worse
-
ఉభయ కొరియాల మధ్య...ఉద్రిక్తతలు మరింత తీవ్రం
సియోల్: ఉభయకొరియాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఉత్తరకొరియా శనివారం సరిహద్దు ప్రాంతాల్లోకి 180 యుద్ధ విమానాలను తరలించింది. దక్షిణ కొరియా కూడా దీటుగా అత్యాధునిక ఎఫ్–35 ఫైటర్ జెట్లు సహా 80 మిలటరీ ఎయిర్ క్రాఫ్టులను మోహరించింది. ఉత్తర కొరియా బుధవారం రికార్డు స్థాయిలో 20కిపైగా క్షిపణులను ప్రయోగించడం, వాటిలో ఒకటి దక్షిణకొరియా సరిహద్దుల్లో పడటం తెలిసిందే. ప్రతిగా దక్షిణ కొరియా కూడా మూడు గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించింది. గురువారం కూడా ఉత్తరకొరియా ఆరు క్షిపణులు ప్రయోగించడంతో జపాన్ అప్రమత్తమైంది. అమెరికా, దక్షిణ కొరియా 240 యుద్ధ విమానాలతో చేస్తున్న సంయుక్త విన్యాసాలు శుక్రవారంతో ముగియాల్సి ఉంది. తాజా పరిణామాలతో వాటిని శనివారమూ కొనసాగించనున్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తరకొరియా ప్రకటించింది. ఈ తప్పిదానికి పశ్చాత్తాప పడతాయంటూ బెదిరించింది. కానీ, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించలేదు. అణ్వస్త్ర దేశంగా గుర్తింపు పొందడంతోపాటు ఆంక్షలను ఎత్తివేసేలా అమెరికాపై ఒత్తిడి పెంచేందుకే ఉత్తరకొరియా ఇటువంటి తెగింపు చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
అధ్వాన్నం: దేశాధినేతలకు డబ్ల్యూహెచ్ఓ అక్షింతలు
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభింస్తున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి చాలా తీవ్రతరం అవుతోందని, సమీప భవిష్యత్తులో తిరిగి సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం కనిపించడం లేదని హెచ్చరించింది. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియేసన్ తాజాగా సూచించారు. యూరోప్, ఆసియా దేశాలు మహమ్మారి కట్టడిలో కొంత విజయం సాధించినప్పటికీ చాలా వరకు ప్రపంచ దేశాలు వైరస్‌ను ఎదుర్కొనే అంశంలో తప్పుడు విధానాలు అవలంబిస్తున్నాయని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. పటిష్టమైన చర్యలను అమలు చేయని కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. జెనీవాలో సోమవారం (నిన్న) మీడియాతో మాట్లాడిన ఆయన నిర్దిష్టంగా నాయకుల పేర్లను ప్రస్తావించకుండానే దేశాధినేతలపై విమర్శలు చేశారు. మహమ్మారి నియంత్రణలో దేశాధినేతల మిశ్రమ సందేశాలతో అంత్యత కీలకమైన విశ్వాసం ప్రజల్లో సన్నగిల్లుతోందని టెడ్రోస్ ఆరోపించారు. వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు ప్రజల్లో అవగాహనతోపాటు ఆయా ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సమగ్ర చర్యలు తీసుకోకపోతే, పటిష్టమైన చర్యలు చేపట్టకపోతే పరిస్థితి మరింత దారుణంగా దిగజారి పోనుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక దూరం, హ్యాండ్‌వాష్, మాస్క్‌లను ధరించడం లాంటి అంశాలపై ప్రజలు, ప్రభుత్వాలు దృష్టిపెట్టాలన్నారు. లేదంటే మరింత అధ్వాన్నపరిస్థితులకు దారి తీస్తుందని టెడ్రోస్ హెచ్చరించారు. అంతేకాదు జాగ్రత్తలు పాటించకపోతే ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కాగా అమెరికాలో రికార్డు స్థాయిలో ఒక రోజులో 63,998 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు అమెరికాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 34,77,993కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 1,38,234కి చేరింది. భారతదేశంలో ఒక రోజులో రికార్డు స్థాయిలో 27,151 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 540 మందికి పైగా ఈ వ్యాధితో మరణించారు. దీంతో మొత్తం కేసులు 9 లక్షలు దాటాయి. అటు ఒక రోజులో 276 కంటే ఎక్కువ మరణాలతో మెక్సికో ఇటలీని అధిగమించింది. రోజు రోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంతో డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది. -
అత్యంత హీనంగా కేరళ సర్కారు తీరు
కొల్లం(కేరళ), బలంగిర్(ఒడిశా): శబరిమల అంశంపై కేరళ ప్రభుత్వం అత్యంత హీనంగా వ్యవహరించి, చరిత్రలో నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రేషన్ సరుకులను పక్కదారి పట్టకుండా ఆపి, రూ.90వేల కోట్ల కుంభకోణాన్ని బట్టబయలు చేసినందుకు తనను తొలగించేందుకు కుట్ర జరిగిందని ప్రధాని ఆరోపించారు. మంగళ వారం ఆయన కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లం (కేరళ), బలంగిర్ (ఒడిశా)లలో జరిగిన కార్యక్రమాల్లో ప్రసంగించారు. అవినీతి, మతతత్వం, కులతత్వం అంశాల్లో కేరళలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్డీఎఫ్) ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఒకే నాణేనికి రెండు పార్శా్వల వంటివని పేర్కొన్నారు. ‘శబరిమల అంశంపై కేరళలోని వామపక్ష ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత హీనమైందిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇలా మరే ప్రభుత్వం కానీ, పార్టీ కానీ చేయలేదు. కమ్యూనిస్టులకు చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలపై ఏమాత్రం గౌరవభావం ఉండదని మనకు తెలుసు. కానీ, ఇంత హేయంగా వ్యవహరిస్తుందని ఎవరూ ఊహించలేరు’ అని తీవ్రంగా దుయ్యబట్టారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై పార్లమెంట్ లోపల ఒకలా, పత్తనంతిట్ట (అయ్యప్ప కొలువైన జిల్లా)లో మరోలా మాట్లాడుతున్న కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. కేరళ ప్రజలకు, వారి సంప్రదాయాలకు రక్షణగా నిలిచే ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పారు. ‘యూడీఎఫ్, ఎల్డీఎఫ్ లకు ఒక్కటే చెబుతున్నా. మా కార్యకర్తను తక్కువగా చూడొద్దు. త్రిపురలో జరిగిందే ఇక్కడా జరుగుతుంది’ అని అన్నారు. నన్ను తొలగించేందుకు కుట్ర నకిలీ పత్రాల ద్వారా రూ.90వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకున్నందుకు తనను పదవి నుంచి తొలగించేందుకు చూశారని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘గత ప్రభుత్వాల హయాంలో దళారులు.. లేకపోయినా ఉన్నట్లు పత్రాలు సృష్టించి రేషన్ కార్డులు, వంట గ్యాస్ కనెక్షన్లు, పింఛన్లు పొందారు. మా ప్రభుత్వం అలాంటి ఆరు కోట్ల పేర్లను గుర్తించి రూ.90వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టే పెద్ద కుంభకోణాన్ని అడ్డుకుంది. తమ ఆటలు సాగకపోయేసరికి ఈ అక్రమార్కులంతా ఏకమై ఈ‘చౌకీదార్’ను తొలగించేందుకు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు’ అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ కొల్లాంలోని జాతీయ రహదారి–66పై నిర్మించిన 13 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును, బలంగీర్‌లో రూ.1,550 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. -
విమాన సేవలు దారుణం
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో చెక్–ఇన్ కౌంటర్ల వద్ద పరిస్థితి అధ్వానంగా ఉందనీ, సిబ్బంది తక్కువ ఉండడంతో బోర్డింగ్ పాస్ జారీ బాగా ఆలస్యమవుతోందని, దీంతో ప్రయాణికులు చాలా సార్లు విమానం మిస్‌అవుతున్నారని పార్లమెంటరీ స్థాయీ సంఘం (స్టాండింగ్ కమిటీ) నివేదించింది. ఈ నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇండిగో వంటి చౌకధరల విమానయాన సంస్థల చెక్–ఇన్ కౌంటర్లలో ఈ సమస్య తీవ్రంగా ఉందని రవాణా, పర్యాటకం, సంస్కృతి విభాగాల స్థాయీ సంఘం తెలిపింది. కొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా ప్రయాణికులను చెక్–ఇన్ క్యూలో అధిక సమయం నిల్చోబెట్టి, వారు టికెట్ బుక్ చేసుకున్న విమానమెక్కే అవకాశం లేకుండా చేసి, ఆ తర్వాతి విమానంలో అధిక చార్జీలు చెల్లించి ప్రయాణించేలా అక్రమాలకు పాల్పడుతున్నాయని నివేదించింది. విమానాశ్రయాల్లో ఆయా సంస్థలకు తగినన్ని చెక్–ఇన్ కౌంటర్లు ఉండేలా ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తున్న సంస్థలు చర్యలు తీసుకోవాలనీ, రద్దీ సమయాల్లో చెక్–ఇన్ కౌంటర్లలో సిబ్బందిని పెంచాలని సూచించింది. బోర్డింగ్ పాస్ పొందడానికి ప్రయాణికులు 10 నిమిషాలకు మించి ఎక్కువ సేపు క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదంది. ఇటీవల ఇండిగో సిబ్బంది ఓ ప్రయాణికుడిని కిందపడేసి కొట్టడాన్ని కమిటీ ఆక్షేపించింది. ఇది సంస్థాగతమైన సమస్య అనీ, ప్రయాణికుల పట్ల ఆ సంస్థ ఉద్యోగులు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించింది. కొన్నిసార్లు విమానసంస్థలు టికెట్ రేట్లను 10 రెట్లు పెంచేసి అడ్డగోలు దోపిడీకి దిగుతున్నాయనీ, ఈ విషయం పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని స్థాయీ సంఘం నివేదికలో పేర్కొంది. టికెట్ రద్దు చార్జీలు కూడా బేస్ ఫేర్‌లో 50 శాతానికి మించకుండా నియంత్రణ విధించాలని కమిటీ సూచించింది. -
భారత్ కన్నా రష్యా జైళ్లే నయం
లండన్: భారత జైళ్ల వ్యవస్థ రష్యాలో కన్నా ఘోరంగా ఉంటుందని విజయ్ మాల్యా తరఫున లండన్ కోర్టులో కేసు వాదిస్తున్న న్యాయవాదుల బృందం మంగళవారం వ్యాఖ్యానించింది. భారత్‌లో బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను తిరిగి అప్పగించే విషయమై అక్కడి కోర్టులో సోమవారం నుంచి విచారణ ప్రారంభమవడం తెలిసిందే. మాల్యా తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ‘జైలులో విజయ్ మాల్యాకు సురక్షిత వాతావరణం కల్పిస్తామని భారత అధికారులు చెబుతున్నా అందుకు అనువైన యంత్రాంగమేదీ అక్కడ లేదు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘనకు గురైనప్పుడు కూడా పరిస్థితిని అక్కడి ప్రభుత్వం సరిదిద్దడం లేదు. రష్యాలో జైళ్లు భారత్‌లో కన్నా ఎంతో మెరుగ్గా ఉంటాయి’ అని న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్నాట్కు తెలిపారు. సాధారణంగా రష్యాలో ఖైదీల అప్పగింత కేసులు అక్కడి జైళ్లలో ఉండే సదుపాయాలపై ఆధారపడి ఉంటాయి. అలాంటి దేశంతో భారత్‌ను ఎలా పోలుస్తారని న్యాయమూర్తి ప్రశ్నించగా... కోర్టు ఆదేశాలు జైలులో ఉల్లంఘనకు గురవుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు కనీసం రష్యాలో అయితే అంతర్జాతీయ నిపుణులను అనుమతిస్తారనీ, కానీ భారత్‌లో ఆ అవకాశం కూడా ఉండదని వివరించారు. -
ప్రమాదంలో ఉత్తర భారత నగరాలు
సాక్షి, న్యూఢిల్లీ : శత్రుదేశాల భయంకన్నా.. వాతావరణ కాలుష్యమే భారతీయ నగరాలను భీకరంగా వణికిస్తోంది. పాకిస్తాన్ అణు దాడికన్నా గాలి కాలుష్యమే భారతీయులను దారుణంగా పొట్టన పెట్టుకునేలా ఉంది. దేశం రాజధానిలో ఆవరించిన పొగమంచు, కాలుష్యం అందరికీ తెలిసిందే. ఇదొక్క ఢిల్లీకే పరిమితం కాకుండా పలు ఉత్తర భారతీయ నగరాలపై పంజా విసురుతోంది. నగరాలు.. కాలుష్య కాసారాలు దేశ రాజధాని ఢిల్లీతో పాటు, పట్నా, కాన్పూర్, లక్నో, మొరాదాబాద్, జైపూర్, హౌరా వంటి నగరాలపై వాయు కాలుష్యం పడగలు చాస్తోంది. గత మంగళవారం నాడు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 448 సూచిస్తోంది. ఇదే ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో 500 తాకింది. ఆయా నగరాల్లో గాలి నాణ్యత అత్యంత కనిష్టానికి చేరింది. గడచిన వారం రోజులుగా మొరాబాదాబద్లో గాలి నాణ్యత 450 నుంచి 500 మధ్యలోనే ఉంటోంది. భయపడాల్సిన పని లేదు మరో వారం రోజుల్లో ఢిల్లీ, మొరాదాబాద్ నగరాల్లో వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. వాయు కాలుష్యాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదపు అంచుల్లో నగరాలు గంగాతీర మైదానంలో ఉన్న ఉత్తర భారత ప్రధాన నగరాలపై వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉందని నాసా తెలిపింది. ప్రధానంగా లక్నో, ఆగ్రా, కాన్పూర్, ముజఫర్‌పూర్, పట్నా వంటి నగరాలపై వాము కాలుష్య ప్రభావం అత్యంత తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. -
సౌదీలో భారత్ వర్కర్ కష్టాలు...!
ఉపాధి కోసం సౌదీకి వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కొందరు, కుటుంబ భారాన్ని మోసేందుకు మరికొందరు సుదూర తీరాల నుంచి దుబాయ్ కి వలసలు వెళ్తుంటారు. వీరిలో కొందరు కొన్నాళ్ల తర్వాత స్వదేశానికి వచ్చి స్థిరపడుతున్నా... ఎక్కువశాతం మంది అక్కడ యజమానులు పెట్టే హింసలకు, ఇబ్బందులకు గురై తీవ్ర కష్టాల్లో కూరుకుపోతున్నారు. ప్రస్తుతం ఫేస్బుక్లో కలకలం సృష్టించిన వీడియో ఈ కష్టాలు, కన్నీళ్లను కంటికి కట్టినట్లు చూపిస్తోంది. భారత్ నుంచి సౌదీ అరేబియాకు డ్రైవర్ పనికోసం వెళ్లి యజమాని పెట్టే హింసలను భరించలేక కన్నీటి పర్యంతమౌతున్న అబ్దుల్ సత్తార్ మకందర్ వీడియో సౌదీ కష్టాలను కళ్లకు కట్టింది. రెండేళ్ల క్రితం ఉపాధి కోసం వెళ్లి సౌదీ అరేబియాలో డ్రైవర్‌గా చేరిన 35 ఏళ్ల సత్తార్ మకందర్ అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సత్తార్ కన్నీటి కథ వీడియో ను ఢిల్లీకి చెందిన కార్యకర్త కుందన్ శ్రీవాస్తవ గతవారం ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఇంటర్నెట్లో ఆ వీడియో దేశ విదేశాల్లోనూ వైరల్‌గా వ్యాపించింది. తన యజమాని స్వదేశానికి (ఇండియాకు) పంపించడం లేదంటూ వీడియోలో సత్తార్ కన్నీరు మున్నీరయ్యాడు. తనకు జీతం కూడా సరిగా చెల్లించడం లేదని, కనీసం తిండికి కూడా డబ్బు ఇవ్వడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే సత్తార్ వీడియో అతడికి మేలు చేయకపోగా, మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. సౌదీలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సత్తార్ వీడియో ఇంటర్నెట్లో వ్యాపించడంతో సౌదీ అధికారులు అతడిని అరెస్టుచేశారు. తప్పుడు సమాచారం వ్యాపింపజేయడం సౌదీ అరేబియాలో క్రిమినల్ చర్యగా భావించిన అధికారులు అతడ్ని అరెస్ట్ చేశారు. దీంతో వెంటనే సౌదీ అధికారులను సంప్రదించి వెంటనే అసలు వీడియోను ఇంటర్నెట్ నుంచి తొలగించి, క్షమాపణలు చెప్పానని శ్రీవాస్తవ తెలియజేశాడు. మానవ హక్కుల కార్యకర్త అయిన శ్రీవాస్తవ మానవత్వమే తన కుటుంబమని, మానవులంతా తమకుటుంబంలోని వారిగానే భావిస్తానని, అందుకే సత్తార్ ను సైతం తన కుటుంబంలోని వ్యక్తిగా భావించి అతడి తరపున క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించాడు. ఈ సందర్భంలో సత్తార్ మకందర్ ఎ1 సరూర్ యునైటెడ్ గ్రూప్ లో పని చేస్తున్నాడని, అతడికి కంపెనీ సమయానికి జీతం చెల్లిస్తోందని, అతడికి పనిచేయడం ఇష్టం లేకపోతే స్వేచ్ఛగా వైదొలగవచ్చునని రిక్రూట్ మెంట్ ఏజెన్సీకి చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. అయితే తాను చెప్పిన క్షమాపణలతో సత్తార్ ను విడిచి పెట్టారని, కానీ మర్నాడు వెంటనే మరో కారణంతో అరెస్టు చేశారని శ్రీవాస్తవ చెప్తున్నాడు. మకందర్ తల్లి కూడా అతడితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. అరెస్టు కాకముందు ఐదురోజుల క్రితం సత్తార్ ఓసారి తనతో మాట్లాడాడని, ఆ తర్వాత సత్తార్ ను అరెస్టు చేసినట్లు స్నేహితులు చెప్పారని ఆమె తెలిపింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించలేదని శ్రీవాస్తవ అన్నాడు. ఇప్పటికీ మకందర్ ఖైదీగానే ఉన్నాడని, ఏ ప్రభుత్వం అతడికి సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. -
తెలుగుదేశం తీరు అధ్వానం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ విమర్శ గొలుగొండ: చంద్ర బాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచి ప్రతిపక్షనాయుకుడైన జగన్మోహన్రెడ్డిని విమర్శించడం తగ దని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం ఆయన లింగంపేట నూకాలమ్మతల్లిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో స్వీక ర్ కోడెల శివప్రసాద్ తీరు అధ్వానంగా ఉందని అన్నారు. ప్రతిపక్షనాయుకుడు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తుంటే మైక్ కట్ చేయడం ఇప్పటి వరకు ఏ అసెంబీల్లో జరగలేదని అన్నారు. వాస్తవాలు మాట్లాడుతుటే జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు విరుచుకుపడటం సమంజసం కాదని తెలిపారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలో ప్రజలకు చంద్రబాబునాయుడు మేలు చేసే విధంగా లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల విశాఖపట్నం జిల్లాకు ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. అటువంటి ప్రాజెక్టు కట్టకుండా తెలుగుదేశం ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందని వాటిలో ఏడాది గడిచిన ఏ ఒక్కటీ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. అవినీతి గురించి మాట్లాడే చంద్రబాబునాయుడు తన ప్రభుత్వంలో అవినీతి నాయకులకు మంత్రి పదవులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ఒకటి నుంచి వంద వరకు అంకెలు రాని అచ్చెన్ననాయుడు జగన్మోహన్రెడ్డిని విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. అమలు కానీ హమీలు ఇచ్చి ప్రజలు మోసం చేయడం చంద్రబాబునాయుడుకు అలవాటేనని ఆరోపించారు. ఇప్పటిల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం బండారం బయటపడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్, మండల పార్టీ అధ్యక్షుడు రాయపురెడ్డి నాగేశ్వర్రావు, యాత్ అధ్యక్షలు కవి, సీనియర్ నాయకులు చిటికెల భాస్కరనాయుడు, ధనిమిరెడ్డి నాగు,కోనేటి రామకృష్ట, తమరాన నాయుడు, జి. నాగేశ్వరరావు, లగుడు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అధ్వానంగా కార్పొరేషన్
మంత్రి నారాయణ అసహనం నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): చెత్తా-చెదారం. అధికారులు-పనితీరుతో నెల్లూరు కార్పొరేషన్ వరస్ట్‌గా మారింది. మంత్రిగా బాధ్యతలు చే పట్టిన పదిరోజుల తర్వాత అక్రమ కుళాయిల లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించా. ఇంతవరకూ అరీగురీ లేదని నారాయణ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడారు. చెత్త, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, తాగునీరు, సిటీప్లానింగ్, విద్యావిభాగం, ఆక్రమణలు, ప న్నులు చెల్లించడం ఇలా ప్రతి విభాగం అధ్వానంగా ఉ న్నాయని అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్య క్తం చేశారు. వచ్చే శనివారం లోపు అన్నీ విభాగాలను క్రమపరచాలని కమిషనర్ చక్రధర్‌బాబుకు పలు సూచనలు చేశారు. చెత్తను డంప్‌యార్డుకు చేర్చే విధా నం పూర్తిగా విరుద్దంగా ఉందన్నారు. చిన్న, చిన్న ఆటోల్లో 25కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంతాలి డంప్‌యార్డుకు చేర్చడం వల్ల ఇంధనం, ధనం వృథా అవుతోందన్నారు. చిన్నచిన్న బండ్లలో సేకరించిన చెత్తను పెద్ద వాహనాల ద్వారా డంప్‌యార్డుకు చేర్చడంపై చర్యలు చేపడుతామన్నారు. 1972లో నిర్మించిన అండర్ గ్రౌండ్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదన్నారు. కాలువల మురుగునీరు సర్వేపల్లి కాలువలోకి వదిలివేస్తున్నారనీ దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. 30ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరా న్ని మోడల్ సిటీగా రూపొందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నామన్నారు. కార్పొరేషన్లో కొత్తగా విలీనమైన 16గ్రామాలకు నీటి అవసరం తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. నగర పరిధిలో 1.23 లక్షల ఇళ్లు ఉంటే కేవలం 41,640 కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపడాన్ని ఆ యన తీవ్రంగా పరిగణించారు. అనధికార కుళాయిల లెక్కలను ఇంతవరకూ తేల్చకపోవడంపై అధికారులు వివిధ కారణాలు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. త్వరలో అక్రమ కుళాయిలను క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించారు. అత్యంత దారుణమైన స్థితిలో టౌన్‌ప్లానింగ్ విభాగం ఉందన్నారు. ప్లాన్ అ ప్రూవల్ను సులభతరం చేస్తామన్నారు. ఇంట్లోనుంచే కంప్యూటర్ ద్వారా ప్లాన్ అప్రువల్ పొందే వ్యవస్థను రాబోవు రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చ ర్యలు తప్పవన్నారు. నియమ, నిబంధనలు కచ్చితం గా ఉంటేనే స్మార్ట్ సిటీ అవకాశం కలుగుతుందన్నారు. నిబందనలు పాటించడంలో రాజీ పడేది లేదన్నారు. ఆక్రమణల తొలగింపు, అక్రమ లేఅవుట్లపై ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేదిలేదనీ స్పష్టంచేశారు. నగరంలో ఆక్రమణలు గుర్తించి వాటిని క్రమబద్ధీకరించాలన్నారు. కార్పొరేషన్‌కు చెందిన 237దుకాణాల అద్దెల వివరాలను కంప్యూటరైజ్డ్ చేస్తామన్నారు. మూడు డిస్పెన్సరీలో పరికరాలు, సిబ్బంది లేకపోవడం బాధాకరమన్నారు. నెలరోజుల పాటు పరిశీలించి డిస్పెన్సరీకి వ స్తున్న రోగులను బట్టి డిస్పెన్సరీలు ఉంచడమా, మూ యడమా తదితర అంశాలను పరిశీలిస్తామన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఉన్న లోపాలను పరిశీ లించి సరిచేసి త్వరలో ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు చర్యలు చేపడుతామన్నారు. కార్పొరేషన్ పరిధిలో 64స్కూల్స్, 12వేల మంది విద్యార్థులకు మూడు క్లస్టర్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. కమిషనర్ చక్రధర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బం దితో సమాలోచనలు జరిపామన్నారు. సమస్యలున్న చోటే పరిష్కారాలు కనుగొన్నాలన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. తక్కువ సమయం లో మోడల్ సిటీగా రూపొందించేందుకు కృషిచేస్తామ ని తెలిపారు. మేయర్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మే యర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీ డర్ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
బాల్యవివాహం రేప్ కంటే దారుణం
న్యూఢిల్లీ: బాల్యవివాహాలపై ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం కంటే బాల్యవివాహం దారుణమని పేర్కొంది. 14 ఏళ్ల వయసులోనే ఓ బాలికకు వివాహం చేశారు. భర్త, అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఆ బాలిక కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సమాజంలో బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టాలని సూచించింది. -
ఆహార అభద్రత
జిల్లాలో ఆహార భద్రత శాఖ పనితీరు దారుణంగా ఉంది. ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు సీమాంధ్ర ప్రాంతంనుంచి అప్ అండ్ డౌన్ చేస్తుండడంతో వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఆరు నెలల కాలంలో 48 కేసులే నమోదు కావడం, జూన్ 15 తర్వాత ఒక్క కేసూ లేకపోవడం ఆ శాఖ పనితీరుకు నిదర్శనం. ఖలీల్‌వాడి, న్యూస్‌లైన్ : ఆహార పదార్థాల కల్తీని నిరోధించడంలో ఆహా ర భద్రత శాఖ అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో ఈ శాఖ ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియదు. గతంలో ఈ శాఖను ఆహార కల్తీ నిరోధక శాఖ అని పిలిచేవారు. 2011 ఆగస్టు 8వ తేదీన ఆహార భద్రత శాఖగా పేరు మార్చారు. అయితే ఈ విషయం శాఖ అధికారులకు తెలియదో, లేదా పట్టించుకోలేదో.. బోర్డు మాత్రం మార్చలేదు. ఇటీవల ఈ విషయమై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు బోర్డుపై పేరు మార్పించారు. సీమాంధ్ర నుంచి అప్ అండ్ డౌన్.. ఆహార భద్రత శాఖ అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. మూడు నెలల క్రితం జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి గంగాధర్ వైఎస్సార్ కడప జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానం రెండు నెల ల పాటు ఖాళీగా ఉంది. ఇన్చార్జి బాధ్యతలు సైతం ఎవరికీ అప్పగించ లేదు. నెలక్రితం ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారిగా అమృతశ్రీ వచ్చారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రసాద్, ప్రహ్లాద్‌లు స్థానికంగా ఉండరు. ప్రసాద్ అనే అధికారి విజయవాడనుంచి వచ్చి వెళుతుంటారు. ప్రహ్లాద్ అనే అధికారి కర్నూలునుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. దీంతో వీరు ఎ ప్పుడు వస్తున్నారో ఎంతసేపు ఉంటున్నారో తెలియని పరిస్థితి. గతంలో జిల్లా ఉన్నతాధికారి లేనందున తనిఖీలు చేయడం లేదని తప్పించుకున్నారు. జిల్లా అధికారి వచ్చిన తర్వాత కూడా వీరు ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదు. ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు 48 కేసులే నమోదు కావడం గమనార్హం. అందులో జూలై 15 నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కాగా వంద కేసులు నమోదు చేశామని శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఫిర్యాదు వస్తే స్పందిస్తాం -అమృతశ్రీ, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి గతంలో జిల్లాలో ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి లేకపోవడంతో తనిఖీలు నిర్వహించలేదు. ఫిర్యాదులు వస్తే స్పందిస్తాం. తనిఖీలు నిర్వహించి, కేసులు నమోదు చేస్తాం.