Yadava communities
-
వైఎస్సార్‌సీపీతోనే యాదవులకు న్యాయం
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమాజంలో అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి యాదవ కులానికి చెందిన నర్తు రామారావు, నర్తు నరేంద్రయాదవ్లకు అవకాశం కల్పించారని వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యాలయంలో మామిడి శ్రీకాంత్ అధ్యక్షతన బూర పాపారావు, కలగ శ్రీనివాస్‌యాదవ్, గద్దెబోయిన కృష్ణ సమక్షంలో జిల్లాలోని 10 నియోజకవర్గాలకు చెందిన సుమారు 500 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, కృపారాణి, ధర్మాన రామ్మనోహర్ నాయుడు వారికి వైఎస్సార్ సీపీ కండువాలు వేసి సాదారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం యాదవులను అంటరాని వారిలా చూస్తోందని, వారి ప్రగతి కోసం ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. జిల్లాకు చెందిన బీసీ మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గంలో ఓ గ్రామంలో యాదవ కులానికి చెందిన వ్యక్తి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలని కోరగా.. ‘బస్సు టికెట్ కాదు..?’ అని వ్యంగ్యంగా మాట్లాడిన తీరు బాధాకరణమన్నారు. రైతులు తమ కూరగాయలు అమ్ముకునేందు రైతు బజార్లు ఎలా ఏర్పాటు చేశారో.. యాదవులు గొర్రెలు, మేకలు విక్రయించుకునేందుకు ప్రత్యేకంగా మార్కెట్ చేస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు. బంజరు భూముల్లో మేకలు, గొర్రెలు మేతకు అవకాశం కల్పిస్తామని జీఓ 559ని అమలు చేయలేదని గుర్తుచేశారు. జిల్లాలో యాదవుల అభివృద్ధికి కృషిచేసే అనుభవజ్ఞుడైన ధర్మాన ప్రసాదరావు, ఎంపీ అభ్యర్థి దువ్వాడను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్పొరేషన్‌కు కృషి వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ యాదవులంటే.. తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి తొలి దర్శనం దక్కిన వారని, నమ్మిన వారికోసం ప్రాణాలను సైతం లెక్క చేయరనే గొప్పవారని పేర్కొన్నారు. పేదరికంలో ఉన్న యాదవులకు ఎమ్మెల్సీ పదవి, కార్పొరేషన్ ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు మాట్లాడుతూ టీడీపీ మరోసారి ఓట్లు వేయించుకోవడం కోసం... ‘అధికారంలోకి వస్తే చచ్చిపోయిన గొర్రెలను బతికిస్తామని’ కూడా హామీలిస్తారని ఎద్దేవా చేశారు. ధర్మాన ప్రసాదరావుకి యాదవులంటే ఎనలేని గౌరవమని, ఆయనకు అండగా ఉండాలని కోరారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎంవీ పద్మావతి, అంధవరపు వరహానరసింహం(వరం), బాలకృష్ణయాదవ్, సంఘం పెద్దలు పాల్గొన్నారు. -
యాదవ సత్రానికి పదెకరాలు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్ : తిరుమలలో సన్నిధి గొల్ల శరబయ్య పేరుతో యాదవ సత్రం నిర్మాణానికి పదెకరాల స్థలం మంజూరు చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి కోరింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్‌ను యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు రాగం సతీశ్ యాదవ్ గురువారం కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. సత్రం నిర్మిస్తే యాదవులందరికీ ఉపయోగపడుతుందన్నారు. దీనిపై టీటీడీ చైర్మన్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పొట్ట మల్లికార్జున్ యాదవ్, గడ్డం సతీశ్ యాదవ్, రవిక్రాంత్ తిరుపతి, బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
గొల్లమండపానికి రక్షణ
=కూల్చివేతకు వెనుకడుగు =ఇత్తడి కటాంజనాల ఏర్పాటు =పనులు ప్రారంభం =నెలాఖరుకు పూర్తి సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం ఎదురుగా ఉన్న గొల్లమండపాన్ని టీటీడీ అధికారులు పటిష్టపరచనున్నారు. కూలే స్థితిలో ఉన్న ఈ మండపానికి టీటీడీ ఇంజినీర్లు రక్షణ చర్యలు వేగవంతం చేశారు. ప్రత్యేకంగా ఇత్తడితో కూడిన కటాంజన బంధనాలు అమర్చనున్నారు. ఈ మేరకు శనివారం పనులు ప్రారంభించారు. ఆరు దశాబ్దాల క్రితం.. వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహద్వారానికి పది మీటర్ల దూరంలో నిటారైన నాలుగు శిలలపై గొల్ల మండపం ఉంది. శాసనాధారం ప్రకారం కేవలం పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు 1464లో సాళువ మల్లయ్య దొర వేయికాళ్ల మండపం నిర్మించారు. అయితే భక్తుల సౌకర్యార్థం మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఈ పురాతన మండపాన్ని 2003లో తొలగించారు. దీనివల్ల అక్కడే ఉన్న గొల్ల మండపం రాతి స్తంభాలకు పగుళ్లు వచ్చాయి. దీంతో గొల్లమండపాన్నీ తొలగించాలని టీటీడీ ప్రయత్నించింది. అయితే, తమ మనోభావాలకు విరుద్దంగా మండపం కూల్చడం సరికాదని కొన్ని యాదవ సంఘాలు భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టాయి. మరోవైపు దీనిపై కోర్టులో కేసులూ నడిచాయి. తీర్పు కూడా టీటీడీకి అనుకూలంగా వచ్చింది. అయినప్పటికీ మండపాన్ని తొలగించేందుకు టీటీడీ అధికారులు సాహసించలేకపోయారు. ఏ క్షణమైనా కూలిపోవచ్చు ఐఐటీ ప్రొఫెసర్ నరసింహరావు రెండేళ్లక్రితం గొల్లమండపాన్ని పరిశీలించారు. ఇది ఏ క్షణమైనా కూలిపోవచ్చంటా టీటీడీ అధికారులను హెచ్చరించారు. వ్యతిరేకత ఎదురవుతున్న దృష్ట్యా మండపం కూల్చివేతకు టీటీడీ అధికారులు సాహసించలేకపోయారు. అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున మండపానికి రక్షణ చర్యలు చేపట్టారు. ఇవీ రక్షణ చర్యలు గొల్లమండపానికి ఉన్న నాలుగు రాతి స్తంభాలను కలుపుతూ ఇత్తడితో కటాంజనాలు నిర్మించనున్నారు. మండపం బరువు నాలుగు స్తంభాలపై ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మేరకు శనివారం నుంచి పనులు ప్రారంభించారు. నెలాఖరులోపు పనులు పూర్తి చేయనున్నారు. మండపం కూల్చేస్తారనే వదంతులు కొంతకాలంపాటు వ్యాపించాయి. దీంతో యాదవ సంఘాలు, భక్తుల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రక్షణ చర్యలు చేపట్టడంతో శతాబ్దాలనాటి గొల్లమండపం మరికొంతకాలం పాటు తమకు కనువిందు చేయనుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరి తగతిన పూర్తిచేయాలని కోరుతున్నారు.