Yandamuri Virendranath
-
యండమూరి చేతుల్లో మెగాస్టార్ జీవిత చరిత్ర
మెగాస్టార్ చిరంజీవి జీవిత చరిత్రను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్కు అప్పగించారు చిరంజీవి. ఈ విషయాన్ని వైజాగ్‌లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఎఎన్ఆర్ శత జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చిరంజీవి ఈ ప్రకటన చేశారు. లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో యండమూరితో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులకు అవార్డులు అందించారు ఫౌండేషన్ ప్రతినిధి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఎన్టీఆర్, ఎఎన్ఆర్ల గురించి ప్రశంసాపూర్వక ప్రసంగం చేసిన చిరంజీవి తన బయోగ్రఫీ గురించి మాట్లాడుతూ.. తన బయోగ్రఫీ రాసేంత సమయం తనకు లేదని.. నా బయోగ్రఫీ రాసే సామర్ధ్యం ఒక్క యండమూరికి మాత్రమే ఉందని.. అందుకే ఆ బాద్యతను యండమూరికి అప్పగిస్తున్నాను అని అన్నారు. సమకాలీన రచయితల్లో యండమూరికి సాటి మరెవరూ లేరు. తెలుగులో ఉన్న ఏకైక స్టార్ రచయిత ఎవరన్నా ఉన్నారా అంటే అది యండమూరి మాత్రమే. అలాంటి గొప్ప రచయిత ఈ రోజు నా బయోగ్రఫీ రాస్తాను అనడం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆయన రాసిన అభిలాష చిత్రంతోనే సినీ పరిశ్రమలో నా స్థానం పధిలమని అప్పుడే నిర్ణయించుకున్నాను అంటూ యండమూరిపై ప్రశంసల వర్షం కురిపించారు చిరంజీవి. -
యండమూరి డైరెక్షన్లో మరో సినిమా
ప్రముఖ నవలా, కథారచయిత, దర్శకుడు యండమూరి వీరేంద్ర నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నల్లంచు తెల్లచీర’. భూషణ్, దియా, జెన్నీ, సాయి, కిషోర్ దాస్ ముఖ్యపాత్రధారులు. ‘ఊర్వశి’ ఓటీటీ సమర్పణలో రవి కనగాల–తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నల్లంచు తెల్లచీర’ పేరుతో యండమూరి రాసిన నవలని చిరంజీవి హీరోగా ‘దొంగ మొగుడు’ పేరుతో తెరకెక్కించగా మంచి విజయం సాధించింది. చిరంజీవిగారి ‘అభిలాష, ఛాలెంజ్, మరణమృదంగం’ వంటి చిత్రాలకు చక్కని కథ అందించారు యండమూరి. ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, అగ్నిప్రవేశం, దుప్పట్లో మిన్నాగు’ వంటి చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నల్లంచు తెల్లచీర’పై అందరిలో ఆసక్తి నెలకొంది’’ అన్నారు. ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాత: సి.అమర్, కో–ప్రొడ్యూసర్: కృష్ణకుమారి కూనం. -
నన్ను చూసి నవ్వుతున్నారు... ఏం చేయను?!
జీవన గమనం యండమూరి వీరేంద్రనాథ్ నేనో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిని. పని పరంగా ఇబ్బందుల్లేవు. కానీ నేను చుట్టూ ఉన్నవాళ్లతో త్వరగా కలసిపోలేకపోతు న్నాను. ఎవరితో మాట్లాడాలన్నా మొహ మాటం. ఏ ఇద్దరు మాట్లాడుకుని నవ్వుకుం టున్నా, నన్నేమైనా కామెంట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇదేమైనా మానసిక రుగ్మతా? - సుధాకర్‌బాబు, గుడివాడ మీరు ఒకే ప్రశ్నలో రెండు సమస్యలు రాశారు. ఒకటి, చుట్టూ ఉన్నవాళ్లతో త్వరగా కలవలేకపోవడం. రెండు, ఏ ఇద్దరు మాట్లాడుతున్నా మీ గురించే అనుకోవడం. మొదటిది పెద్ద సమస్య కాదు. అందరితో కలివిడిగా ఉండేవారు ఒక వర్గానికి చెందినవారైతే, హుందాగా తన పని తాను చేసుకుపోయేవారు మరొక వర్గం. నిజానికి రెండో వర్గం వారినే చుట్టూ ఉన్నవారు గౌరవంగా చూస్తారు. అయితే ఇంట్రావర్షన్ వేరు. రిజర్వ్డ్గా ఉండటం వేరు. ఇంట్రావర్షన్ అంటే అవసరమైనప్పుడు కూడా మాట్లాడలేక పోవడం. రిజర్వ్డ్గా ఉండటమంటే అవసరమైనంత వరకూ మాట్లాడి ఆపేయడం, అధిక ప్రసంగం చేయక పోవడం. ఇక రెండో సమస్య... ఏ ఇద్దరు మాట్లాడుకున్నా మీ గురించేమోనని అనుమానపడటం. దీనికి పరిష్కారం కలివిడిగా ఉండటం కాదు, మీ పట్ల మీరు నమ్మకం పెంచుకోవడం. మీ గురించి నవ్వుకునేటంత హాస్యాస్పదమైన, దుర్మార్గమైన పనులు మీరేమీ చేసి ఉండరు. కొంచెం విశ్లేషించుకుంటే ఈ విషయం మీకే అర్థమవుతుంది. అలాం టప్పుడు మీ చుట్టూ ఉన్నవారికి మీ గురించి నవ్వుకునే అవసరం ఏముం టుంది? మరీ గాఢంగా ప్రేమిస్తే తప్ప, ఒక మనిషి తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించేది రోజుకి కేవలం రెండు గ ంటలేనని మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు. అది వాస్తవం అనుకుంటే... ఒక మనిషికి పదిమంది స్నేహితులున్నా రనుకుందాం. అతడు రోజుకి పన్నెండు నిమిషాలే ఒక్కొక్కరి గురించీ ఆలోచి స్తాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే... ఈ వేగ వంతమైన ప్రపంచంలో మీ గురించి ఆలోచించడానికి, నవ్వుకోవ టానికి ఎవరికీ సమయం ఉండదు. నేను డిగ్రీ పూర్తి చేసి, మూడేళ్లుగా బ్యాంక్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నాను. ఒక మంచి అవకాశం వస్తే ఓ అమ్మాయి ప్రేమలో పడి పోగొట్టుకున్నాను. ఆ అమ్మాయీ దక్కలేదు. ఇప్పుడు మరో అమ్మాయి కోసం పిచ్చోడిలా తిరుగుతున్నాను. దాంతో నా స్నేహితులు నువ్వీ జన్మలో మారవు అంటూ తిడుతున్నారు. నేనెలా అయినా ఉద్యోగం తెచ్చుకోవాలి. ఏం చేయాలో సలహా ఇవ్వండి. - అరవింద్, సంద్యాల బ్యాంక్ ఉద్యోగం సంపాదించలేని మీ అశక్తతకి ‘అమ్మాయి ప్రేమ’ అనే అంశాన్ని కారణంగా తీసుకుని ఆత్మవంచన చేసు కుంటున్నారేమోనని నా అభిప్రాయం. రెండో అమ్మాయి కోసం పిచ్చోడిలా తిరుగుతున్నానని రాశారు. అర్థం కాలేదు. ఆ రెండో అమ్మాయి మీ ప్రేమను ఒప్పు కుందా? ఒప్పుకోకపోతే పిచ్చోడిలా తిరుగుతున్నారా? ఒప్పుకున్నాక పిచ్చో డయ్యారా? మొదటి అమ్మాయి ప్రేమలో పడి అవకాశం పోగొట్టుకోవడం ఏమిటో కూడా అర్థం కాలేదు. ఒక సమస్యకి పరిష్కారం అడుగుతున్నప్పుడు, చెప్పే వారికి అర్థమయ్యేట్టు వివరంగా రాయాలి. నాకో బెస్ట్ ఫ్రెండ్ ఉంది. తను నా ప్రాణం. నాకు తనతో కలిసి హ్యాపీగా చదువుకోవాలని ఉంది. కానీ మావాళ్లు నాకు పెళ్లి చేస్తామంటు న్నారు. పెళ్లి చేసుకుంటే నా ఫ్రెండ్‌కి దూరమై పోతానేమోనని నాకు భయంగా ఉంది. తనకు పెళ్లయ్యాకే నేను చేసుకోవాలి అనుకుంటున్నాను. కానీ మావాళ్లు నా మాట వినడం లేదు. నేనేం చేయాలి? - ఎం.హరిత, మెయిల్ పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి మీరు దూరమైపోతారన్న విషయం వాస్తవమే అయితే, ఆమెకు పెళ్లయ్యాక కూడా మీకు అదే స్థితి సంభవిస్తుంది కదా! ముందు వాస్తవాలను ఎదుర్కొనే మనస్తత్వాన్ని పెంచుకోండి. మీ స్నేహాన్ని జీవితాంతం కాపాడుకోవాలంటే, ఇద్దరూ అవివాహి తులుగా ఉండాల్సిన అవసరం లేదే. మీ ప్రశ్న చూస్తూంటే నాకు నందితాదాస్ ‘ద ఫైర్’ సినిమా గుర్తొస్తోంది. ప్రాణ స్నేహమంటే ప్రతి క్షణం కలిసి ఉండటం కాదు. ఎంత దూరంగా ఉన్నా తాము మానసికంగా దగ్గరే అన్న నమ్మకం. స్కైప్ దగ్గర్నుంచి ఫేస్ బుక్ వరకూ ఆధునికత పెరిగిన ఈ రోజుల్లో... దూరం అన్న సమస్యే ఉత్పన్నం కాదు. హ్యాపీగా పెళ్లి చేసుకోండి. మీ ప్రాణ స్నేహితురాలితో పాటు మీ భర్త కూడా ప్రాణ స్నేహితు డవుతాడు. బెస్టాఫ్ లక్. -
నవంబర్ 14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు యండమూరి వీరేంద్రనాథ్ (రచయిత), మమతామోహన్ దాస్ (నటి) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రగ్రహానికి సంబంధించినది. ఇందువల్ల వీరు అందంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతారు, ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగయోగం, అవివాహితులకు వివాహ యోగం కలుగుతాయి. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. విలాస వస్తువులు కొంటారు. వీరు పుట్టిన తేదీ 14. ఇది బుధ సంఖ ్య కాబట్టి తెలివితేటలు, సమయస్ఫూర్తి, కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆగిపోయిన చదువును పూర్తి చే స్తారు. కొత్త టెక్నాలజీ నేర్చుకుంటారు లేదా కొత్త కోర్సులు చేస్తారు. వ్యాపారాన్ని లేదా కొత్తప్రాజెక్టుని ఆరంభిస్తారు, మీడియా రంగంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. లక్కీ నంబర్స్: 1,5,6; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, పర్పుల్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, ఎల్లో. బ్లూ; లక్కీ డేస్: సోమ, మంగళ, గురు, శుక్రవారాలు. సూచనలు: విష్ణుసహస్రనామ పారాయణ, పేద కన్యల వివాహ ఖర్చులను భరించడం, పేద విద్యార్థులకు టూల్‌కిట్స్ కొనివ్వడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ఆయనది గొప్ప వ్యక్తిత్వం
వ్యక్తిగత చరిష్మా ఉన్న నాయకులు మనకి తక్కువ. నాయకుడిని చూడగానే, ‘ఇతడు మనకి బాసటగా నిలబడగలడు’ అనిపించాలి. అటువంటి లక్షణాలు వైయస్సార్‌లో కోకొల్లలు. నమ్మింది చెప్పటం, చెప్పింది చెయ్యటం రాజకీయ జీవితంలో ఆయనని మేరు పర్వతంపై నిలబెట్టాయి. దీనినే వ్యక్తిత్వవికాసంలో ‘ప్రామిస్ మేనేజ్మెంట్’ అంటారు. ఇక యాంగర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే, ఏ మీటింగ్‌లో గానీ, పబ్లిక్‌గా గానీ మనం ఆయనలో కోపాన్ని చూసిన దాఖలాలు లేవు. ఒక నాయకుడికి తనపై తనకున్న నమ్మకాన్నీ, పట్టుదలనీ ఆ వ్యక్తి నడక నుంచి చిరునవ్వు వరకు ప్రతి చర్యలోనూ గమనించవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నాకు తెలిసినంతలో, అంత గొప్ప జ్ఞాపకశక్తి ఉన్న నాయకుడు మరొకరు కనపడలేదు. దశాబ్దం వెనుక కలిసిన కార్యకర్తనైనా పేరు పెట్టి పిలవటం నేను స్వయంగా గమనించాను. - యండమూరి వీరేంద్రనాథ్