Xinjiang province
-
లాక్డౌన్ ఇంకా ఎన్నాళ్లు? చైనాలో వెల్లువెత్తిన నిరసనలు..
బీజింగ్: అత్యంత అరుదుగా నిరసనలు చేపట్టే చైనీయుులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. జిన్జియాంగ్ ప్రావిన్స్ ఉరుమ్కిలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. జీరో కోవిడ్ పాలసీ పేరుతో చాలా రోజులుగా అమలు చేస్తున్న కఠిన ఆంక్షలను ఎత్తివేయాలని భారీ ర్యాలీ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గురువారం రాత్రి ఉరుమ్కిలోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ నిబంధనల కారణంగా అందులోని నివసించేవారు బయటకు వెళ్ల పరిస్థితి లేదు. దీంతో 10 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై చైనా అధికారి ఒకరు నిర్లక్ష్యంగా మాట్లాడారు. వీళ్లు తమను తాము కాపాడుకోలేని రీతిలో చాలా బలహీనంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో ప్రజల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. శుక్రవారం రాత్రి భారీ నిరసనలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారుు. చైనా జాతీయ గీతం ఆలపిస్తూ నినాదాలు చేశారు. 100 రోజులకుపైగా అమలు చేస్తున్న కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే అగ్నిప్రమాదంలో చనిపోయిన వారికి పూలు, క్యాండిల్స్‌తో నివాళులు అర్పించారు. Rare protests broke out in China's Xinjiang region opposing prolonged COVID-19 lockdowns, according to footage seen on social media https://t.co/tHXkz5lRon pic.twitter.com/0phutiecBX — Reuters (@Reuters) November 26, 2022 Thread/1 Massive protest happened in Ulumuqi,Xinjiang,China after more than 100 days zero-covid city lockdown. People are chanting ‘stop lockdown’ ‘we are human being’ pic.twitter.com/trQhDSZLXr — 巴丢草 Bad ї ucao (@badiucao) November 25, 2022 చైనాలో మైనారిటీలైన వీగర్లు ఎక్కువగా ఉండే జిన్జియాంగ్లో కోటి మంది నివసిస్తున్నారు. ఉరుమ్కి నగరంలో 40 లక్షల మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో 100 రోజులకుపైగా కఠిన కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి కూడా అనుమతి లేదు. ఈ క్రమంలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది చనిపోయారు. BREAKING: A large crowd has surrounded the Municipal Government building in Urumqi (Xinjang’s largest city). It’s a rare case of a joint Uyghur & Han protest against the authorities. It comes after 10 people died in fire in a high-rise under lockdown.pic.twitter.com/lmXcHQ5Ggp — Visegrád 24 (@visegrad24) November 25, 2022 ఉరుమ్కిలో చేపట్టిన నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. చైనా రాజధాని బీజింగ్ సరిహద్దు ప్రాంతంలోనూ జీరో కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. చదవండి: బ్రిటన్‌లోకి విదేశీ విద్యార్థుల వలసల కట్టడికి రిషి స్కెచ్! -
అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది సజీవదహనం
బీజింగ్: చైనా జిన్జియాంగ్ ప్రావిన్స్ టియాన్షాన్ జిల్లా ఉరుంఖిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది సజీవ దహనమయ్యారు. అపార్ట్మెంట్లో ఓ ఫ్లోర్లో మంటలు చెలరేగి ఇతర ఫ్లాట్లకు వ్యాపించడంతో ఇద్దరు చిన్నారులతో పాటు మరో ఏడుగురు చనిపోయారు. గరువారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే 10 మంది చనిపోవడానికి ప్రభుత్వం 'జీరో కోవిడ్ పాలసీ' పేరుతో విధించిన కఠిన ఆంక్షలే కారణమని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. కింది ఫ్లోర్ లాక్ చేసి ఉండటంతో మంటలు చూసినా బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. దీంతో అందరూ అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్‌కి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కొంత మంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఒకటి, రెండో అంతస్తుల నుంచి కిందకు దూకేశారని వివరించారు. మరికొంత మంది జంప్ చేసి పక్క ఫ్లాట్లలోకి వెళ్లినట్లు చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ముఖ్యంగా కరోనా కేసులు నమోదైన అపార్ట్మెంట్లను లాక్ చేస్తోంది. ఎవరూ బయటకు రాకుండా కఠిన చర్యలు చేపడుతోంది. అగ్నిప్రమాదం సంభవించిన అపార్ట్మెంట్లో 109 రోజులుగా కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఫలితంగా ఇక్కడ నివసించేవారు వాళ్ల కార్లను ఇన్నిరోజులుగా బయటకు తీయలేదు. అపార్ట్మెంట్ ముందు దారిమొత్తం పార్క్ చేసి ఉన్నాయి. దీంతో మంటలార్పేందుకు వెళ్లిన ఫైర్ ఇంజిన్లకు దారి లేక సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. వారు కార్లను తొలగించి అపార్ట్మెంట్ చేరుకునేందుకు దాదాపు మూడు గంటలు పట్టింది. ఫలితంగా 10 మంది మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఫైరింజన్లు సమయానికి వచ్చి ఉంటే ఇంత మంది చనిపోయి ఉండేవారు కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: వామ్మో ఇంత పెద్ద చెయ్యి.. కొంపతీసి ఏలియన్‌దా? -
కీలక చట్టంపై బైడెన్ సంతకం.. చైనాకు చుక్కలే!
Joe Biden Signed Uyghurs Rights Protection Bill To Check China Atrocities: కీలకంగా భావించిన ఉయిగర్ చట్టంపై ఎట్టకేలకు అగ్రరాజ్యం అధినేత రాజముద్ర పడింది. చైనాను ఇరకాటంలో పడేసే ‘ఉయిగుర్ ఫోర్స్డ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్’(బలవంతపు కార్మిక నిరోధక చట్టం) మీద గురువారం అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. అనంతరం ఆయన ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ద్వైపాక్షిక ఒప్పందం మీద సంతకం చేశా. కేవలం షిన్జియాంగ్ మాత్రమే కాదు.. చైనాలోని మిగతా ప్రాంతాలకు కూడా ఇది వర్తిస్తుంది. చైనా ప్రతీ మూల నుంచి వచ్చేవి బలవంతపు చాకిరీ ఉత్పత్తులు కావని నిర్ధారించుకునేందుకు మా వద్ద (అమెరికా ప్రభుత్వం) ఉన్న ప్రతీ సాధనాన్ని ఉపయోగించుకుంటాం’’ అంటూ ఉయిగర్ల చట్టాన్ని బలంగా అమలు చేసే ఉద్దేశాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ట్విటర్ వేదికగా వినిపించారు. Today, I signed the bipartisan Uyghur Forced Labor Prevention Act. The United States will continue to use every tool at our disposal to ensure supply chains are free from the use of forced labor — including from Xinjiang and other parts of China. pic.twitter.com/kd4fk2CvmJ — President Biden (@POTUS) December 23, 2021 ఇదిలా ఉంటే చైనా పశ్చిమ ప్రాంతంలో పదిలక్షల మైనార్టీ వర్గపు జనాభాపై మానవ హక్కుల ఉల్లంఘన జరగుతోందని, వెట్టిచాకిరీ చేయించుకుంటోందని చైనా మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అయితే ఈ వ్యవహారంలో చైనా మీద మొదటి నుంచే కొరడా ఝళిపిస్తోంది. ఈ క్రమంలో షిన్జియాంగ్ నుంచి తమ దేశానికి అన్ని దిగుమతులను నిషేధిస్తూ ఓ బిల్లు తీసుకొచ్చింది. బిల్లుకు సెనేట్ గత గురువారమే ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేయగా.. చివరి పేరాలో అభ్యంతరాల మేరకు మరో వారం ఆమోద ముద్ర వాయిదాపడింది. దీంతో ఆ అభ్యంతరాలపై క్లియరెన్స్ అనంతరం.. గురువారం (డిసెంబర్ 23న) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయడంతో చట్టం అమలులోకి వచ్చింది. Uyghur Forced Labor Prevention Act ప్రకారం.. బలవంతపు చాకిరీ లేకుండానే తయారుచేశామని నిరూపించగలిగిన ఉత్పత్తులను మాత్రమే ఇకపై అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇది నిరూపించుకోవాలంటే షిన్జియాంగ్ ప్రావిన్స్‌లోకి అమెరికా ప్రతినిధుల్ని, అంతర్జాతీయ జర్నలిస్టులు తప్పనిసరిగా అనుమతించాల్సి ఉంటుంది. అదే జరిగితే అక్కడ జరిగే అకృత్యాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇలా వర్తకవాణిజ్యాన్ని ముడిపెట్టి.. చైనా బండారం బయటపెట్టాలన్నదే బైడెన్ ప్రభుత్వం వేసిన స్కెచ్. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. కేవలం షిన్జియాంగ్ను మాత్రమే తొలుత చట్టంలో చేర్చిన అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్).. ఆపై మిగతా ప్రావిన్స్‌లకు సైతం ఈ చట్టాన్ని అన్వయింపజేయడం. ఇదిలా ఉంటే వర్తకవాణిజ్యాల పరంగా అమెరికాకు వచ్చే వీలైనన్నీ దారులను చైనాకు మూసేస్తోంది బైడెన్ ప్రభుత్వం. బొమ్మలపై విషపు రసాయనాల పూత ఉంటోందని ఆరోపిస్తూ.. మేడ్ ఇన్ చైనా బొమ్మలను అమెరికాలో అడుగు పెట్టనివ్వట్లేదు. ఇక ఉయిగర్లపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ.. ఆ దేశ బయోటెక్, నిఘా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు.. ఇలా ఒక్కోదానిపై ఆంక్షలు విధిస్తూ పోతోంది. ఇక అమెరికా వైపు నుంచి కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండా.. చైనాకు ఎలాంటి ఉత్పత్తులను విక్రయించడానికి వీల్లేదని ఆదేశాలు అమలు చేస్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. అమెరికాతో వర్తకం ద్వారా భారీ ఆదాయం వెనకేసుకుంటోంది. అయితే కరోనా పరిణామాల అనంతరం ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం బెడిసికొడుతోంది. ఈ క్రమంలో చైనాను దూరం పెడుతూ.. క్రమంగా భారత్ సహా ఇతర ఆసియా దేశాలకు దగ్గర అవుతోంది అమెరికా. సంబంధిత వార్త: డ్రాగన్‌కు దెబ్బలు.. షిన్జియాంగ్ మీదే ఫోకస్ -
చైనా చుట్టు ఉచ్చు.. ఆ అరాచకాల్ని ఒప్పుకోక తప్పదా!
పశ్చిమ చైనాలో ఏళ్ల తరబడి ఉయిగుర్, ఇతర మైనార్టీలపై కొనసాగుతున్న ఆరాచకపర్వానికి ఎట్టకేలకు చైనా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనను కారణంగా చూపిస్తూ వచ్చే ఏడాది బీజింగ్‌లో జరగబోయే ఒలింపిక్స్‌ను కొన్ని దేశాలు దౌత్యపరమైన బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆంక్షలతో చైనాను మరో దెబ్బ కొట్టింది అమెరికా. ఇక వరుసగా జరుగుతున్న పరిణామాలు.. అంతర్జాతీయ సమాజం ముందు చైనా తన నేరాన్ని ఒప్పుకోక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాయి. సుమారు పది లక్షల మంది ఉయిగర్లు, టర్కీ మాట్లాడగలిగే ఇతర తెగల వాళ్లు పశ్చిమ చైనాలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నారు. చైనా ప్రభుత్వం వీళ్లను మైనార్టీలుగా గుర్తించింది. అంతేకాదు ఏళ్ల తరబడి వాళ్లపై ఆర్మీ సాయంతో అరాచకాలకు పాల్పడుతోంది. ఉయిగర్ల ఊచకోతను పలు దేశాలు(భారత్‌తో సహా) ఏనాటి నుంచో ఖండిస్తూ వస్తున్నాయి. ఉయిగర్లపై చైనా సైన్యం వేధింపులను తెలియజేసేలా.. లండన్ ఉయిగర్ ట్రిబ్యునల్‌లో సంకెళ్ల ద్వారా నిరసన తెలిపిన ఉయిగర్ నేత చైనాను ఇరకాట పెట్టినవి.. ► షిన్జియాంగ్లో ఉయిగర్లపై హింసాకాండ, రంజాన్ సమయంలో మసీదుల విధ్వంసానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటికి రావడం. ►ఈ తరుణంలో ఇదంతా కేవలం పాశ్చాత్య దేశాల మీడియా స్పృష్టే అని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది చైనా. ►మరోవైపు ఫారినర్లను, జర్నలిస్టులను గ్జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్టనివ్వకుండా చైనా ఆంక్షలు విధించింది. ► అయినప్పటికీ పక్కా ఆధారాలు అక్కడ జరిగే దమనకాండను వెలుగులోకి తీసుకొచ్చాయి. ► అమెరికా సహా చాలా దేశాల ఫోకస్ ఇప్పుడు గ్జిన్జియాంగ్ మీదే. ►డిసెంబర్ 10న లండన్‌లో ట్రిబ్యూనల్(ఇండిపెండెంట్) ఒకటి.. ఉయిగుర్లకు, ఇతర మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న దమనకాండలో చైనా ప్రభుత్వాన్నే దోషిగా ఎత్తి చూపుతూ తీర్పు వెలువరించింది. ►డిసెంబర్ 14న అమెరికా చైనాకు ఓ ఝలక్ ఇచ్చింది. ఉయిగుర్ ఫోర్స్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం.. గ్జిన్జియాంగ్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులన్నీ.. ఉయిగుర్లను బలవంతపెట్టి తయారు చేయించిన ఉత్పత్తులు కావని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ►డిసెంబర్ 16న జో బైడెన్ ప్రభుత్వం.. గ్జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోని మిలిటరీ మెడికల్ సైన్సెన్స్, దాని 11 రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ మీద ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ►హైటెక్ సర్వయిలెన్స్ వ్యవస్థ-ఫేషియల్ రికగ్నిషన్ సాయంతో గ్జిన్జియాంగ్ ప్రజల డీఎన్ఏ శాంపిల్స్‌ను చైనా అక్రమంగా సేకరిస్తోందన్నది అమెరికా వాదన. ►భవిష్యత్తులో ఉయిగర్ల హక్కుల్ని పరిరక్షించేందుకు, స్వేచ్ఛను ప్రసాదించేందుకు.. అవసరమైతే చైనాను కడిగిపడేయాలంటూ అమెరికా, ఇతర అగ్రదేశాల సాయం కోరుతోంది ఉయిగర్ల హక్కుల పరిరక్షణ కమిటీ. ఈ తరుణంలో సానుకూల స్పందన ద్వారా చైనాను ఇరుకున పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ► వచ్చే ఏడాది మొదట్లో అంతర్జాతీయ న్యాయస్థానానికి గ్జిన్‌జియాంగ్‌లో జరిగే మానవ హక్కుల ఉల్లంఘనను తీసుకెళ్లాలని(పిటిషన్ ద్వారా) అమెరికా భావిస్తోంది. చదవండి: ఆపరేషన్ ‘అన్నోన్’.. చైనా ఫోన్ల ద్వారా భారీ కుట్ర -
చైనాలో 28 మంది ఉగ్రవాదుల హతం
బీజింగ్: చైనాలో 28 మంది ఉగ్రవాదులను హతమార్చారు. జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో బొగ్గుగనిపై దాడి చేసి 16 మందిని చంపిన ఉగ్రవాద సంస్థకు చెందిన వారిని పోలీసులు చంపారని అధికారులు చెప్పారు. గత సెప్టెంబర్‌లో ఉగ్రవాదులు దాడి చేసి పారిపోయాక వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సంబంధిత ఉగ్రవాద సంస్థకు చెందిన 28 మందిని పోలీసులు కాల్చిచంపారు. కాగా ఉగ్రవాద సంస్థ పేరు ఏంటన్నది వెల్లడించలేదు. 2008లో ఏర్పడిన ఈ గ్రూపు వేర్పాటువాద కార్యకాలపాలకు పాల్పడుతోందని అధికారులు చెప్పారు. -
చైనాలోని ఓ రైల్వేస్టేషన్లో పేలుడు
* పదుల సంఖ్యలో ప్రయాణికులకు గాయాలు బీజింగ్: చైనాలో ముస్లింలు అధికంగా నివసించే జిన్జియాంగ్ ప్రావిన్సులో ఉన్న ఓ రైల్వేస్టేషన్లో బుధవారం శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఉరుమ్కీ స్టేషన్ వెలుపల ద్వారం వద్ద జరిగిన ఈ పేలుడులో 50 ప్రయాణికులు గాయపడ్డారు. పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి అంబులెన్సులు, పోలీసు వాహనాలు చేరుకున్నాయి. తీవ్రవాద దాడులతో అట్టుడికే ఈ ప్రావిన్సులో దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పర్యటన ముగిసే క్రమంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు నేపథ్యంలో రంగంలోకి దిగిన భద్రతా దళాలు స్టేషన్లో క్షుణ్ణంగా తనఖీలు చేపట్టి స్టేషన్‌ను తిరిగి తెరిచాయి. ఇస్లామిక్ మిలిటెంట్ల దాడులతో గత కొంతకాలంగా ఈ ప్రాంతం అట్టుడుకుతోంది. యుగుర్ ముస్లింలు, ఇతర ప్రావిన్సుల నుంచి వచ్చి స్థిరపడిన హాన్ చైనీయులకు మధ్య కొన్నేళ్లుగా జాతి విద్వేషాలు రగులుతున్నాయి.