వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ విమర్శ
గొలుగొండ: చంద్ర బాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచి ప్రతిపక్షనాయుకుడైన జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం తగ దని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఆదివారం ఆయన లింగంపేట నూకాలమ్మతల్లిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో స్వీక ర్ కోడెల శివప్రసాద్ తీరు అధ్వానంగా ఉందని అన్నారు. ప్రతిపక్షనాయుకుడు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తుంటే మైక్ కట్ చేయడం ఇప్పటి వరకు ఏ అసెంబీల్లో జరగలేదని అన్నారు. వాస్తవాలు మాట్లాడుతుటే జగన్‌మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు విరుచుకుపడటం సమంజసం కాదని తెలిపారు.
ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలో ప్రజలకు చంద్రబాబునాయుడు మేలు చేసే విధంగా లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల విశాఖపట్నం జిల్లాకు ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. అటువంటి ప్రాజెక్టు కట్టకుండా తెలుగుదేశం ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందని వాటిలో ఏడాది గడిచిన ఏ ఒక్కటీ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. అవినీతి గురించి మాట్లాడే చంద్రబాబునాయుడు తన ప్రభుత్వంలో అవినీతి నాయకులకు మంత్రి పదవులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.
ఒకటి నుంచి వంద వరకు అంకెలు రాని అచ్చెన్ననాయుడు జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. అమలు కానీ హమీలు ఇచ్చి ప్రజలు మోసం చేయడం చంద్రబాబునాయుడుకు అలవాటేనని ఆరోపించారు. ఇప్పటిల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం బండారం బయటపడుతుందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్, మండల పార్టీ అధ్యక్షుడు రాయపురెడ్డి నాగేశ్వర్రావు, యాత్ అధ్యక్షలు కవి, సీనియర్ నాయకులు చిటికెల భాస్కరనాయుడు, ధనిమిరెడ్డి నాగు,కోనేటి రామకృష్ట, తమరాన నాయుడు, జి. నాగేశ్వరరావు, లగుడు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.