world number one rank in doubles
-
అమ్మాయి నెంబర్ వన్ కాగలదని నిరూపించా
హైదరాబాద్: ఓ సాధారణ అమ్మాయి ప్రపంచంలో తొలిస్థానానికి చేరుకోగలదని తాను నిరూపించానని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేర్కొంది. తన విజయం ఎంతోమంది ఆడబిడ్డలకు స్ఫూర్తిదాయకం అని చెప్పింది. ఆడపిల్లలను కలిగి ఉండటం ఓ బలహీనతగా తల్లిదండ్రులే చూడటం ఈ దేశంలో దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. డబ్ల్యూటీఏ ఫ్యామిలీ సర్కిల్ కప్ మహిళల డబుల్స్ ఫైనల్స్‌లో సానియా మీర్జా - మార్టినా హింగిస్ జో్డీ విజయంతో ఈ ఘనత దక్కించుకుంది. భారత్‌లో ఈ స్థాయికి చేరిన మొదటి మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సానియానే. -
మహిళల డబుల్స్‌లో నెంబర్ 1 సానియా
చార్లెస్టన్ (యూఎస్ఏ): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని సాధించింది. డబ్ల్యూటీఏ ఫ్యామిలీ సర్కిల్ కప్ మహిళల డబుల్స్ ఫైనల్స్‌లో సానియా మీర్జా - మార్టినా హింగిస్ జో్డీ విజయం సాధించింది. దీంతో మహిళల డబుల్స్‌లో సానియా ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచింది. భారత్‌లో ఈ స్థాయికి చేరిన మొదటి మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సానియా. మహిళల డబుల్స్ ఫైనల్స్‌లో డెల్లాక్వా - జురాక్ జోడీపై సానియా-హింగిస్లు 6-0, 6-4 స్కోర్‌తో గెలుపొందారు. ఈ సీజన్లో సానియా గెలుచుకున్న మూడవ టైటిల్ ఇది.