world cricket cup tourney
-
భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్, ఉచితంగా మ్యాచ్ టికెట్లు!
మరికొద్ది సేపట్లో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్ హర్ష్ గోయెంక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ పోస్ట్‌పై ఓ వర్గానికి చెందిన క్రికెట్ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంతకి ఆ పోస్ట్‌లో ఏముందంటే? వరల్డ్ కప్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు లక్షల ఖర్చు చేసి మరీ మ్యాచ్ టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు నిర్వాహకులు ప్రముఖుల్ని ఆహ్వానిస్తుంటారు. వారికి ఉచితంగా పాస్‌లు అందజేస్తుంటారు. దీనిపై ఆర్పీజీ ఛైర్మన్ హర్ష్ గోయెంక్ తనదైన స్టైల్లో స్పందించారు. How about you, Sir? Ticket or Pass. — Anand Singh (@Anands_page) November 18, 2023 వ్యాపార వేత్తలైనా తన స్నేహితులెవరూ మ్యాచ్ టికెట్లు కొనలేదని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఉచిత పాస్‌లు పొందారని తెలిపారు. పైగా ధనవంతులే డబ్బులు చెల్లించడానికి ఇష్టపడరని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేయడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఓ వర్గం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నెటిజన్లు నేరుగా ఇంతకీ మీరు టికెట్లను కొనుగులో చేశారా? లేదంటా పాస్ తీసుకున్నారా? అని ప్రశ్నిస్తుండగా.. అందుకు తాను రెండూ తీసుకోలేదని చెప్పడం గమనార్హం. ఈ పోస్ట్‌పై కామెంట్లు వైరల్‌గా మారాయి. None of my businessmen friends have paid to get tickets for the #WorldcupFinal, they have all managed to get a ‘pass’. And that’s where the irony lies- it’s the rich who don’t want to pay! — Harsh Goenka (@hvgoenka) November 18, 2023 మ్యాచ్ టికెట్ల ధరలు ఎలా ఉన్నాయంటే? ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ల ధరలు ఒక్కటి రూ. 1.87 లక్షల వరకు పెరిగాయి . క్రికెట్ వరల్డ్ కప్ టిక్కెట్ రీ-సెల్లింగ్ సైట్‌లోని వయాగోగో (viagogo.com) ధరల ప్రకారం, టైర్ 4లో టిక్కెట్ ధర రూ. 1,87,407 కాగా పక్కనే ఉన్న టైర్ టిక్కెట్ ధర రూ.1,57,421. సైట్లో అతి తక్కువ ధర టిక్కెట్ ధర రూ. 32,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. -
అమెరికా, ఒమన్లకు వన్డే హోదా
దుబాయ్: అగ్రరాజ్యం అమెరికాతో పాటు మధ్య ఆసియా దేశం ఒమన్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే జట్ల హోదా దక్కింది. బుధవారం జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2లో ఒమన్ నాలుగు వికెట్లతో నమీబియాపై, అమెరికా 84 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై విజయం సాధించడంతో వన్డే హోదాకు అర్హత సాధించాయి. డివిజన్–2లో ప్రస్తుతం స్కాట్లాండ్, నేపాల్ ఉన్నాయి. 2023లో జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించే క్రమంలో ఈ నాలుగు జట్ల మధ్య రాబోయే రెండున్నరేళ్లలో 36 వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఒమన్‌ను ఒడ్డెక్కించిన హైదరాబాదీ సందీప్ గౌడ్ ఒమన్ జట్టు ఐసీసీ వన్డే హోదా సాధించడంలో హైదరాబాదీ ఆల్‌రౌండర్ సందీప్ గౌడ్ (53 బంతుల్లో 57 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో కీలక పాత్ర పోషించాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య నమీబియా తొలుత 9 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఒమన్ 157 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సందీప్ ఒత్తిడిని తట్టుకుని నిలిచాడు. దీంతో ఒమన్ మరో ఐదు బంతులు ఉండగానే, 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి గెలుపొందింది. అంతకుముందు పంజాబ్‌కు చెందిన వికెట్ కీపర్ సూరజ్ కుమార్ (51) ఒమన్ ఛేదనను ముందుకు నడిపించాడు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
* 14.42 లక్షల రూపాయలతో పాటు * మారణాయుధాలు, డమ్మీ పిస్తోల్లు,వాహనాలు స్వాధీనం * ప్రధాన బుకీ పరార్ మల్కాజిగిరి(హైదరాబాద్‌సిటీ) : మల్కాజిగిరి: ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా ఆటకు ఎస్ఓటీ పోలీసులు చెక్ పెట్టారు. ముఠాలోని ఇద్దరు నిర్వాహకులతో పాటు ముగ్గురు కలెక్షన్ ఏజెంట్లు, బెట్టింగ్‌లో పాల్గొన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. బుధవారం మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్ఆర్ కడపజిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహ్మద్ గౌస్ ఐదేళ్ల క్రితం మౌలాలి ప్రాంతానికి వచ్చి ఏపీఐఐసీ కాలనీలోని వైభవ్ అపార్ట్మెంట్ పెంట్‌హౌస్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయాల్లో బెట్టింగ్ నిర్వహిస్తూ నగరంలోనే ప్రధాన బుకీగా గౌస్ పేరు పొందాడు. ఇటీవల ఎస్ఓటీ టీం వనస్థలిపురంలో బుకీతో పాటు బెట్టింగ్‌లో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసినపుడు గౌస్ పై కేసు నమోదైంది. అతను ఉంటున్న చిరునామా పక్కాగా తెలుసుకున్న ఎస్ఓటీ విభాగం ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, వి.ఉమేందర్‌లు బుధవారం పెంట్ హౌస్ పై దాడి చేశారు. ఆ సమయంలో ప్రధాన బుకీ గౌస్ కుమారుడు సివిల్ ఇంజనీర్ మహ్మద్ అలి(25), గ్రాఫిక్ వర్క్ చేసే మరో కుమారుడు షౌకత్ అలి(22) తో పాటు పంటర్స్( బెట్టింగ్ చేసేవారు) నుంచి డబ్బులు కలెక్షన్ చేసే ఏజెంట్లు కుషాయిగూడకు చెందిన శ్రీనివాస్(29),ఏపీఐఐసీ కాలనీకి చెందిన వాహీద్(39), సలీం(39) తో పాటు బెట్టింగ్‌లో పాల్గొన్న నాగారంకు చెందిన మోకు జగన్మోహన్రెడ్డి(46), కుషాయిగూడకు చెందిన వీరేష్(33), కాప్రాకు చెందిన దీపక్(32)లను అరెస్ట్ చేశారు.గౌస్ కుమారుల నుంచి 12,82,000 ఏజెంట్లు, బెట్టింగ్‌లో పాల్గొన్న వారి నుంచి 1,60,000 రూ మొత్తం 14.42 లక్షలు, రెండు తల్వార్లు, రెండు డమ్మీ పిస్టోల్స్, ఒక ఎయిర్‌గన్, ఒక ల్యాప్‌టాప్, ఒక ట్యాబ్,18 మొబైల్స్, రెండు వాహనాలను స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు తరలించారు. ప్రధాన బుకీ గౌస్‌తో పాటు అతని అనుచరులు ఆరుగురు పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. గౌస్ ఇతర రాష్ట్రాలో కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని ప్రధానంగా విధ్యార్థులు, చిరు వ్యాపారులను ఈ బెట్టింగ్ లోకి ఆకర్షిస్తాడని డీసీపీ తెలిపారు. బెట్టింగ్‌లో ఓడిపోయిన వారు గొడవకు దిగితే బెదిరించడానికి కత్తులు, పిస్టోల్స్ ఉపయోగించేవాడన్నారు. తనకు ఉన్న డీడీ కాలనీలో విలాసవంతమైన ఫ్లాట్, దమ్మాయిగూడలో గెస్ట్గౌస్ లో కూడా బెట్టింగ్ నిర్వహించేవాడని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లతో పాటుసిబ్బంది రాములు, ఆంజనేయులును అభినందిస్తున్నామని రివార్డు కోసం సిఫార్స్ చేస్తామన్నారు.