writing skills
-
ఎక్కడ చూసినా ఇదే చర్చ.. చాట్ జీపీటీ! గూగుల్‌ని మించి? ఏది అడిగినా..
కంచర్ల యాదగిరిరెడ్డి ఆవకాయ పెట్టడం ఎలాగో అడిగితే గూగుల్ చెప్పగలదేమోగానీ.. సొంతంగా ఓ సినిమా కథ రాయమంటే మాత్రం చేతులెత్తేస్తుంది! మనమేది అడిగినా అవసరమైనదానితో పాటు సంబంధం లేని ఎన్నో విషయాలనూ గూగుల్ ఇస్తుంది. ఎందుకంటే.. ఎక్కడెక్కడి సమాచారాన్నో సేకరించి ఇవ్వడమే గూగుల్ చేయగలిగిన పని. సొంతంగా ఆలోచించడం దానికి సాధ్యం కాదు. ..అయితే మారుతున్న టెక్నాలజీతో ఈ పరిస్థితి మారిపోతోంది. గత ఏడాది నవంబర్‌లో విడుదలైన కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ ‘చాట్ జీపీటీ’ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అడిగిన సమాచారమేంటో కచ్చితంగా ఇస్తోంది. తప్పుగా అడిగితే తప్పనీ చెప్తోంది. విద్యార్థుల సందేహాలు తీరుస్తోంది. పిల్లల కథల నుంచి సాఫ్ట్వేర్ కోడ్ల దాకా రాసిపెడుతోంది. మరి ఏమిటీ చాట్ జీపీటీ? ఎలా పనిచేస్తుంది? ప్రయోజనం, ప్రభావాలేమిటి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ. అచ్చం మనిషిలా ఆలోచించి, స్పందించే కృత్రిమ మేధ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో చాట్ జీపీటీ తాజా అవతారం. గతేడాది నవంబర్లోనే విడుదలైంది. దీనిపై ఎవ రికీ హక్కుల్లేకపోవడం విశేషం.ఓపెన్ఏఐ.కామ్ అన్న వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని మీరూ దీంతో సంభాషించవచ్చు. ఆవకాయ నుంచి అణ్వాస్త్రాల వరకు, స్టాక్ మార్కెట్ నుంచి ఖగోళపు అంచుల వరకూ ఏ అంశంపైనైనా మాట్లాడవచ్చు. సినిమా స్క్రిప్ట్ రాయాలని రామ్‌గోపాల్ వర్మ అడిగితే.. మూడే సెకన్లలో రాసేసింది. ఇదంతా బాగానే ఉందికానీ.. ఏమిటీ చాట్ జీపీటీ? ఒక్క ముక్కలో చెప్పాలంటే చాటింగ్ చేయగల కృత్రిమ మేధ రోబో అనాలి! కాకపోతే యాంత్రికంగా కాకుండా మనలా ఆలోచించి చేస్తుందన్నమాట.ఈ–కామర్స్ సహా వివిధ రంగాల కంపెనీల వెబ్సైట్లలోనూ చాటింగ్ కోసం రోబోలను వాడుతున్నారు. కానీ వాటి స్పందనలు చాలా పరిమితం. కంపెనీకి లేదా సైట్‌కు సంబంధించిన అంశాలపై మాత్రమే వివరాలు ఉంటాయి. చాట్ జీపీటీ దీనికి భిన్నం. ఇది చేయగల పనులకు అంతం లేదని చెప్పవచ్చు. తప్పుదారి పట్టిస్తే.. పట్టేస్తుంది కంప్యూటర్ ప్రోగ్రాములు రాయడం, వాటిలోని తప్పులను (బగ్స్)ను గుర్తించి తొలగించడం కూడా చాట్ జీపీటీ చేయగలదు. సంగీతాన్ని పొందుపరచడం, టెలివిజన్ నాటకాలు, కల్పిత కథలు రాయడం వంటివీ అలవోకగా చేసేస్తుంది. విద్యార్థులకు వ్యాసాలు రాయడమే కాకుండా పరీక్షల్లో ప్రశ్నలకూ జవాబులిస్తుంది. పాటలు రాయడం, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ డేటా అనలిటిక్స్‌ను తయారు చేయడం, చాట్ రూమ్‌ను రూపొందించడం, టిక్–టాక్–టో వంటి ఆటలాడటం కూడా చేయగలదు. ఇలాంటి పనులు ఇతర రోబోలతోగానీ, గూగుల్‌తో కానీ అస్సలు సాధ్యం కాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చాట్‌జీపీటీ ఎంత తెలివైందంటే ఎప్పుడో వందల ఏళ్ల కింద అమెరికాను కనిపెట్టిన.. ‘క్రిస్టోఫర్ కొలంబస్ 2015లో అమెరికాకు వచ్చినప్పుడు ఏమైందో చెప్పు’అని అడిగామనుకోండి. మనం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని గుర్తిస్తుంది. ప్రశ్నలో ఉన్నట్టుగా క్రిస్టోఫర్ ఒకవేళ 2015లో అమెరికాకు వచ్చి ఉంటే ఏమై ఉండేదో ఊహించుకుని సమాధానం సిద్ధం చేస్తుంది. కొలంబస్ గతంలో చేసిన పనులపై ఇప్పుడు మనుషులేం అనుకుంటున్నారో కూడా పరిగణించి సమాధానాలిస్తుంది. అంతా బాగున్నట్టేనా? చాట్ జీపీటీకి కూడా ఎన్నో పరిమితులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ప్రయోగాత్మకంగా విడుదల చేసిన బీటా వెర్షన్ మాత్రమే. అయితే ఇన్‌స్ట్రక్ట్ జీపీటీ పేరుతో సిద్ధం చేసిన ఏఐ సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించడంతో.. దీనిద్వారా వచ్చే ప్రమాదకరమైన, మోసపూరితమైన సమాధానాలు తగ్గాయని నిపుణులు చెప్తున్నారు. ఇక జాతి విద్వేషాలు, ఉగ్రవాదం వంటి అంశాలకు సంబంధించిన సమాచారం చాట్‌జీపీటీకి దక్కకుండా ఓపెన్ ఏఐ సంస్థ జాగ్రత్తలు తీసుకుంటోంది. చాట్ జీపీటీ కొన్నిసార్లు తిక్క సమాధానాలు ఇస్తుందని.. అది దాని పరిమితి అని చెప్తోంది. పైగా 2022 డిసెంబర్ వరకూ చాట్ జీపీటీ రాజకీయాలపై వ్యాఖ్యలు చేయకుండా సాఫ్ట్‌వేర్‌లోనే పరిమితులు చేశారు. మొత్తంగా చాట్ జీపీటీ ద్వారా తప్పుడు సమాచారం లేదా తప్పుదోవ పట్టించే సమాచారం అందకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మధ్య మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మన దేశానికి వచ్చినప్పుడు ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. చాట్ జీపీటీతో మాట్లాడుతూ ఆయన ఓ ప్రశ్న వేశాడు. దక్షిణ భారతదేశంలో టిఫిన్ల రుచిని బట్టి ఓ జాబితా తయారు చేయమన్నారు. చాట్ జీపీటీ జాబితా తయారు చేసిందిగానీ.. అందులో బిర్యానీని కూడా చేర్చేసింది. ఆయనకు చిర్రెత్తుకొచ్చి.. బిర్యానీని టిఫిన్ అంటావా? నాలాంటి హైదరాబాదీని అవమానిస్తావా? అని కోపగించారు! మామూలు సాఫ్ట్వేర్ అయితే సంభాషణ ఇక్కడితో ఆగిపోయేదేమో! కానీ అది చాట్ జీపీటీ. వెంటనే ‘సారీ’చెప్పేసింది. పొరబాటుపడ్డానని ఒప్పేసుకుంది. సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవలే చాట్ జీపీటీతో చాటింగ్ చేశారు. చాలా అంశాలపై అవగాహన ఉన్న ఆయన.. త్వరగానే దాని సామర్థ్యాన్ని గుర్తించారు. వరుసగా కనీసం 17 ట్వీట్ల ద్వారా చాట్ జీపీటీతో జరిపిన సంభాషణలను దృష్టిలో ఉంచుకుని.. దాని ద్వారా భవిష్యత్తులో జరిగే పరిణామాలను అంచనా వేశారు. చాట్ జీపీటీ విశేషాలు, ప్రత్యేకతలెన్నో.. నార్తర్న్ మిషిగన్ యూనివర్సిటీలో బుర్ఖా నిషేధంపై ఓ వ్యాసం రాయాల్సిందిగా ప్రొఫెసర్ ఆంటోని ఔమన్ విద్యార్థులను కోరారు. ఒక విద్యార్థి నుంచి విస్పష్టమైన ఆలోచనలతో సమాధానపత్రం అందింది. నిషేధం, నైతికత వంటి అంశాలన్నీ అందులో ఉన్నాయి. వ్యాసం అద్భుతంగా ఉందని అంటూనే.. సదరు విద్యార్థిని నువ్వే రాశావా అని ప్రొఫెసర్ నిలదీశారు. దీనితో అసలు విషయం బయటపడింది. ఆ వ్యాసం రాసింది చాట్ జీపీటీ. ఈ ఉదంతం తర్వాత వ్యాసరచన నిర్వహించే పద్ధతుల్లో మార్పులు చేయాలని ప్రొఫెసర్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని పలు వర్సిటీల అధ్యాపకులుకూడా ఇదే ఆలోచనలో ఉండటం గమనార్హం. ►ఓపెన్ ఏఐ కంపెనీ అభివృద్ధి చేసిన మరో కృత్రిమమేధ సాఫ్ట్వేర్ డాల్–ఈ2. కేవలం కొన్ని వివరాలిస్తే చాలు. ఇది వాటి ఆధారంగా బొమ్మలు గీస్తుంది. ►చాట్ జీపీటీని పరిశీలించిన తర్వాత చాలా పాఠశాలల్లో చాట్బోట్లను క్లాస్‌రూమ్‌లలో వాడే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. సియాటెల్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిషేధం విధించారు కూడా. ►2900 కోట్ల డాలర్లు ఓపెన్ఏఐ మార్కెట్ విలువ చాట్ జీపీటీ–3 విడుదల తరువాత ఏకంగా 2900 కోట్ల డాలర్లకు చేరుకుంది. త్వరలోనే మరింత మెరుగైన జీపీటీ–4ను విడుదల చేసే ఆలోచనలో కంపెనీ ఉంది. ►గూగుల్ కూడా ల్యామ్డా పేరుతో ఓ చాట్‌బోట్‌ను తయారు చేయగా.. మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీనే తన అజ్యూర్ క్లౌడ్ సర్వర్‌లో ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా ఓపెన్ ఏఐ కంపెనీలో సుమారు 1,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ►కొంతమంది విద్యార్థులు చాట్‌జీపీటీతో తమకు ఎంతో మేలు జరుగుతుందని విశ్వసిస్తున్నారు. కొంతమంది తమ సాఫ్ట్వేర్ కోడ్లలో తప్పులు వెతికేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ►57.8 కోట్లు టిక్‌టాక్‌లో చాట్‌జీపీటీ హ్యాష్‌ట్యాగ్‌కు నమోదైన వ్యూస్ ఎలా పని చేస్తుంది? చిన్నపిల్లలకు మనం ఏ అంశమైనా ఎలా నేర్పిస్తాం? అక్షరాలైతే ఒకటికి వందసార్లు చెప్పించడం, రాయించడం చేస్తాం. అలాగే సమాచారమిచ్చి చదవడం అలవాటు చేస్తాం. చాట్‌జీపీటీ శిక్షణా ఇలాగే జరుగుతుంది. బులెటిన్ బోర్డ్ సిస్టమ్, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో వాడే ‘మ్యాన్ పేజెస్’వంటివి ఉంటాయి. టీచర్ల మాదిరిగా కొంతమంది సాఫ్ట్వేర్ డెవలపర్లు చాట్‌జీపీటీకి పలు విషయాలను నేర్పించడంతోపాటు నేర్చుకుంటున్న విషయాలను గమనిస్తూ వాటిలో మార్పులు, చేర్పులు చేస్తూ వచ్చారు. పదే పదే రాయడం, లేదా వల్లె వేయడం ద్వారా మనం నేర్చుకున్నట్టే.. చాట్‌జీపీటీకి పలు విషయాలను నేర్పారు. చాట్‌జీపీటీ స్పందనలను ర్యాంక్ చేయడం ద్వారా అది తన తప్పొప్పులను తెలుసుకునేలా చేశారు. మంచి ర్యాంకులివ్వడం ద్వారా ఫలానా అంశం నేర్చుకుంటే లాభమన్న భావన కల్పించారు. దీనికితోడు చాట్‌జీపీటీ ఇంటర్నెట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి తాను నేర్చుకున్న అంశాలకు మెరుగులు దిద్దుకుంటుంది. ఈ క్రమంలో మనం చాట్‌జీపీటీతో జరిపిన సంభాషణలనూ వాడుకుంటుంది. చాట్ జీపీటీ స్పందనలకు మన అభిప్రాయాలను అప్వోట్ లేదా డౌన్‌వోట్ ద్వారా తెలియజేస్తే దాని ఆధారంగా తప్పులు దిద్దుకోవడమూ చేస్తుంది. Best AI Tools You Need To Know#chatgpt #chatgpt3 #ArtificialIntelligence #ai pic.twitter.com/0jfr8cOMoo — John Vianny (@johnvianny) January 13, 2023 -
రైటర్స్ బ్లాక్
చాలా చిన్న విషయమే ఇది. ఏం లేదు... ఫలానా ఊళ్లో నివసించే ఒక రచయిత తన ఊళ్లో పూర్తిగా గుంతలు పడ్డ రోడ్లు చూసి ‘చిల్లుల కంబళి’ అనే కథ రాయాలనుకున్నాడు. కొంచెం వ్యంగ్యం రాయగలడు. మాట విరుపులో అందె వేసిన చేయి. ఈ గుంతలకు కారకులెవరో నేరుగా చెప్పకుండా కాకినీ, పిచ్చుకనూ పాత్రలుగా చేసి మొత్తం కథ చెప్పేయగలడు. అయినా సరే చిన్న సంశయం వచ్చింది. కథ ఎట్లాగూ తన ఊళ్లోని ఘోరమైన రోడ్ల గురించి. మరి అచ్చయ్యాక మునిసిపల్ కమిషనర్ గారికి ఈ కథ ఎవరైనా చూపిస్తేనో! ఎం.ఎల్.ఏ సముఖాన ఎవరైనా చదివి వినిపిస్తేనో! పార్టీ కార్యాలయంలో ఔత్సాహికులైన కార్యకర్తలు దీనిని రెడ్ఇంక్తో మార్క్ చేస్తేనో! పాఠకులు చదివి ధర్నాకు ప్లాన్ చేస్తారని పోలీసు వారికి సందేహం వస్తేనో! ఎందుకొచ్చిన గొడవ. ‘చిల్లుల కంబళి’ని మూల పడేశాడు. ఆ తర్వాత ఏ కథా రాయలేక పోయాడు. రైటర్స్ బ్లాక్. ‘ఎక్స్’ మతం, ‘వై’ మతం, ‘జడ్’ మతం గురించి ఒక రచయిత ఎంతో అధ్యయనం చేశాడు. మతాల సకారాత్మక, నకారాత్మక చర్యలను, ప్రపంచవ్యాప్తంగా వాటి మధ్య ఘర్షణను, దరిమిలా స్థానిక ప్రతిఫలనాలను విశదం చేసే 500 పేజీల నవల రాయదలిచి మూడు సంవత్సరాలు సెంట్రల్ లైబ్రరీలో మెటీరియల్ కోసం కూసాలు కదుల్చుకున్నాడు. మతాల కంటే ముందు మనిషే ఉంటా డని మనిషిని దాటి దాటి దాటి మతాల దగ్గరకు రావాలని తన నవలకు ‘ఏ టు ఆర్’ అని పేరు పెట్టుకున్నాడు. నవల చివరలో మార్క్స్‌ను ప్రస్తావిస్తూ ‘మతం ఒక మత్తుమందు’ అని కూడా రాస్తా డట. మిత్రుడు అంతా విని తక్కిందంతా ఓకేగాని ఈ చివరి వాక్యాన్ని పట్టుకుని తమ వ్యాపారాన్ని దెబ్బ తీసేందుకే ఈ నవల రాశావని ‘డిస్టిలరీల జాతీయ సమాఖ్య’ వ్యాజ్యం వేస్తే ఏం చేస్తావ్? అన్నాడు. అంతే. సదరు రచయిత ఆ నవలను అటక ఎక్కించేశాడు. తర్వాత ఏమీ రాయలేదు. రైటర్స్ బ్లాక్. ‘సగటు పట్టణం’ అనే పట్టణానికి ఢిల్లీ ఎంతో దూరమైనా నిజానికి ఢిల్లీ దూరంగా లేదని అక్కడ నివసించే మరొక రచయితకు తెలిసొచ్చింది. అతడు రాయదలిచింది ‘హాయి నడక’ అనే కథను! అందులో పెట్రోలు పోయించుకోలేక ఒక సగటు ఉద్యోగి స్కూటర్ మాని ఆఫీసుకు నడక మీద వెళ్లడం మొదలెడతాడు. తొలత ఇబ్బందిగా ఉన్నా తర్వాత నడకలో ఏదో హాయి ఉందని గ్రహిస్తాడు. దారిలో తన లాంటి వాళ్లే పదిమంది కలవడంతో వారి మధ్య స్నేహం చిగురిస్తుంది. వారంతా వాట్సప్ గ్రూప్ పెట్టుకుంటారు. ఈ కథ అచ్చుకు ముందు చదివిన విమర్శక మిత్రుడు ‘మంచి కథే గాని స్నేహానికి కొత్త వార«ధే గాని వాళ్లంతా ఎప్పుడైతే వాట్సప్ గ్రూప్ పెట్టారో అప్పుడే దేశానికి ప్రమాదకరంగా మారారు. కథ అచ్చయ్యాక కేంద్ర జాగరూకత సంస్థ వచ్చి దేశ సార్వ భౌమత్వానికి విఘాతం కలిగించడానికే ఆ పది మందీ వాట్సప్ గ్రూప్ పెట్టుకున్నారని అంటే కాదని ఎలా నిరూపిస్తావ్’ అన్నాడు. కథ చిరిగిపోయింది. ప్రస్తుతం ఆ రచయిత సగటు పట్టణంలో సగటు బతుకు బతుకుతున్నాడు. రైటర్స్ బ్లాక్. దుప్పి పిల్లల్ని, అప్పుడే పుట్టిన లేడి కూనల్ని నోట కరిచి అవి ఆర్తనాదాలు చేస్తున్నా నిశ్చలంగా ఉండగలిగే పులులను ‘క్షమాభిక్ష’ పేరుతో బోన్ల నుంచి విడిచి పెడతారు. పర్యావరణ హితం కోరే ఒక రచయితకు కథ రాయాలనిపిస్తుంది. రాయలేడు. మిట్ట మీద ఉండే వర్గం వారు పల్లంలో ఉండే వర్గం వారికి కంచె కట్టి ఇబ్బంది పెడతారు. హింసిస్తారు. వివక్షను నిరసించే ఒక రచయితకు కథ రాయాలనిపిస్తుంది. రాయలేడు. కోర్టుకెక్కిన ఫలానా ప్రజావ్యాజ్యంలో న్యాయం ఇదేనని అందరికీ తెలిసినా తీర్పు ఎందుకు ఆలస్యమవుతోంది అని ఒక రచయితకు అసహనం కలుగుతుంది. కథ రాయాలనుకుంటాడు. రాయలేడు. ఆడవాళ్ల బాధలు, ఆదివాసుల బాధలు, ఉద్యోగాలు రాక ఖర్చులకు డబ్బులు లేక కటకటలాడే నిరుద్యోగుల వేదనలు, పేదల పెను ఆర్తనాదాలు, మూలకు నెట్టివేయబడేవారి మూల్గులు, తల్లితండ్రుల చేత చిక్కి ర్యాంకుల వేటలో అల్లాడుతున్న పిల్లల శోకాలు, విస్తారమైన దేశ సంపదలో ఆవగింజంత భాగం కూడా దొరకని కోట్లాది దీనుల మాట పడిపోవడాలు, 12 గంటల చాకిరీకి పొందే చిల్లర జీతాల దీనుల ఈసురోలు, పెను సర్పాలను పట్టి చంపే శక్తిని మరిచిన చలిచీమల మతిమరుపులు... ఇవి కథలు రాయాలని ఉంటుంది చాలామంది రచయితలకు. కానీ రాయలేకపోతున్నారు. రైటర్స్ బ్లాక్. మామూలుగా అయితే ఏదైనా రాయాలనుకుని రాయలేకపోవడం, రాసేందుకు ఆలోచన, ఆసక్తి సన్నగిల్లిపోవడాన్ని ‘రైటర్స్ బ్లాక్’ అంటారు. కాని సత్యం çపలకక పోవడం వల్ల, పలకలేని వాతావరణం ఉండడం వల్ల బలవంతపు రైటర్స్ బ్లాక్‌కు నేడు రచయితలు గురవుతున్నారు. రచయితలు అప్రియమైన సత్యాలు పలికేది జనం పట్ల ఉన్న ప్రియత్వం వల్లే! పాలకుల పట్ల ఉన్న బాధ్యత వల్లే! సత్యం వినే ఓర్పు ఉండాలి. సత్యం లేని చోట చీకటి చోటు చేసుకుంటుంది. సరే! మరి రైటర్స్ బ్లాక్ రిస్క్ వద్దనుకునే వారికి రాయడానికి ఏం మిగులుతాయి? ఎన్నో! శృంగార కథలు, ఉద్రేక నవలలు, నేరగాథలు, అత్తాకోడళ్ల కీచులాటలు, వెకిలి హాస్యాలు, కాలక్షేప బఠాణీలు, కన్నీటి చుక్కకుగాని ఆలోచనా వీచికకు గాని వీలు లేని శుష్క వైకల్యాలు. జాతి సత్యం వైపు ఉండాలా? శుష్కతలో మునిగి తేలాలా? ఎచ్చట రైటర్స్ బ్లాక్ లేకుండా ఉండునో... అచ్చట ధర్మం ఒక పాదానైనా నడుచును!! -
కొలువు వేటలో విజేతగా నిలవాలంటే..
భారత్‌లో నిరుద్యోగుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. చాలా మందికి తమ అర్హతలకు తగిన కొలువులు దొరకడం లేదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో దాదాపు సగం మంది ఖాళీగానే ఉంటున్నట్లు అధ్యయనాల్లో తేలింది. జాబ్ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలను పెంచుకుంటే ఏ సబ్జెక్టు విద్యార్థులైనా కొలువు వేటలో విజేతలుగా మారొచ్చు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే రిక్రూటర్లను ఆకట్టుకునే ప్రత్యేక నైపుణ్యాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. అనుకున్న లక్ష్యం నెరవేరడంలో ఇవి కచ్చితంగా ఉపయోగపడతాయి. జాబ్ సాధించడానికే కాదు, వచ్చింది నిలుపుకోవాలన్నా స్కిల్స్ ఉండాల్సిందే. రైటింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్ ఉండటం అభ్యర్థులకు ప్రధాన అర్హతగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా, వెబ్ పేజీలు, ఈ-మెయిళ్ల ద్వారానే సమాచార మార్పిడి జరుగుతోంది. నేటి ఇంటర్నెట్ ప్రపంచంలో రాత నైపుణ్యాలు మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలిచేలా చేస్తాయి. సొంత బ్లాగ్లు ఉన్నవారికి ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశం ఉంది. రిక్రూటర్లు అభ్యర్థుల బ్లాగుల్లోని రాతలను పరిశీలిస్తున్నారు. సంతృప్తి చెందితే జాబ్ ఆఫర్ ఇచ్చేం దుకు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి రైటింగ్ స్కిల్స్‌ను మెరుగుపర్చుకోండి. వెబ్ మార్కెటింగ్ ప్రస్తుతం వెబ్ మార్కెటింగ్ హవా కొనసాగుతోంది. కంపెనీలు తమ కస్టమర్లకు చేరువ కావడానికి వెబ్ మార్కెటింగ్‌ను ఆశ్రయిస్తున్నాయి. ఉత్పత్తుల ప్రచారం, అమ్మకాలు, సేవలు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆన్లైన్ యాడ్లు, వెబ్సైట్ కంటెంట్, ఈ-మెయిల్ మార్కెటింగ్‌పై పట్టు సాధిస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్(ఎస్ఈఎం) కూడా వెబ్ మార్కెటింగ్ లాంటిదే. పెయిడ్ సెర్చ్ యాడ్స్, ఫ్రీ వెబ్సైట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ద్వారా కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించేలా చేయడమే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. ప్రస్తుతం చాలా కంపెనీలు దీనిపై మొగ్గుచూపుతున్నాయి. ఎస్ఈఎంలో మంచి ప్రావీణ్యం సంపాదించివారికి బోలెడు అవకాశాలు ఉన్నాయి. ఎస్ఈఎంకు సంబంధించి మన దేశంలో ప్రత్యేకంగా కోర్సులు, శిక్షణ అందుబాటులో లేవు. అభ్యర్థులు సొంతంగానే దీనిపై పట్టు సంపాదించాలి. ఎస్ఈఎంపై ఆన్లైన్ పాఠాలున్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. సోషల్ మీడియా ‘ఎప్పుడూ ఆ ఫేస్బుక్, ట్విట్టరేనా..?’ అని తల్లిదండ్రులు మందలిస్తున్నా మీరు వెనక్కి తగ్గాల్సిన పనిలేదు. నేను ఉద్యోగ సాధనలో బిజీగా ఉన్నా అంటూ ధైర్యంగా చెప్పండి. ఎందుకంటే సోషల్ మీడియా నేటి సమాజంలో కీలక పాత్ర పోషిస్తోంది. కంపెనీలు సోషల్ మీడియా ద్వారానే తమ కార్యకలాపాలను నిర్విహ స్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉండి సృజనాత్మక ఆలోచనలు కలిగిన వారికి ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. ప్రస్తుతం క్లాస్రూమ్ మార్కుల కంటే క్లౌట్ స్కోర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. సోషల్ మీడియాలో మీరు ఎంత యాక్టివ్‌గా ఉన్నారో క్లౌట్ స్కోర్ వెల్లడిస్తుంది. ప్రోగ్రామింగ్ ఉద్యోగం కావాలంటే ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం పొందడం చాలా అవసరం. మం చి ప్రోగ్రామర్ కావాలంటే కంప్యూటర్ సైంటిస్ట్ అయి ఉండాలని అభ్యర్థులు భావి స్తుంటారు. కానీ, అది పొరపాటు. ప్రతిభావంతులైన ప్రోగ్రామర్లుగా గుర్తింపు పొందినవారంతా సృజనాత్మక ఆలోచనలు ఉన్నవారే తప్ప సాంకేతిక నిపుణులు కాదు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పనులు కంప్యూటర్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రతి పనికీ సాఫ్ట్వేర్ అవసరం. అందుకు ప్రోగ్రామింగ్ తెలుసుండాలి. ఈ స్కిల్ నేర్చుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. కోర్స్ఎరా, ఉడాసిటీ లాంటి వాటి ద్వారా ప్రోగ్రామింగ్ కోర్సులను ఆన్లైన్లో సులువుగా అభ్యసించొచ్చు.