World Team Championship
-
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్!
ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్ అందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ తమ కోవిడ్ పాలసీని మార్చడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత విధానం ప్రకారం.. పాజిటివ్‌గా తేలిన ఆటగాడు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. అయితే ఇప్పుడు కొవిడ్ పాజిటివ్‌గా తేలినప్పటికీ ఆటగాడు మ్యాచ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఐసీసీతో కూడా బీసీసీఐ సంప్రదింపులు జరపనున్నట్లు సమాచారం. కాగా కొవిడ్ సోకిన ఆటగాళ్లకు మ్యాచ్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వడం ఐసీసీకి ఇదేమీ కొత్త కాదు. కామన్వెల్త్ గేమ్స్‌లోనే ఐసీసీ ఈ రూల్‌ను తీసుకొచ్చింది. ఇప్పడు బీసీసీఐ కూడా ఈ విషయంపై దృష్టిపెట్టింది. "డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం మా కొవిడ్ కోవిడ్ పాలసీని రివర్స్ చేయాలా వద్ద అనే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం ఐపీఎల్లో మా పాత కొవిడ్ విధానాన్నే అనుసరిస్తున్నాం. అయితే ఆటగాళ్లతో పాటు అధికారులు అందరూ బూస్టర్ డోస్ తీసుకున్నారు. కాబట్టి పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. ఈ విషయంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. రహానేకు పిలుపు ఇక భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జాన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించగా.. తాజాగా బీసీసీఐ కూడా భారత జట్టును ఎంపిక చేసింది. అయితే ఈ జట్టులో వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేకు చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కారణంగా రహానేకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. 🚨 NEWS 🚨#TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced. Details 🔽 #WTC23 https://t.co/sz7F5ByfiU pic.twitter.com/KIcH530rOL — BCCI (@BCCI) April 25, 2023 చదవండి: IPL 2023 RCB vs KKR: కేకేఆర్ హీరో జాసన్ రాయ్‌కు భారీ జరిమానా.. -
భారత్ ‘డబుల్’ ధమాకా
- ప్రపంచ టీమ్ బిలియర్డ్స్‌లో స్వర్ణ, రజతాలు - టైటిల్స్‌లో పంకజ్ అద్వానీ రికార్డు గ్లాస్గో: అంతర్జాతీయ బిలియర్డ్స్‌లో భారత్ మరోసారి సత్తా చాటింది. గ్లాస్గోలో జరిగిన ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఓ స్వర్ణం, రజత పతకంతో మెరుపులు మెరిపించింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో భారత్ ‘బి’ జట్టు 5-4తో భారత్ ‘ఎ’ జట్టును ఓడించింది. తాజా విజయంతో పంకజ్ అద్వానీ (10) అత్యధిక ప్రపంచ టైటిల్స్ సాధించిన భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతవరకు ఏ క్రీడలో ఏ ఆటగాడూ ఇన్ని ప్రపంచ టైటిల్స్‌ను గెలవలేదు. భారత్ ‘ఎ’ తరఫున అలోక్ కుమార్, భాస్కర్, సౌరవ్ కొఠారీ, ధ్రువ్ సిత్వాలా; భారత్ ‘బి’ తరఫున పంకజ్ అద్వానీ, రూపేశ్ షా, దేవేంద్ర జోషి, అశోక్ శాండిల్యాలు ప్రాతినిధ్యం వహించారు. గంటపాటు జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. తొలి మూడు రౌండ్లలో భారత్ ‘ఎ’ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి మూడు రౌండ్లలో ‘బి’ జట్టు 2-1తో నెగ్గి స్కోరును సమం చేసింది. చివరి మూడు రౌండ్లలో భారత్ ‘బి’ ఆటగాళ్లు పంకజ్ 613-116తో కొఠారీని; రూపేశ్ షా 379-90తో అలోక్‌ను ఓడించి జట్టుకు టైటిల్‌ను అందించారు. కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత ప్రపంచ టీమ్ ఈవెంట్‌ను నిర్వహించాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్న అంతర్జాతీయ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ సమాఖ్య వచ్చే కామన్వెల్త్ గేమ్స్‌లో క్యూ స్పోర్ట్స్‌ను ప్రవేశపెట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.