yaganti
-
యాగంటిలో షూటింగ్ సందడి
బనగానపల్లె రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటిలో షూటింగ్ సందడి కొనసాగుతోంది. సోమవారం.. ‘నేనే రాజు నేనే మంత్రి’’ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు. హీరో రానా, హీరోయిన్ కాజల్ అగర్వాల్..చిత్రీకరణలో పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు తేజతోపాటు పలువురు పలువురు డ్యాన్సర్లు, టెక్నిషియన్లు, కెమెరామెన్లు ఉన్నారు. షూటింగ్ చూసేందుకు అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
16 ఏళ్ల తరువాత అదే లోకేషన్లో రానా
బాహుబలి షూటింగ్ పూర్తి చేసుకున్న రానా, ప్రస్తుతం తాను హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తన తొలి సినిమాలో రాజకీయనాయకుడిగా నటించిన ఈ మ్యాన్లీ హీరో ఇప్పుడు మరోసారి అదే తరహా పాత్రలో కనిపించనున్నాడు. లవ్ స్టోరీలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నూలు జిల్లాలోని యాంగటి ఆలయ పరిసరాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా గతంలో తాను ఆలయాన్ని వెళ్లిన సందర్భాన్ని అభిమానులతో పంచుకున్నాడు రానా. 16 ఏళ్ల క్రితం వెంకటేష్ హీరోగా తెరకెక్కిన జయంమనదేరా షూటింగ్ సమయంలో యాగంటి ఆళయానికి వచ్చారాన్న తిరిగి ఇన్నేళ్ల తరువాత అక్కడే షూటింగ్ చేయటం ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు. Never was a believer of the God or the Devil!! But this is just spectacular. Shooting at the Yaganti Temple!! #bestjobever pic.twitter.com/omQTy0urnv — Rana Daggubati (@RanaDaggubati) 8 January 2017 Came here exactly 16years ago for the shoot of VictoryV's #JayamManadaeRaa #జయంమనదేరా pic.twitter.com/s7SkhLIVKu — Rana Daggubati (@RanaDaggubati) 8 January 2017 -
యాగంటి క్షేత్రంలో షూటింగ్
బనగానపల్లె రూరల్: ఓ టీవీ చానల్లో ప్రసారం కాబోతున్న పున్నగా సీరియల్ షూటింగ్ గురువారం ప్రముఖ శైవక్షేత్రం యాగంటి క్షేత్రంలోని శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంల నిర్వహించారు. వరమూళ్లపూడి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియో ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సీరియల్‌కు సంబంధించిన హోమం సన్నీవేశాలను చిత్రీకరించారు. ఆర్టీస్ట్లు భరణి, బృంద, డబ్బింగ్ జానకి, హరి, పవిత్రలోకేష్, జ్యోతిరెడ్డి, వెంకట్ గోవర్ధన్‌తో పాటు మరి కొందరు ఆర్టీస్ట్లతో షూటింగ్ చేశారు. ఈ సీరియల్లో హీరో ఆకాష్, హిరోయిన్ అంజన కూడా నటిస్తున్నారని, ఆ సన్నివేశాలను శుక్రవారం చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.