కార్మిక దినోత్సవాలు ఎన్ని వచ్చినా మారని బతుకు..
ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న నినాదం విన సొంపుగా ఉన్నా... ఆచరణలో సాధ్యం కావడం లేదు. కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమంటూ దశాబ్దాలుగా చెబుతున్న పాలకుల్లో చిత్తశుద్ధి లోపించింది. దీంతో కార్మిక చట్టాలు కాస్తా అభాసుపాలవుతున్నాయి.
ప్రభుత్వాలు ఎన్ని మారినా... ఏ రోజుకారోజు కష్టపడందే పూట గడవని బతుకులు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని వాడవాడలా ఘనంగా జరుపుకుంటున్నా... బతుకుబండిని లాగాలంటే శ్రమదోపిడీ తప్పడం లేదు. బెంగళూరులోని కేఆర్ మార్కెట్ వద్ద కాయగూరలను శుక్రవారం బండిలో తరలిస్తున్న కార్మికుడు. - బెంగళూరు