World Laughter Day
-
World Laughter Day: మీ నవ్వుల చల్లదనాన్ని మంచుకొండ అప్పడిగింది...
ఒకరు జోక్ వేస్తే నవ్వడం చాలా వీజీ. నవ్వించడం మాత్రం నవ్వినంత ఈజీ కాదు. టోటల్‌గా చెప్పొచ్చేదేమిటంటే... నవ్వించడం అనేది అత్యంత కష్టతరమైన టాస్క్. ఈ నవ్వుల మహారాణులు మాత్రం అవలీలగా నవ్వులు పూయిస్తూ సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులను సం΄ాదించుకున్నారు.నిఫ్ట్ గ్రాడ్యుయేట్ అయిన కుష కపిల బిల్లీ మసి, సౌత్ దిల్లీ గర్ల్స్లాంటి క్యారెక్టర్లతో నవ్వుల వర్షం కురిపిస్తోంది. ఆమెకు 1.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. నిత్యజీవిత సంఘటనల ఆధారంగా దిల్లీకి చెందిన డాలీసింగ్ కామేడినీ మేడ్ ఈజీ చేసింది. ముంబైకి చెందిన ప్రజక్తా కోలి కామెడీ వీడియోలు మోస్ట్ ΄ాపులర్ అయ్యాయి. అబ్జర్వేషనల్ కామెడీకి ఆమె వీడియోలు అద్దం పడతాయి. కోలికి యూట్యూబ్‌లో 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. స్టాండ్–అప్ కమెడియన్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది ప్రశస్తి సింగ్. అమెజాన్ ప్రైమ్ వీడిమో సిరీస్ ‘కామిక్‌స్థాన్’ సూపర్ హిట్ అయింది. ఎంబీఏ చేసిన ప్రశస్తి ‘నవ్వించడం’ తన ΄్యాషన్ అంటోంది. వీరు మాత్రమే కాదు కనీజ్ సుర్క, శ్రిష్ఠి దీక్షిత్, నిహారిక ఎన్ఎం, సుప్రియ జోషి, సుముఖి సురేష్, ఐశ్వర్య మోహన్‌రాజ్, సుమైర... లాంటి ఎంతోమంది నవ్వుల ప్రపంచంలో మహారాణులుగా వెలిగి΄ోతున్నారు. -
రోజుకు 10 నిమిషాలు నవ్వితే.. ఎన్ని కేలరీల కొవ్వు కరుగుతుందో తెలుసా!
సాక్షి, జడ్చర్ల టౌన్: ‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడు.. నవ్వుతూ చావాలిరా.. చచ్చినాక నవ్వలేమురా.. ఎంత ఏడ్చినా బతికిరామురా.. అంటూ ఆచార్య ఆత్రేయ రాసిన గీతం అక్షరసత్యం. అసలు ఈ పాట గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. మీ సందేహం సబబే. ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం అందుకే ఆ ఉపోద్ఘాతం. నవ్వు గురించి చెబుదామనిపించి అలా ఆ గీతంతో మొదలుపెట్టాం. నవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నవ్వుల దినోత్సవం ఏర్పాటయ్యింది. నవ్వడం వల్ల మానసికంగా, శారీరకంగా మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు కాస్త నవ్వుకుంటూ నవ్వు వెనకాల ఉన్న చరిత్రను తెలుసుకుందాం పదండి. నవ్వులకూ ఓ శాస్త్రం నవ్వడం వల్ల శరీరంలో కలిగే ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు మానసిక వైద్యశాస్త్రంలో జిలోటాలజి అనే ప్రత్యేక విభాగం కూడా ఉంది. మహబూబ్‌నగర్, జడ్చర్లలో.. మహబూబ్‌నగర్, జడ్చర్లలోనూ లాఫింగ్ క్లబ్‌లు ఉన్నాయి. అయితే కరోనా కారణంగా మూడేళ్లుగా ఈ క్లబ్‌లు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. క్లబ్ సభ్యులు ప్రతిరోజు పరిమితంగా కలుసుకోవడం, హాయిగా జోకులు వేసుకుంటూ నవ్వడం చేస్తున్నారు. నవ్వడం, నవ్వించడం ఓ కళగా క్లబ్ సభ్యులు చెబుతుంటారు. యోగాసనాలు వేశాక చివరగా రెండు నిమిషాలు తప్పనిసరిగా లాఫింగ్ థెరపీ చేస్తుంటారు. తద్వారా అప్పటి వరకు యోగాసనాలతో మానసిక, శారీరకమైన అలసట నుంచి బయట పడేందుకు అలా చేస్తుంటారు. ఇవీ ఆరోగ్య ప్రయోజనాలు ► నవ్వు యోగా కామెడీ కాదని ఆరోగ్య శ్రేయస్సు కోసం నిర్వహించే వ్యాయామ ప్రక్రియగా చెబుతున్నారు. ► నవ్వడం వల్ల శారీరక విశ్రాంతి లభిస్తుంది. హాయిగా నవ్వడం వల్ల అలా నవ్విన వ్యక్తికి 45 నిమిషాలపాటు కండరాలు సడలించబడి ఒత్తిడిని తగ్గిస్తుంది. ► నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ఒత్తిడి హార్మోన్లు తగ్గి రోగనిరోధక కణాలు పెరుగుతాయి. ► నవ్వు రక్తనాళాల పనితీరు మెరుగుపరచడం వల్ల రక్తప్రసరణ పెరిగేలా చేసి గుండెపోటు రాకుండా కాపాడుతుంది. ► రోజుకు 10 నిమిషాలు నవ్వడం వల్ల శరీరంలోని 40 కేలరీల కొవ్వును కరిగిస్తుంది. కోపాన్ని తగ్గింపజేసి ఆయుష్షును పెంచడానికి దోహదపడుతుంది. -
మోదీ తర్వాత విప్లవ్ కుమారే అంటూ సెటైర్
-
త్రిపుర సీఎంను ఓ ఆటాడుకున్న కాంగ్రెస్
న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్-బీజేపీల మధ్య మాటల యుద్ద తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి కాంగ్రెస్ వ్యూహత్మకంగా అడుగేసి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేసింది. మే 6(ఆదివారం)న ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా తమ అధికారిక ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ వివాదస్పద వ్యాఖ్యలను జోడించింది. 150 సెకన్ల పాటు నిడివి కలిగిన ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం బీజేపీకి ఊపు తీసుకొచ్చే నేత త్రిపుర సీఎం విప్లవ్ కుమారేనని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ వీడియోలో ప్రస్తావించిన విషయాలు విప్లవ్ కుమార్, బీజేపీల అభిప్రాయాలు మాత్రమేనని పేర్కొంది. త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విప్లవ్ కుమార్ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సైతం విప్లవ్‌ను మందలించినట్లు వార్తలొచ్చాయి. మహాభారత కాలంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఉందంటూ మొదలైన విప్లవ్ వ్యవహారం.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని మతి చెడిందంటూ వ్యాఖ్యలు... మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు... సివిల్ సర్వీసెస్‌కు సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లే సరితూగుతారని, మెకానికల్ వాళ్లు పనికి రారని ప్రకటన... చివరకు.. చదువుకోవటం కన్నా పాన్ షాపులు పెట్టుకోవటం. ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం, బీజేపీని ఇరుకున పెట్టేసాయి. ఈ వ్యాఖ్యాలనే ట్వీట్ ద్వారా కాంగ్రెస్ మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేసింది. -
కోహ్లి జట్టుపై జోకులే జోకులు!
పుణే : అంతర్జాతీయ నవ్వుల దినోత్సవం సందర్భంగా కడుపుబ్బా నవ్వలానుకుంటున్నారా? అయితే సోషల్ మీడియా వేదికగా రాయల్ చాలెంజర్స్ జట్టుపై పేలుతున్న జోకులను చదవండి. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ఓడి ప్లే ఆఫ్ ఆశలను మరింత సంక్షిష్టం చేసుకున్న ఆర్సీబీపై అభిమానులు జోకులు పేల్చుతున్నారు. పాయింట్ల పట్టికలో పైకి, కిందికి మారాడాన్ని ప్రస్తావిస్తూ తమ ఫోటో మార్ఫింగ్ నైపుణ్యం జోడించి మరీ ట్వీట్లు చేస్తున్నారు. ఆర్సీబీ ఓటములను కర్ణాటక ఎన్నికలకు ముడిపెడుతూ ట్రోల్ చేస్తున్నారు. ఆర్సీబీ వైఫల్యానికి పూర్తి బాధ్యత సిద్దరామయ్యదేనని మోడీ అన్నట్లు.. బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్సీబీపై ఏ జట్టు గెలవదని పేర్కొన్నట్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రతీ ఐపీఎల్‌ల్లో ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని అభిమానులంతా ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. జట్టు సభ్యులే వెన్నుపోటు పొడుస్తున్నారని, కట్టప్ప-బాహుబలి ఫొటోను ట్వీట్ చేస్తున్నారు. పరీక్షల్లో ఎంత కష్టపడ్డా మార్కులు రానట్లు.. ఆర్సీబీ ఎంత బాగా ఆడిన ఓడిపోతుందని ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తొమ్మిది మ్యాచుల్లో మూడు మాత్రమే నెగ్గిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. టోర్నీలో నిలవాలంటే ఆర్సీబీ ప్రతీ మ్యాచ్ గెలువాల్సిందే. MODI :- Siddaramaiah Government is responsible for poor performance of RCB. If BJP comes to power ,then it will assure that no other team plays other than RCB. Crowd chanting- Modi...Modi....Modi.....#SRHvDD #CSKvRCB #KannadigaPrideSiddaramaiah #BJPThreatensVoters — Mohd Ibrahim Ahmed (@IbrahimAhmed455) May 5, 2018 If exams are IPL then i'm RCB, I perform every year but didn't get good points. — . (@ZypMuffin) May 5, 2018 #Rcb #MEMES #IPL #IPL18 #IPL11 #IPL2018 #ViratKohli #FunniestTweets #fun #funniness #LOL #jokes 😂😂 #Baahubali2 pic.twitter.com/4GkYLwuYKl — Mastihub.com (@mastihubcom) April 27, 2018 -
నవ్వుతూ బతికేద్దాం..!
నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం హైదరాబాద్: నవ్వు ఒక యోగం... నవ్వడం ఒక భోగం...అన్నారు. పెద్దలు ప్రస్తుతం నగరవాసులు ఇదే నానుడిని అనుసరిస్తున్నారు. దీంతో పగలబడి నవ్వుతూ ఎక్సర్సైజులు చేసేవారు ప్రతిరోజు ఉదయం నగరంలోని పలు పార్కుల్లో మనకు తారసపడుతున్నారు. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నవ్వు దోహదపడుతుందని అందరూ నమ్ముతున్నారు. దీంతో లాఫర్ యోగాపై నగరంలో నానాటికి క్రేజీ పెరిగిపోతోంది. లాఫర్ యోగా కథాకమామిషు ఏమిటో చూద్దాం... ఆరోగ్యం..ఆనందం..ఆహ్లాదం సరదాగా సాగే లాఫర్ యోగాలో వినోదంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బీపీ, షుగర్ నియంత్రించేందుకు ఫ్యాన్ ఎక్సర్సైజ్...మోకాలి నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు మోకాలి ఎక్సర్సైజు...నడుంను ఇష్టానుసారంగా తిప్పుతూ చేసే పొట్ట ఎక్సర్‌సైజును.. నవ్వుతూ చకచక చేసేందుకు సిటీవాసులు ఆసక్తి చూపుతున్నారు. నాలుకను ముందుకు చాచి సింహంలాగా దూకుతూ ‘ఆఆఆఆ...’అని అరుస్తూ చేసే సింహగర్జన ఇందులో ప్రత్యేకం. ఇలా చేయడాన్ని థైరాయిడ్ ఎక్సర్సైజు అంటారు. కుడి చెయ్యి బొటనవేలును అటుఇటు తిప్పుతూ కళ్లు కరెక్ట్‌గా దాన్ని ఫాలో అవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుందని యోగా నిపుణులు పేర్కొంటున్నారు. చివర్లో ఓంకారం చేసి...కళ్ల మూసుకొని బిగ్గర నవ్వుతూ. ‘ఊఊఊఊ...’ అని అరవడం వల్ల మెదడు చురుకుగా తయారవుతుందని వారు తెలిపారు. ఇలా మొదలైంది నగరవాసులు లాఫర్ యోగా పట్ల ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. అల్వేస్ బీ చీర్‌ఫుల్(ఏబీసీ) లాఫర్ క్లబ్ వ్యవస్థాపకుడు సీహెచ్ వెంకటాచారి. ఎనిమిదేళ్ల క్రితం సఫిల్‌గూడలో ప్రారంభమైన లాఫర్ క్లబ్ ప్రస్థానం నేతాజీనగర్, మణికొండ, పోచంపల్లి, ఖమ్మం, నాగార్జున సాగర్లకు విస్తరించిందన్నారు. తాను ముంబైతో పాటు వివిధ నగరాల్లో జరిగిన లాఫర్ యోగా తరగతులకు హాజరై ట్రైనర్‌గా మారానని, ఇప్పుడు నగరంలోని ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు యోగా ట్రైనర్ రమణచారి.