WORST ADMINISTRATION
-
రాజన్న సన్నిధిలో అపరిశుభ్రత
సాక్షి, వేములవాడ : కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న వేములవాడ రాజన్న గుడి వద్ద అపరిశుభ్రం రాజ్యమేలుతోంది. ఏటా లక్షలాది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్న ఈ క్షేత్రంలో పారిశుధ్యం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, భక్తులు పడేసిన విస్తర్లు, చెత్త, ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తున్నాయి. రద్దీ సమయంలో ఇంకా చెత్త పెరిగిపోయి పారిశుధ్యం లోపించి దుర్వాసన వెదజల్లుతోందని భక్తులు మొత్తుకుంటున్నారు. చెత్త కుప్పలు.. మలినాలు రాజన్న ఆలయ ఆవరణతోపాటు క్యూలైన్ల వెంట చెత్తకుప్పలు, మలినాలు దర్శనమిస్తున్నాయి. ఇక క్యూలైన్లలోని మరుగుదొడ్ల వద్ద ముక్కులు మూసుకునే దుస్థితి నెలకొంది. ప్రధానాలయం ముందు భాగంలో చెత్త కుప్పలు అలాగే పడి ఉంటున్నాయి. రాజగోపురం వద్ద ప్లాస్టిక్ కవర్లు, చెత్త దర్శనమిస్తోంది. ధర్మగుండం వద్ద పారిశుధ్యం లోపించి దుర్వాసన వెదజల్లుతోంది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. ఏటా పారిశుధ్యం నిర్వహణకు ఆలయం నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా భక్తులకు మాత్రం స్వచ్ఛమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో ఆలయ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతుందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
తాడిపత్రిలో రాక్షస పాలన
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి నియోజకవర్గంలో రాక్షసపాలన సాగుతోందని, ప్రజలను రక్షించేందుకే బీజేపీలో చేరామని మండలంలోని చిన్నపోలమడ గ్రామంలో ఉన్న ప్రభోదనందస్వామి ఆశ్రమ నిర్వాహకులు యోగానందచౌదరీ పేర్కొన్నారు. ముళ్లును ముళ్లుతోనే తీయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నామన్నారు. కొందరు ప్రజాప్రతినిధులు రౌడీలమని చెప్పుకుంటూ నియంత పాలన చేస్తున్నారని ఆరోపించారు. యోగానందచౌదరీ సోదరుడు జితేంద్రచౌదరి మాట్లాడుతూ స్థానిక రాజకీయ నాయకులకు దేవుడన్న, ప్రజలన్న గౌరవం లేదన్నారు. అందుకే కృష్ణామందిరం ఆశ్రమంలో చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దేవాదాయ శాఖ మంత్రి సమక్షంలో.. ప్రభోదనంద ఆశ్రమ నిర్వాహకులు యోగానందచౌదరి, జితేంద్రచౌదరీతో పాటు 3వేల మంది ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సమక్షంలో బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి, రాష్ట్ర సంఘటిత ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి రామకృష్ణారెడ్డి, యువమోర్చా రాష్ట్ర అ«ధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు హరిష్కుమార్రెడ్డిలతో కలిసి యోగనందచౌదరీ, జితేంద్రచౌదరిలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే 3 వేల మందితో సెల్‌ఫోన్ ద్వారా సభ్యత్వం నమోదు చేయించి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సామాన్యుల అలోచన దిశగా పరిపాలన చేస్తున్న నరేంద్రమోదీ పాలన చూసి ప్రభోదనంద ఆశ్రమ నిర్వాహకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరడం అభినందనీయన్నారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఇచ్చిన పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు. తాడిపత్రి ప్రాంతంలో బీజేపీ బలపడటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, రంగనాథరెడ్డి, రాంబాబు, ఆంజనేయలు, చంద్ర కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆరోగ్య ‘సిరి’కి మంగళం
ఒకప్పుడు ఏ జబ్బు చేసినా పేదలు భయపడేవారు కాదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఉందన్న భరోసాతో బతికేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ పథకానికి తూట్లు పొడిచిన తెలుగుదేశం పార్టీ సర్కారు ఎన్టీఆర్ వైద్యసేవగా పేరుమార్చి దానిని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోంది. నిధుల విడుదలలో అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా పేద రోగులు అల్లాడుతున్నారు. దీంతో ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ గళం విప్పనుంది. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనుంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్టీఆర్ వైద్యసేవగా మారుమార్చినా.. ఆ పథకం ఇప్పటికీ ఆరోగ్యశ్రీగానే జనం గుండెల్లో నిలిచిపోయింది. ఇది పేదలను ఆ పథకం ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తోంది. అలాంటి పథకం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సర్కారు నిర్వాకం వల్ల నిర్భాగ్యులకు అందకుండా పోతోంది. ఫలితంగా పేదలు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన హయాంలో ఆరోగ్యశ్రీ కార్డుతో దర్జాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స అనంతరం ఆరోగ్య సిరితో తిరిగి వచ్చిన రోజులను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ పథకం వివరాలు ఆరోగ్యమిత్రల వద్ద కూడా అందుబాటులో లేవంటే ఆ పథకం ఎంతగా నిరుగారిపోయిందో అర్థమవుతోంది. ప్రభుత్వం నిధులు తగ్గించడమే ఈ దుస్థితికి కారణం. దీనివల్ల ప్రైవేటు వైద్యశాలలు వైద్యసేవ ద్వారా శస్త్రచికిత్సలు చేయడానికి జంకుతున్నాయి. పేద రోగులను అవస్థల పాలే్జస్తున్నాయి. పక్షవాతం వంటి జబ్బులు వస్తే మంచి వైద్యం కోసం కార్పొరేటు ఆసుపత్రులకు వెళ్లే అవకాశం ప్రస్తుతం పేదలకు ఉండటం లేదు. కేవలం ప్రభుత్వ వైద్యశాలల్లోనే చికిత్స తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతినెలా మండల కేంద్రం లేదా గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, ఈ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎవరిని సంప్రదించాలనే విషయాలను వివరించేవారు. ప్రముఖ వైద్యులు పేదలకు సేవలు అందించేవారు. అయితే ఏడాదిగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా వైద్యశిబిరాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఆరోగ్యశ్రీకి రూకల్పన ఇలా.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని దివగంత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2007 జూలై 7న ప్రారంభించారు. తెల్ల కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు అర్హమైందిగా నిర్ణయించారు. ఈ సేవలకు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా రూపకల్పన చేశారు. 125 రకాల శస్త్రచికిత్సల అనంతరం ఏడాదిపాటు మందులు వాడాల్సి ఉండడంతో ఆ ఖర్చునూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయించారు. రోగులను ఇ¯ŒSపేషెంట్లుగా చేర్చుకునే ప్రక్రియలో ఆరోగ్యశ్రీ ట్రస్టు పకడ్బందీగా వ్యవహరించేది. అప్పట్లో కేవలం 12 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసే పద్ధతిని ట్రస్టు అమలు చేసింది. దీంతో పేదలకు సత్వరం వైద్యం అందేది. కానీ ఇప్పుడలా లేదు. కార్డుల పంపిణీ కూడా పెండింగ్‌లోనే .... తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చి ఆ పార్టీ రంగు కనబడేలా కొత్తగా హెల్త్‌కార్డులను రూపొందించారు. వీటిని లబ్ధిదారులకు అందించే బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల ద్వారా ఈ కార్డులను లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంది. అయితే పౌర సరఫరాల శాఖ అధికారుల వద్దే ఈ కార్డులు మూలుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో ఈ కార్డుల ముద్రణ పూర్తి చేశారు. ముద్రణలో లబ్ధిదారుల ఫొటోలు అదృశ్యమయ్యాయి. కొన్నింటిపై మాత్రమే ఫొటోలు ఉన్నాయి. జిల్లాలో కొన్నివేల కార్డులు పంపిణీ కాకుండా ఉండిపోయినట్లు సమాచారం. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు హెల్త్ కార్డులు లేక ఖరీదైన వైద్య సేవల కోసం కార్పొరేట్ హాస్పిటల్స్‌లో అప్పులు చేసి మరీ వైద్యం చేయించుకునే దుస్థితి నెలకొంది. నడుం కట్టిన వైఎస్సార్ సీపీ ఆరోగ్యశ్రీ నిర్వీర్యంతో జనం పడుతున్న అవస్థలను గమనించిన వైఎస్సార్ సీపీ వారి తరఫున పోరాటానికి సిద్ధమైంది. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమైంది. ఈ ధర్నాకు పార్టీ శ్రేణులు భారీ సన్నాహాలు చేస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం రాకతో అనారోగ్యం తెలుగుదేశం ప్రభుత్వం రాకతో ఆరోగ్యశ్రీ ఆనారోగ్యం బారిన పడింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరిన రోగులకు శస్త్రచికిత్సలు అవసరమైతే అనుమతులకే వారం నుంచి పదిరోజుల సమయం పడుతోంది. దీంతో పేదలు వైద్యం సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగుల బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వ తీరుతో వైద్యసేవ నెట్వర్క్ వైద్యశాలల్లో అత్యవసర శస్త్ర చికిత్సలను దాదాపుగా నిలిపివేశారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చిన తర్వాత మరో వంద జబ్బులను పథకంలో కలపడమే కాకుండా రూ.2 లక్షల పరిమితిని రూ.2.50లక్షలకు పెంచిన సర్కారు అనుమతుల మంజూరులో మాత్రం జాప్యం చేస్తోంది. నిధుల విడుదల్లో అలసత్వం ప్రదర్శిస్తోంది. దీనివల్ల చాలామంది పేదలు సొంత డబ్బుతోనే వైద్యం చేయించుకుంటున్నారు. ఫలితంగా పథకం లక్ష్యం నీరుగారుతోంది. దీనికితోడు ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు నెలలుగా బిల్లులు అందలేదు. దీంతో ఖరీదైన శస్త్రచికిత్సలకు ఆయా ఆసుపత్రులు వెనుకాడుతున్నాయి. చేద్దాములే అనే ధోరణిలో ఉన్నాయి. కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు ముందు డబ్బు పెట్టి వైద్యం చేయించేసుకోవాలని రోగులకు సూచిస్తున్నాయి. ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్, లేదా ఆపద్బంధు వంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నాయి. ప్రభుత్వాసుపత్రులకు కూడా సర్కారు బిల్లులు మంజూరు చేయడం లేదు. పెద్దమొత్తంలో బకాయి పెట్టింది. ఓ రోగికి ఆపరేష¯ŒS చేయాలంటే కనీసం పదిరోజులపైనే పడుతోంది. నరసాపురం వంటి ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవ ద్వారా ఆపరేషన్లు చేయకుండా ఏలూరు, కాకినాడలకు రిఫర్ చేస్తున్నారు.