కోడింగ్‌లో తప్పు.. కంపెనీ కొలాప్స్
లండన్: ప్రోగ్రామ్ కోడింగ్‌లో ఒక వ్యక్తి అనుకోకుండా రాసిన తప్పు అతని సొంత కంపెనీయే నాశనమయ్యేలా చేసింది. ఆ తప్పుడు కోడ్ వల్ల అతని కంప్యూటర్లలోని డేటాతోపాటు, దాదాపు 1535 క్లైంట్ల వెబ్‌సైట్‌ల్లోని సమాచారం డెలీట్ అయింది. సర్వర్‌లో కోడింగ్ సమయంలో విలువైన డేటా విడిగా ఉండేలా వేరియబుల్‌ను నిర్వచించకపోవడమే ఇందుకు కారణం.
లండన్‌లో వెబ్ హోస్టింగ్ సంస్థను నడుపుతున్న మార్కో మార్సాలా అనే వ్యక్తి సర్వర్ కంప్యూటర్లో పొరపాటున ’rm -rf’ అనే తప్పుడు కోడ్ రాశాడు. సాధారణంగా డిలీట్ చే స్తున్నపుడు వార్నింగ్ నోటిఫికేషన్ వస్తుంది. కోడ్‌లో ఆ వేరియబుల్‌ను నిర్వచించకపోవడం వల్ల ఎలాంటి నోటిఫికేషన్ రాకుండానే, బ్యాకప్‌తో సహా అన్ని ఫైళ్లు డెలీట్ అయిపోయాయి.