Yandamoori Veerendranath
-
పిల్లల మెదడు విశ్లేషణ గురించి యండమూరి వీరేంద్రనాథ్
-
‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసిన రాఘవేంద్రరావు
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నటుడు సునీల్, బిగ్‌బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఝాన్సీ కూనం (యూఎస్ఏ) సమర్పణలో రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని... పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘సంధ్య స్టూడియోస్ నిర్మిస్తున్నఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రచయితగా యండమూరి సృష్టించిన సంచలనాలు అందరికీ తెలిసినవే. ఆయన నా దర్శకత్వంలో రూపొంది మంచి విజయాలందుకున్న ‘ఆఖరి పోరాటం’, ‘జగదేకవీరుడు-అతిలోక సుందర’ చిత్రాలకు రచయితగా పని చేశారు. యండమూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలని’ అన్నారు. యండమూరి మాట్లాడుతూ... ‘రాఘవేంద్రరావు నాకు మంచి మిత్రుడు మాత్రమే కాదు గురువులాంటివారు కూడా. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడాయన. ఆయన మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసి, మా చిత్రాన్ని ప్రమోట్ చేయడం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. చదవండి: హీరోగా రాబోతున్న దర్శకేంద్రుడు.. నలుగురు హీరోయిన్లతో సందడి! -
దిండుకింద నల్ల త్రాచు!
దిండు కింద నల్లత్రాచు... ఈ ఊహే ఎంతో భయంకరంగా ఉంది. ఇలాంటి ఊహ ఒకటి వచ్చి, దానిని కథగా మలిచి నవలల పోటీకి పంపితే 50000 రూపాయల బహుమతి గెలిచింది. ఆ కథను రాసింది, ఆ బహుమతి గెలిచింది ఎవరో కాదు.. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఇప్పుడు ఆ కథను ‘దుప్పట్లో మిన్నాగు’ పేరుతో సినిమాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కించారు. చిరంజీవి క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి అమర్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు యండమూరి మాట్లాడుతూ– ‘‘12 సంవత్సరాల క్రితం వచ్చిన ఓ చిన్న ఐడియాతో ఈ కథ రాయటం జరిగింది. కశ్మీర్ ఉగ్రవాదం నేపథ్యంలో అకస్మాత్తుగా తప్పిపోయిన తన తండ్రిని ఓ కూతురు ఎలా వెతికి పట్టుకుంది? ఉగ్రవాదులను ఎలా మట్టుపెట్టింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది’’ అన్నారు. ప్రముఖ పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ– ‘‘యండమూరి రచనలకు నేను అభిమానిని. విశిష్టమైన రచయిత. నా ఆలోచనలకు ఇంథనం ఇచ్చే రచనలు ఆయనవి. సెలబ్రిటీల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. తెలుగు తెలిసినవారందరికీ ఆయన తెలుసు. అన్ని తరహా పాఠకులకు ఆయన శైలి నచ్చుతుంది. ఇప్పుడు సినిమా చేస్తున్నారు. ఆయన సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘కాంటెంపరరీ దర్శకులకు ఏ మాత్రం తక్కువ కాకుండా అడ్వాన్స్డ్గా సినిమా తీశారు యండమూరి గారు’’ అన్నారు నిర్మాత కేయస్ రామారావు. దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘సినిమా చూశాను. బాగుంది. ఇప్పుడున్న పరిణామాలకు కరెక్ట్‌గా సరిపోయే సినిమా ఇది. యండమూరి రచించిన 12 నవలలను సినిమాలుగా తీశాను. అన్నీ సూపర్‌హిట్టే’’ అన్నారు. చిత్రనిర్మాత అమర్ మాట్లాడుతూ– ‘‘1992 నుండి ఇండస్ట్రీలో ఉండి యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు తీస్తున్నాను. ఇది నా మొదటి చిత్రం. యండమూరిగారితో సినిమా తీయటం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
మనసు మనసులో ఉండేదెలా?!
జీవన గమనం నేను దైవ సంబంధిత ఆచారాల వ్యతిరేకిని. మనిషి సంతోషంగా బతకాలంటే ఆత్మ విశ్వాసం, తార్కిక జ్ఞానం ముఖ్యమని నమ్ముతాను. గుళ్లూ గోపురాలకు వెళ్లను. ప్రస్తుతం ఓ అకాడెమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఓ ప్రొఫెషనల్ కోర్సుకి ప్రిపేర్ అవుతున్నాను. మంచి స్థాయికి వెళ్తాననే నమ్మకం ఉంది. కానీ నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. పూజలు చేసి పుణ్యం సంపాదించకపోవడం వల్ల నాకు మంచి జరగట్లేదు, సరైన ఉద్యోగం దొరకట్లేదంటూ ఉపయోగం లేని మాటలు చెప్తున్నారు. అలాంటప్పుడు నా ఆత్మవిశ్వాసం దెబ్బ తింటోంది. ఈ మధ్య తెలిసిన వ్యక్తి ఒకరు నా జాతకంలో దోషముందని భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి వాళ్లని ఎదుర్కోవడం ఎలా? - వెంకట్, శ్రీకాకుళం దైవం, ఆచారం, గుళ్లూ గోపురాలూ, విగ్రహారాధన... వీటిపట్ల బలమైన అభి ప్రాయాలు ఉన్నవారు మరొక అలవాటు కూడా చేసుకోవాలి. తమ అభిప్రాయాలకి వ్యతిరేకమైన అభిప్రాయాలు ఉన్నవారితో చర్చించడం, వాదించడం తగ్గించాలి. భిన్న ధృవాలు ఎప్పుడూ ఒకటి కావు. మీ అభిప్రాయాల పట్ల మీకు బలమైన నమ్మకం ఉన్నప్పుడు మీ బంధువులు, స్నేహితులు వాటిని అర్థం చేసుకోకపోతే మీకొచ్చే నష్టమేంటి? అసలీ చర్చలన్నీ ఎందుకు? ఎప్పుడైతే మీ జాతకం మరొకరికి చూపించారో... వారు దానిపట్ల తమ అభిప్రాయాలు చెప్తూనే ఉంటారు. వాటిని నమ్మనప్పుడు చర్చ ఎందుకు? మీరు నమ్మిన సిద్ధాంతాలను బలపర్చేవారి గ్రూప్స్ ఫేస్బుక్లో కొన్ని ఉంటాయి. వాళ్లతో చేరితే మీ అభిప్రాయాల పట్ల మీకు నమ్మకం ఇంకా బలంగా పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, అవతలివారి అభిప్రాయం కూడా విని నిర్ణయం తీసుకోండి. తన నమ్మకాలు తప్పని తెలిసినప్పుడు వాటిని మార్చుకోనివాడు మూర్ఖుడు. మార్చుకునేవాడు జ్ఞాని. ‘అందరూ నిన్ను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు, నాతో సహా. నేను చెప్పినా, మతగ్రంథాల్లో రాసినా అది నీ తర్కానికి, ఇంగిత జ్ఞానానికి, హేతువుకి సరిపోతేనే దాన్ని నమ్మి ఆచరించు’ అన్నాడు బుద్ధుడు. కాబట్టి అనవసరమైన చర్చల ద్వారా సమయం వృథా చేసుకోకుండా, ప్రొఫెషనల్ కోర్సుకి బాగా ప్రిపేరవ్వండి. నా వయసు 18. నా మనసు అధీనంలో ఉంచుకోవడం నాకు చేతకావడం లేదు. ముఖ్యంగా శృంగారపరమైన ఆలోచనలు నన్ను కుదురుండనివ్వడం లేదు. దాంతో చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. ఇలా అయితే ఫెయిలైపోతానేమోనని భయంగా ఉంది. ఏం చేయాలి? - వికాస్, మెయిల్ పద్దెనిమిదేళ్ల వయసులో శృంగార పరమైన ఆలోచనలు రాకపోతే తప్పు కానీ వస్తే తప్పులేదు. అయితే చదువు మీద శ్రద్ధ, శృంగారపరమైన ఆలోచనలు... రెండూ భిన్నమైనవి. ఒకదాన్ని ఒకటి డామినేట్ చేయకూడదు. చానలైజ్ చేయాలి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒకచోట... ‘ఇలాంటి ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తి చిత్రకారుడై, తన కోరికలకి ఒక చానెల్ చూపించి గొప్ప విజయాన్ని సాధించాడు’ అని రాశాడు. కాబట్టి మీరు ఏదైనా ఒక హాబీని అలవర్చుకోండి. సాధారణంగా ఇలాంటి ఆలోచనలు తెల్లవారుజామున లేదా రాత్రిళ్లు వస్తాయి. కాబట్టి మెలకువ రాగానే పక్కమీద నుంచి లేచిపోవడం, సాయంత్రం గేమ్స్‌తో బాగా అలసిపోయి, నిద్ర ముంచుకువచ్చే వరకూ పక్క మీదికి చేరకపోవడం వంటి అలవాట్లు చేసుకోండి. కీప్ యువర్సెల్ఫ్ ఆల్వేజ్ బిజీ. అదొకటే మంత్రం దీన్నుంచి బయట పడటానికి. చదువుకునే వాతావరణాన్ని తగిన విధంగా సృష్టించుకోవడం, పొద్దున్న లేవగానే కాసేపు ప్రార్థన, ఆపై మరికాసేపు యోగా మొదలైన ప్రక్రియల ద్వారా మనసును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. గమ్యంవైపు దృష్టిపెట్టి భవిష్యత్తులో నేనెలాగూ దాన్ని అనుభవించబోతున్నాను కదా అనే ఆశతో చదువు మీద శ్రద్ధ నిలపండి. సినిమాలు తగ్గించండి. ఇంటర్నెట్లో ఇటువంటి సైట్ల జోలికి అస్సలు వెళ్లకండి. తరచూ సెక్స్ గురించి మాట్లాడే ఫ్రెండ్స్‌ని దూరం పెట్టండి. అప్పటికీ మార్పు రాకపోతే మంచి సైకాలజిస్టును సంప్రదించండి. నేను ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. బాగా చదువుతాను. కానీ హాస్టల్లో నా రూమ్మేట్ పద్ధతి బాలేదు. ఎప్పుడూ ఫోన్లో గట్టిగట్టిగా మాట్లాడుతుంది. ల్యాప్ టాప్‌లో సినిమాలు చూస్తుంది. ప్రశాంతంగా చదువుకోవడానికి, నిద్రపోవడానికి ఉండట్లేదు. భరించి భరించి పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా అని వార్డెన్‌కి చెప్పాను. ఆవిడ మందలించడంతో తను మరీ రెచ్చిపోతోంది. ఇంతకుముందు కంటే ఎక్కువ గొడవ చేస్తోంది. ఆ అమ్మాయిది పెద్ద బ్యాగ్రౌండ్ కావడంతో వార్డెన్ రూమ్ మార్చడం లేదు. నా సమస్య ఎలా తీరుతుంది? - మంజరి, హైదరాబాద్ హాస్టల్లో ఉండే చాలామంది విద్యార్థులకు (ముఖ్యంగా విద్యార్థినులకు) ఇది పెద్ద సమస్య. బాగా చదువుకునే విద్యార్థినులకు ఒక గదిలోను, అల్లరి చిల్లరిగా ఉండేవారిని మరొక గదిలోనూ వేయాలనే స్పృహ వార్డెన్లకు ఉండదు. అయితే వారి సమస్యలు, కారణాలు వారికుంటాయి. మీరింకా మొదటి సంవత్సరమే కాబట్టి నాలుగేళ్ల పాటు ఈ డిస్టర్బెన్స్‌ని భరించడం కష్టం. అందుకే మీ తల్లిదండ్రులని వెళ్లి అధికారులతో కానీ ప్రిన్సిపల్‌తో కానీ మాట్లాడమని చెప్పండి. సమస్య పరిష్కారమవుతుంది. లేదంటే నేరుగా కాలేజీ కరెస్పాండెంట్తోనే మీ పేరెంట్స్‌ని మాట్లాడమని చెప్పండి. అదొక్కదే దీనికి పరిష్కారం. -
ప్రేమను పెత్తనం అంటోంది... ఏం చేయను?
జీవన గమనం మాదో మధ్య తరగతి కుటుంబం. పైగా ఉమ్మడి కుటుంబం. నేను ఇంట్లో చిన్న కోడలిని. అందుకనో ఏమో, అందరూ ప్రతి పనీ నాకే చెబుతారు. ఇద్దరు తోటి కోడళ్లు ఉన్నా అత్తగారు, మామగారు మంచినీళ్ల దగ్గర్నుంచి ప్రతిదీ నన్నే అడుగుతారు. అలా అని ప్రాముఖ్యతనిస్తారా అంటే అదీ లేదు. ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలను కున్నప్పుడు మాత్రం పెద్ద కోడళ్లిద్దరితోనే చెప్తారు. నేనెంత సర్దుకుపోదామన్నా ఇలాంటివి నన్ను బాధపెడుతున్నాయి. పైగా పని చేసీ చేసీ విసుగు పుడుతోంది. నేనూ మీలాంటిదాన్నే కదా అని అడిగేద్దామంటే తోటికోడళ్లు ఏమనుకుంటారోనని భయం. నాకు వాళ్లంటే ఇష్టమే. కానీ మరీ ఇంతగా అడ్జస్ట్ అవ్వాలంటే కష్టంగా ఉంది. నా బాధ వాళ్లకు అర్థమవ్వాలంటే ఏం చేయాలి? - శ్రీవల్లి, నెల్లూరు జాయింట్ ఫ్యామిలీలో ఇలాంటివన్నీ మామూలే శ్రీవల్లిగారూ! కొత్త కోడలికే సీనియర్లు పని చెప్పడం, మిగతా కుటుంబ సభ్యులు ఏమాత్రం ప్రాముఖ్యత నివ్వకపోవడం సాధారణంగా కొన్ని కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు రాసిన ఈ సమస్య మీ భర్తతో చర్చించారో లేదో చెప్పలేదు. ముందు ఆ ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా కలిసి ఉండాలా లేక విడిగా వెళ్లిపోవడానికి ఆస్కారం ఉందా అనేది మీ భర్తని ఆలోచించమనండి. అయితే ప్రతి సమస్యకీ పరిష్కారం దూరంగా వెళ్లిపోవడం కాదు. చిన్న చిన్న సమస్యలకు కూడా మీరు లోతుగా ఆలోచించి బాధ పడుతున్నారేమో ఓసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీ వివాహం జరిగి ఎంత కాలమైంది? మీకు సంతానం ఉన్నారా? ఒకవేళ ఇంకా లేకపోతే, ఎలాగూ మీరు తల్లి అవుతున్న కాలంలో కొంతకాలం పుట్టింట్లోనే ఉంటారు. ఆ తర్వాత బిడ్డ సేవతో చాలాకాలం గడిచిపోతుంది. అప్పుడు ఆటోమేటిగ్గా ఇంట్లోవాళ్లంతా మీకు దగ్గరవుతారు. ఈ కోణంలో ఆలోచించి చూడండి. నేనో అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాను. కొన్నాళ్లు బాగానే కలిసున్నా, తర్వాత ఆమె ప్రవర్తన మారిపోయింది. ఆఫీసు నుంచి త్వరగా వచ్చేది కాదు. ఫోన్ చేస్తే తీసేది కాదు. ఎప్పటికో ఇంటికొచ్చేది. అడిగితే ఫ్రెండ్‌తో రెస్టారెంటుకు వెళ్లాననో, కొలీగ్ ఇంట్లో పార్టీకి వెళ్లాననో అనేది. ఓ మాట చెప్పొచ్చు కదా అంటే నాకా మాత్రం స్వేచ్ఛ లేదా అంటూ అరిచేది. చివరికి ఓసారి నాతో చెప్పకుండా వేరే ఊరు కూడా వెళ్లిపోయింది. తిరిగొచ్చాక కోప్పడ్డాను. దాంతో ఆవేశంగా నన్ను వదిలి వెళ్లిపోయింది. నేను తనను హింసిస్తున్నా నంటూ కేసు పెట్టింది. రెండేళ్లుగా ఆ కేసు తేలక నరకం అనుభవిస్తున్నాను. నేను చేసిన తప్పేంటి? ఎక్కడున్నావో తెలియకపోతే టెన్షన్‌గా ఉంటుంది, ఓ మాట చెప్పమనడమేనా? దానికి ఇలా కోర్టుల చుట్టూ తిప్పాలా? - గంగాధర్, రాజమండ్రి మీ ఉత్తరం కేవలం మీ తరఫు నుంచి రాసినట్లు ఉంది. ఏ అమ్మాయీ కూడా కారణం లేకుండా తన భర్తపై కేసు పెట్టదు. ఆఫీసు నుంచి త్వరగా రాకపోవడం, మీరు ఫోన్ చేసినా తీయకపోవడం, మీమీద గట్టిగా అరవడం మొదలైనవన్నీ మీ అభియోగాలు. ఆమె ఒప్పుకుంటే ఓసారి ఇద్దరూ కలిసి మ్యారేజ్ కౌన్సెలర్ దగ్గరకు వెళ్లండి. కానీ మీరు రాసిన ఉత్తరం ప్రకారం ఆమె బహుశా దీనికి ఒప్పుకోకపోవచ్చు. విడాకులు ఒక్కటే మీ సమస్యకు పరిష్కారంగా కనబడుతోంది. నాకు ఈ మధ్యనే ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చెరర్‌గా ఉద్యోగం వచ్చింది. నిజానికి నేను మొదట్నుంచీ బాగా చదివేవాడిని. కానీ నాకు భయం చాలా ఎక్కువ. రోడ్డుమీద వెళ్తుంటే ఎవరైనా నన్ను కొట్టి దోచుకుంటారేమోనని భయం. కొత్త టెక్నాలజీ వాడాలంటే భయం. పొడవుగా ఉన్నవాళ్లను చూసినా, భారీ కాయుల్ని చూసినా భయం. కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే మరీ భయం. నా ఈ భయాల గురించి ఎవరికీ ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఈ మధ్య నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇన్ని భయాలున్న నేను ఆ అమ్మాయిని ఏం సుఖపెట్టగలుగుతాను? అందుకే పెళ్లి చేసుకోబుద్ధి కావడం లేదు. ఒకవేళ నా గురించి ఆ అమ్మాయికి ముందే చెబుదామంటే, చెప్పాక చేసుకోదేమోనని భయం. ఇప్పుడు నేనేం చేయాలి? - కుమార్, హైదరాబాద్ భయాలు, ఫోబియాలు రకరకాలుగా ఉంటాయి. కొద్దిపాటి కౌన్సెలింగ్‌తో ఏ మానసిక శాస్త్రవేత్త అయినా మీ భయాన్ని తొలగించగలడు. అయితే దీనికి ‘పారనాయిడ్’ అని పేరు పెట్టి, వేలల్లో ఫీజు వసూలు చేసే ఫేక్ డాక్టర్ల దగ్గరకు మాత్రం వెళ్లకండి. మీ భయాలకూ వివాహానికీ ఏ సంబంధమూ లేదు. పెళ్లికి ముందే మీ భయాల గురించి ఆ అమ్మాయికి చెబుతారా లేదా అన్నది మీ ఇష్టం. ఎందుకంటే మీరు ఉత్తరంలో రాసిన భయాలేవీ కంగారు పడాల్సినంత ఫోబియాలు కాదు. దాచిపెట్టేటంత రహస్యాలూ కాదు. యండమూరి వీరేంద్రనాథ్