Womens union leaders
-
వీణ-హరికృష్ణల కథ సుఖాంతం
తిరుపతి: గత రెండు రోజుల నుంచి భర్త, అత్తమామల వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ దీక్ష చేపట్టిన వీణ కథ సుఖాంతమయ్యింది. భార్య వీణతో కాపురం చేయడానికి భర్త సమ్మతి వ్యక్తం చేయడంతో ఆమె దీక్షకు ప్రతిఫలం లభించింది. దీక్ష స్థలిలోనే ఎమ్మెల్యే సమక్షంలో భార్య భర్తలిద్దరూ మరోసారి దండలు మార్చుకున్నారు. దీంతో వారిద్దరి సమస్య ఓ కొలిక్కి వచ్చినా.. ఆమె తల్లి దండ్రులు మాత్రం ఇంకా పూర్తి న్యాయం జరగలేదని అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు భర్త హరికృష్ణ తనతో కలిసి కాపురం చేస్తానంటేనే దీక్ష విరమిస్తానని వీణ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనను భర్త ఆదరించాలంటూ రెండు రోజుల క్రితం దీక్ష చేపట్టిన వీణ శుక్రవారం కూడా కొనసాగించింది. ఉదయం బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే వెంకటరమణ.. సాయంత్రానికి కల్లా సమస్యను పరిష్కారిస్తానని హామీ ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే వీణ మామయ్య గోవిందయ్య తో చర్చలు జరిపాడు. వీణ దీక్ష చేస్తున్న వార్తలను చూసిన భర్త హరికృష్ణ కూడా ఘటనాస్థలికి చేరుకోవడంతో వారి మధ్య ఎమ్మెల్యే రాజీ కుదిర్చారు. దీంతో పాటు వీణకు అటు మీడియా, మహిళా సంఘాల మద్దతు కూడా లభించడంతో భర్త హరికృష్ణ కాపురం చేయడానికి అంగీకరించాడు. తిరుపతి భవానీనగర్‌కు చెందిన గోవిందయ్య, పద్మావతి కుమారుడు హరికృష్ణతో జీవకోనకు చెందిన వెంకటముని, జ్యోతి కుమార్తె వీణకు 2013 జనవరిలో వివాహమైంది. 11 నెలల క్రితం వీరికి ఆడబిడ్డ పుట్టిందని ఆమె నుంచి భర్తను దూరం చేసే యత్నం చేశారు. ఆడపిల్ల పుట్టిందని అత్తగారింటి నుంచి చూడడానికి ఎవ్వరూ రాలేదు. కనీసం తండ్రి హరికృష్ణ కూడా రాలేదు. ఈ సమస్య తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచన మేరకు బుధవారం ఏఎస్పీని కలిశారు. దీంతో వీణ భర్త హరికృష్ణను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తరువాత భర్త హరికృష్ణ మాయం కావడం. ఆమె దీక్ష చేపట్టడంతో కలకలం సృష్టించింది. -
భర్త ఆదరిస్తేనే దీక్ష విరమిస్తా: వీణ
తిరుపతి: భర్త హరికృష్ణ తనతో కలిసి కాపురం చేస్తానంటేనే దీక్ష విరమిస్తానని వీణ స్పష్టం చేసింది.గత రెండు రోజుల క్రితం తనను, బిడ్డను భర్త ఆదరించాలంటూ దీక్ష చేపట్టిన వీణ శుక్రవారం కూడా తన నిరసనను కొనసాగించింది. ఈ రోజు ఉదయం బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే వెంకటరమణ .. సాయంత్రానికల్లా సమస్యను పరిష్కారిస్తానని హామీ ఇచ్చాడు. ఇందులో భాగంగానే వీణ మామయ్య గోవిందయ్య చర్చలు చేపట్టారు. వీణ దీక్ష చేస్తున్న వార్తలను చూసిన భర్త హరికృష్ణ కూడా ఘటనా స్థలికి చేరుకున్నాడు. అయితే భర్త హరికృష్ణ తనతో కాపురం చేస్తేనే దీక్ష విరమిస్తానని వీణ తెలిపింది. ఒకవేళ అలా కాకపోతే దీక్షను కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసింది. తిరుపతి భవానీనగర్‌కు చెందిన గోవిందయ్య, పద్మావతి కుమారుడు హరికృష్ణతో జీవకోనకు చెందిన వెంకటముని, జ్యోతి కుమార్తె వీణకు 2013 జనవరిలో వివాహమైంది. 11 నెలల క్రితం వీరికి ఆడబిడ్డ పుట్టింది. అప్పటి నుంచి అత్తగారింటి నుంచి చూడడానికి ఎవ్వరూ రాలేదు. కనీసం తండ్రి హరికృష్ణ కూడా రాలేదు. ఈ సమస్య తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచన మేరకు బుధవారం ఏఎస్పీని కలిశారు. దీంతో వీణ భర్త హరికృష్ణను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తరువాత ఇంటికి బయలుదేరినా మార్గమధ్యంలోనే అదృశ్యమయ్యాడని వీణ వివరించింది. తనను ఆదరించమని అత్తారింటి ముందు దీక్షకు దిగినట్లు ఆమె స్పష్టం చేసింది. ‘మా అత్తామామలకు, భర్తకు ఆస్తులు చూసుకోవడానికి వారసుడు కావాలని తనను భర్త నుంచి దూరం చేసేందుకు యత్నిస్తున్నారని వీణ ఏకరువు పెట్టింది. అవసరమైతే రెండో పెళ్లి చేయడానికైనా సిద్ధపడేలా ఉన్నారు. తనను, తన బిడ్డను భర్త దగ్గరకు చేర్చుకుంటాడనే ఆశ ఉంది అంటున్న వీణకు మహిళ సంఘాల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. -
ఆగని కోడలి దీక్ష
తిరుపతిక్రైం: ‘మా అత్తామామలకు, భర్తకు ఆస్తులు చూసుకోవడానికి వారసుడు కావాలంటున్నాడు. అవసరమైతే రెండో పెళ్లి చేయడానికైనా సిద్ధపడేలా ఉన్నారు. బుధవారం నుంచి నా భర్తకు ఉన్న మెడికల్ షాప్‌ను కూడా మూసివేసి కనపడకుండా పంపించివేశారు. నాకు కేసులు అవసరం లేదు. నాకు నాభర్త కావాలి. ఇదంతా నాభర్త కోసమే చేస్తున్నాను. మీరు ప్రచురించే వార్తను చూసైనా నన్ను, నాబిడ్డను దగ్గరకు చేర్చుకుంటాడనే ఆశ ఉంది’. అంటూ ఓ అభాగ్యురాలు మెట్టినింటి వద్ద లోకం పోకడ తెలియని పసిబిడ్డను ఒడిలో ఉంచుకుని గురువారం కూడా దీక్ష కొనసాగించింది. తిరుపతి భవానీనగర్‌కు చెందిన గోవిందయ్య, పద్మావతి కుమారుడు హరికృష్ణతో జీవకోనకు చెందిన వెంకటముని, జ్యోతి కుమార్తె వీణకు 2013 జనవరిలో వివాహమైంది. 11 నెలల క్రితం వీరికి ఆడబిడ్డ పుట్టింది. అప్పటి నుంచి అత్తగారింటి నుంచి చూడడానికి ఎవ్వరూ రాలేదు. కనీసం తండ్రి హరికృష్ణ కూడా రాలేదు. ఈ సమస్య తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచన మేరకు బుధవారం ఏఎస్పీని కలిశారు. దీంతో వీణ భర్త హరికృష్ణను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తరువాత ఇంటికి బయలుదేరినా మార్గమధ్యంలోనే అదృశ్యమయ్యాడని వీణ వివరించింది. తనను ఆదరించమని అత్తారింటి ముందు దీక్షకు దిగినట్లు ఆమె స్పష్టం చేసింది. పార్టీలు సంఘాల మద్దతు న్యాయం కోసం పోరాటం సాగిస్తున్న వీణకు వివిధ పార్టీలు, మహిళా సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. ఆమెతో పాటు లక్ష్మి (ఐద్వా), టీ.రాజేంద్ర (వైఎస్ఆర్ సీపీ), రాటకొండ విశ్వనాథ్ (బీజేవైఎం) చిన్నం పెంచలయ్య (సీపీఐ)తో పాటు పలువురు నాయకులు బైఠాయించారు. ఐద్వా మద్దతు తిరుపతి కల్చరల్: న్యాయం కోసం భర్త ఇంటి ముందు మౌనదీక్ష చేపడుతున్న వీణకు ఐద్వా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. వీణను కాపురానికి నిరాకరించడంపై ఆమె భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.