World Class
-
వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్‌గా ‘తిరుపతి’.. డిజైన్లు విడుదల రైల్వే శాఖ మంత్రి
సాక్షి, తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్‌కు త్వరలో మహర్దశ పట్టనుంది. కాంట్రాక్టులన్ని పూర్తి చేశామని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఆయన డిజైన్లు కూడా విడుదల చేశారు. దేశంలోనే ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లుగా తొలిదశలో అభివృద్ధి చేస్తున్న 14 రైల్వే స్టేషన్లలో తిరుపతి ఒకటి. చదవండి: టీటీడీ కీలక నిర్ణయం.. కచ్చితంగా ఆ రూల్స్ పాటించాల్సిందే.. ఈ 14 రైల్వే స్టేషన్లను 5 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఇక ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు అధికంగా రైల్వే ద్వారానే వస్తుంటారు. వేలాది భక్తులతో తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు రావడంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. -
AP: పేదల ఇళ్లు చల్లగా.. నిర్మాణాల్లో ప్రపంచశ్రేణి సాంకేతికత
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణాల్లో ప్రపంచశ్రేణి సాంకేతికతను వినియోగించడం ద్వారా గాలి, వెలుతురు బాగా వచ్చేలా.. ఇళ్లలో శీతలీకరణ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విద్యుత్ బిల్లులను ఆదా చేసే ఈ సాంకేతికతను ‘ఎకో–నివాస్ సంహిత’ పేరిట అమలు చేయాలని నిర్ణయించింది. గృహ నిర్మాణ శాఖ ద్వారా చేపడుతున్న 28.3 లక్షల ఇళ్లలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఆధ్వర్యంలో లబ్ధిదారుల అంగీకారంతో దీనిని అమలు చేస్తారు. ఇంధన సామర్థ్య బిల్డింగ్ డిజైన్ల ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించే విధంగా ఇళ్ల నిర్మాణాలు జరుపుతారు. ప్రజాహితం.. పర్యావరణ పరిరక్షణ దేశంలో మొత్తం విద్యుత్ వినియోగంలో భవనాల వాటా 38 శాతం కాగా.. 20 ఏళ్ల నుంచి ఇప్పటివరకు ఈ రంగంలో విద్యుత్ వినియోగం మూడు రెట్లు కంటే ఎక్కువగా పెరిగింది. భవిష్యత్‌లో ఇది మరింత పెరగనుంది. ఎకో నివాస్ పథకం ద్వారా ప్రపంచ శ్రేణి ‘ఇండో స్విస్ ఎనర్జీ ఎఫిషియంట్ బిల్డింగ్ టెక్నాలజీ’ని అమలు చేస్తారు. దీనివల్ల శీతలీకరణ జరిగి ఇళ్లలో ఉష్ణోగ్రతలు కనీసం 2 డిగ్రీల వరకు తగ్గుతాయి. ఈ టెక్నాలజీ వల్ల సహజ వెలుతురు పెరగడంతో పాటు 20 శాతం విద్యుత్ బిల్లులు కూడా ఆదా అవుతాయి. గ్రీన్హౌస్ వాయువులు (కర్బన ఉద్గారాలు) కూడా తగ్గుతాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, భవిష్యత్‌లో ఇంధన డిమాండ్‌ను అరికట్టడానికి, ఇంధన పొదుపు చేయడానికి ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ భవనాల్లోనూ.. వెయ్యి చదరపు మీటర్ల ప్లాట్ లేదా 2 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో గల కమర్షియల్, నాన్ రెసిడెన్షియల్ భవనాల నిర్మాణ అనుమతులు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఏపీ ఈసీబీసీ)ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణంలోనూ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. మొదటి దశలో రూ.28 వేల కోట్ల అంచనా వ్యయంతో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే 10,055 లేఅవుట్లలో 10.7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వీటన్నిటితో పాటు మొత్తం 28.3 లక్షల ఇళ్లలోనూ ఈసీబీసీని అమలు చేయనుంది. ‘ఎకో–నివాస్’ ఇలా.. ►పగటిపూట సహజ సిద్ధ వెలుతురు (సూర్యరశ్మి) ఇంటిలోకి వచ్చే విధంగా డిజైన్ ఉంటుంది. ►రేడియంట్ కూలింగ్ విధానం ద్వారా ఇంట్లో ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉండేలా సీలింగ్, గోడలకు ప్రత్యేక ఫోమ్‌ని, పెయింట్స్ వినియోగిస్తారు. ►ఫ్లోర్పైనా ఇంటిని చల్లబరిచే ప్రత్యేక టైల్స్ అమర్చుతారు. హార్డ్ ఉడ్‌ను ఎక్కువగా వినియోగిస్తారు. ►కిటికీలకు అమర్చే అద్దాలు కూడా ప్రత్యేకంగా రూపొందించినవే ఉంటాయి. ►అత్యంత మన్నిక కలిగిన ఇన్సులేటెడ్ తలుపులను అమర్చుతారు. ఇవి ఫైబర్ గ్లాస్‌తో తయారైనప్పటికీ కలపతో చేసినవిగానే కనిపిస్తాయి. ►వాటర్ పైపులు కూడా ప్రత్యేకమైనవే ఉంటాయి. ఇవి వేడి నీటిని త్వరగా చల్లారనివ్వవు. ►ఇంటి ఆవరణలో మొక్కలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తారు. ఇంటి లోపల విద్యుత్‌ను ఆదా చేసే ఎల్ఈడీ బల్బులు, ట్యూబులైట్లు, ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యాన్లు అమర్చుతారు. ►వంట గది, బాత్రూమ్, టాయిలెట్.. ఇలా ప్రతి నిర్మాణంలోనూ ఇంధన ఆదాను దృష్టిలో ఉంచుకుంటారు. -
రాజధానిలో 'వరల్డ్ స్టేషనరీ ఎక్స్ పో'..!
న్యూఢిల్లీః పాఠశాల విద్యార్థులకు, కార్యాలయాలకు కావలసిన పరికరాలు, నోట్ బుక్ లు, డైరీలు మొదలైన ఉత్పత్తులతో కూడిన ప్రపంచ స్టేషనరీ ఎక్స్ పో దేశ రాజధాని నగరంలో ప్రారంభం కానుంది. జూలై 29న ప్రారంభమయ్యే అతిపెద్ద ఎక్స్ పో మూడురోజులపాటు కొనసాగనుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ ప్రగతి మైదానంలో ప్రపంచ స్టేషనరీ ఎక్స్ పో శుక్రవారం ప్రారంభం కానుంది. సుమారు 7000 నుంచి 8000 వరకూ స్టేషనరీ ఉత్పత్తులే లక్ష్యంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. మెక్స్ ఎగ్జిబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రత్యేక ప్రదర్శనను నిర్వహిస్తుంది. జూలై 29న ప్రారంభమై మూడు రోజుల పాటు అంటే 31వ తేదీ వరకూ జరిగే ఈ స్టేషనరీ ఫెయిర్ లో ప్రపంచవ్యాప్తంగా దొరికే వివిధ రకాల స్టేషనరీ ఉత్పత్తులు ఒకేచోట లభ్యమయ్యేట్లుగా.. వన్ స్టాప్ హబ్ ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఈ స్టేషనరీ ఎక్స్ పో లో వారి వారి బడ్జెట్ ను బట్టి చిన్న, మధ్య తరహా, భారీ కార్యాలయాలు, సంస్థలు, విద్యా సంస్థలు, మొదలైన అన్ని తరహాల వారికి అందుబాటులో ఉండేట్లుగా స్టేషనరీ ఉత్పత్తులను ఇక్కడ ఉంచనున్నారు. వినియోగదారులు ముఖ్యంగా ఆఫీసు, సంస్థలకు అవసరమైన పరికరాలను, ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఈ భారీ ఎక్స్ పో ప్రధాన కేంద్రంగా చెప్పొచ్చు. పెన్నులు, పెన్నిళ్ళు, కాగితాలు వంటి కార్యాలయాలు, విద్యాసంస్థలకు సంబంధించిన ఉత్పత్తులతోపాటు, పదిరూపాయలు మొదలుకొని వంద రూపాయల వరకూ అన్ని పరిథుల్లోనూ వస్తువులు అందుబాటులో ఉంటాయని మెక్స్ ఎక్స్ పో ఎగ్జిబిషన్ డైరెక్టర్ హిమానీ గులాటీ తెలిపారు. దీంతోపాటు గిఫ్ట్ ఎక్స్ పో, ఆఫీస్ ఎక్స్ పో పేరున మరో రెండు ప్రదర్శనలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో కూడిన సుమారు 150 కంపెనీల వస్తువులు ఈ ప్రత్యేక వేదికలో లభ్యమౌతాయని గులాటీ తెలిపారు. -
ప్రగతి పట్టాలెక్కేనా?
రైల్వే బడ్జెట్లో వరాలపై తిరునగరి వాసుల ఆసక్తి {పభూ, గుప్తా కరుణిస్తేనే పెండింగ్ {పాజెక్టులకు మోక్షం కలగామారిన వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్ తిరుపతికి ఏటా రైల్వే బడ్టెట్‌లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. దేశం నలుమూలల నుంచి రోజూ వేలాదిగా వచ్చే భక్తుల కోసం వరల్డ్‌క్లాస్ స్టేషన్‌ను నిర్మిస్తామని దాదాపు దశాబ్దకాలంగా కేంద్రం చెబుతూనే ఉంది. కానీ వాస్తవ పరిస్థితిలో ఏ మాత్రం కానరావడం లేదు. ఇటీవల రైల్వే మంత్రి, జీఎం వేర్వేరుగా తిరునగరికి వచ్చిన సందర్భంగా స్థానిక ఎంపీ వారికి ప్రత్యేక నివేదికను అందించారు. తాజాగా విజయవాడ సమావేశంలోనూ తన డిమాండ్లను తెలియజేశారు. ఇందులో యాభైశాతం ఆమోదించినా.. న్యాయం జరిగినట్టేనని భావిస్తున్నారు. ఎంపీ ఇచ్చిన నివేదికలోని అంశాలపై ప్రత్యేక కథనం.. తిరుపతి అర్బన్: దక్షిణమధ్య రైల్వేలోనే ఎక్కువ ఆదా యం వచ్చే మొదటి మూడు స్టేషన్లలో ఒకటైన తిరుపతికి ఈ రైల్వే బడ్టెట్లోనైనా న్యాయం చేయాలని ప్రజలు, రైల్వే కార్మికులు కోరుతున్నారు. ఇక్కడి ప్రధాన సమస్యల గురించి ప్రతిసారీ ఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖతో సహా ఆ శాఖ ఉన్నతాధికారులకు, సికింద్రాబాద్‌లోని జీఎంలకు ఎన్నోసార్లు నివేదిం చా రు. అయినా ఫలితం మాత్రం కనిపించ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏర్పాటు చేసిన రైల్వే బడ్జెట్ ప్రతిపాదనల సమావేశంలో ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ ప్రత్యేక నివేదికను అందించారు. తిరుపతి ఎంపీ ప్రతిపాదనలివీ... రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా తక్షణం రైల్వే డివిజన్ ఏర్పాటు కు చర్యలు చేపట్టాలి. తిరుపతి పరిధిలోని రేణిగుంట సీఆర్ఎస్ లో కేవలం రైలు బోగీల మరమ్మతులు కాకుండా బోగీల తయారీ దిశగా నిధులు, విస్తరణ అభివృద్ధి పనులు చేపట్టాలి.అంతర్జాతీయ హోదాస్థాయికి రైల్వేలోని అన్ని విభాగాలను అభివృద్ధి చేసేందుకు నిధులు పుష్కలంగా విడుదల చేయాలి.తిరుపతి దక్షిణం వైపు రైల్వే ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి మరిన్ని ప్లాట్‌ఫాంలు, ప్రయాణికుల వసతి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. తిరుపతి, నడికుడి రైల్వేలైన్ పూర్తికోసం సమృద్ధిగా నిధులు మంజూరు చేయాలి. }M>-âహస్తిలో అన్ని ప్రధాన రైళ్లకు స్టాపింగ్ సౌకర్యం కల్పించాలి. తిరుపతి నగరంతో పాటు వెంకటగిరి, గూడూరు సమీపంలో జరుగుతున్న కొన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తికి, అవసరమైన చోట కొత్త ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు ఇవ్వాలి.తిరుపతి, చిత్తూరు నుంచి విజయవాడ వరకు మరిన్ని కొత్త రైళ్ల ఏర్పాటుకు చర్య లు చేపట్టాలి. సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి వరకు పొడిగించి నడపాలి. రాష్ట్రంలోని పోర్టులకు అనుసంధానంగా రైల్వే ప్రాజెక్ట్‌లు అభివృద్ధి చేయాలి. జిల్లా పరిధిలోని మరికొన్ని రైల్వే సమస్యలు నిత్యం వేలాదిగా తాకిడి ఉండే రైల్వే ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికుల కోసం స్టేషన్ పరిసరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలి. రైల్వేస్టేషన్లో ప్రయాణికులందరికీ ఆరోగ్యకరమైన తాగునీటి సరఫరాకు ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటు చేయాలి. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల మంది రైల్వే కార్మికులు, ఉద్యోగుల సౌకర్యార్థం తిరుపతిలో రైల్వే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు మోక్షం కల్పించాలి. రైల్వే కార్మికుల సౌకర్యార్థం రైల్వే స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. తిరుపతిలోని మెకానికల్, సేఫ్టీ, రైల్వే పోలీస్, ఎలక్ట్రికల్, కోచ్ డిపో విభాగం, శానిటరీ విభాగాల్లోని వందలాది ఖాళీలను భర్తీ చేయాలి. చిత్తూరు, పాకాల, మదనపల్లి, శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్లను మరింత అభివృద్ధి చేయాలి. తిరుపతిలో కార్మికులు, ఉద్యోగులకు అవసరమైన రైల్వే క్వార్టర్స్ నిర్మాణం దిశగా చర్యలు తీసుకోవాలి.చిత్తూరు జాతీయ రహదారిలోని అన్ని రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఈ సంవత్స రం అయినా ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు నిధులు కేటాయించాలి. తిరుపతితో పాటు రేణిగుంట, చంద్రగిరి, తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్లలోని ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసి అభివృద్ధిని వికేం ద్రీకరించి ప్రయాణికులకు సేవలు విస్తృ తం చేయాలి. వీటిలో ఎంత మేరకు ఆమోదిస్తారో వేచి చూడాల్సి ఉంది. ప్రతిపాదనలకే వరల్డ్‌క్లాస్ పరిమితం తిరుపతి రైల్వేకి ప్రపంచ స్థాయి అభివృద్ధి చేకూరుస్తామని 2008 నుంచి రైల్వే మంత్రులు ప్రకటిస్తూనే ఉన్నారు. ఆ అంశం కొన్నాళ్ల పాటు మరుగున పడినప్పటికీ... ఇటీవల నగరానికి వచ్చిన రైల్వే జీఎం రవీంద్రగుప్తా చేసిన ప్రకటనతో మరోసారి చర్చనీయాంశమైంది. విజయవాడలో దక్షిణమధ్య రైల్వే జీఎం ఆధ్వర్యంలో జరిగిన రైల్వే బడ్జెట్ ప్రతిపాదనల సమావేశంలో తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అందించిన ప్రతిపాదన నివేదికలకు రైల్వేశాఖ మోక్షం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. -
వరల్డ్క్లాస్కు రెడ్ సిగ్నల్
తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. నాలుగేళ్ల నుంచి ఊరిస్తూ వచ్చిన వరల్డ్‌క్లాస్ హోదాకు రెడ్‌సిగ్నల్ పడింది. ఇప్పుడు మోడ్రన్క్లాస్కే పరిమితమైంది. అయినా అభివృద్ధి పనులు నత్తనడకన సాగడం విమర్శలకు తావిస్తోంది. తిరుపతి అర్బన్: స్థానిక రైల్వేస్టేషన్ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే వరల్డ్‌క్లాస్ హోదాకు రెడ్‌సిగ్నల్ పడింది. మోడ్రన్ క్లాస్ పనులూ సజావుగా సాగకపోవడం ప్రయాణికులను అసంతృప్తికి గురిచేస్తోంది. వరల్డ్‌క్లాస్ హోదా ఎందుకు పోయిందంటే! తిరుపతి రైల్వేస్టేషన్‌ను వరల్డ్‌క్లాస్‌గా అభివృద్ధి చేయాలని రైల్వేకి చెందిన కమిటీలు భావించాయి. రెండేళ్ల క్రితం తిరుపతి రైల్వే స్టేషన్‌కు చుట్టుపక్కల 20 కి.మీల వరకు ఉన్న అన్ని స్టేషన్లలో స్థలాలను పరిశీలించాయి. తిరుపతికి అతి దగ్గరలోని వెస్ట్ రైల్వేస్టేషన్లో అందుబాటులో ఉన్న 52 ఎకరాల రైల్వే స్థలంతో పాటు ఎస్వీయూ, మహిళా యూనివర్సిటీలకు చెంది న మరో 40 ఎకరాల స్థలాలను రైల్వేకి అప్పగిస్తే తాము పనుల ప్రారంభానికి సిద్ధమని అప్పటి రైల్వే బోర్డు అధికారులు ప్రకటించారు. అయితే తిరుపతి రైల్వేస్టేషన్ పరిసరాల్లోని హోటల్ నిర్వాహకులు కొందరు తమ వ్యాపారాలు దెబ్బతింటాయని భావించి ఎంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. వెస్ట్‌లో వరల్డ్‌క్లాస్ పనులు జరగనీయకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ క్లాస్ హోదా దాదాపు కనుమరుగైంది. నత్తనడకన మోడ్రన్క్లాస్ పనులు రైల్వేబోర్డు అధికారులు తిరుపతి రైల్వేస్టేష న్ను మోడ్రన్క్లాస్గా తీర్చిదిద్దతామని హామీ ఇచ్చారు. ఆమేరకు నిధులు మంజూరయ్యేలా చూస్తామని పాలకులూ చెప్పారు. నిధుల మాట ఏమోగానీ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ పనులు చేపట్టలేదు. 60 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల గోడలకే సోకులు అద్దే కార్యక్రమాన్ని చేపట్టారు. సమస్యల కూత తిరుపతి రైల్వేస్టేషన్ సమస్యలకు నిలయమైం ది. వెయిటింగ్ హాళ్లు, మరుగుదొడ్లు లేవు. స్టేషన్లో ఎలుకల బెడద ఎక్కువ. స్టేషన్ వెలుపల వాహనాల పార్కింగ్ స్థలం లేదు. ట్రాఫిక్ సమస్యల విలయతాండవం చేస్తోంది. వరల్డ్ క్లాస్ వచ్చి ఉంటే.. బహుళ అంతస్తుల మల్టీప్లెక్స్ కాంప్లెక్స్‌లు వస్తాయి. ప్రయాణికుల్లోని అన్ని వర్గాలకు అనువుగా హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, అన్ని విధాలా సౌకర్యాలతో కూడిన వాణిజ్య సముదాయాలు ఏర్పాటవుతాయి. డివిజన్ కేంద్రం ఏర్పాటవుతుంది. జిల్లాలోని నిరుద్యోగ యువతలో సుమారు 30 వేల మందికి ప్రత్యక్ష, మరో లక్ష మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులందరికీ సౌకర్యంగా రెస్ట్రూమ్లు, ప్రయాణికులకు పూర్తి స్థాయిలో వెయిటింగ్ హాళ్లు, అవసరమైన ప్రతి చోటా మరుగు దొడ్లు, స్నానపు గదులు అందుబాటులోకి వస్తాయి. పార్కింగ్ సమస్యకు ఫుల్స్టాప్ పడుతుంది. మోడ్రన్ క్లాస్‌తో ప్లాట్‌ఫారాలపై దశాబ్దాల క్రితం వేసిన టైల్స్‌ని తొలగించి అధునాతన టైల్స్ ఏర్పాటు చేస్తారు. రిజర్వేషన్ ప్రయాణికులకు సౌకర్యవంతం గా బటన్ సిస్టమ్ పొయెట్ మిషన్ల స్థానంలో టచ్ స్క్రీన్లు ఏర్పాటవు తాయి. స్టేషన్ ఆవరణలో ఆటోమేటిక్ రిజర్వేషన్ చార్టు స్క్రోలింగ్ వీడియో సిస్టమ్‌ను అమర్చుతారు. జనరల్, ప్లాట్‌ఫాం టికెట్ల కోసం ఆటోమేటిక్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తారు. సఫాయివాలాలకు (మహిళా స్వీపర్లకు) అధునాతన స్వీపింగ్ కిట్లను అందుబాటులోకి తెస్తారు. లగేజీ తనిఖీ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్కానర్‌ను అమర్చుతారు. లిఫ్ట్‌లు, ప్లాట్‌ఫారాలకు ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధి .. తీరుతెన్నులు ప్రపంచ స్థాయి అభివృద్ధి ప్రకటన : 2004 సెప్టెంబర్‌లో ప్రపంచ స్థాయి అభివృద్ధికి అవసరమైన స్థలం : 300 ఎకరాలు (రైల్వే ప్యాసింజర్స్ అమినిటీస్ కమిటీ, రైల్వే ఇంజినీరింగ్ అత్యున్నత స్థాయి అధికారుల బృందం ద్వారా మంత్రిత్వ శాఖకు నివేదిక) ప్రస్తుత(ఈస్ట్) రైల్వేస్టేషన్ విస్తీర్ణం : 34 ఎకరాలు (ఖాళీస్థలంతో కలిపి) వెస్ట్ రైల్వేస్టేషన్లో అందుబాటులో ఉన్నది : 52 ఎకరాలు ప్రపంచ స్థాయి పనులకు పరిశీలించిన ప్రాంతాలు : పూడి, ఏర్పేడు, చంద్రగిరి రైల్వేస్టేషన్ల పరిసరాలు తిరుపతిలోనే అభివృద్ధి చేయాలన్న కారణం : శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే యాత్రికుల సెంటిమెంట్ దెబ్బ తినకుండా చూడాలన్న అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం. వరల్డ్‌క్లాస్ అభివృద్ధికి ఎదురైన ఆటంకాలు : ప్రస్తుత రైల్వేస్టేషన్ పరిసరాల్లోని బడా హోటల్ నిర్వాహకులు తమ వ్యాపారం దెబ్బ తింటుందని అడ్డుపడ్డారు. వీరికి స్థానిక ప్రజాప్రతినిధులు వత్తాసు పలికారు. -
ప్చ్!
సిటీజనుల పెదవి విరుపు ‘వరల్డ్ క్లాస్’... నో జోష్ కానరాని కొత్త రైళ్లు స్టేషన్ల అభివృద్ధి... విస్తరణ ఊసే లేదు రైల్వే బడ్జెట్లో రాజధానికి నిరాశ ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ అంచనా రూ.850 కోట్లు కేంద్రం విదిల్చింది రూ.8 కోట్లు ఆశల రైలు రాజధానికి రాలేదు. ప్రయాణికుల ఆకాంక్షలు నెరవేరలేదు. అభివృద్ధి మంత్రం వినిపించలేదు. జంట నగరాల నుంచి ఒక్క రైలూ అదనంగా కదల్లేదు. ఇతర ముఖ్య ప్రాంతాల నుంచి ఇక్కడికి కొత్త ైరెళ్లు రాలేదు. ‘వరల్డ్ క్లాస్’ యోచన ఏమైందో తెలియలేదు. ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్‌పై భారీ ఆశలు పెట్టుకుంటే... సాధారణ రహదారికి కేటాయించాల్సిన స్థాయిలోనైనా నిధులు విదల్చలేదు. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.850 కోట్లు... బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.8 కోట్లే. ‘మెట్రో’ వేగంతో నగరం పరుగులు పెట్టాలనుకుంటుంటే... బడ్జెట్ రైలు బహు దూరంలో ఆగిపోయింది. సిటీబ్యూరో: గ్రేటర్ సిటీజనులను ఊరించి ఉసూరుమనిపించిన రైల్వే బడ్జెట్‌పై నగర వాసుల్లో మిశ్రమ స్పందన కనిపించింది. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు సమర్పించిన తాజా రైల్వే బడ్జెట్‌పై గురువారం ‘సాక్షి’ బృందం గ్రేటర్ పరిధిలో సర్వే నిర్వహించింది. నగర నలుమూలల్లో విభిన్న రంగాలకు చెందిన 300 మంది అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడ య్యాయి.రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి రావడంపై పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తమ భద్రతకు 182 టోల్ ఫ్రీనెంబరు ఏర్పాటు చేయడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ రెండోదశకు మొక్కుబడిగా రూ.8 కోట్లు కేటాయించడం, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ ఊసెత్తకపోవడంపై గ్రేటర్ వాసులు పెదవి విరిచారు. -
మూడేళ్లలో ప్రపంచస్థాయి రోడ్లు
సాక్షి, ముంబై: వచ్చే మూడేళ్లలో ముంబై రహదారుల రూపురేఖలు మారనున్నాయి. నగరంలో ప్రపంచ స్థాయిలో (వరల్డ్ క్లాస్) నాణ్యమైన రహదారులు నిర్మించేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) రూ. ఏడున్నర వేల కోట్లతో ‘రోడ్ మాస్టర్ ప్లాన్’ తయారు చేసింది. ఏటా వర్షా కాలంలో రోడ్లపై ఏర్పడిన గుంతలతో ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ ఇబ్బందుల నుంచి ముంబైకర్లకు విముక్తి కల్పించాలని బీఎంసీ మాస్టర్ ప్లాన్ తయారుచేసినట్లు మేయర్ సునీల్ ప్రభు చెప్పారు. ‘ముంబై రోడ్స్ మాస్టర్ ప్లాన్’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమానికి బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే, డిప్యూటీ మేయర్ మోహన్ మిట్భావ్కర్, సభాగృహం నాయకుడు తృష్ణ విశ్వాస్రావ్, స్థాయీ సమితి అధ్యక్షుడు యశోధర్ ఫణసే తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ కుంటే మాట్లాడుతూ రోడ్ల మరమ్మతులకు బీఎంసీ ఏటా కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నా వర్షా కాలంలో అవి అధ్వానంగా మారిపోతున్నాయన్నారు. దీంతో పటిష్టమైన రహదారులు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాగా, మూడేళ్ల కాలపరిమితిలో ఈ పనులు ఎలా చేపట్టాలి, ఎన్ని విడతల్లో పూర్తి చేయాలి తదితర ఈ పుస్తకంలో పొందుపర్చామన్నారు. ఇదిలాఉండగా పటిష్టమైన రోడ్లు నిర్మించేందుకు ఆర్థిక బడ్జెట్లో రూ.7500 కోట్లు మంజూరు చేశారు. ఆ ప్రకారం ఏటా రూ.2500 కోట్లు ఖర్చుచేసి సీసీ రోడ్లు, మాస్టిక్ అసఫల్ట్ రసాయనంతో పటిష్టమైన రహదారులు నిర్మించాలని సంకల్పించారు. టెండర్లను ఆహ్వానించకుండా ఏటా నగర రహదారులపై అధ్యయనం చేస్తారు. ఏ రోడ్డును, ఎన్ని రోజుల్లో పూర్తిచేయాలి ప్రణాళిక రూపొందించి ఆ ప్రకారం విడతల వారీగా పనులు చేపడతారని కుంటే వివరించారు. -
బడ్జెట్ బండి...ఆగేనా?
నేడే కొత్త రైల్వే బడ్జెట్ అటకెక్కిన వరల్డ్‌క్లాస్ కొరవడిన సదుపాయాలు విస్తరణకు నోచని టెర్మినళ్లు లింకు సర్వీసుల్లేని ఎంఎంటీఎస్ మోడీ బడ్జెట్ రైలు మరి కొన్ని గంటల్లో పట్టాల పైకి చేరుకోనుంది.ఈ రైలులో సౌకర్యాల మూటలుంటాయో... అసౌకర్యాల ముళ్లుంటాయో... నగర ప్రయాణికులను కేంద్రం కరుణిస్తుందో... గాలికి వదిలేస్తుందో... రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను మన్నిస్తుందో...మరచిపోతుందో కాసేపట్లో తేలిపోతుంది. సాక్షి, సిటీబ్యూరో: ప్రజలు ఎన్నో ఆశలతో ప్రధానిగా మోడీని గద్దెనెక్కిస్తే... నెల తిరక్కుండానే చార్జీల భారాన్ని మోపి ప్రయాణికుల నుంచి విమర్శలను మూటగట్టుకున్నారు. ఇప్పుడు అసలు సిసలైన... మోడీ ప్రభుత్వ ప్రతిష్ఠకు తార్కాణంగా నిలిచే రైల్వే బడ్జెట్ వస్తోంది. దీని కోసం నగర ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రైల్వే వ్యవస్థ పనితీరు...చేపడుతున్న ప్రాజెక్టులు... అభివృద్ధి చర్యలు, సమస్యలను ఒకసారి పరిశీలిస్తే... ఎప్పటికి పూర్తయ్యేనో? ఎనిమిదేళ్ల క్రితం ప్రతిపాదించి, చివరకు రెండేళ్ల క్రితం బడ్జెట్లో చోటు దక్కించుకున్న ఎంఎంటీఎస్ రెండో దశ పనులు అనేక ఆటంకాలను అధిగమించి ఇప్పుడిప్పుడే ముందుకు కదులుతున్నాయి. రెండో దశ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. విస్తరణ అంతేనా? నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్లపై ఒత్తిడిని తొలగించేందుకు మల్కాజిగిరి, మౌలాలీ స్టేషన్లను విస్తరించాలనే ప్రతిపాదనలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా రైళ్లు పెరగడం లేదు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రాజధాని హైదరాబాద్‌తో అనుసంధానం చేసే దిశగా ఇంతవరకూ అడుగులు పడలేదు. ఈ దశలో కొత్త సర్కారు తెలంగాణపై ఎలాంటి వరాలు కురిపిస్తుందో చూడాలి. కొండెక్కిన వరల్డ్ క్లాస్ సుమారు రూ.5000 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పూర్తిగా ఆధునికీకరించాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని 2008లో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటి వరకు అది అధ్యయనానికే పరిమితమైంది. దీనిని వరల్క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయడం వల్ల స్టేషన్‌కు వచ్చే రైళ్లకు, ఇక్కడి నుంచి వెళ్లే రైళ్లకు ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. ఎంఎంటీఎస్ వంటి లోకల్ సర్వీసులకు ప్రత్యేక లైన్లు, ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. స్టేషన్లో రైళ్ల రద్దీ తగ్గుతుంది. ప్రయాణికులకు అవసరమైన షాపింగ్‌మాల్స్, కమర్షియల్ భవనాలు నిర్మించవచ్చు. కానీ ఆచరణ వైపు చక్రాలు కదల్లేదు. తెలంగాణ సర్కారు ఈ దిశగా చేసిన కృషి ఏంటో బడ్జెట్ పట్టాలపైకి ఎక్కితే తెలుస్తుంది. పేరుకేఏ-1 స్టేషన్ నగరంలోని కాచిగూడను ఏ-1 స్టేషన్‌గా ప్రకటించారు. కానీ సదుపాయాలు ఆ స్థాయిలో లేవు. ఇక్కడినుంచి నిత్యం 50 వేల మంది వివిధ ప్రాంతాలకు వెళ్తారు. నిజాం కాలానికి చెందిన ఈ స్టేషన్లో కనీస సదుపాయాలు లేవు. ఇటీవల కొత్తగా నిర్మించిన ప్లాట్‌ఫామ్‌ల పైన మంచినీళ్లు, టాయిలెట్లు, కేటరింగ్ వంటి సదుపాయాలు లేవు. విస్తరణ లేని నాంపల్లి... నిజాం కాలంలో జరిగిన అభివృద్ధి మినహా నాంపల్లి స్టేషన్లో ఎలాంటి పురోగతి లేదు. చెన్నై తరహాలో ప్లాట్‌ఫారాలను విస్తరించాలనే ప్రతిపాదన అటకెక్కింది. ఎస్కలేటర్లు మంజూరైనా స్థలాభావం సాకు చూపి ఇక్కడి నుంచి తరలించారు. రైల్వే హెల్త్ యూనిట్లో సేవలను విస్తరించకపోవడంతో ప్రమాదాలకు గురైన కార్మికులను సికింద్రాబాద్ లా లాగూడ ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. ఇటీవల గుండెపోటుకు గురైన ఓ కార్మికుడు సకాలంలో వైద్యం లభించక మృతిచెందాడు. ఏదీ లింక్? రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నట్లు ప్రకటించి, 2003లో ప్రవేశపెట్టిన మల్టిమోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్)కు ఇప్పటికీ సిటీ బస్సుతో లింకు లేదు. జంట నగరాల ప్రయాణికులకు ‘రైలు-బస్సు’ సదుపాయం అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టు లక్ష్యం నీరుగారుతోంది. ప్రస్తుతం నగరంలో ఉన్న 26 ఎంఎంటీఎస్ స్టేషన్లలో సగానికి పైగా స్టేషన్లలో కనీసం రోడ్డు సదుపాయం లేదు. రైలు దిగిన ప్రయాణికులు ఆటో ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా అసాధ్యంగానే ఉంది. ఫలక్‌నుమా, మలక్‌పేట్, లకిడికాఫూల్, నెక్లెస్ రోడ్డు, సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ వంటి కొన్ని స్టేషన్లకు రోడ్డు సదుపాయం ఉన్నప్పటికీ ఎంఎంటీఎస్ రాకపోకలకు అనుగుణంగా సిటీ బస్సులు అందుబాటులో ఉండడం లేదు. ఫలక్‌నుమా, ఉప్పుగూడ, యాకుత్‌పురా, డబీర్‌పురా స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్‌తో పాటు దూర ప్రాంత రైళ్లూ రాకపోకలు సాగిస్తాయి. నిత్యం వేల సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. కానీ ఈ స్టేషన్లకు అనుబంధ రోడ్డు, రవాణా సదుపాయాలు లేవు. మంచినీరూ కరువే హైటెక్ సిటీ, లింగంపల్లి వంటి వద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో మంచినీటి సదుపాయం కూడా లేకపోవడం అధికారుల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. ప్రయాణికులు తల దాచుకునేందుకు షెల్టర్లు కూడా లేవు. పత్తా లేని టెర్మినళ్లు... మల్కాజిగిరి, మౌలాలీ స్టేషన్లను విస్తరించి అతి పెద్ద ప్రయాణికుల టెర్మినళ్లుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లోనే ఉంది. ఈ రెండు స్టేషన్లను విస్తరించేందుకు కావలసినంత స్థలం ఉంది. వీటిని అభివృద్ధి చేయడం వల్ల కాజీపేట్, నిజామాబాద్ వైపు నుంచి వచ్చే రైళ్లకు హాల్టింగ్ సదుపాయం లభిస్తుంది. సికింద్రాబాద్‌తో నిమిత్తం లేకుండా కొన్ని రైళ్లు నేరుగా కాచిగూడకు వెళ్తాయి. 2007 నుంచే ఈ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఆదర్శ స్టేషన్‌గా ప్రకటించిన మల్కాజిగిరికి ఇప్పటికీ అప్రొచ్ రోడ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మౌలాలీ స్టేషన్ నుంచి నేరుగా బస్సు సదుపాయం లేదు. ఇందుకోసం ప్రయాణికులు ఒకటిన్నర కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. కొత్త రైళ్లకు డిమాండ్ జంట నగరాల నుంచి సుమారు 100 నుంచి 120 ప్రధాన రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. విశాఖ, తిరుపతి, బెంగళూరు, షిర్డీలకు మరిన్ని కొత్త రైళ్లు అవసరమనే డిమాండ్ ఉంది. కాచిగూడ నుంచి బెంగళూర్‌కు రెండు ఎక్స్‌ప్రెస్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ రూట్లో మరో 2 రైళ్లకు డిమాండ్ ఉంది. నగరం నుంచి షిర్డీ వెళ్లే భక్తులకు ప్రస్తుతం మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఆధారం. ఇది కూడా నాగర్సోల్ వరకు వె ళ్తుంది. అక్కడి నుంచి షిర్డీకి రోడ్డు మార్గాన వెళ్లాల్సిందే. కాకినాడ నుంచి నేరుగా షిర్డీవరకు సాయినగర్ ఎక్స్‌ప్రెస్ ఉంది. ఇది వారానికి రెండు రోజులే నడుస్తుండడం గమనార్హం. వరంగల్, మిరియాలగూడ, మణుగూర్ల నుంచే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. మిగతా అన్ని జిల్లా కేంద్రాల నుంచి నగరానికి ఇంటర్ సిటీ సర్వీసులతో రైల్వే రవాణా సదుపాయాలను మెరుగుపర్చవలసిన అవసరం ఉంది. కొత్త లైన్లు... ప్రస్తుతం రూ.389 కోట్లతో వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రెండో దశ లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ పనులు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఎంఎంటీఎస్ సర్వీసులకు ప్రత్యేక లైన్లు లేకపోవడం వల్ల అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయి.శంకర్పల్లి-పగిడిపల్లి మధ్య బైపాస్ రైల్వే లైన్ నిర్మిస్తే గూడ్సు రైళ్లను ఆ దిశలో మళ్లించేందుకు అవకాశం లభిస్తుంది. సికింద్రాబాద్ మార్గంలో గూడ్సు రైళ్ల ఒత్తిడి తగ్గి ఎంఎంటీఎస్‌కు అవకాశాలు పెరుగుతాయి. -
ఈసారైనా ఒనగూరేనా?
అధ్యయనానికే పరిమితమైన వరల్డ్‌క్లాస్ ఏళ్లు గడిచినా ముందుకు కదలని ప్రతిపాదనలు సికింద్రాబాద్ స్టేషన్‌పై పెరుగుతున్న ఒత్తిడి ఏ మాత్రం పట్టని నాంపల్లి స్టేషన్ అభివృద్ధి అదనపు టర్మినళ్లపై కదలిక శూన్యం సాక్షి, సిటీబ్యూరో: ప్రతి బడ్జెట్ ఒక ప్రహసనం. ప్లాట్‌ఫామ్‌పైకి ఒకదాని తరువాత మరొకటి రైలొచ్చినట్లుగా బడ్జెట్లకు బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. కానీ నగరానికి పెద్దగా ఒనగూరిన ప్రయోజనం మాత్రం లేదు. ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ పెండింగ్ జాబితాలోనే పేరుకుపోతున్నాయి. ఏటా కొత్త రైళ్లు వస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. కానీ అందుకు తగిన విధంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల విస్తరణ జరగకపోవడంతో రైళ్లరాకపోకల్లో గంటల తరబడి జాప్యం చోటుచేసుకుంటోంది. మరో నాలుగు రోజుల్లో రైల్వే బడ్జెట్ రానున్న దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రైల్వే ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. వందల కొద్దీ రైళ్ల రాకపోకలతో, లక్షలాది మంది ప్రయాణికుల తాకిడితో నిత్యం కిటకిటలాడే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సమూలంగా మార్చివేయాలని సూచించారు. మరోవైపు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా మరిన్ని టర్మినళ్లు నిర్మించాలన్న సీఎం సూచన చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశమే. ప్రస్తుత స్టేషన్లపై పెరుగుతున్న ఒత్తిడి దృష్ట్యా మల్కాగిరి, మౌలాలీ, హైటెక్‌సిటీ వంటి రైల్వేస్టేషన్లను విస్తరించాలన్న ప్రతిపాదనలు ఏళ్లకు ఏళ్లుగా కాగితాలకే పరిమితమవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలన్న ఆరేళ్ల నాటి బడ్జెట్ ప్రతిపాదన ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. అధ్యయనాలకే పరిమితమైన వరల్డ్‌క్లాస్... మినీ భారత్‌ను తలపించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం 80కిపైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, 122 సబర్బన్, ఎంఎంటీఎస్‌లు రాకపోకలు సాగిస్తాయి. వీటికితోడు ఏటా 3 నుంచి 4 కొత్త రైళ్లు వచ్చి చేరుతూనే ఉన్నాయి. ఇప్పుడున్న 10 ప్లాట్‌ఫామ్‌లు ఏ మాత్రం చాలడంలేదు. ఒక రైలు ప్లాట్‌ఫామ్ వదిలితే కానీ మరో రైలు స్టేషన్లోకి ప్రవేశించడం సాధ్యం కాదు. దీంతో చాలా రైళ్లు నగర శివార్లలోనో, సమీప స్టేషన్లలోనో నిలిపివేస్తున్నారు. ఈ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని సుమారు రూ.5 వేల కోట్లతో 2008 బడ్జెట్లోనే ప్రతిపాదించారు. కానీ ఇప్పటికీ ఆ ప్రతిపాదన ఒక్క అడుగైనా ముందుకు పడలేదు. అధ్యయనాలకే పరిమితమైంది. సికింద్రాబాద్‌ను వరల్డ్‌క్లాస్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తే విమానాశ్రయం తరహాలో ఎలివేటెడ్ లైన్లను నిర్మిస్తారు. స్టేషన్‌కు చేరుకునే రైళ్లన్నీ ఒకవైపు నుంచి, స్టేషన్ నుంచి బయలుదేరేవన్నీ మరోవైపు నుంచి వెళ్లే విధంగా లైన్లు, ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేస్తారు. ప్యాసింజర్ రైళ్లు, ఎంఎంటీఎస్, సబర్బన్ సర్వీసుల కోసం ప్రత్యేక లైన్లు ఉంటాయి. దీనివల్ల రైళ్ల రాకపోకల్లో ఎలాంటి అంతరాయం లేకుండా, ఆలస్యానికి తావు లేకుండా నిర్వహణ సాధ్యమవుతుంది. ఆచరణకు నోచని అదనపు టర్మినళ్లు.... సికింద్రాబాద్‌తోపాటు నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి రోజూ 2.5 లక్షల మంది ప్రయాణికులు బయలుదేరుతారు.నాంపల్లి,కాచిగూడ స్టేషన్లలో 5 ప్లాట్‌ఫామ్‌ల చొప్పున ఉన్నప్పటికీ 18 బోగీల కంటే ఎక్కువ బోగీలున్న దూరప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేందుకు అనుకూలంగా లేవు. ఒకటి, రెండు స్టేషన్లలో మాత్రమే ఆ సదుపాయం ఉంది. దీంతో అన్ని రైళ్లను సికింద్రాబాద్‌కే మళ్లిస్తున్నారు. ఆ విధంగా కూడా సికింద్రాబాద్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా మౌలాలీ, మల్కాజిగిరి స్టేషన్లను భారీ టర్మినళ్లుగా నిర్మించాలని చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. కలగానే ఎంఎంటీఎస్ ప్రత్యేక లైన్... రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే కూడా లోకల్ ట్రైన్‌కే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలన్న లక్ష్యంతో 2003లో ప్రారంభించిన ఎంఎంటీఎస్‌కు అడుగడుగునా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. నగరంలోని నాలుగు ప్రధాన మార్గాల్లో రోజూ 121 సర్వీసులతో సుమారు లక్షా 70 వేల మందికి రవాణా సదుపాయాన్ని అందజేస్తోన్న ఎంఎంటీఎస్ కోసం ప్రత్యేకంగా ఓ లైన్ వేయాలన్న ప్రతిపాదన నేటికీ ఆచరణకు నోచలేదు.