యాగంటి క్షేత్రంలో షూటింగ్
Published Fri, Oct 28 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
బనగానపల్లె రూరల్:
ఓ టీవీ చానల్‌లో ప్రసారం కాబోతున్న పున్నగా సీరియల్ షూటింగ్ గురువారం ప్రముఖ శైవక్షేత్రం యాగంటి క్షేత్రంలోని శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంల నిర్వహించారు. వరమూళ్లపూడి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియో ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సీరియల్‌కు సంబంధించిన హోమం సన్నీవేశాలను చిత్రీకరించారు. ఆర్టీస్ట్‌లు భరణి, బృంద, డబ్బింగ్ జానకి, హరి, పవిత్రలోకేష్, జ్యోతిరెడ్డి, వెంకట్ గోవర్ధన్‌తో పాటు మరి కొందరు ఆర్టీస్ట్‌లతో షూటింగ్ చేశారు. ఈ సీరియల్‌లో హీరో ఆకాష్, హిరోయిన్ అంజన కూడా నటిస్తున్నారని, ఆ సన్నివేశాలను శుక్రవారం చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
Advertisement
Advertisement