అధ్వానంగా కార్పొరేషన్
మంత్రి నారాయణ అసహనం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): చెత్తా-చెదారం. అధికారులు-పనితీరుతో నెల్లూరు కార్పొరేషన్ వరస్ట్‌గా మారింది. మంత్రిగా బాధ్యతలు చే పట్టిన పదిరోజుల తర్వాత అక్రమ కుళాయిల లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించా. ఇంతవరకూ అరీగురీ లేదని నారాయణ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడారు. చెత్త, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, తాగునీరు, సిటీప్లానింగ్, విద్యావిభాగం, ఆక్రమణలు, ప న్నులు చెల్లించడం ఇలా ప్రతి విభాగం అధ్వానంగా ఉ న్నాయని అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్య క్తం చేశారు. వచ్చే శనివారం లోపు అన్నీ విభాగాలను క్రమపరచాలని కమిషనర్ చక్రధర్‌బాబుకు పలు సూచనలు చేశారు. చెత్తను డంప్‌యార్డుకు చేర్చే విధా నం పూర్తిగా విరుద్దంగా ఉందన్నారు.
చిన్న, చిన్న ఆటోల్లో 25కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంతాలి డంప్‌యార్డుకు చేర్చడం వల్ల ఇంధనం, ధనం వృథా అవుతోందన్నారు. చిన్నచిన్న బండ్లలో సేకరించిన చెత్తను పెద్ద వాహనాల ద్వారా డంప్‌యార్డుకు చేర్చడంపై చర్యలు చేపడుతామన్నారు. 1972లో నిర్మించిన అండర్ గ్రౌండ్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదన్నారు. కాలువల మురుగునీరు సర్వేపల్లి కాలువలోకి వదిలివేస్తున్నారనీ దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. 30ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరా న్ని మోడల్ సిటీగా రూపొందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నామన్నారు. కార్పొరేషన్‌లో కొత్తగా విలీనమైన 16గ్రామాలకు నీటి అవసరం తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. నగర పరిధిలో 1.23 లక్షల ఇళ్లు ఉంటే కేవలం 41,640 కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపడాన్ని ఆ యన తీవ్రంగా పరిగణించారు. అనధికార కుళాయిల లెక్కలను ఇంతవరకూ తేల్చకపోవడంపై అధికారులు వివిధ కారణాలు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. త్వరలో అక్రమ కుళాయిలను క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించారు. అత్యంత దారుణమైన స్థితిలో టౌన్‌ప్లానింగ్ విభాగం ఉందన్నారు. ప్లాన్ అ ప్రూవల్‌ను సులభతరం చేస్తామన్నారు. ఇంట్లోనుంచే కంప్యూటర్ ద్వారా ప్లాన్ అప్రువల్ పొందే వ్యవస్థను రాబోవు రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చ ర్యలు తప్పవన్నారు. నియమ, నిబంధనలు కచ్చితం గా ఉంటేనే స్మార్ట్ సిటీ అవకాశం కలుగుతుందన్నారు. నిబందనలు పాటించడంలో రాజీ పడేది లేదన్నారు.
ఆక్రమణల తొలగింపు, అక్రమ లేఅవుట్లపై ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేదిలేదనీ స్పష్టంచేశారు. నగరంలో ఆక్రమణలు గుర్తించి వాటిని క్రమబద్ధీకరించాలన్నారు. కార్పొరేషన్‌కు చెందిన 237దుకాణాల అద్దెల వివరాలను కంప్యూటరైజ్డ్ చేస్తామన్నారు. మూడు డిస్పెన్సరీలో పరికరాలు, సిబ్బంది లేకపోవడం బాధాకరమన్నారు. నెలరోజుల పాటు పరిశీలించి డిస్పెన్సరీకి వ స్తున్న రోగులను బట్టి డిస్పెన్సరీలు ఉంచడమా, మూ యడమా తదితర అంశాలను పరిశీలిస్తామన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఉన్న లోపాలను పరిశీ లించి సరిచేసి త్వరలో ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు చర్యలు చేపడుతామన్నారు. కార్పొరేషన్ పరిధిలో 64స్కూల్స్, 12వేల మంది విద్యార్థులకు మూడు క్లస్టర్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. కమిషనర్ చక్రధర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బం దితో సమాలోచనలు జరిపామన్నారు. సమస్యలున్న చోటే పరిష్కారాలు కనుగొన్నాలన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. తక్కువ సమయం లో మోడల్ సిటీగా రూపొందించేందుకు కృషిచేస్తామ ని తెలిపారు. మేయర్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మే యర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీ డర్ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.