
రాజధానిలో 'స్వచ్ఛ' కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: రాజధానిలో చెత్త సేకరణ, నిర్వహణ కోసం ప్రజాప్రతినిధులతో ప్రత్యేక కమిటీని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ అంశంపై రాజధాని పరిధిలోని ప్రజాప్రతినిధులతో కేసీఆర్ శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. హైదరాబాద్ లో చెత్త సేకరణ పనిని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. రాజధాని పరిధిలో నాలాల నిర్వాహణకు ప్రజాప్రతినిధులతో మరో కమిటీని ఆయన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్లో కొత్త మార్కెట్ల నిర్మాణం కోసం స్థలం సేకరించనున్నట్లు చెప్పారు.