి ఓటరును కలిసేందుకే అభ్యర్థులు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రచార సమయంలో ఎవరైనా ముఖ్య నేతలు కలవకపోతే ఉదయం, రాత్రి వేళనో వారి ఇంటికి వెళ్లి ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. మహిళలు, యువతపై దృష్టి .... ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, మహిళలు, యు వకులపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. గ్రామాలకు ఎన్నికల ప్రచారానికి వెళ్లే అభ్యర్థులు సామాజిక వర్గాలతో పాటు మహిళలు, యువకుల ఓట్లను ఏ విధంగా రాబట్టుకోగలుగుతామనేది ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్నారు. యువజన, మహిళ సంఘాల బాధ్యులతో మాట్లాడి ఈఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. యు వకులు, మహిళలను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు. సమస్యల ఏకరువు ... గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లే అభ్యర్థులకు ప్రజల నుంచి పలు సమస్యలపై ఏకరువు పెడుతున్నారు. ఈ సమయంలో వారిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వారి డిమాండ్లకు తలొగ్గుతున్నారు. తమ కాలనీల్లోని సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం కొందరు చేస్తుంటే మరికొందరు వివిధ అభివృద్ధి పనులను కోరుకుంటున్నారు. తాము చెప్పిన పనులు చేస్తేనే ఎన్నికల్లో మీకు మద్దతు ఇస్తామని ప్రజలు çస్పష్టం చేస్తున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు రేయింబవళ్లు వ్యూహ ప్రతివ్యూహాలలో నిమగ్నమై ముందుకు వెళుతున్నారు. -
మహిళా ఓటర్లే అధికం
విడుదలైన తుది జాబితా ∙ జిల్లాలో మొత్తం 37,33,336 మంది ఓటర్లు మహిళలు : 18,74,091 l పురుషులు : 18,58,964 l ఇతరులు : 281 కాకినాడ సిటీ : ఎన్నికల కమిష¯ŒS ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరణను జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. జిల్లా ఓటర్ల తుది జాబితాను సోమవారం ప్రకటించింది. దీని ప్రకారం జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 37,33,336 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 18,58,964 మంది, మహిళలు 18,74,091 మంది, ఇతరులు 281 మంది ఉన్నారు. గత ఏడాది జనవరిలో విడుదల చేసిన జాబితా ప్రకారం జిల్లాలో 37,04,882 మంది ఓటర్లు ఉండగా, తాజా సవరణ అనంతరం 28,454 మంది కొత్త ఓటర్లు చేరారు. అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా రంపచోడవరం, అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా రాజోలు నిలిచాయి. నియోజకవర్గాలవారీగా ఓటర్లు ఇలా.. నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం తుని 97,171 97,380 12 1,94563 ప్రత్తిపాడు 92,502 93,620 17 1,86,139 పిఠాపురం 1,08,972 1,06,831 6 2,15,809 కాకినాడ రూరల్ 1,06,496 1,05,028 13 2,11,537 పెద్దాపురం 90,762 91,181 16 1,81,959 అనపర్తి 98,777 1,00,755 3 1,99,535 కాకినాడ సిటీ 94,259 98,171 73 1,92,503 రామచంద్రపురం 90,726 89,547 10 1,80,283 ముమ్మిడివరం 1,03,886 1,01,419 3 2,05,308 అమలాపురం 94,775 92,172 7 1,86,954 రాజోలు 84,871 83,542 1 1,68,414 పి.గన్నవరం 87,519 82,565 0 1,70,084 కొత్తపేట 1,12,275 1,12,297 11 2,24,583 మండపేట 97,456 1,00,552 4 1,98,012 రాజానగరం 91,451 92,942 13 1,84,406 రాజమహేంద్రవరం సిటీ 96,843 1,02,122 58 1,99,014 రాజమహేంద్రవరం రూరల్ 1,00,578 1,03,386 18 2,03,982 జగ్గంపేట 97,076 98,334 10 1,95,420 రంపచోడవరం 1,12,578 1,22,247 6 2,34,831 -
మహిళలే నిర్ణేతలు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా భాగస్వాములవుతున్నారన్న విషయం మరోమారు స్పష్టమైంది. ప్రాదేశిక ఎన్నికల తుది విడత పోలింగులోనూ మహిళల ఓటింగ్ శాతమే ఎక్కువగా నమోదైంది. పోలైన పురుషులు, మహిళల ఓట్లలో భారీ తేడా ఉండటంతో అభ్యర్థుల జయాపజయాలను వారి ఓట్లే నిర్దేశిస్తాయని భావిస్తున్నారు. జె డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తక్కువ ఓట్లే ఉంటాయి. అందువల్ల కొద్దిపాటి ఓట్ల తేడాలే అభ్యర్థుల తలరాతను మార్చేస్తాయి. ఈ నేపథ్యంలో మహిళల ఓట్లు ఎక్కువగా పోలవడంతో వారి ఓట్లే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు. జిల్లాలో ఈ నెల 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరిగిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ జరిగింది. తొలివిడతలో 18 మండలాల్లోనూ, రెండో విడతలో 20 మండలాల్లోనూ జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. తొలివిడతలో 7,68, 961 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉండగా ఎమ్పీటీసీ స్థానాలకు 5,75,773 మంది, జెడ్పీటీసీ స్థానాలకు 5,52,967 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రెం డింటిలోనూ మహిళలే అధికసంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా రెండో విడతలో జరిగిన ఎన్నికల్లో 8,87,977 మంది ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఎమ్పీటీసీ స్థానాలకు 6,63,112 మంది, జెడ్పీటీసీ స్థానాలకు 6,82,262 మంది ఓటు వేశారు. ఈ రెండు విడతల్లోనూ పురుషులు కంటే మహిళల ఓటింగ్ గణాంకాల్లో 5 నుంచి 8 శాతంవరకు అధికంగా ఉంది. ఇంత భారీ వ్యత్యాసం కచ్చితంగా అభ్యర్థుల గెలుపు అవకాశాలను ప్రభావితం చేస్తుందని అం చనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి అదరణ ఉన్నట్లు పోలింగ్ సందర్భంగా స్పష్టం కావడంతో ఈ పరి ణామం ఆ పార్టీ అభ్యర్థులకే అనుకూలం గా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో తెలుగుదేశం అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. తమ పార్టీకి మహిళాదరణ తగ్గిపోవడం, పోలింగ్‌లో వారిదే పైచేయిగా ఉండటంతో తమ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని టీడీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.