worlds first
-
వరల్డ్స్ ఫస్ట్ మిస్ ఏఐగా కిరీటాన్ని దక్కించుకున్న మొరాకో బ్యూటీ..! (ఫొటోలు)
-
ప్రపంచంలోకెల్లా తొలి స్మార్ట్ కాలిక్యులేటర్.. హైదరాబాద్‌లో అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: చిన్న, మధ్యతరహా వ్యాపారులకు రోజువారీ లావాదేవీలు, ఆదాయ, వ్యయాల లెక్కింపులో దోహదపడేందుకు ప్రపంచంలోకెల్లా తొలి స్మార్ట్, మేడ్ ఇన్ ఇండియా కాలిక్యులేటర్ పరికరం హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. కాలిక్యులేటర్‌కు అనుసంధానంగా ఉండే టుహ్యాండ్స్ మొబైల్ యాప్ ద్వారా ఇది పనిచేయనుంది. ఒక్కో లావాదేవీని యాప్‌లోకి వ్యాపారులు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా రియల్‌టైమ్‌లోనే లావాదేవీల వివరాలన్నీ ఈ పరికరంలో నిక్షిప్తం కావడం దీని ప్రత్యేకత. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, టీ–హబ్ సహకారంతో టుహ్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీ రూ. 50 లక్షల నిధులను సమీకరించి స్మార్ట్ కాలిక్యులేటర్‌ను అభివృద్ధి చేసింది. సోమవారం నగరంలోని ‘టీ–హబ్’లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలను తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. ఇలాంటి ఆవిష్కరణల కోసమే టీ హబ్‌ను ప్రభుత్వం అన్ని హంగులతో ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇది జపాన్, చైనాలు తయారు చేసి విక్రయిస్తున్న సాధారణ కాలిక్యులేటర్ల గుత్తాధిపత్యానికి కచ్చితంగా గండికొడుతుందని జయేశ్ రంజన్ అభిప్రాయపడ్డారు. టుహ్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆవిష్కర్త ప్రవీణ్మిశ్రా మాట్లాడుతూ ఈ కాలిక్యులేటర్ చిన్న, మధ్యతరహా వ్యాపారుల బుక్ కీపింగ్‌లో పారదర్శకతను తీసుకొస్తుందన్నారు. ఆల్ఫా న్యూమరిక్ కీబోర్డ్‌తో కూడిన ఈ స్మార్ట్ కాలిక్యులేటర్ పవర్ రీచార్జ్ చేశాక 3 రోజులపాటు నడుస్తుందని వివరించారు. దీని ధరను రూ. 2,999గా నిర్ణయించినట్లు చెప్పారు. ఏడాది వారంటీతో పనిచేసే ఈ పరికరంలో 90 రోజుల డేటాను సులభంగా పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీహబ్ సీఈఓ శ్రీనివాసరావు, టీఎస్ఐసీ సీఐఓ శాంతతౌతం, టుహ్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆవిష్కర్తలు సత్యం సాహు, షణ్ముగ వడివేల్, అరవింద్ సుబ్రమణియన్ పాల్గొన్నారు. చదవండి: సీఎం ఫాంహౌస్ కోసమే ‘రీజినల్’ అలైన్మెంట్ మార్పు -
ప్రపంచంలోనే తొలి ఎగిరే కారు, ధర ఎంతంటే..
బంపర్-టు-బంపర్ ట్రాఫిక్‌లో గంటలు గంటలు జామ్ అయ్యే సమస్యలకు చెక్ పెట్టేలా ఇపుడు ఎగిరే కార్లు రయ్ మంటూ దూసుకురానున్నాయి. దీంతో ఇక హాలీవుడ్ సినిమాల్లో జేమ్స్‌బాండ్ లాగా రెక్కలు తొడుక్కున్న కార్లతో అలా గాల్లోకి ఎగిరిపోవచ్చన్నమాట. ప్రపంచంలోని మొట్టమొదటి కమర్షియల్ ఫ్లయింగ్ కారు ఎగిరే కారు నెదర్లాండ్స్ వీధుల్లో చక్కర్లు కొట్టనుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. నెదర్లాండ్స్‌లో అక్కడి రహదారులపై కమర్షియల్ ప్లయింగ్ కోసం అధికారిక ఆమోదం లభించింది. పాల్-వి లిబర్టీగా పిలిచే ‘ఎయిర్ కార్' ను డచ్ కంపెనీ పాల్-వి రూపొందించింది. ఎగిరే కారు మనం ఊహించినట్టు గానే చిన్న హెలికాప్టర్ , ఏరోడైనమిక్ కారు (పైన మడతపెట్టే ప్రొపెల్లర్‌తో) లా ఉంటుంది. డ్రైవింగ్ మోడ్‌లో గంటకు 99 మైళ్లు, ఫ్లైట్ మోడ్‌లో దీని గరిష్టంగా గంటకు 112 మైళ్లు వేగాన్ని అందుకుంటుంది. లిబర్టీ ఒక గైరోకాప్టర్, అంటే పైన ఉన్న రోటర్లుకారును పైకి లేపుతాయి. ఇందుకు కారు వెనుక భాగంలో ఒక ప్రత్యేక ప్రొపెల్లర్ ఇంజిన్ ఉంటుంది. కారు హెలికాప్టర్ లాగా కదిలినా, వర్టికల్ గా టేకాఫ్ అవ్వలేదు. టేకాఫ్‌కు కనీసం 590 అడుగుల పొడవు, ల్యాండింగ్‌కు 100 అడుగుల పొడవు రన్‌వే అవసరం. అయితే డ్రైవింగ్ మోడ్‌లో ఉండగా రోటర్లను మడవటం అనే సాధారణ విషయం కాదు. భవిష్యత్ మోడళ్లలో లిబర్టీ ఇంజనీర్లు దీనిపై దృష్టిపెడుతున్నారు. పరిమిత ఎడిషన్ గా 90 పయనీర్ వాహనాలను విక్రయించింది. ప్రీ-టాక్స్ ధర ట్యాగ్‌తో 599,000 డాలర్లుగా (4.47 కోట్ల రూపాయలు)దీని ధరను నిర్ణయించింది. మంచి డిజైన్, సొగసుగా తయారుచేయడానికి ఇటాలియన్ డిజైనర్లను నియమించుకుంది. అనంతరం స్పోర్ట్ మోడల్ తదుపరి 399,000 డాలర్లకు విక్రయించనుంది. అయితే నెదర్లాండ్స్ వెహికల్ అథారిటీతో నాణ్యతా పరీక్షల తరువాతగానీ కారు ఉత్పత్తిని ప్రారంభించమని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం అధికారిక లైసెన్స్ తో ఒకటి మాత్రమే నడుస్తోందని వెల్లడించింది. 2022 లో యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీతో ధృవీకరణను అందుకోవాలని యోచిస్తోంది. అటు స్లోవేకియాకు చెందిన క్లెయిన్ విజన్ అనే కంపెనీ ఎగిరే కారును అభివృద్ధి చేసింది. విజయవంతంగా పరీక్షించిన ఈ కారు బరువు 1,100 కిలోలు. 200 కిలోల వరకు మోసుకెళ్లగలదు. నవంబర్‌లో నిర్వహించనున్న ‘చైనా ఇంటర్నేషనల్ ఇంపోర్ట్'లో రెండు మోడళ్లను ప్రదర్శనకు పెట్టనున్నారు. కారు వచ్చే ఏడాది మార్కెట్లోకి రావచ్చు. ఈ కారు 2021 కల్లా అందుబాటులోకి రానుందనీ..ఈ కారు భూమికి 1500 అడుగుల ఎత్తులో గంటకు 620 కిమీల వేగంతో కారు దూసుకెళ్తుందని క్లెయిన్‌విజన్ సంస్థ వెల్లడించింది.ఈ కారును రెండు రకాల వెర్షన్లలో విడుదల చేయనుంది సదరు సంస్థ. వీటిలో ఒకటి టూసీటర్, రెండోది ఫోర్ సీటర్. ఇందులో సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్ కూడా ఉంటుందట. -
ప్రపంచంలోనే తొలి కృత్రిమ క్లోమగ్రంధి అమరిక!
సిడ్నీ: వైద్య చరిత్రలో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలి కృత్రిమ క్లోమ గ్రంధిని ఆస్ట్రేలియా డాక్టర్లు విజయవంతంగా అమర్చారు. గత కొంతకాలంగా డయాబెటీస్ తో బాధపడుతున్నఏవియర్ హేమ్స్ అనే నాలుగేళ్ల బాలుడికి కృత్రిమ క్లోమగ్రంధిని అమర్చారు. ఆ బాలుని రక్తంలో గ్లూకోజ్ శాతం గణనీయంగా పడిపోవడంతో తీవ్రమైన బాధతో కొట్టుమిట్టాడతున్నాడు. దీంతో ఆ బాలున్ని తల్లి దండ్రులు పెర్త్ మార్గెరెట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సలో భాగంగా డాక్టర్లు ఆ బాలునికి క్లోమ గ్రంధి మాదిరిగా పనిచేసే కృత్రిమ గొట్టాన్ని అమర్చారు. దీని ద్వారా ఆ బాలుని రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని తెలుసుకునే వీలుంటుంది. శరీరంలో సుగర్ లెవిల్స్ పడిపోయేనప్పుడే కాకుండా ఇన్సులిన్ విడుదల కావడం పూర్తిగా ఆగిపోయినప్పుడు ఈ గొట్టం పసిగట్టి సమాచారాన్ని అందిస్తోంది. దీంతో వారి తల్లి దండ్రులకు ఆ బాలుని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందని ఆ ఆస్పత్రి ప్రొఫెసర్ టిమ్ జోన్స్ చెబుతున్నారు.