xxx
-
చౌటుప్పల్‌లో ఐటీ దాడులు
అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాలు వ్యాపార వర్గాల్లో హడల్ చౌటుప్పల్: చౌటుప్పల్‌లో మంగళవారం హైదరాబాద్‌కు చెందిన ఐటీ(ఇన్‌కమ్‌టాక్స్) అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా దాడులు సంచలనం రేకెత్తించాయి. వ్యాపారుల గుండెల్లో రైళ్లను పరుగెత్తించాయి. చౌటుప్పల్‌కు చెందిన వ్యాపారులు చంద్రారెడ్డి, నర్సిరెడ్డిలకు చెందిన ఇళ్లల్లో, సునీల్ ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ గోదాంలో, సునీల్ బేకరీలో తనిఖీలు నిర్వహించారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీలు పూర్తయ్యాక వివరాలను వెళ్లడిస్తామని ఐటీ అధికారులు తెలిపారు. -
స్టార్ హీరోయిన్ మనసులో ఏముంది?
ముంబై: బాజీరావు మస్తానీ భామ దీపికా పదుకొనే, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేం విన్ డీజిల్ జంటగా తెరకెక్కుతున్న హాలీవుడ్ మూవీ 'ట్రిపుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్'. దీపికా మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ విడుదలచేశారు. షూటింగ్ స్పాట్ లో విన్ డీజిల్, దీపికాపై చిత్రీకరిస్తున్న ఓ సీన్లో భాగంగా ఫొటో తీశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్టార్ దీపికా పదుకొనే తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్యాక్ గ్రౌండ్లో దీపిక ఫోటో స్కెచ్ వేసినట్లు ఉండగా, దాని ముందు మంచి వాళ్లను నేను నమ్మను. నాకు నమ్మకం లేదు అని అర్ధం వచ్చేలా 'ఇ డోంట్ బిలీవ్ ఇన్ గుడ్ గయ్స్' అని పోస్ట్ చేసింది. గతంలో ఈ ఒక్క సినిమా చేసి త్వరగా భారత్ కు తిరిగి వచ్చి, కేవలం బాలీవుడ్ లో కొనసాగుతానని చెప్పిన దీపికా ప్రస్తుతం ఇలాంటి ఫొటో ఎందుకు పోస్ట్ చేసిందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని యాక్షన్‌సీన్స్‌లో అతనితో పోటీగా నటించేందుకు దీపికా సన్నద్ధమవుతోంది. -
నటికి గాయాలు.. షూటింగ్ బ్రేక్
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి నైనా దోబ్రేవ్కు గాయాలయ్యాయి. సినిమా షూటింగ్ సెట్లో ఆమె తొడభాగానికి పెద్ద గాయం అయింది. తన జీన్స్ ప్యాంటూ చిరిగి మరీ ఈ గాయం కావడంతో రక్తస్రావం కూడా అయింది. ఆ ఫొటోను కూడా ఆన్ లైన్ లో పెట్టారు. గతంలో భారీ హిట్ సాధించిన త్రిప్లెక్స్ చిత్రానికి కొనసాగింపుగా త్రిప్లెక్స్: ది రిటర్న్ ఆఫ్ క్జాండర్ కేజ్ అనే చిత్రం త్వరలో రానుంది. ఈ చిత్రం ఈ 27 ఏళ్ల అమ్మడు హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పూర్తిగా యాక్షన్ చిత్రం కావడంతో ఫైట్లు వంటి రిస్క్ లు కూడా చేయాల్సి ఉంటుంది. విన్ డీసెల్ (38)తో కలిసి నటిస్తున్న నైనా దోబ్రేవ్ షూటింగ్ లో గాయపడిందని చిత్ర యూనిట్ కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమె కోలుకునే వరకు షూటింగ్ కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. కాగా, ఈ గాయం పెద్దగా పట్టించుకోనని, తనకు యాక్షన్ చిత్రాల్లో నటించడం చాలా ఇష్టమని చెబుతోంది నైనా. -
మరో హాలీవుడ్ సినిమాలో?
ఇక దీపికా పదుకొనె హిందీ సినిమాల్లో నటించడం కష్టమేనా? కొత్తగా ఆరంభమయ్యే హిందీ సినిమాల్లో నటించరా? ప్రస్తుతం హిందీ రంగంలో వాడిగా వేడిగా జరుగుతున్న చర్చ ఇది. దానికి కారణం లేకపోలేదు. గత ఏడాది నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ తర్వాత దీపిక వేరే హిందీ చిత్రం అంగీకరించిన దాఖలాలు లేవు. హాలీవుడ్లో విన్ డీజిల్ సరసన ‘ఎక్స్ఎక్స్ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ అనే చిత్రంలో నటిస్తున్నారామె. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ స్లిమ్ బ్యూటీ కచ్చితంగా హాలీవుడ్ వారిని కూడా ఆకట్టుకుంటారనే అంచనాలు ఉన్నాయి. అయితే, సినిమా విడుదలకు ముందే అక్కడి దర్శక-నిర్మాతల దృష్టి దీపికా పదుకొనె మీద పడినట్లుంది. మొదటి సినిమా రిలీజ్ కాకముందే హాలీవుడ్లో రెండో అవకాశం దక్కించుకున్నారని భోగట్టా. అది కూడా హాలీవుడ్ సూపర్‌స్టార్ బ్రాడ్ పిట్ సరసన అని నెట్లో వార్తలు షికారు చేస్తున్నాయి. హాలీవుడ్లో మొదటి సినిమా అంగీకరించిన కొన్ని నెలలకే మరో అవకాశం దీపికను వరించడం సహజంగానే హాట్ టాపిక్ అయింది. చూడబోతుంటే.. హాలీవుడ్లో దీపిక హవా కొనసాగేలా ఉంది. -
అవును.. అతను విన్ డీసిలే..!
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో దీపిక పదుకొనే ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది. ఓ భారీకాయాన్ని కౌగిలించుకున్న దీపిక సీరియస్ లుక్‌తో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. అయితే ఈ ఫోటో బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి ఎవరంటూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్‌గా ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అతను హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీసెల్. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటో లెటెస్ట్ సెన్సేషన్‌గా మారింది. అయితే ఈ ఇద్దరు కలిసిన సందర్భం మాత్రం తెలియకపోయినా.. విన్ డీసిల్ హీరోగా తెరకెక్కనున్న ట్రిపులెక్స్ సీరీస్ నెక్ట్స్ పార్ట్ లో దీపిక హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. విన్ హీరోగా తెరకెక్కిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రంలోనే దీపిక హీరోయిన్గా నటించాల్సి ఉన్నా, అప్పటికే హ్యాపీ న్యూ ఇయర్ సినిమాకు కమిట్ అవడంతో చేయలేకపోయింది. దీంతో ఈ సారి విన్ డీసిల్ సరసన దీపిక నటించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.