2050 సంవత్సరం మన లక్ష్యం: కేసీఆర్
2050 సంవత్సరం మన లక్ష్యం: కేసీఆర్
Published Tue, Jun 3 2014 9:59 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చదిద్దడానికి మెరుగైన మౌళిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు(కేసీఆర్) ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి 2050 సంవత్సరాన్ని లక్ష్యంగా ఉంచుకుందామని అధికారులకు తెలిపారు. ముఖ్యమంత్రిగా నిన్న పదవీ బాధ్యతల్ని స్వీకరించిన కేసీఆర్.. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐటీ కంపెనీలను ఆకర్సించడానికి ఉత్తమ మౌళిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి సారించాలని అధికారులను కేసీఆర్ కోరారు. 94 లక్షలున్న నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించాలని కేసీఆర్ తమను కోరారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు.
వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరద తాకిడి గురికాకుండా చర్యలు చేపట్టాలని.. శుద్ధమైన మంచినీటి అందించాలని అధికారులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
Advertisement