World Twenty20
-
ఇక రేసులో మిగిలింది భారత్, ఆస్ట్రేలియానే
మొహాలీ: టి-20 ప్రపంచ కప్ గ్రూప్-2 నుంచి మరో జట్టు నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్ (0) ఇంతకుముందే టోర్నీ నుంచి నిష్ర్కమించగా, తాజాగా ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో పాకిస్తాన్ (2) కూడా అదే బాటపట్టింది. ఈ గ్రూపు టాపర్ న్యూజిలాండ్ (6) హ్యాట్రిక్ విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లగా, మరో బెర్తు కోసం ఈ గ్రూపు నుంచి ఆస్ట్రేలియా(4), భారత్ (4) రేసులో మిగిలాయి. టీమిండియా సెమీస్ చేరాలంటే ఆదివారం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచితీరాలి. ఈ మ్యాచ్‌లో ధోనీసేన గెలిస్తే గ్రూపు-2లో భారత్ ద్వితీయ స్థానంలో నిలిచి నాకౌట్ బెర్తు దక్కించుకుంటుంది. కాగా మ్యాచ్ రద్దయితే టీమిండియాకు నిరాశ తప్పదు. అప్పుడు భారత్, ఆసీస్ చెరో ఐదు పాయింట్లతో సమానంగా ఉంటాయి. అయితే భారత్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న కంగారూలు సెమీస్‌కు వెళ్తారు. కాబట్టి సెమీస్ చేరాలంటే భారత్ ఆసీస్‌పై గెలిచితీరాలి. ఇక పాక్ లీగ్ దశలోనాలుగు మ్యాచ్‌లూ ఆడేసి ఇంటిదారి పట్టింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ల మధ్య ఓ మ్యాచ్ జరగాల్సి ఉన్నా ఇది నామమాత్రమే. మెరుగైన రన్‌రేట్ ఉన్న కివీస్.. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా గ్రూపులో అగ్రస్థానంలో ఉంటుంది. -
మొహాలీలో పాకిస్తాన్ జట్టుకే మద్దతు
మొహాలీ: భారత్ వేదికపై దాయాది పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అనూహ్య మద్దతు లభిస్తోంది. టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా శుక్రవారం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అభిమానులు పాక్ టీమ్‌కు మద్దతు తెలిపారు. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు అభిమానులు 'పాకిస్తాన్ జీతేగా', 'అఫ్రిదీ లలా' అంటూ స్టేడియం హోరెత్తిపోయేలా నినాదాలు చేశారు. దీంతో పాక్ టీమ్‌కు స్వదేశంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న అనుభూతి కలిగింది. మొహాలీ స్టేడియంలో 27 వేల సీటింగ్ కెపాసిటీ ఉంది. పాక్-ఆసీస్ మ్యాచ్‌ను తిలకించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అఫ్రిదీ ఆటను చూసేందుకు వచ్చానని అనంత్‌నాగ్‌కు చెందిన ఆమిర్ అనే యువకుడు చెప్పాడు. అతను దగ్గరలోని రాజ్‌పురాలో చదువుతున్నాడు. పాకిస్తాన్ జట్టు అంటే పెద్దగా ఆసక్తి లేదని, అఫ్రిదీ కోసం వచ్చామని సరబ్ ప్రీత్ అనే యువకుడు చెప్పాడు. పాటియాలాకు చెందిన సరబ్ సోదరుడితో కలసి మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. పాక్ జట్టుకు స్థానికులతో పాటు కశ్మీరీ విద్యార్థులు మద్దతు ఇస్తున్నారు. ఇదే ఈవెంట్లో న్యూజిలాండ్, పాక్ మ్యాచ్ కూడా ఈ వేదికలోనే జరిగింది. -
'టీమిండియాను ఓడించడం కష్టమే'
దుబాయ్:స్వదేశంలో భారత క్రికెట్ జట్టు చాలా ప్రమాదకరమైనదని ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. భారత్ ను వారి దేశంలో ఓడించడం అంత సులువు కాదని స్పష్టం చేశాడు. వచ్చే నెలలో ఆరంభం కానున్న వరల్డ్ టీ 20లో భారత జట్టే ఫేవరెట్ గా వాట్సన్ అభివర్ణించాడు. 'నా దృష్టిలో భారత్ అత్యంత క్లిష్టమైన జట్టు. ఆ జట్టుకు స్వదేశీ పరిస్థితులు కచ్చితంగా కలిసొస్తాయి. దాంతో టీమిండియానే వరల్డ్ కప్ ఫేవరెట్' అని వాట్సన్ తెలిపాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) లో పాల్గొనేందుకు దుబాయ్ కు వచ్చిన వాట్సన్ క్రికెట్.డాట్.కమ్. ఏయూతో ముచ్చటించాడు. ప్రత్యర్థి జట్లు ఆడేదాని కంటే కూడా స్వదేశంలో పరిస్థితులు టీమిండియాకు కలిసొస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లతో భారత జట్టు సమతుల్యంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. బ్యాటింగ్ లో అత్యంత దూకుడుగా ఉండే భారత్.. బౌలింగ్ విభాగంలో కూడా మెరుగ్గానే ఉందన్నాడు. ప్రత్యేకంగా స్పిన్నర్ల విషయానికొస్తే మ్యాచ్ ను క్షణాల్లో ప్రభావితం చేసే అత్యుత్తమ స్పిన్నర్లు వారి సొంతమన్నాడు. పేస్ విభాగంలో సీనియర్ ఆటగాడు ఆశిష్ నెహ్రా, యువ బౌలర్ బూమ్రాల రాకతో భారత జట్టులో చక్కటి సమన్వయం కనబడుతుందని ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన వాట్సన్ తెలిపాడు. -
ఇండియాను గెలిపించిన కోహ్లి హాఫ్ సెంచరీ
-
సఫారీలతో టీం ఇండియా ఢీ
-
రెండో సెమీస్‌లో ఇండియా V సౌతాఫ్రికా