కలుషిత నీటితో 10 మందికి అస్వస్థత
వరంగల్ : కలుషిత నీరు తాగి పదిమంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా చేర్యాల మండలం యాదవ్ నగర్లో గురువారం జరిగింది. కాలనీకి సరఫరా అవుతున్న మంచినీరు కలుషితం కావడంతో కాలనీ వాసులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా దీనిపై కాలనీ వాసులు మాట్లాడుతూ.. గతంలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.