కూలిన గోడ : బాలుడు మృతి
అనంతపురం : ఉరవకొండ మండలం వై రాంపురంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోడ బాగా నీటితో నానడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు.