యాగంటిలో షూటింగ్ సందడి
బనగానపల్లె రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటిలో షూటింగ్ సందడి కొనసాగుతోంది. సోమవారం.. ‘నేనే రాజు నేనే మంత్రి’’ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు. హీరో రానా, హీరోయిన్ కాజల్ అగర్వాల్..చిత్రీకరణలో పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు తేజతోపాటు పలువురు పలువురు డ్యాన్సర్లు, టెక్నిషియన్లు, కెమెరామెన్‌లు ఉన్నారు. షూటింగ్ చూసేందుకు అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.