worked
-
చంద్రయాన్-3 ఆ విజయం వెనక మేధస్సు వీరిదే
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమయింది. భారత అంతరిక్ష యానంలో ఎన్నో ఎళ్ల కళ సాకారం అయింది. అయితే.. ఈ మహత్తర కార్యం వెనుక దాదాపు 1000 మంది ఇంజినీర్ల కృషి ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. వీళ్లనే మూన్ స్టార్లుగా పిలుస్తున్నారు. ఇందులో ప్రధానమైనవారు.. ఎస్. సోమనాథ్, (ఇస్రో ఛైర్మన్) ఎస్. సోమనాథ్ ఎయిరో స్పేస్ ఇంజినీర్. చంద్రయాన్ 3ని జాబిల్లి కక్షలో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడిన బాహుబలి రాకెట్‌ని రూపొందించడంలో సహకరించారు. రాకెట్లోకి చేర్చే ముందు చంద్రయాన్ 3ని పూర్తిగా పరీక్షించే బాధ్యతలను ఆయన చూసుకున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు పూర్వ విద్యార్థి. సంస్కృత భాషను అనర్గళంగా మాట్లాడగలరు. ఈయన పేరులోని సోమనాథ్(చంద్రునికి ప్రభువు) అర్థం ఉంది. ఇస్రోలో ఎంతో సమర్థవంతమైన నాయకునిగా పనిచేస్తున్నారు. ఉన్నికృష్ణన్ నాయర్,(విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్) రాకెట్ పరిశోధనల్లో మరో కీలక శాస్త్రవేత్త . అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న ఏరోస్పేస్ ఇంజనీర్. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పూర్వ విద్యార్థి. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌కు మొదటి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గగన్‌యాన్ ప్రోగ్రామ్ కోసం అనేక క్లిష్టమైన మిషన్లకు నాయకత్వం వహించారు. లాంచ్ వెహికల్ మార్క్ 3 ఈయన నాయకత్వంలోనే విజయవంతమైంది. వీరముత్తువేల్:(చంద్రయాన్ 3 డైరెక్టర్) ప్రముఖ శాస్త్రవేత్త వీరముత్తువేల్.. చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుకు తన మేధస్సును అందిస్తున్నారు. ఈయన చెన్నై నుంచి మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీలో పట్టా పొందారు. చంద్రయాన్-2, మంగళయాన్ మిషన్లలో కూడా ఆయన పాల్గొన్నారు. కే. కల్పన(చంద్రయాన్ 3 డిప్యూటీ డైరెక్టర్) మరో ప్రముఖ ఇంజినీర్ కే. కల్పన. కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలోనూ చంద్రయాన్-3 ప్రాజెక్టు కోసం దీక్షగా తన బృందంతో కలిసి పనిచేశారు. మన దేశానికి ఉపగ్రహాల తయారీలో తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె చంద్రయాన్-2, మంగళయాన్ మిషన్లలో కూడా పాల్గొన్నారు. ఎం. వనిత(యూఆర్ రావు సాటిలైట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్)బెంగళూరు ప్రముఖ ఇంజినీర్ ఎం. వనిత చంద్రయాన్-2 మిషన్‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన ఆమె.. జాబిల్లిపై చేసిన ప్రయోగానికి నాయకత్వం వహించిన భారత మొదటి మహిళ. చంద్రయాన్-2పై ఆమెకున్న జ్ఞానాన్ని చంద్రయాన్ 3 కోసం శాస్త్రవేత్తల బృందం సరిగా వినియోగించుకుంది. ఆమెకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఎమ్ శంకరన్:(యూఆర్ రావు సాటిలైట్ సెంటర్ డైరెక్టర్) బెంగళూరు ఎమ్ శంకరన్ ISRO పవర్‌హౌస్‌గా ఖ్యాతిగాంచారు. ఎందుకంటే కొత్త పవర్ సిస్టమ్‌లు, పవర్ శాటిలైట్లకు సౌర శ్రేణులను తయారు చేయడంలో ఈయనకి మంచి నైపుణ్యం ఉంది. ఉపగ్రహాల తయారీలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన.. చంద్రయాన్-1, మంగళయాన్, చంద్రయాన్-2ల్లో కూడా పనిచేశారు. చంద్రయాన్-3లో ఉపగ్రహం తగినంత వేడి, చల్లగా ఉండేలా చూసుకోవడం ఈయన పని. ల్యాండర్ బలాన్ని రూపొందించడంలో ఆయన సహాయం చేశారు. ఈయన భౌతికశాస్త్రంలో మాస్టర్ పట్టా పొందారు. వీ నారాయణన్.. (లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్ డైరెక్టర్, తిరువనంతపురం) లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్లను తయారు చేయడంలో నిపుణుడు. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడానికి అవసరమైన థ్రస్టర్లను ఈయన నాయకత్వంలో అభివృద్ధి చేశారు. ఖరగ్‌పూర్ IIT పూర్వ విద్యార్థి. క్రయోజెనిక్ ఇంజిన్లను తయారు చేయడంలో కూడా ఆయన నిపుణుడు. చంద్రయాన్-3ని ప్రయోగించిన లాంచ్ వెహికల్ మార్క్ 3తో సహా ఇస్రో తయారు చేసిన చాలా రాకెట్లలో ఈయన మేధస్సు ఉపయోగపడింది. ఇదీ చదవండి: Chandrayaan-3 Moon Landing Updates:షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ ప్రక్రియ -
'కార్గిల్‌లో పోరాడినా.. భార్యను కాపాడలేకపోయా' మణిపూర్ బాధితుని ఆవేదన
ఇంఫాల్: మణిపూర్ ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతి చెందింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం పంటపొలాల్లోకి లాక్కెళ్లి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుత్తాయి. ఈ ఘటనపై స్పందించిన బాధిత యువతి.. తమను పోలీసులు అల్లరి మూకకు వదిలేసినట్లుగా ఆరోపించింది. పోలీసులు రక్షణ కల్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. అటు.. బాధిత మహిళ భర్త ఆర్మీలో పనిచేసినట్లు తెలుస్తోంది. సైనికుడిగా కార్గిల్ యుద్ధంలో పోరాడిన తమకు ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆయన మనోవేదనకు గురయ్యారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాధితులు విస్తుపోయే విషయాలను వెల్లడించారు. అల్లరి మూక జంతువుల్లా ఆయుధాలతో తమపై ఎగబడ్డారని చెప్పారు. కార్గిల్‌లో పోరాడి దేశాన్ని రక్షించినప్పటికీ దేశంలోపల తన భార్యను కాపాడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి? పోలీసుల నుంచి లాక్కెళ్లి.. వర్గాల మధ్య పోరులో ఓ గ్రామంపై అల్లరి మూకలు ఎగబడ్డాయి. ఈ క్రమంలో తప్పించుకుంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలపై ఆందోళనకారులు అమానవీయంగా ప్రవర్తించారు. బాధితుల్లో 50 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు (19), కుమార్తె (21) కాగా.. మరో ఇద్దరు మహిళలు(52, 42) ఉన్నారు. వీరు సమీప పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులను ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దాదాపు 800 నుంచి 1000 మందితో ఉన్న ఓ భారీ గుంపు వీరిని పోలీసుల నుంచి లాగి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధిత గ్రూప్‌లోని 19 ఏళ్ల యువకుడు తన సోదరి (21)ని రక్షించేందుకు ప్రయత్నించగా.. సాయుధ మూకల దాడిలో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై స్పందించిన బాధిత యువతి తమను పోలీసులు రోడ్డుపైనే వదిలేశారని వాపోయింది. ఇదీ చదవండి: మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటిని తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు సామూహిక అత్యాచారం ఘటనలో 21 ఏళ్ల యువతితోపాటు మరో మహిళను నగ్నంగా వీధుల్లో ఊరేగించడమే కాకుండా సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. సాయం కోసం వాళ్లు కేకలు పెడుతుంటే..కొందరు యువకులు మాత్రం అమ్మాయిల శరీర భాగాలను చేతులతో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. అయితే అందులో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మే 18నే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జులై 19న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రాగా.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘోర ఘటనకు సంబంధించి ఇప్పటికే తౌబల్ జిల్లాకు చెందిన హెరాదాస్ (32) అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: Manipur Violence.. మహిళపై అఘాయిత్య ఘటన.. అసలు ఆరోజు జరిగింది ఇదేనా! -
బాధితులకు సృజనాత్మక సహాయం!
మనసుంటే మార్గం దొరుకుతుందంటారు. తమిళనాడులో వర్షం, వరద బాధితులను జనం ఆదుకుంటున్న తీరు చూస్తే సరిగ్గా అదే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతి త్వరగా బాధితులను ఎలా ఆదుకోవచ్చన్న విషయాన్ని ఆలోచించి ఆ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. కొందరు డబ్బు, ఆహారం వంటివి అందిస్తుంటే...మరి కొందరు ఉడతాభక్తిగా తమ సృజనను ఉపయోగించి, స్వచ్ఛందంగా సహాయపడుతున్నారు. వరద ముప్పు నుంచి బాధితులను ఒడ్డున పడేయడమే కాక... సౌకర్యాలను కల్పించి ఆదుకుంటున్నారు. ఇళ్ళలోసైతం నీరు చేరిన పరిస్థితుల్లో వారిని బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం, ఇతర సంస్థలు పడవలను అందుబాటులోకి తెచ్చినా... అవి లేని ప్రాంతాల్లో స్థానికంగా, సులభంగా దొరికే డ్రమ్ములు, వెదురు కర్రలను వినియోగించి కొందరు సాయపడుతున్నారు. ఇళ్లు కూలి ఇబ్బంది పడుతున్నవారిని ఆదుకోడానికి వారికి వెదురుతో గుడిసెలు కట్టి పునరావాసం కల్పిస్తున్నారు. గూడు కోల్పోయి రోడ్డున పడ్డవారికి 'సేలం సిటిజెన్స్ ఫోరమ్' ఈ వెదురు ఇళ్లను అందుబాటులోకి తెస్తోంది. 96 చదరపు అడుగుల వైశాల్యం, సోలార్ లైట్లతో నిర్మించే ఈ ఇంట్లో నలుగురు నివాసం ఉండొచ్చు. అలాగే కరెంటు అందుబాటులో లేని ప్రదేశాల్లో.. ఛార్జింగ్ చేసుకునే అవకాశం లేక మొబైల్ ఫోన్లు మూగబోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా ఛార్జింగ్ చేసేందుకు కొందరు తమ సృజనను వినియోగిస్తున్నారు. సిల్వర్ నాణేలు, బ్యాటరీలు అందుబాటులోకి తెచ్చి మొబైల్ ఛార్జింగ్ చేస్తున్నారు. అలాగే చీకట్లో దీపాలుగా కొవ్వొత్తులకు బదులు క్రేయాన్స్ స్టిక్స్ ను అందిస్తున్నారు. ఇవి కనీసం ఇరవై నిమిషాలపాటు నిలకడగా వెలగడంతో బాధితులకు తక్షణ అవసరం తీరుతోంది. మరోవైపు వరద కారణంగా ఎటువంటి ఇన్ఫెక్షన్లు, జ్వరాలు రాకుండా ముందుజాగ్రత్తగా ఔషధ మూలికలు, ఆకులతో తయారుచేసిన సిద్ధ వైద్యానికి సంబంధించిన నీలవెంబు కషాయాన్నిబాధితులకు ఉచితంగా అందిస్తున్నారు. ఇక బ్యాంకుల్లో బ్యాలెన్సులున్నా డబ్బు తీసుకునేందుకు ఏటీఎంలు పనిచేయక ఇబ్బందులు పడుతున్న వారి కోసం కొన్ని బ్యాంకులు మొబైల్ ఏటీఎంలను ఏర్పాటుచేశాయి. ఇవి అన్ని ప్రాంతాల్లోనూ తిరుగుతూ అవసరానికి డబ్బును అందిస్తున్నాయి. -
దండుకో...
కొలువుల భర్తీలో అవినీతి జాతర అక్రమాలకు తెరలేపిన జలమండలి అధికారులు బోగస్ పత్రాలతో రెచ్చిపోతున్న అభ్యర్థులు మరోవైపు దళారుల ప్రవేశం ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల చొప్పున వసూలు 80 పోస్టులకు చేతులు మారనున్న రూ.4 కోట్లు! సాక్షాత్తు సీఎం చైర్మన్‌గా ఉన్నా ఆగని అవినీతి దందా సాక్షి, సిటీబ్యూరో: జలమండలి పోస్టుల భర్తీ ప్రక్రియ అవినీతి పుట్టగా మారింది. పోస్టులు చిన్నవే అయినా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మెట్రో వాటర్ బోర్డులోనే భారీ అవినీతికి తెరలేసింది. 80 పోస్టులకు గాను వేలాది మంది దరఖాస్తు చేసుకోగా కొందరు దొడ్డిదారిన ఉద్యోగాన్ని సంపాదించే పనిలో పడ్డారు. అనుభవం ఉన్నట్టు బోగస్ ధ్రువపత్రాలను సమర్పించారు. బోగస్ ధ్రువపత్రాలు జారీ చేసింది బోర్డు అధికారులే కావడం గమనార్హం. ఇదిలావుంటే దళారులు సైతం రంగ ప్రవేశం చేశారు. ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. ఈ లెక్కన రూ.4 కోట్ల మేర చేతులు మారినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడిన తరవాత నగరంలో జరుగుతోన్న తొలి భర్తీ ప్రక్రియలో అవినీతి చోటుచేసుకోవడం నిరుద్యోగులను విస్మయానికి గురిచేస్తోంది. విజిలెన్స్ విచారణతో అక్రమార్కుల నిగ్గు తేల్చాలని కార్మిక సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. జలమండలిలో జనరల్ పర్పస్ ఎంప్లాయ్ (వాటర్ సప్లై అండ్ సీవరేజీ) పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. సుమారు 658 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే వాటర్ బోర్డులో ఎన్ఎంఆర్, హెచ్ఆర్ కార్మికులుగా పనిచేస్తున్న సుమారు 578 మంది సర్వీసులను క్రమబద్ధీకరించనున్నారు. అయితే మిగిలిన 80 పోస్టులకు గాను నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 80 పోస్టులకు గాను సుమారు 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు టెన్త్, బీసీ, జనరల్ అభ్యర్థులకు ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా సుమారు 2,500 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. వీరికి ఇటీవల క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించారు. కాగా భర్తీ ప్రక్రియలో అనుభవం ఉన్నవారికి వెయిటేజీ ప్రకటించడంతో వందలాది మంది అభ్యర్థులు అనుభవం ఉన్నట్టు బోగస్ పత్రాలు సమర్పించారు. బోర్డులో పనిచేసే క్షేత్రస్థాయి అధికారుల నుంచి తీసుకున్న ఈ పత్రాలను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించినట్టు ఇటీవల ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. సదరు అనుభవ ధ్రువీకరణ పత్రం సరైనదేనా కాదా? అని తేల్చే అంశం ఉన్నతాధికారులకు తలకుమించిన భారంగా మారింది. భర్తీ ప్రక్రియ సమయంలో బోగస్ పత్రాలను గుర్తించడం కష్టమనే విషయాన్ని అధికారులు చెబుతుండడంతో మిగతా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో పోస్టుకు రూ.5 లక్షలు వసూలు? బయటి వ్యక్తుల ద్వారా 80 పోస్టులను భర్తీ చేయాల్సి రావడంతో దళారులు రంగంలోకి దిగారు. నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఈ లెక్కన సుమారు రూ.4 కోట్ల వరకు చేతులు మారే అవకాశం ఉంది. ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఈ దందా కొనసాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు యూనియన్ నేతలు సైతం తమ పలుకుబడిని, అధికారాన్ని ఉపయోగించుకొని ఈ వ్యవహారంలో తలదూర్చి చేతివాటాన్ని ప్రద ర్శిస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నీటి సరఫరా పోస్టుకే మొగ్గు.. ఇందులో జీపీఈ(నీటి సరఫరా)పోస్టు వైపే పలువురు అభ్యర్థులు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. పైసంపాదన అధికం.. శ్రమ తక్కువగా ఉండడం వల్లే పలువురు అభ్యర్థులు ఈ పోస్టు దక్కించుకునేందుకు ఖర్చుకు వెనుకాడడం లేదని తెలుస్తోంది. ఇక జీపీఈ(సీవరేజి) కి సంబంధించిన పోస్టులు 30 వరకు ఉన్నాయి. మ్యాన్‌హోళ్లలోకి దిగి మురుగును తొలగించా ల్సి ఉంటుంది. ఇలాంటి పనులు చేపట్టాల్సి ఉన్నందున సీవరేజి పోస్టులోకి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. విజిలెన్స్ విచారణకు డిమాండ్.. భర్తీ ప్రక్రియలో భాగంగా కొందరు అభ్యర్థులు బోగస్ అనుభవ పత్రాలు సమర్పించినట్టు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరపాలని పలు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోస్టుల నియామకంలో పారదర్శకత కరువైందని, బయటి అభ్యర్థులు సమర్పించిన విద్యార్హత, అనుభవ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే పోస్టింగ్‌లు ఇవ్వాలన్నారు. బోగస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 200 మంది బోగస్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు ప్రాథమికంగా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈనెలాఖరులోగా భర్తీ ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో బోగస్ వ్యవహారాన్ని బోర్డు యాజమాన్యం సీరియస్‌గా తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
జలసిరి ఆవిరి
మండే ఎండలకు త గ్గిపోతున్న నీటినిల్వలు తీవ్ర మవుతున్న పానీపరేషాన్ శివార్లకు తప్పని క‘న్నీటి’ కష్టాలు జూలై చివరి వరకు ఢోకా లేదంటున్న జలమండలి సాక్షి, సిటీబ్యూరో : మండుటెండలకు గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జలాశయాలు ఆవిరవుతున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు నిత్యం 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో ఆయా జలాశయాల్లో ఆవిరయ్యే నీటి శాతం ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి ఐదు నుంచి పది శాతానికి క్రమంగా పెరుగుతోందని జలమండలి వర్గాలు అంచనా వేస్తున్నాయి. భ విష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జలమండలి పొదుపు మంత్రం పాటిస్తూ.. అరకొరగా మంచినీటిని సరఫరా చేస్తుండటంతో శివార్లలోని పలు ప్రాంతాలకు వారం పదిరోజులకోమారు సరఫరా అందుతోంది. ఇప్పటికిప్పుడు నగరంలో తాగునీటికి ఇబ్బంది లేకపోయినా ఎండ ల తీవ్రత, కరెంటు కోతలు పెరిగితే పానీపరేషాన్ మరింత పెరగక తప్పదన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాల్లో నీటినిల్వలు శరవేగంగా పడిపోతున్నాయని జలమండలి తాజా నివేదిక వెల్లడించింది. వివిధ జలాశయాల్లో పడిపోతున్న నీటి మట్టాలు గతేడాదితో పోలిస్తే అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఇవీ క‘న్నీటి’ కష్టాలు గ్రేటర్ పరిధిలో జలమండలి మంచినీటి సరఫరా 180 మిలియన్ గ్యాలన్లకు మించడం లేదు. ఈ నీటినే మహానగరం పరిధిలోని 8 లక్షల కుళాయిలకు సరిపెడుతున్నారు. సుమా రు 4 లక్షల కుళాయిలకు రెండురోజులకోమారు అరకొరగా నీళ్లందుతున్నా.. మరో నాలుగు లక్షల కుళాయిలకు వారం, పదిరోజులకోమారు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. అదీ పట్టుమని పది బిందెల నీళ్లు పట్టుకోకముందే కుళాయి ఆగిపోతోంది. దీంతో శివారు జనానికి పానీపరేషాన్ తీవ్రమౌతోంది. ట్యాంకర్ నీళ్లు, ఫిల్టర్ ప్లాంట్లను ఆశ్రయించక తప్పని దుస్థితి తలెత్తింది. పదకొండు శివారు మున్సిపాల్టీల పరిధిలోని 870 కాలనీలు, బస్తీలకు కన్నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. జూలై చివరి వరకు భయం లేదు.. ప్రస్తుతం ఆయా జలాశయాల్లో ఆవిరయ్యే నీటి శాతం సాధారణంగా నిత్యం ఐదు శాతం మేర... ఎండ తీవ్రత పెరిగిన రోజుల్లో పదిశాతానికి పెరుగుతోందని జలమండలి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు జూలై చివరి నాటి వరకు నగర అవసరాలకు సరిపోతాయని భరోసా ఇస్తున్నాయి. అప్పటివరకు వర్షాలు కురవని పక్షంలో నీటి కష్టాలు మరింత పెరగడం తథ్యమని స్పష్టం చేస్తున్నాయి. రుతుపవనాలు కరుణించి సకాలంలో వర్షాలు కురిస్తే జలాశయాల్లో నీటి మట్టాలు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాయి.