world media
-
పుతిన్‌ను ఆపకపోతే పెనువిధ్వంసమే: ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య
Olena Zelenska Open Letter: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ భార్య, ప్రథమ మహిళ అయిన ఒలెనా జెలెన్స్కా.. రష్యా యుద్ధకాండను నిరసిస్తూ ప్రపంచ మీడియాకి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఉక్రెయిన్ పౌరులపై రష్యా చేసిన సామూహిక మారణకాండను తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ పై రష్యా నమ్మశక్యం కాని విధంగా దాడి చేస్తోంది. మాస్కో మద్దతుగల దేశాల హామీతోనే మా దేశాన్ని వ్యూహాత్మకంగా చట్టుముట్టి దాడి చేస్తున్నప్పటికి దీనిని ప్రత్యేక ఆపరేషన్ గా పిలుచుకుంటున్నారు. అంతేకాదు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడిచేయనని రష్యా చెప్పింది. అది(రష్యా) చేస్తున్న పనులకు చెబుతున్న మాటలకు పొంతనే లేదు. మాస్కో పౌరులపై ఏ విధంగా దాడి చేసిందో నేను వివరిస్తాను. చాలామంది చిన్నారులు తమ తల్లిదండ్రులతోపాటు మృత్యువాత పడ్డారు. మరికొంతమంది అనాథలుగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇది భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం కలిగించిన విధ్వంసకర యుద్ధం. పుతిన్ ను అడ్డుకోకుంటే ఎవరికీ రక్షణ ఉండదన్నారు. ‘‘అణు యుద్ధం మొదలు పెడతానంటూ బెదిరిస్తున్న పుతిన్ ను మనం నిలువరించకపోతే ప్రపంచంలో సురక్షిత ప్రదేశం అంటూ మనకు ఉండదు’’ అని ఆమె భావోద్వేగంగా రాశారు. View this post on Instagram A post shared by Olena Zelenska (@olenazelenska_official) ఈ యుద్ధ భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. పిల్లలతో పారిపోయి అలసటతో ఉన్న తల్లుల కళ్లలోకి చూడండి, అంతేకాదు కేన్సర్ రోగులు ఈ సంక్షోభం కారణంగా అవసరమయ్యే కీమోథెరఫీ వంటి అత్యాధునిక చికిత్సలు అందక మరణిస్తున్నవారు కొందరూ. అంతేకాదు భారీ అగ్ని ప్రమాదాల కారణంగా ఆస్మా వంటి దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడేవారిపరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. దయ చేసి మా గగనతలం మూయండి అంటూ ఉక్రెయిన్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చి ప్రేక్షపాత్ర వహించింది నాటో" అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ లేఖ రాశారు. (చదవండి: నాటోపై ఆసక్తి లేదంటూనే.. జెలెన్స్కీ డబుల్ గేమ్!) -
ప్రపంచ మీడియాకు హెడ్‌లైన్స్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని భారత మీడియా ఆకాశానికెత్తేస్తూ సోమవారం రోజంతా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఆర్టికల్ 370 రద్దుతో పరోక్షంగా ప్రభావం పడే పాకిస్తాన్ మీడియా మోదీ ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేక కథనాలు వండి వారుస్తోంది. ఈ అంశంపై ప్రపంచ మీడియా సంస్థలు ఎలా రిపోర్ట్ చేశాయో ఓసారి చూద్దాం. ది గార్డియన్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుందని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ది గార్డియన్ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌ను విభజించాలన్న నిర్ణయం కూడా నాటకీయ మైన ఎత్తుగడ అని తెలిపింది. ఈ నిర్ణయం తో పాకిస్తాన్ వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందంది. బీబీసీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం అత్యంత ముఖ్యమైన చర్యగా ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ అభివర్ణించింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఉద్రిక్తతలు రాజేసే అవకాశం ఉందంది. సీఎన్ఎన్: ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ చర్య కశ్మీరీలకు మానసికంగా పెద్ద షాక్ కలిగించిందని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సీఎన్ఎన్ సంస్థ పేర్కొంది. భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆ రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపింది. ది వాషింగ్టన్ పోస్ట్: ‘కలహాలకు కొత్త వేదిక’అంటూ భారత ప్రభుత్వ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. భారత్‌లో కశ్మీర్ విలీనమవ్వడానికి ఆర్టికల్ 370 మూలమైందని పేర్కొంది. -
రెండు గ్రామాలు ఒక కథ!
వరల్డ్ మీడియా మొత్తం ఆ రెండు గ్రామాల నడిబొడ్డున తిష్టవేసింది. ఎటు చూసినా టీవీకెమెరాలు, గన్మైక్లే. ఎందుకిలా?మామూలుగానైతే దీపావళి పండుగకు ముందు మూడు రోజులు, వెనక మూడు రోజులు...‘ఢాం...డూమ్’ అనే శబ్దాలు వినిపిస్తుంటాయి.శాంతిపురం, కాంతిపురం అనే ఈ రెండు గ్రామాల్లో మాత్రం పెద్ద పెద్ద టపాసులు కాదు కదా...చిన్న కాకరపుల్ల కూడా కాల్చరు.‘ఎందుకిలా?’ అనే ప్రశ్నకు మీ దగ్గర ఉన్న సమాధానం...‘పర్యావరణ స్పృహ’‘వాయు, శబ్దకాలుష్యాలను నివారించడం’దీపావళి పండుగరోజు ఆ ఊళ్లల్లో సింగిల్ బాంబు కూడా కాల్చకపోవడానికి కారణం పై రెండు సమాధానాలు పొరపాటున కూడా కావు.మరి ఎందుకలా?ఇది తెలుసుకోవాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి. ముప్ఫై సంవత్సరాల వెనక్కి వెళ్లాలి....శాంతిపురం గ్రామానికి పెద్ద మసిరెడ్డి.కాంతిపురం గ్రామానికి పెద్ద కసిరెడ్డి.ఆరోజు దీపావళి...ఆరుబయట కూర్చొని తన అనుచరులతో ముచ్చటిస్తున్నాడు మసిరెడ్డి. సడన్‌గా కాంతిపురం గ్రామం నుంచి ఒక రాకెట్ దూసుకువచ్చి మసిరెడ్డి పంచెలో దూరింది. అతడి పంచె కాలిపోయింది.‘‘కాలింది నీ పంచె కాదన్నా...మన పరువు’’ పళ్లెంలో ఉన్న దోశ తింటూ ఎగదోశాడు ఒక అనుచరుడు.దీంతో మసిరెడ్డి కోపం ఆకాశాన్ని అంటింది.‘‘తీయండ్రా బండ్లు’’ అని అరిచాడు.‘‘బండ్లు తీయడం ఎందుకన్నా...పెట్రోల్ వేస్ట్. ముల్లును ముల్లుతోనే తీయాలా, రాకెట్‌ను రాకెట్‌తోనే కొట్టాలా’’ అని సలహా ఇచ్చాడు ముఖ్య అనుచరుడు.‘‘అలాగే చేయండి...అర్జంటుగా చేయండి....ఇప్పుడే చేయండి’’ అని ఊరంతా వినబడేలా తొడ కొట్టాడు మసిరెడ్డి. అలనాడు ఇరాక్ మీద అమెరికా క్షిపణి దాడి చేసినట్లు....శాంతిపురం గ్రామం కాంతిపురం గ్రామంపై రాకెట్ల దాడి మొదలు పెట్టింది. ఇక ఆరోజు కాంతిపురంలో ఎటు చూసినా రాకెట్లే!ఒకాయన ఇంకోఆయనకు...‘హ్యాపీ దివాలీ’ అని చెప్పాడు. సరిగ్గా ఆ సమయంలోనే శాంతిపురం నుంచి దూసుకువచ్చిన రాకెట్ అతడి చెవిలోకి దూరింది. ‘ఓరి నాయనో’ అని అరిచి పరుగు అందుకున్నాడు ఆ వ్యక్తి. ఇలాంటి అరుపులు, పరుగులు ఆ పండుగ రోజంతా వినిపిస్తూనే ఉన్నాయి. కనిపిస్తూనే ఉన్నాయి.ఇదంతా ఒక ఎత్తు. కాంతిపురం పెద్ద కసిరెడ్డిపై జరిగిన రాకెట్ దాడి ఒక ఎత్తు.కసిరెడ్డికి పప్పు అంటే మహా ఇష్టం. పండుగ పూట ‘ఆహా’ ‘ఓహో’ అని లొట్టలు వేస్తూ ఆవురావురుమని తింటున్నాడు. ఈలోపే శాంతిపురం నుంచి దూసుకువచ్చిన రాకెట్ కసిరెడ్డి ముందు ఉన్నపప్పుగిన్నెలోకి దూరి పప్పును నేలపాలు చేసింది.‘‘నా పప్పు జోలికి వచ్చి పెద్ద తప్పు చేశార్రా’’ అని నలుదిక్కులు వణికేలా అరిచాడు కసిరెడ్డి. ఆ తరువాత ఇలా కన్నీళ్లు పెట్టుకున్నాడు...‘‘పగ ఉంటే నా మీద చూసుకోవాలి. నా పప్పేం చేసింది?’’‘‘నేలపాలైంది పప్పు కాదన్నా...మన పౌరుషం’’ అగ్గి రాజేశాడు అనుచరుడు.ఇక ఆరోజు నుండి రెండు గ్రామాల మధ్య ఫ్యాక్షన్ మొదలైంది. ఆ ఊరి మీద వాలిన కాకి ఈ ఊరు మీద వాలొద్దని కాకులను అదేపనిగా తరమడం ప్రారంభించారు. ఆ ఊరు మీద పడిన వాన ఈ ఊర్లో పడొద్దు అంటూ ఎటు చూసినా టెంట్లు వేశారు!ఆ రెండు గ్రామాల ప్రజలు తమ ప్రగతి మరిచారు. తమ పిల్లలు చదువు మరిచారు. వాళ్ల భవిష్యత్తు మరిచారు.దేశంలో ఎక్కడైనా ఒక్కరోజే దీపావళి జరుగుతుంది. దీపావళి రోజు జరిగిన గొడవ పుణ్యమా అని ఆ ఊళ్లలో రోజూ బాంబులమోతే! పెద్ద రాకెట్‌కు లక్ష్మీబాంబులు, ఉల్లిగడ్డబాంబులు కట్టి ప్రత్యర్థిగ్రామంపైకి పంపించేవారు.శబ్దకాలుష్యం పుణ్యమా అని ఊళ్లో 97 శాతం మందికి చెవికి సంబంధించిన సమస్యలు, శ్వాసకోశ సంబంధ సమస్యలు తలెత్తాయి. దీపావళి సెలవులకని పట్నం నుంచి దిగాడు మసిరెడ్డి కొడుకు బాంబేష్. అతడిని బస్‌స్టాప్ నుంచి ఇంటికి ఘనంగా తీసుకెళ్లడానికి పదులసంఖ్యలో టాటాసుమోలు బారులు తీరాయి. టాటా సుమోలకుముందు వెళుతున్న మసిరెడ్డి కారు టైర్లను రెండు దీపావళి రాకెట్లు ఢీకొట్టడంతో కారు అదుపు తప్పి బోల్తాపడి మసిరెడ్డి మసిబొగ్గులా అయిపోయాడు. హెడ్లో ఉన్న ఫైల్స్ అన్ని డిలీటైపోయి ఎవరిని గుర్తుపట్టడం లేదు. ‘దూకుడు’లో ప్రకాశ్‌రాజ్‌లాగా!ఇక ఆరోజు నుంచి బాంబేష్ నుంచి పెద్ద పెద్ద డైలాగులు వినిపించేవి. మచ్చుకు...‘ఒరే నాయాలా...దీపావళి బాంబుల పొగ ముక్కులో దూరితే ఎట్టుంటుందో తెలుసా? హుసేన్సాగర్ వాటర్‌ను క్వార్టర్ బాటిల్లో కలిపి తాగిస్తే ఎలా ఉంటుందో తెలుసా?’‘కంటపడ్డావా కాకరపుల్లతో కంట్లో పొడుస్తా....వెంటబడ్డావా ఉల్లిగడ్డ బాంబుతో ఊడ్చేస్తా’‘‘ఈ ఊళ్లో ఒక్కొక్కడు ఒక్కో సైనికుడై కాంతిపురం వాళ్ల మీద విరుచుకుపడాలి. ఊళ్లో శ్మశానం ఉంటుంది. కాని శ్మశానంలోనే ఊరు ఉండాలి’’ అని పిలుపునిచ్చాడు.ఇంటింటికీ వెళ్లి చెప్పడం మొదలుపెట్టాడు.కానీ ఏంలాభం?ఒక్కరికి వినపడి చావడం లేదు.పదిసార్లు చెప్పినా ఒక్క పదం వినబడడం లేదు.బాంబేష్ మనసులో మార్పు మొదలైంది.‘‘ఏం సాధించాం?’’ అని అద్దం ముందు నిల్చొని గట్టిగా అరిచాడు.‘‘చెవుడు’’ అని అద్దంలోని ప్రతిబింబం సమాధానం చెప్పింది.‘‘వాడిదైన రోజు చిచ్చుబుడ్డి కూడా లక్ష్మీబాంబై పేలుతుంది. అసలు చిచ్చుబుడ్డిని బాంబు కాకుండా ఆపుతాడు చూడు...వాడే గొప్పోడు!’’ అని గట్టిగా డైలాగ్ చెప్పి ఫ్యాక్షన్‌కు ఫుల్స్టాప్ పెట్టాడు బాంబేష్.ఇక ఆరోజు నుంచి...మామూలు రోజుల్లోనే కాదు....దీపావళి రోజు కూడా ఆ గ్రామాల ప్రజలు బాణసంచ కాల్చడం లేదు. – యాకుబ్ పాషా -
ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటుతారు!
ఆదర్శం: కాలం మారిందంటాం. ఆడా మగా తేడాలు పోయాయంటాం. కానీ ఆడపిల్ల పుట్టిందని పురిట్లోనే చంపేశారనో, ముళ్లపొదల్లో ఆడ పసికందు మృతదేహమనో వార్తలు వింటూనే ఉంటాం. కానీ ఆడపిల్ల పుడితే ఊరంతా సంబరాలు చేసుకునే ఊరిని ఎక్కడైనా చూశామా? అమ్మాయికి గుర్తుగా 111 చెట్లు నాటి, వాటిని పెంచి పెద్దవి చేసే జనాల గురించి ఎక్కడైనా విన్నామా? అమ్మాయిని అమ్మలా భావించి కొలుస్తున్న ఊరి గురించి తెలుసుకుందాం రండి. పట్టణాలకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లో పిప్లాంట్రి అనే గ్రామం గురించి కొన్నేళ్ల ముందు వరకు ఎవరికీ తెలియదు. ఆరేళ్ల క్రితం అన్నింటిలాగే అదీ. కానీ ఇప్పుడా గ్రామం పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రపంచ మీడియా వేనోళ్ల పొగుడుతోంది. అందుక్కారణం... ఆడపిల్లను దేవతలా భావించి, ఆదరిస్తున్న ఆ ఊరి జనమే. ఆడపిల్ల పుట్టగానే అక్కడివారు దురదృష్టం అనుకోరు. సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. వెంటనే మామిడి, నిమ్మ, ఉసిరి లాంటి రకరకాల చెట్లు 111 నాటుతారు. ఈ సంప్రదాయాన్ని ప్రస్తుత పిప్లాంట్రి గ్రామ సర్పంచి శ్యామ్‌సుందర్ పలివాల్ తన కూతుర్ని కోల్పోయిన కొన్ని నెలలకు మొదలుపెట్టారు. గ్రామస్తులందరినీ సమావేశపరిచి, ఆడపిల్ల పుడితే చెట్లు నాటి, వాటిని పెంచి పెద్దచేద్దామన్న పలివాల్ ఆలోచనకు మొదట పెద్దగా స్పందన రాలేదు కానీ, ఒకరిద్దరు ఈ సంప్రదాయాన్ని పాటించాక, అందరూ అనుసరించారు. కేవలం చెట్లు నాటేయడంతో ఈ కథ ముగియదు. వాటిని పెంచి, పెద్ద చేసే బాధ్యత కూడా తీసుకుంటారు. అంతేకాదు... ఆడపిల్ల పుట్టిన కుటుంబ యజమానికి 10 వేల రూపాయలు పంచాయితీ ఇవ్వాలి. గ్రామస్తులంతా మరో రూ.21 వేలు చందా ఇస్తారు. మొత్తం 31 వేలను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. 20 ఏళ్ల తర్వాత, ఆ ఎఫ్డీ అమ్మాయి చేతికందుతుంది. అది ఆమె భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అమ్మాయి పెళ్లి, చదువు ఎవరికీ భారం కాకూడదనే ఉద్దేశంతో చేసిన ఏర్పాటిది. భవిష్యత్తుపై భరోసా ఉండటంతో ఆడపిల్లను కన్నామని ఎవరూ చింతించరిక్కడ. అయితే అమ్మాయి భద్రత విషయంలో పిప్లాంట్రి పంచాయితీ అక్కడితో ఆగిపోవట్లేదు. 18 ఏళ్ల కంటే ముందు అమ్మాయికి పెళ్లి చేయబోమని, ఆమె చదువును ఆపబోమని, తనకోసం నాటిన చెట్లను కాపాడతామని పంచాయితీకి తల్లిదండ్రులు అఫిడవిట్ కూడా సమర్పించాలి. దీన్ని మీరితే గ్రామంలో ఎవ్వరూ ఆ కుటుంబానికి సహకరించరు. ఆడపిల్ల పుట్టినప్పుడే కాదు, ఎవరైనా చనిపోయినప్పుడు కూడా 11 చెట్లు నాటడం గ్రామంలో సంప్రదాయంగా మారింది. ఆదర్శ గ్రామం ఆడపిల్లల్ని కాపాడేందుకు పలివాల్ వేసిన ఒక ముందడుగు పిప్లాంటి గ్రామ రూపురేఖల్ని మార్చేసింది. ఒకమంచి పని అనేక మంచిపనులను చేయించింది. మార్బుల్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పిప్లాంట్రి ఒకప్పటి పంచాయితీ అధికారులు డబ్బుకోసం ఇష్టానుసారం ఎన్వోసీలు (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు) ఇచ్చేశారు. దీంతో మైనింగ్ కాలుష్యం బాగా పెరిగిపోయింది. తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితికి చేరుకున్న దశలో పలివాల్ చేపట్టిన చెట్ల పెంపకం ఈ రోజు గ్రామాన్ని కాలుష్యం బారి నుండి బయటపడేలా చేయడమే కాదు, విప్లవాత్మకమైన మార్పులకూ కారణమైంది. గత కొన్నేళ్లలో పిప్లాంట్రి గ్రామస్తులు ఏకంగా రెండున్నర లక్షల చెట్లు నాటారు. ఆ చెట్ల వల్ల కాలుష్యం పూర్తిగా తగ్గడమే కాదు, వాటి ద్వారా వచ్చే ఆదాయం ఆ ఊరిని లగ్జరీగా తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడింది. పండ్ల చెట్లకు చుట్టూ నాటే కలబంద చెట్ల ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. పంచాయితీ సహకారంతో అలోవీరా ఉత్పత్తులు తయారుచేసి అమ్ముతున్నారు. ఆ బ్రాండ్ పిప్లాంట్రి బ్రాండ్. మరోవైపు పంచాయితీ నిధులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని, స్వచ్ఛమైన నీళ్లు తాగుతున్నారు. ప్రభుత్వ నిధులకు గ్రామస్తుల సహకారం తోడై రోడ్లు, స్కూళ్లు నిర్మించుకున్నారు. 24 గంటల కరెంటు. పాడవని వీధి దీపాలు. ఆరోగ్య, విద్య సదుపాయలు. వ్యాక్సినేషన్ వంటి ఖరీదైనవీ ఉచితంగా అందుబాటులో ఉంటాయక్కడ. మొత్తంగా ఈ గ్రామంలో లేని సౌకర్యమంటూ ఏదీ లేదు. 2006 వరకు రాజస్థాన్‌లో ఒక్క గ్రామం కూడా ‘నిర్మల్ ఆదర్శ గ్రామం’ పురస్కారానికి ఎంపిక కాలేదు. అయితే పిప్లాంట్రి ఆ ఘనత సాధించి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ ఊరు సొంతంగా ‘గ్రామ గీతం’ రూపొందించుకోవడమే కాక, వెబ్సైట్ కూడా తీర్చిదిద్దుకుంది. అన్నట్లు, పిప్లాంట్రి గ్రామంలో ఆల్కహాల్ నిషిద్ధం. జంతు వధ, చెట్లు నరకడం కూడా. గత ఏడెనిమిదేళ్లలో ఇక్కడ ఒక్క పోలీస్ కేసు కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిందే.