world class city
-
భూ సేకరణే రైతులకు లాభం
* రైతు చైతన్యయాత్రలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి * సీఆర్డీఏ బిల్లును చూసి అన్నదాతలెవరూ భయపడొద్దు * డబ్బుల్లేకుండా వరల్డ్ క్లాస్ సిటీ ఎందుకట? * బడాబాబులకు దోచిపెట్టేందుకు సర్కారు కుట్ర * రైతులకు న్యాయ సహాయానికి తుళ్లూరు కేంద్రంగా త్వరలో లీగల్ సెల్ సాక్షి, విజయవాడ బ్యూరో: భూ సమీకరణకంటే భూ సేకరణే రాజధాని రైతులకు ప్రయోజనకరమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. సీఆర్డీఏ బిల్లును చూసి ఎవరూ భయపడాల్సిన పని లేదని రైతులకు ధైర్యం చె ప్పారు. సమీకరణ, సేకరణల్లోని తేడాలను రైతులకు వివరించి వారిని చైతన్యపరిచేం దుకే రాజధాని గ్రామాల్లో చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి నేతృత్వంలోని ఓ బృందం శుక్రవారం రాజ ధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో పర్యటిం చింది. ఉండవల్లి నుంచి బయల్దేరిన ఈ బృందం పెనుమాక, వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తుళ్లూరు, రాయపూడి, నవులూరు గ్రామాల్లోని పొలాలను పరిశీలించింది. రైతులతో మాట్లాడింది. సర్కారుకు భూమలివ్వబోమని అక్కడి రైతులు స్పష్టం చేశారు. అనంతరం రైతు నాయకులు అనుమో లు గాంధీ అధ్యక్షతన మందడంలో రైతులతో జరిగిన సమావేశంలో జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రసంగించారు. రైతులు ఇష్టపడితేనే ప్రభుత్వం భూ సమీకరణ జరపాల్సి ఉంటుందని చెప్పారు. ఒక వేళ భూ సేకరణ జరిపినా రైతులకు లాభమేనని తెలిపారు. భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం సేకరించిన భూమిని మూడో వ్యక్తి అమ్మితే ఆ రోజు ధర ఎంత వస్తుందో.., ఆ ధరకు, మొదట రైతుకు చెల్లించిన రేటుకు మధ్య ఉన్న వ్యత్యాసంలో 40 శాతాన్ని రైతులకు చెల్లించాలని తెలిపారు. భూములిచ్చిన ప్రతి కుటుంబానికీ ఉద్యోగమివ్వాల్సిన బాధ్యత కూడా సర్కారుపై ఉందన్నారు. ఈ విషయాలను రైతులకు చెప్పకుండా ప్రభుత్వం భూ సమీకరణ పేరిట బడాబాబులకు ఏజెంటుగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అస లు డబ్బుల్లేకుండా వరల్డ్ క్లాస్ సిటీ ఎందుకని ప్రశ్నించారు. రియల్టర్లు, డెవలపర్ల కోసం ఎందుకు ఏజెంటుగా వ్యవహరించాలని పరోక్షంగా సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. రైతులకు న్యాయపరమైన సలహాలి చ్చేందుకు త్వరలో తుళ్లూరు కేంద్రంగా లీగల్ సెల్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. భూ సమీకరణ, భూ సేకరణల్లోని తేడాలపై త్వరలో విస్తృత ప్రచారం చేస్తామని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష్యుడు వి.లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ కుట్రను ఎదుర్కొనేందుకు పార్టీలకు అతీతంగా రైతులంతా ఐక్యంగా ఉద్యమించాలని బీజేపీ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి పిలుపునిచ్చారు. హైకోర్టు న్యాయవాదులు జగన్మోహన్రెడ్డి, శ్యామసుందరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మందడం, లింగాయపాలెం, వెంకటపాలెం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులకు కోర్టులపరంగా లభించే న్యాయాన్ని వివరించారు. ఏ సమస్యకు ఏ విధంగా కోర్టును ఆశ్రయించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చెప్పారు. ఈ సందర్భంగా లింగాయపాలెం వాసి అనుమోలు హరి లేచి ఎక్కువ మంది భూములివ్వడానికి సుముఖంగా ఉన్నామ ని, తామేం చేయాలో చెప్పాలని ప్రశ్నించా రు. దీంతో అక్కడున్న రైతులు హరిపై మం డిపడ్డారు. రైతులందరి పక్షాన భూములిస్తామని చెప్పడానికి నువ్వెవరంటూ నిలదీశారు. దీంతో గందరగోళం ఏర్పడింది. -
పత్తాలేని ‘ప్రజా రవాణా’ !
‘ఔటర్’ చుట్టూ అమరని ఆధునిక వ్యవస్థ శివారు ప్రాంతాలను విస్మరించిన సర్కార్ అంతర్గత రవాణా గ్రిడ్ లేకుండా విశ్వనగ రం సాధ్యమా...? సిటీబ్యూరో: హైదరాబాద్‌ను వరల్డ్ క్లాస్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోన్న ప్రభుత్వం..‘రవాణా గ్రిడ్’ను మాత్రం విస్మరించింది. ముఖ్యంగా నగర శివార్లను కోర్ ఏరియాతో కలిపేందుకు కీలకమైన ప్రజా రవాణా (పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు) వ్యవస్థను గాలికి వదిలేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అంతర్గత రవాణా గ్రిడ్ అభివృద్ధి చేయకుండా విశ్వనగరాన్ని ఎలా ఆవిష్కరిస్తారన్నది ఇప్పుడు అందరిలో మదిలో ఉదయిస్తున్న ప్రశ్న. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ 158 కి.మీ. మేర ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు (సిటీ వైపు) 25 మీటర్ల వెడల్పుతో ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. ఔటర్ నిర్మాణం పూర్తికావస్తున్నా ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు మాత్రం ఫైళ్లకే పరిమితమైంది. శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండటంతో నగరానికి రాకపోకలకు మెరుగైన రావాణా వ్యవస్థ తప్పనిసరి. ప్రధానంగా ఎంఎంటీఎస్, బీఆర్టీఎస్, మెట్రోరైల్, మోనోరైల్ వంటివాటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేయాల్సి ఉండగా... సర్కార్ అసలు ఇంతవరకు దాని ఊసే పట్టించుకోలేదు. ఓఆర్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే కనుక దానిపైకి సాధారణ రవాణా వాహనాలను అనుమతించరు. సర్వీసు రోడ్డు గుండానే రాకపోకలు సాగించాలి. అయితే.. నగరానికి త్వరితగతిన చేరుకొనేందుకు తగిన ప్రజా రవాణా సౌకర్యం లేకపోవడంతో ఔటర్‌కు సమీపంలోని సుమారు 600 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందరికీ వ్యక్తిగత వాహనాలు ఉండవు గనుక అత్యవసర పరిస్థితుల్లో వారు పడుతున్న యాతన అంతా ఇంతా కాదు. ఆదిభట్ల, ఘట్కేసర్ వంటి ప్రాంతాలు అనూహ్యంగా అభివృద్ధి చెందుతున్నాయి. నగరం నుంచి అక్కడికి చేరుకోవాలంటే 2 గంటలకు పైగా సమయం పడుతుండటంతో ప్రజలు యాతనపడుతున్నారు. ఇప్పటికే పటాన్చెరు నుంచి శంషాబాద్ మీదుగా పెద్దఅంబర్‌పేట, అలాగే పటాన్చెరు-శామీర్‌పేట వరకు 120 కి.మీ మేర ఔటర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. అక్కడి ప్రజలు నగరానికి వచ్చి వెళ్లేందుకు ఒక పూట సమయాన్ని వెచ్చించాల్సి వస్తుండడం ట్రాఫిక్ రద్దీకి అద్దం పడుతోంది. ఇది కీలకం... గ్రేటర్ ముంబయి తరహాలో ఓఆర్ఆర్ చుట్టూ వెలిసే శాటిలైట్ నగరాలకు కోర్ ఏరియాతో ప్రజా రవాణా వ్యవస్థ వల్లే అనుసంధానం కలుగుతుంది. ఔటర్‌కు సమీపంలోని ప్రజలు ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం నగరానికి రావడానికి ఇదే ప్రధాన రవాణా మార్గం. అత్యంత కీలకమైన ఈ అంతర్గత రోడ్ గ్రిడ్ ప్రాజెక్టుపై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టాలని రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు. నగరంలో సమగ్ర రవాణా వ్యవస్థ (సీటీఎస్) అధ్యయనంలో భాగంగా ఔటర్ చుట్టూ నిర్మించాల్సిన ప్రజా రవాణా వ్యవస్థను కూడా చేర్చి హెచ్ఎండీఏ నివేదికలు రూపొందించింది. మెట్రోరైల్, ఎంఎంటీఎస్ వంటివి రెండు లేన్లు నిర్మించవచ్చని, అవసరమైన చోట స్టేషన్లు నిర్మించేందుకు తగినంత స్థలం ఉన్నట్లు గుర్తించింది. అయితే, నిధుల్లేకపోవడంతో నిర్మాణ విషయంలో చేతులెత్తేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏమిటో అంతుచిక్కట్లేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అంటీముట్టనట్లుగా హెచ్ఎండీఏ.. ఔటర్‌ను పూర్తిచేయడంపైనే దృష్టిపెట్టిన హెచ్ ఎండీఏ ప్రజారవాణా వ్యవస్థ విషయంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది. నిజానికి ఔటర్ చుట్టూ ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు ఓఆర్ఆర్ ప్రణాళికలో భాగమే అయినా...ప్రత్యేకంగా నిధులేవీ కేటాయించలేదు. రవాణా కారిడార్ కోసం ఔటర్ చుట్టూ 25 మీటర్ల వెడల్పుతో స్థలం కేటాయించామని, అయితే... అక్కడ ఏ తరహా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. -
నమ్మకం నిలబెట్టుకుంటా
స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ వెల్లడి బాధ్యతల స్వీకరణ సిటీబ్యూరో: దాదాపు కోటి జనాభా కలిగిన హైదరాబాద్ మహా నగరానికి స్పెషలాఫీసర్‌గా నియమించి {పభుత్వం తనపై అతిపెద్ద బాధ్యతను ఉంచిందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తన శాయశక్తులా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. గురువారం ఉదయం 11.05 గంటలకు స్టాండింగ్ కమిటీ చైర్మన్(మేయర్) చాంబర్లో స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి విధులు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆశయాలకుఅనుగుణంగా గ్రేటర్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు, ప్రజలకు సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వం తనపై ఉంచిన బృహత్తర బాధ్యతను నిర్వహించేందుకు మరింతగా కృషి చేయాల్సి ఉందన్నారు. ప్రజాఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. నిజమైన వరల్డ్‌క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు మార్పులు తేవాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సోమేశ్ కుమార్‌ను కలిసిన వారిలోఎ స్పెషల్ కమిషనర్లు బాబు అహ్మద్, ప్రద్యుమ్న, అడిషనల్ కమిషనర్ రామకృష్ణారావుతో పాటు అడిషనల్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఉన్నారు. -
శివారుల్లోకి ఫార్మా సిటీ..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను ‘వరల్డ్ క్లాస్ సిటీ’గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా కాలుష్య భూతాన్ని పారదోలేందుకు పకడ్బందీగా చర్యలకు దిగుతోంది. మౌలికావసరాలైన తాగునీరు, మురుగునీటి పారుదల, రోడ్డు, రవాణా, గ్రీనరీ వంటివాటి అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే గ్రేటర్‌ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా నగరం దాని చుట్టుపక్కల ఉన్న బల్క్‌డ్రగ్, ఫార్మా సంస్థలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించాలని నిర్ణయించింది. వీటికోసం ప్రత్యేకంగా ఏడు వేల ఎకరాల్లో ‘ఫార్మా సిటీ’ని నిర్మించేందుకు అనువైన స్థలాల కోసం అన్వేషణ ప్రారంభించింది. బల్క్‌డ్రగ్ రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌లో ఆ రంగాన్ని సమున్నతంగా తీర్చిదిద్దాలన్న యోచిస్తోంది. బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియట్, ఫార్మా నిల్వ గోదాముల కారణంగా నగరంలో తీవ్ర కాలుష్యం వెలువడుతోన్న కారణంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు 30 కిలోమీటర్ల వెలుపల గల ప్రాంతాల్లో ఏడు వేల ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మించాలని తలపెట్టింది. ప్రస్తుతం జీడిమెట్ల, బాలానగర్, కాటేదాన్, ఐడీఏ బొల్లారం తదితర ప్రాంతాల్లో ఉన్న ఫార్మా కంపెనీలను ప్రతిపాదిత ఫార్మాసిటీకి తరలించేందుకుసర్కార్ సన్నాహాలు చేస్తోంది. విజయవాడ రూట్లో.. ఫార్మా సిటీని విజయవాడ రూట్లో నల్గొండ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంతంగి టోల్‌గేట్‌కు అవతల హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్-65)కు ఆనుకొని నల్లగొండ జిల్లా పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇరవైకిపైగా బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలున్నాయి. మరోవైపు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపైనున్న గుండ్రాంపల్లి గ్రామ శివార్లలో రె ండేళ్ల క్రితం ఓ ప్రైవేటు సంస్థ పరిశ్రమల సెజ్ ఏర్పాటు కోసం సుమారు రెండు వేల ఎకరాల భూములను రైతుల నుంచి కొనుగోలు చేసింది. దీనికి అనుబంధంగా మరో ఐదు వేల ఎకరాలను సేకరిస్తే ఫార్మాసిటీ ఏర్పాటుకుఅనువుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాయితీలు ప్రకటించాలి.. కొత్తగా అమల్లోకి వచ్చిన భూసేకరణ, పునరావాస బిల్లు వల్ల ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి భూమి సేకరించడం కష్టసాధ్యం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని ప్రకటించడంతోపాటు పరిశ్రమలు నెలకొల్పేవారికి ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించడమే గాక అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ సూచిస్తోంది. ముఖ్యంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో జాతీయ రహదారి-65కి సమీపంలో ఉన్న ఎనిమిది గ్రామాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు, విస్తరణకు అనుకూలంగా ఉంటుందని అధికార వర్గాలు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ప్రతి జిల్లాకు ఓ పారిశ్రామిక కారిడార్‌ను ప్రకటిస్తున్న సర్కార్ నల్లగొండ జిల్లాకు ఫార్మా సిటీని కేటాయించే విషయమై ఉన్నతాధికారులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంలోనే ఫార్మాసిటీ ఏర్పాటు, మార్గదర్శకాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భూసేకరణ, నూతనంగా ఫార్మా కంపెనీల ఏర్పాటు, విస్తరణకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం కల్పించే రాయితీలు, మౌలిక వసతులు, ఇతర ప్రోత్సాహకాలు తదితర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి. -
‘స్మార్ట్’ బడ్జెట్
నిధుల సేకరణకు అధికారుల వ్యూహం రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక పద్దులు ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ నివేదిక సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ సర్కారు కలల ప్రాజెక్టులైన వరల్డ్ క్లాస్ సిటీ, స్లమ్ ఫ్రీ సిటీ, స్మార్ట్‌సిటీల దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలంటే భారీ స్థాయిలో నిధులు అవసరం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వీటికి ప్రత్యేక హెడ్స్ (పద్దులు) ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో వివిధ ప్రభుత్వ శాఖలు భాగస్వాములు కానున్నాయి. ఆ శాఖలకు కేటాయించే నిధులు వాటి అవసరాలకే పరిమితమవుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధులకు ప్రత్యేక పద్దులుంటే మంచిదనే తలంపులో అధికారులు ఉన్నారు. వీటిని సత్వరం పూర్తి చేసేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలైన ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు ఐదు నుంచి పదేళ్ల వరకు పట్టనుంది. దశల వారీగా పనులు పూర్తి చేయాలన్నా రూ.వందల కోట్లు అవసరం. దీంతో ప్రత్యేక పద్దుల కింద నిధులు మంజూరు చేయాల్సిన అవసరముందని అధికారులు భావిస్తున్నారు. ఆమేరకు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. తద్వారా ఏటా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చార్మినార్ పాదచారుల పథకానికి అవసరమైన దాదాపు రూ.500 కోట్లకు బడ్జెట్లో ప్రత్యేక పద్దు ఉన్న సంగతి తెలిసిందే. దానికంటే భారీ వ్యయంతో కూడుకున్నందున ఈ ప్రాజెక్టులకుప్రత్యేక పద్దుల అవసరాన్ని వివరిస్తూ అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. వేలాది కోట్లు కావాలి.. స్లమ్‌ఫ్రీ సిటీలో భాగంగాతొలిదశలో నియోజకవర్గానికో స్లమ్‌ను ఎంపిక చేసినా దాదాపు రూ. 650 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ఈ లెక్కన గ్రేటర్‌లోని 1476 మురికివాడలను అభివృద్ధిపరచి స్లమ్ ప్రీ సిటీగా మార్చాలంటే రూ.వేల కోట్లు అవసరం. ఈ తరహాలోనే వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులు.. భూగర్భ డక్టింగ్లు, ఫుట్‌ఫాత్‌లు, సైక్లింగ్ మార్గాలు, ఎల్ఈడీ లైట్లు కావాల్సి ఉంటుంది. వీటిని అందుబాటులోకి తేవాలంటే రూ. వేలాది కోట్లు అవసరం. స్మార్ట్సిటీకీ అంతే స్థాయిలో నిధులు కావాల్సి ఉంటుంది. ప్రత్యేక పద్దులతో ఈ నిధులు మంజూరుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రహదారులకు రూ.10 వేల కోట్లు నగరాన్ని ‘గ్లోబల్’గా తీర్చిదిద్దాలంటే తొలుత రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంది. లండన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాలకు తీసిపోనివిధంగా రహదారుల నిర్మించాలి. కేబుల్ వైర్లు భూగర్భంలో వేసేందుకు డక్టింగ్ ఏర్పాటు,్ల రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించడం, వరదనీటి కాలువలు, విద్యుత్ దీపాలు తదితర సదుపాయాలతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, సామూహిక మరుగుదొడ్లు, బస్షెల్టర్లు అవసరం. దీనికోసం అంతర్జాతీయ కన్సల్టెంట్ల సేవలు వినియోగించుకునేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ తరహారహదారులకు రూ.10వేల కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా. కాలువలకూ అధిక మొత్తం కావాల్సిందే నగరాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చాలంటే తొలుత వరదనీరు సాఫీగా పోయేలా పనులు చేపట్టాలి. అందుకు దాదాపు రూ.16 వేల కోట్లు అవసరమని గతంలో అం చనా వేశారు. ఇది ఇంకా పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. రాబడిపై జీహెచ్ఎంసీ దృష్టి ఇప్పటి వరకు రూ.5కే భోజనం.. బస్తీలకు శుద్ధజలం వంటి పథకాలపై శ్రద్ధ చూపిస్తున్న జీహెచ్ఎంసీ... ఆదాయ మార్గాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించడంతో రూ.వెయ్యి కోట్లకు పైగా వసూలైంది. అదే తరహాలో వివిధ మార్గాల ద్వారా రావాల్సిన ఆదాయంపైనా దృష్టి పెడుతున్నట్టుసోమేశ్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీకి వృత్తిపన్ను దాదాపు రూ. 300 కోట్లు రావాల్సి ఉండగా, రూ.100 కోట్లు కూడా రావడం లేదు. మోటారు వాహనాల పన్నుల వాటా, వినోదపు పన్ను, ఇతరత్రా మార్గాల్లో రావాల్సిన వందల కోట్ల నిధులు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరడం లేదు. వీటన్నింటిపై శ్రద్ధ వహించడం ద్వారా ఎవరిపై ఎలాంటి భారమూ మోపకుండానే జీహెచ్ఎంసీ ఆదాయం కనీసం 30 శాతం పెరగగలదని అంచనా. ఆ దిశగా అవసరమైన కసరత్తు ప్రారంభించారు. వరల్డ్ క్లాస్ సిటీ కి కావాల్సినవి... చక్కని రహదారులు, ఫుట్‌పాత్‌లు పార్కింగ్ ప్రదేశాలు వీధి దీపాలు 24 గంటలపాటు నీటి సరఫరా నిరంతరం విద్యుత్ సరఫరా భూగర్భడ్రైనేజీ చెరువుల పరిరక్షణ శుద్ధమైన తాగునీరు మెరుగైన ప్రజారవాణా భూగర్భకేబుళ్లు స్మార్ట్‌సిటీకి... వైఫై సేవలు ఆధునిక సాంకేతిక వనరులు ఇంట్లో కూర్చునే నెట్వర్క్తోవివిధ పనులు చేసుకోగలగడం ఫోన్ మెసేజ్‌తో సమస్యల పరిష్కారం -
2050 సంవత్సరం మన లక్ష్యం: కేసీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చదిద్దడానికి మెరుగైన మౌళిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు(కేసీఆర్) ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి 2050 సంవత్సరాన్ని లక్ష్యంగా ఉంచుకుందామని అధికారులకు తెలిపారు. ముఖ్యమంత్రిగా నిన్న పదవీ బాధ్యతల్ని స్వీకరించిన కేసీఆర్.. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐటీ కంపెనీలను ఆకర్సించడానికి ఉత్తమ మౌళిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి సారించాలని అధికారులను కేసీఆర్ కోరారు. 94 లక్షలున్న నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించాలని కేసీఆర్ తమను కోరారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరద తాకిడి గురికాకుండా చర్యలు చేపట్టాలని.. శుద్ధమైన మంచినీటి అందించాలని అధికారులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.