
యండమూరి వీరేంద్ర నాథ్
ప్రముఖ నవలా, కథారచయిత, దర్శకుడు యండమూరి వీరేంద్ర నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నల్లంచు తెల్లచీర’. భూషణ్, దియా, జెన్నీ, సాయి, కిషోర్ దాస్ ముఖ్యపాత్రధారులు. ‘ఊర్వశి’ ఓటీటీ సమర్పణలో రవి కనగాల–తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నల్లంచు తెల్లచీర’ పేరుతో యండమూరి రాసిన నవలని చిరంజీవి హీరోగా ‘దొంగ మొగుడు’ పేరుతో తెరకెక్కించగా మంచి విజయం సాధించింది.
చిరంజీవిగారి ‘అభిలాష, ఛాలెంజ్, మరణమృదంగం’ వంటి చిత్రాలకు చక్కని కథ అందించారు యండమూరి. ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, అగ్నిప్రవేశం, దుప్పట్లో మిన్నాగు’ వంటి చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నల్లంచు తెల్లచీర’పై అందరిలో ఆసక్తి నెలకొంది’’ అన్నారు. ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాత: సి.అమర్, కో–ప్రొడ్యూసర్: కృష్ణకుమారి కూనం.