పాలు కాదు.. యూరియా నీళ్లు
హైదరాబాద్: ఓ పాల వ్యాపారి అందులో యూరియా రసాయనాలు కలిసి అమ్ముతూ పట్టుబడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గాల్ పల్లిలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తున్నాడు. పాలలో యూరియా రసాయనాలు కలిపి వాటిని చిక్కగా తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాలు తాగి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు పాల వ్యాపారిని తమదైన శైలిలో విచారిస్తేం పూర్తి సమాచారం బయట పడింది. తర్వాత ఆ పాల వ్యాపారితో పాటు ఈ ఘటనకు సంబంధించి అతడికి సహకరించిన గ్యాంగ్ మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.